నేషనల్ ఫైర్ సర్వీస్ సబ్ ఆఫీసర్స్

Tags: Jobs In India



కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ 36వ ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ సబ్ ఆఫీసర్స్ కోర్సు నోటిఫికేషన్‌న్‌ను విడుదల చేసింది. అగ్నిప్రమాదాల నివారణ సమయంలో నిఫుణుల అవసరం ఉంటుంది. ఇందుకు నేరుగా నియామకాలే కాకుండా కళాశాలలో కోర్సు చేయడం ద్వారా కూడా నిపుణులను తయారు చేసుకోవడం ఈ కోర్సు ఉద్దేశ్యం. 2010-2011 సంవత్సరానికి నాగపూర్‌లోని ఫైర్ సర్వీస్ కాలేజీతో పాటు దాని కింద ఉన్న రీజనల్ ట్రైనింగ్ కాలేజీల్లో సబ్ ఆఫీసర్స్ కోర్సును అందించేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ కోర్సు కాల వ్యవధి 33 వారాలు ఉంటుంది. 21 వారాలు కాలేజీ, ట్రైనింగ్ సెంటర్‌లలో జరిగితే, మిగిలిన 12 వారాలు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న జరుగుతుంది. ఈ కోర్సు ఉందన్న విషయం చాలామందికి తెలీదు. ఫైర్ సర్వీస్ ఉద్యోగాలకు ఇటు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కూడా మంచి డిమాండ్ ఉంది.
వయోపరిమితి: 2010 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ళ మధ్య ఉన్న కలిగి ఉండాలి. పురుష, మహిళలు ఇరువురూ అర్హులే. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్ధులకు 5 ఏళ్ల వయోపరిమితి నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. వయోపరిమితి సడలింపు అర్హత ఉన్న వారు తమ వద్ద ఉన్న అర్హత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్ధ నుంచి హెచ్‌ఎస్‌ఎస్‌సి లేదా ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. హిందీ, ఇంగ్లీషు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
శారీరక కొలతలు:
పురుషులు: ఎత్తు 165 సె.మీ తగ్గకుండా ఉండాలి. బరువు 50 కేజీలు తగ్గకుండా ఉండాలి. ఛాతీ గాలి పీల్చినప్పుడు 86 సె.మీ, పీల్చనప్పుడు 80 సె.మీ ఉండాలి. కంటిచూపు 6/6 కలర్ బ్లైండ్‌నెస్ ఉండకూడదు. మెడికల్‌గా ఫిట్ కావాల్సి ఉంటుంది.
మహిళలు: ఎత్తు 157 సెం.మీ కలిగి ఉండాలి. 46 కేజీల కన్నా బరువు తక్కువ ఉండకూడదు. కంటి చూపు పురుషుల మాదిరిగానే ఉండాలి.
దరఖాస్తులు పంపేందుకు ఆఖరి తేదీ :
దరఖాస్తును నోటిఫికేషన్‌లో పేర్కొన్న మాదిరిగా తయారు చేసుకుని 2010 జనవరి 11 నాటికి పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫైర్ సర్వీస్‌లో పని చేస్తున్న అభ్యర్ధులైతే వారు తమ దరఖాస్తును ప్రోపర్ చానల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. జనవరి 11 తర్వాత అందిన దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుంది.
పరీక్ష ఫీజు:
అన్‌రిజర్వుడు అభ్యర్ధులు రూ.100, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్ధులు రూ.25 ఫీజు చెల్లించాలి. ఫీజును ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో పంపించాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాప్టులు గానీ, తక్కువగా గానీ, అసలు ఫీజు చెల్లించకుండా గానీ పంపితే అటువంటి దరఖాస్తులు తిరస్కరించబడతాయని అభ్యర్ధులు గ్రహించాలి.
ప్రవేశ పరీక్ష విధానం:
పరీక్ష రెండు విభాగాలుగా ఒకే రోజు జరుగుతుంది. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీషుల్లో ఉంటుంది. మొదటి విభాగం పేపర్‌లో ప్రశ్నలు పూర్తి ఆబ్జక్టివ్ పద్దతిలో ఇంటర్మీడియట్ స్ధాయిలో ఉంటాయి. ఈ పేపర్‌లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జి ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపర్‌లో జనరల్ సైన్స్, మేథమెటిక్స్ ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు:
ప్రవేశ పరీక్ష కేంద్రాలు ముంబయి, న్యూఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నై, నాగపూర్‌లో మాత్రమే జరుగుతాయి. దరఖాస్తులు అన్నీ పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి మాత్రమే ప్రవేశ పరీక్ష రాసేందుకు కాల్ లెటర్లు అందుతాయి. కళాశాల అవసరార్ధం కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని మార్చేందుకు అవకాశం ఉంటుంది.
సీట్ల వివరాలు:
నాగపూర్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో 60 సీట్లు మాత్రమే ఉంటాయి. రెండు బ్యాచ్‌లుగా జరుగుతాయి. ఒక్కో బ్యాచ్‌కి 30 సీట్లు ఉంటాయి. వాటిలో 5 సీట్లు ఎస్‌సి, ఎస్‌టిలకు, మరో రెండు సీట్లను సర్వీస్‌లో ఉండి చనిపోయిన వారి పిల్లలకు కేటాయించబడతాయి. జులై 2010లో ఒక బ్యాచ్, 2011 జనవరిలో రెండో బ్యాచ్‌కి తరగతులు జరుగుతాయి. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ఎటువంటి టి.ఎ, డి.ఎలు ఇవ్వబడవు.
ప్రవేశం: కోర్సులోకి ప్రవేశించే అభ్యర్ధులు ప్రవేశ పరీక్షలో సాధించిన పూర్తి స్ధాయి ప్రతిభ ఆధారంగా ఉంటుంది. దీంతో పాటు మెడికల్‌గా పూర్తి ఫిట్‌నెస్ కలిగి ఉండాలి.
ఇతర వివరాలు: దరఖాస్తులను ఎ4 సైజులో మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అన్ని వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్ధులు తమ సంతకాన్ని నిర్ధేశించిన బాక్స్‌లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫోటో కాపీ పంపిస్తే తిరస్కారానికి గురవుతుంది. దరఖాస్తులో అభ్యర్ధులు తమ సంతకాన్ని కేపిటల్ లెటర్‌లలో చేస్తే తిరస్కరించబడతాయి. దరఖాస్తుతో పాటు పంపిన అభ్యర్ధి ఫోటోపై కళాశాల ప్రిన్సిపాల్ లేదా, గెజిటెడ్ అధికారి సంతకం చేసి పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులను డైరక్టర్, నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ, సివిల్ లైన్స్, నాగపూర్-440001 చిరునామాకు పంపించాలి. దరఖాస్తు పంపించే కవర్‌పై ‘అప్లికేషన్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ 36వ సబ్ ఆఫీసర్స్ కోర్సు-2009’ అని స్పష్టంగా రాసి పంపించాలి. ఎవరైతే అర్హులుగా కాలేజీ భావిస్తుందో వారికి మాత్రమే కాల్ లెటర్లు పంపించడం జరుగుతుంది. ఈ కోర్సు పూర్తిగా కళాశాలలో ఉండి మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది. బాలురు ఉండేందుకు వసతి సౌకర్యం ఉంది. కానీ మహిళా అభ్యర్ధులు తమ వసతికి సంబంధించిన ఏర్పాట్లు వారే చేసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ చెకప్ సమయంలో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు, రెండు ఫోటో గ్రాఫ్‌లు తమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వివరాలు, దరఖాస్తులు డౌన్ లోడ్ కోసం తీతీతీ.డ్ళ్ఘజూౄజఒఒజ్యశ.ష్యౄ సందర్శించవచ్చును.


టెన్త్ క్వాలిఫికేషన్‌తో కావచ్చు ఎక్సైజ్ కానిస్టేబుల్

టెన్త్ క్వాలిఫికేషన్‌తో కావచ్చు ఎక్సైజ్ కానిస్టేబుల్

కేవలం టెన్త్ ఉత్తీర్ణులై తమకు పెద్దగా ప్రభుత్వోద్యోగాలు రావడం లేదని ఆవేదన చెందుతున్న యువతీ యువకులకు శుభవార్త. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి
ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెలువడనున్నది. దాదాపు రెండు దశాబ్థాల అనంతరం 2606 ఖాళీలు భర్తీచేయనున్నారు.

టెన్త్ క్వాలిఫికేషన్‌గల యువతీ యువకులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు టెన్త్ వారికి అరుదుగా వస్తున్న నేపథ్యంలో రాష్ర్ట ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడే అవకాశం కల్పిస్తున్నది. ఏకంగా 18 ఏళ్ళ తర్వాత 2600 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించ నున్నది. ఈ అరుదైన అవకాశాన్ని టెన్త్ ఉత్తీర్ణులైన 10 లక్షల మంది ఉపయోగించుకునే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.

ఎంపిక విధానం
తొలిదశ ః శారీరక సామర్థ్య పరీక్ష
-పురుష అభ్యర్థులు 4 కి.మీ.ల పరుగు పందెం 20 నిమిషాల్లో, మహిళలు 2 కి.మీ.ల పరుగుపందెం 1 నిమిషాల్లో పూర్తి చేయాలి. 100 మీటర్ల పరుగు పందెంను పురుషులు 15 సెకన్లు, మహిళలు 18 సెకన్లలో పూర్తిచేయాలి.
-హైజంప్ పురుషులకు 1.20 మీటర్లు. మహిళ లకు దీని నుంచి మినహాయించారు.
-లాంగ్‌జంప్ పురుషులకు 3.80 మీటర్లు. మహిళలు 2.75 మీటర్లలో అర్హత సాధించాలి.
-షాట్‌పుట్ (7.26 కిలోలు) పురుషులు 5.60 మీటర్లు, మహిళలు (4 కిలోలు) 4.5 మీటర్ల వరకు విసరాలి.
-పురుషులు 800 మీటర్ల పరుగుపందెంను 2.50 నిముషాల్లో పూర్తి చేయాలనే నిబంధన విధించారు.

మలిదశ ః రాత పరీక్ష
(100 మార్కులు - సింగిల్ పేపర్)
-జనరల్ స్టడీస్ ః 50 మార్కులు
-ఆప్టిట్యూడ్ టెస్ట్ ః 50 మార్కులు

ఫాస్ట్ ట్రాక్ ప్రవెూషన్స్
సివిల్ కానిస్టేబుల్ పోస్టులతో పోల్చుకుంటే 5-10 ఏళ్ళ ముందుగానే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్ధులు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంద వచ్చు. రాష్ర్ట పోలీసు శాఖలో 50 వేల మంది కానిస్టేబుళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. అదే ఎక్సైజ్ డిపార్ట్‌మెంటులో కేవలం 5 వేల మంది కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించే ప్రక్రియలో ఎక్కువ సిబ్బంది ఉన్న చోట ఆలస్యంగా పదోన్నతులు లభిస్తుంటాయి. అదే తక్కువ సిబ్బంది ఉన్నచోట త్వరితగతిన పదోన్నతులు అందు తుంటాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికైన 20 ఏళ్ళ యువకుడు 38 ఏళ్ళకు తన కెరీర్ ప్రస్థానంలో హెడ్ కానిస్టేబుల్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ స్థాయి వరకు పదోన్నతులు పొందుతూ కీలక స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది.

రూ. 30 వేల కోట్ల ఆదాయం
రాష్ర్టంలో మధ్యం సరఫరా నియంత్రణ, ప్రత్యేక విధులు నిర్వర్తించే ఎక్సైజ్ డిపార్ట్‌మెంటు ఏటా రాష్ర్ట ప్రభుత్వానికే 30 వేల కోట్లు ఆర్జించి పెడుతోంది. రాష్ర్ట ప్రభుత్వ అనేక విభాగాలలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్లు కీలకమైనవిగా గుర్తించటం అనాదిగా వస్తోంది. ఎక్సైజ్ డిపార్ట్‌మెంటు రెవెన్యూ శాఖల పరిధిలోకి వస్తుంది. రాష్ర్టప్రభుత్వానికి ఏటా ‘బంగారు కోడిపెట్ట’లా బంగారుగుడ్లు పెట్టే నాలుగైదు డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అవి కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంటు, ఎక్సైజ్ డిపార్ట్‌మెంటు , ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంటు, గనుల శాఖ వంటివి ఉన్నాయి. రూ.50 వేల కోట్లు అందించే కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంటు తర్వాత రూ.30 వేల కోట్లు అందించి రెండోస్థానంలో నిలబడిన డిపార్ట్‌మెంటు ఎక్సైజ్.

ఎక్సైజ్ కానిస్టేబుల్ విధులు
రాష్ర్టవ్యాప్తంగా 324 ఎక్సైజ్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఎక్సైజ్ పోలీసుస్టేషన్‌కు ఉన్నతాధికారిగా ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వ్యవహరిస్తుంటారు. ఎక్సైజ్ స్టేషన్‌లో సి.ఐ.కు దిగువన ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉంటారు. ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లేదా ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో అక్రమ మద్యం సరఫరా స్థావరాలపై దాడులు చేసే క్రమంలో ఎక్సైజ్ కాని స్టేబుల్స్ నిర్దేశిత విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అక్రమ సారా తయారీ, కల్తీకల్లు తయారీ, గంజాయి మొక్కలు పెంపకం, వైన్‌షాపులలో మద్యం అమ్మకాలు వంటి వేర్వేరు నిషేదిత, ఆవెూదిత కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయా లేదానేది ప్రాథమిక సమాచార సేకరణలో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కీలక బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు చేపట్టే క్రమంలో సివిల్ డ్రెస్, యూనిఫాం డ్రెస్‌తో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ విధులు చేపట్టాల్సి ఉంటుంది.

జిల్లా స్థాయి పోస్టులు

postes
జిల్లా పరిధిని కేంద్రంగా చేసుకుని ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేపట్టారు. జిల్లాలో ప్రకటించే మొత్తం ఉద్యోగ ఖాళీలలో 80 శాతం పోస్టులు స్థానికులకు రిజర్వ్ చేస్తారు. రాత పరీక్షలో పోటీపడిన స్థానిక అభ్యర్ధులలో ఎవరైతే అత్యధిక మార్కులు స్కోర్ చేస్తారో వారితో 80 శాతం కాని స్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు. సదరు జిల్లాలో 4 నుంచి 10వ తరగతి వరకు అత్యధిక సంవత్సరాలు పాఠశాల విద్యనభ్యసించిన అభ్యర్ధులను స్థానికంగా గుర్తిస్తారు. ఇక మిగతా 20 శాతం ఖాళీలలో రాత పరీక్షకు పోటీపడిన జిల్లాస్థానికులు లేదా ఇతర జిల్లాలు స్థానికేతర అభ్యర్ధులు ఎవరైతే అత్యధిక మార్కులు సాధిస్తారో వారిని ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ముందుగా 20 శాతం ఖాళీలు భర్తీ చేసి, ఆ తర్వాత 80 శాతం ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు.

హౌటు ప్రిపేర్ ?
రాతపరీక్ష సిలబస్ ః 10వ తరగతి స్థాయి
ఆబ్జెక్టివ్ టైప్ ః 100 ప్రశ్నలు

1. భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమం.
2. ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ మరియు ఎకానమీ.
3. జనరల్ సైన్స్
4. జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత యొక్క కరెంట్ ఈవెంట్స్
5. అర్థమెటిక్
6. టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటి
7. జనరల్ ఇంగ్లిష్

సిలబస్ ఏమిటి?
ఎలాంటి ప్రశ్నలడుగుతారు?

నూతన పరీక్షావిధానంలో ప్రశ్నల స్థాయి 10వ తరగతి లోపునే ఉంటుంది. ప్రశ్నలసంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ సిలబస్ పరిధి మాత్రం ఎక్కవగానే ఉంటుంది. నూతన సిలబస్‌ను ఒక్కొక్క విభాగం నుండి ఎలాంటి ప్రశ్నలు ఇవ్వవచ్చో విపులంగా తెలుసుకుందాం...

భారతదేశ చరిత్ర
ఈ విభాగాన్ని వివరంగా పరిశీలిస్తే భారతదేశ చరిత్రలో మూడు భాగాలుంటాయి. అవి ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్ర. హరప్పా నాగరికతా కాలం నుంచి ప్రారంభమై వేదయుగం, మౌర్యులు, గుప్తుల కాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులు, అనంతరకాలంలో భారతదేశానికి అడుగిడిన అరబ్బులు, టర్కులు తరువాత మొఘల్ సామ్రాజ్య ఏలుబడిలో మారిన భారత రాజకీయ చిత్రపటం, భిన్న సంస్కృతుల మేళవింపు. ఇదే సమయంలో దక్షిణాదిన వెలుగు వెలిగిన బహమనీలు, విజయనగర రాజుల వరకు అదే కాలంలో వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా భారతదేశానికి అడుగిడిన శ్వేతజాతి ఆంగ్లేయులు, అనంతర కాలంలో భారతదేశ రాజకీయ ఆధిపత్యాన్ని కైవసం చేసుకోవడం వరకు జరిగిన సంగ్రామం, విదేశీయుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందటానికి భారతజాతి పోరాటం వరకు, ఇదే కాలంలో సామాన్య ప్రజల నాయకుడైన గాంధీజీ అహింస, సత్యా గ్రహాన్ని ఆయుధంగా దేశ స్వాతంత్య్రం తెప్పించడం వరకు గల అంశాలుంటాయి.




జనరల్ సైన్స్

Tags: DSC in telugu, APPSC in Telugu, APPSC Study Metrical in Telugu 

జనరల్ సైన్స్-1


1) మానవ శరీరంలోని అతి పెద్ద గ్రంథి?
ఎ) కాలేయము బి) క్లోమము సి) జఠర గ్రంథి డి) లాలాజల గ్రంథి

2) ప్రొటీన్లను పెస్టోన్లుగా మార్చే ఎంజైమ్?
ఎ) ట్రిప్సిన్ బి) పెప్సిన్ సి) సుక్రోజ్ డి) ఎమలైజ్

3) మొక్కల నుండి వచ్చే ఆహారంలో ఈ విటమిన్ వుండదు...
ఎ) బి-విటమిన్ బి) ఎ-విటమిన్ సి) డి-విటమిన్ డి) సి-విటమిన్

4) అమీబా చలనాంగాలు?
ఎ) మిధ్యాపాదములు బి) సీలియంలు సి) కశాబాలు డి) నీటములు

5) ఈ క్రింది వాటిలో వైరస్ ద్వారా సంభవించే అంటువ్యాధి?
ఎ) కలరా బి) మశూచి సి) టైఫాయిడ్ డి) క్షయ

6) ఈ క్రింది వానిలో వినాళ గ్రంథి?
ఎ) కాలేయము బి) థైరాయిడ్ సి) క్లోమము డి) ఏదీ కాదు

7) రక్తము గడ్డ కట్టుటకు అవసరమయ్యే విటమిన్ ?
ఎ) విటమిన్-ఎ బి) విటమిన్- బి సి) విటమిన్-కె డి) విటమిన్-సి

8) థయామిన్ లోపం వలన ఈ వ్యాధి వస్తుంది...
ఎ) బెరిబెరి బి) పెల్లాగ్రా సి) రికెట్స్ డి) రక్తహీనత

9) రక్తం గడ్డకట్టిన తర్వాత ఏర్పడే ద్రవము?
ఎ) ప్లాస్మా బి) ఆక్సిజన్ రహిత రక్తం సి) ఆక్సిజన్ సహిత రక్తం డి) సీరం

10) దీనిని ఎర్ర రక్తకణాల స్మశాన వాటిక అంటారు...
ఎ) కాలేయం బి) ప్లీహం సి) లింఫ్ డి) కిడ్నీలు

11) రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టకుండా ఇది కాపాడుతుంది...
ఎ) హిమోగ్లోబిన్ బి) పెప్సిన్ సి)్థరాక్సిన్ డి) హిపారిన్

12) మానవునిలో క్రోమోజోముల సంఖ్య?
ఎ) 46 బి) 45 సి) 27 డి) 24

13) లాలాజలంలోని ఎంజైము?
ఎ) ఎమలైజ్ బి) పెప్టిన్ సి) ట్రిప్సిన్ డి) క్లోమం

14) కిరణజన్య సంయోగక్రియలో వెలువడే వాయువు?
ఎ) కార్బన్‌డై యాక్సైడ్ బి) ఆక్సిజన్ సి) హైడ్రోజన్ డి) నైట్రోజన్

15) ఐరన్ లోపం వలన కలిగే వ్యాధి?
ఎ) డయాబిటీస్ బి) బెరిబెరి సి) ఎనీమియా డి) రికెట్స్

16) దీనిలోపం వలన గాయిటర్ కలుగుతుంది...
ఎ) కాల్షియం బి) సిలీనియం సి) అయోడిన్ డి) జింక్

17) రక్తంలో ఇన్సులిన్ తగ్గితే వచ్చే వ్యాధి?
ఎ) బెరిబెరి బి) కీళ్ళ వ్యాధి సి) ఎయిడ్స్ డి) మధుమేహం

18) హెచ్.ఐ.వి. వైరస్ కలగజేసే వ్యాధి...
ఎ) ప్లేగు బి) ఎయిడ్స్ సి) మధుమేహం డి) క్షయ

19) హెపటైటిస్ వైరస్ వలన వచ్చే వ్యాధి...
ఎ) కామెర్లు బి) కలరా సి) మలేరియా డి) టైఫాయిడ్

20) మానవునిలో సాధారణ రక్తపీడనము...
ఎ) 80/120 బి) 120/80 సి) 80/110 డి) 90/120

21) 13 గదుల హృదయం గల జీవి?
ఎ) నత్త బి) వానపాము సి) బొద్దింక డి) జలగ

22) అమీబాలో శ్వాసక్రియ జరిగే విధానము?
ఎ) భాష్పీభవనము బి) ఉచ్ఛ్వాసము సి) విసరణము డి) అస్మాసిస్

23) రక్తపీడనాన్ని కొలిచే సాధనము ఏది?
ఎ) స్పిగ్మో మానోమీటర్ బి) ధర్మామీటర్ సి) లాక్టోమీటర్ డి) బారోమీటర్

24) ఇవి కేంద్రకం లేని రక్త కణాలు...
ఎ) లింఫోసైట్లు బి) రక్త్ఫలకికలు సి) మోనోసైట్లు డి) ఇస్నోఫిల్స్

25) ఈ క్రింది వానిలో గజ్జిని కలుగజేసేది...
ఎ) ఈగ బి) దోమ సి) బొద్దింక డి) ఎకారస్

26) చర్మంలో నిర్జీవ కణాలు గల పొర?
ఎ) కెరాటిన్ బి) కార్నియం సి) సెబేషియన్ డి) ప్రొటీన్

27) చర్మానికి రంగు దీని వలన వస్తుంది...
ఎ) ప్రొటీన్ బి) కెరాటిన్ సి) మెలానిన్ డి) సెబేషియన్

28) ఈ క్రింది దానిని పరిక్షించేందుకు అయోడిన్‌ను ఉపయోగిస్తారు...
ఎ) గ్లూకోజ్ బి) పిండి పదార్థం సి) కాంతి డి) కార్బన్ డైయాక్సైడ్

29) ఈ జీవి యందు ఎర్రరక్త కణాలు వుండవు...
ఎ) వానపాము బి) కప్ప సి) పాము డి) నెమలి

30) ఈ గ్రంథి వాయునాళానికి దగ్గరగా ఉంటుంది...
ఎ) కాలేయము బి) అవటు గ్రంథి సి) అధిపృక్క గ్రంథి డి) క్లోమ గ్రంథి

31) కంఠమిలం మీద మూతలా పనిచేసే నిర్మాణము...
ఎ) నాలుక బి) మొప్ప పటలిక సి) ఉప జిహ్విక డి) ఉపరికుల

32) శరీరంలో రసాయన సమన్వయం జరిపే పదార్థాలు?
ఎ) రక్తం బి) లింఫ్ సి) ఎంజైములు డి) హార్మోనులు

33) నిస్సల్ కణికలు గల కణాలు...
ఎ) నాడీ కణాలు బి) ఇస్ నోఫిల్స్ సి) లింఫోసైట్స్ డి) గ్లియల్ కణాలు

34) అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలోని దీని ఆధీనంలో ఉంటాయి...
ఎ) మజ్జాముఖము బి) వెన్నుపాము సి) అను మస్త్కిము డి) హైపొథలామస్

35) మస్తిష్కము యొక్క ఉపరితల వైశాల్యమును వృద్ధిచేయునవి...
ఎ) గైరీ బి) డెండ్రైట్లు సి) ఎక్సానులు డి) మైలీన్ తొడుగులు

36) ఈ క్రింది దానిలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది...
ఎ) కాకి బి) పాము సి) కప్ప డి) ఎలుక

37) తల్లి యొక్క గర్భాశయ కుడ్యానికి, భ్రూణాన్ని కలిపే నిర్మాణము...
ఎ) జరాయువు బి) ఫెలోపియన్ నాళము సి) నాభి రజ్జవు డి) ఎపిడిడిమస్

38) గ్రాఫియన్ పుటికలు దీని నిర్మాణంలో ఉంటాయి...
ఎ) స్ర్తి బీజకోశము బి) శుక్ర కణము సి) అండము డి) ఫెలోపియన్ నాళము

39) సమ్యోగము అనునది ఒక రకమైన...
ఎ) ద్విధావిచ్ఛిత్తి బి) శాఖీయోత్పత్తి సి) లైంగిక ప్రత్యుత్పత్తి డి) అలైంగిక ప్రత్యుత్పత్తి

40) సెల్యులోజ్ అనునది ఒక...
ఎ) ప్రొటీన్ బి) కార్బోహైడ్రేట్ సి) కొవ్వు డి) మినరల్
సమాధానాలు:
------------------------------

1) ఎ, 2) బి, 3) సి 4) ఎ, 5) ఎ, 6) బి, 7) సి, 8) ఎ, 9) డి, 10) బి, 11) డి, 12) సి, 13) ఎ, 14) బి, 15) సి, 16) సి, 17) డి, 18) బి, 19) ఎ, 20) బి, 21) ఎ, 22) సి, 23) ఎ, 24) బి, 25) డి, 26) బి, 27) సి, 28) బి, 29) ఎ, 30) బి, 31) సి, 32) డి, 33) ఎ, 34) బి, 35) ఎ, 36) సి, 37) సి, 38) ఎ, 39) సి, 40) బి.


Followers