టోరి (Tori) ఏప్ తో పాత, కొత్త తెలుగు పాటలు 24 గంటలు స్మార్ట్ ఫోన్ లో వినొచ్చు

నా చిన్నప్పుడు కేవలం రేడియో ఒక్కటే సాధనం పాటలు వినడానికైనా, సంక్షిప్త శబ్ద చిత్రాన్ని వినడానికైన.  అప్పటికీ ఇప్పటికీ ఎంతో పురోగామించాం సాంకేతికంగా. ఇది సాంఖ్యిక (డిజిటల్) యుగం.  ఇప్పుడు అంతా జాలం (net) లో వుంది. ఇది అంతర్జాల (internet) మహిమ.  మనకు ఉపాధి కోసం అందరూ భౌతికమైన ఎల్లలను చెరిపేశారు లేదా అధికమించారు. ఉద్యోగ పరంగా తెలుగు వారు దేశ, విదేశాలు తిరుగుతున్నారు. అయితే మన తెలుగును మరచి పోవడం లేదు.  నాకు నచ్చిన ఒక  గ్లోబల్ రేడియో అప్లికేషన్ (ఏప్) "టోరి" (TORI). ఇది Android లో వుంది. iPhone లో వుందో, లేదో తెలియదు. ఈ ఏప్ చాల బాగుంది. Free installation ap. ఈ ఏప్ తో పాత తరం, కొత్త తరం తేడా లేకుండా అన్ని తెలుగు పాటలు 24 గంటలు ప్రసారం చేసే గ్లోబల్ రేడియో. అంతే కాదు ఏ దేశం నుంచైనా వినొచ్చు ఈ ఏప్ వుంటే.  మీరు కూడా download చేసుకుని ఆనందించండి. Android Smartphone aps లో market place కు వెళ్లి search లో "tori" type చేస్తే దొరుకుతుంది. చాల మందికి తెలిసి ఉండొచ్చు

APPSC Guidance దృష్టి సారించాల్సిన అంశాలు


ఫిజికల్ సైన్స్: ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యు త్, ఉష్ణం, యాంత్రికశాస్త్రం, ఆధునిక బౌతిక శాస్త్రం.

బయలాజికల్ సైన్స్: జీవుల వర్గీకరణ, మానవ శరీరం- వ్యవస్థలు, వ్యాధులు-వ్యాక్సీన్‌లు-ఆవిష్కరణలు.

మెంటల్ ఎబిలిటీ: నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్, ర్యాంకులు, శాతాలు, సగటులు, అక్షరక్రమం, వర్గాలు, వర్గమూలాలు, వెన్ డయాగ్రమ్స్.

జాగ్రఫీ: ఖనిజాలు, సహజ వనరులు, అతిపెద్ద- అతి చిన్న భౌగోళిక స్వరూపాలు. నీటిపారుదల అంశాలు

హిస్టరీ: పరిమితంగా ఉండే సిలబస్‌లో ఆయా రాజులు, రాజ వంశాలు- వారి కాలంలో సాంస్కృతిక చరిత్ర.

పాలిటీ: రాజ్యాంగం- లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు-విధులు, ఆదేశిక సూత్రాలు, భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అధికార విభజన, శాసన,కార్య నిర్వహణ వ్యవస్థ, సుప్రీంకోర్టు- ముఖ్యమైన తీర్పులు. ఆయా కమిటీలు-సిఫార్సులు

ఎకానమీ: ప్రణాళికలు, లక్ష్యాలు-విజయాలు, వైఫల్యాలు-కారణాలు, సంస్కరణల ముందు-తర్వాత కాలంలో ఆర్థిక రంగం, తాజా ఎకనామిక్ సర్వేలు, బడ్జెట్‌లు-గణాంకాలు. సంక్షేమ పథకాలు-లక్ష్యాలు-ప్రగతి. కోర్ టాపిక్‌గా భావించే జీఎన్‌పీ, జీడీపీ, ఎన్‌ఎన్‌పీ వంటి సూచీల గురించి సంపూర్ణ అవగాహన పొందాలి.


కెరీర్‌కు వ్యవ‘సాయమే’- బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (సీఏ అండ్ బీఎం), బీటెక్ ఫుడ్‌టెక్నాలజీ,

ఎంసెట్ ర్యాంకు ద్వారా ప్రవేశం కల్పించే బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (సీఏ అండ్ బీఎం), బీటెక్ ఫుడ్‌టెక్నాలజీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్‌సీ, బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటి వివరాలు...

కెరీర్ గెడైన్‌‌స

యూనివర్సిటీలు-కోర్సులు
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ- హైదరాబాద్

కోర్సు: బీఎస్సీ (అగ్రికల్చర్)
వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 620
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
అగ్రికల్చర్ కాలేజ్, బాపట్ల, గుంటూరు జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, నైరా, శ్రీకాకుళం జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, రాజమండ్రి, తూర్పు గోదావరి
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్
అగ్రికల్చర్ కాలేజ్, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా
ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్, తిరుపతి, చిత్తూరు జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, మహానంది, కర్నూలు జిల్లా

కోర్సు: బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (సీఏ అండ్ బీఎం)
వ్యవధి: నాలుగేళ్లు;
మొత్తం సీట్లు: 40
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్

కోర్సు: బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)
వ్యవధి: నాలుగేళ్లు:
మొత్తం సీట్లు: 45
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాపట్ల, గుంటూరు జిల్లా
కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పులివెందుల, వైఎస్‌ఆర్ జిల్లా

డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ -
వెంకటరామన్నగూడెం
కోర్సు: బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్
వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 230 సీట్లు.
వీటిలో 20 సీట్లు పేమెంట్ సీట్లు.
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్,మోజెర్ల,మహబూబ్‌నగర్ జిల్లా
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, అనంతరాజుపేట, వైఎస్‌ఆర్ జిల్లా

శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ-తిరుపతి
కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్)
వ్యవధి: ఐదేళ్లు
మొత్తం సీట్లు: 240
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, హైదరాబాద్
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి, చిత్తూరు జిల్లా
ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గన్నవరం, కృష్ణా జిల్లా
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ప్రొద్దుటూరు, వైఎస్‌ఆర్ జిల్లా
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, కోరుట్ల, కరీంనగర్ జిల్లా

కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ (బీఎఫ్‌ఎస్‌సీ)
వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 30
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా

అర్హత:
ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుకు ఇంటర్‌లో ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో ప్రతి సబ్జెక్టులోనూ 50 శాతం (ఎస్సీ, ఎస్టీలు 40 శాతం) మార్కులు సాధించి ఉండాలి.
ఎంసెట్-2012లో ర్యాంకు తప్పనిసరి.
వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి కనీసం 17 ఏళ్లు ఉండి 22 ఏళ్లు మించరాదు. గరిష్ట వయోపరిమితి ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు, శారీరక వికలాంగులకు 27 ఏళ్లు.



వెబ్‌సైట్: www.angrau.net

Followers