పంచా యతీ సెక్రటరీ పరీక్ష కటాఫ్ ఎంత...? 2014


ఆదివారం(ఫిబ్రవరి 23న) జరిగిన పంచాయతీ సెక్రటరీ పోస్టు పరీక్ష కటాఫ్ ఎంత ఉండవచ్చు -వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్ష ఫలితాలు పునరావతం అవుతాయా -అన్న ప్రశ్న పరీక్ష రాసిన అభ్యర్థుల మదిని తొలుస్తోంది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల విషయనిపుణులు, వీఆర్వో పరీక్ష విజేతల అభిపాయ్రాలతో కటాఫ్‌పై అందిస్తున్న విశ్లేషణ.... రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పంచాయతీసెక్రటరీ పరీక్షకు సుమారు ఆరులక్షల మందికి పైగా హాజరయ్యారు. కానీ దీనిలో సీరియస్‌గా పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య లక్షలోపే ఉంటుంది..! రెండు పేపర్లను పోటీపరీక్ష నిపుణులు నూతనకంటి వెంకట్ విశ్లేషిస్తూ... పేపర్ -1 : జనరల్ స్టడీస్ ప్రశ్నలు సిలబస్‌కు భిన్నంగా వచ్చాయన్నారు. ఈ విధంగా రావడంపై పలువురు అభ్యర్థులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తం జీఎస్ ప్రశ్నల్లో 90 శాతం ప్రశ్నలు అందరికీ అనుకూలంగా వచ్చాయి. అంటే సుమారు 113 ప్రశ్నలు సాధారణస్థాయిలో ఉన్నాయి. దీనిలో 100 మార్కులు తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక డాటా ఇంట్రప్రిటేషన్, మెంటల్ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్ విభాగాల కింద అడిగిన ప్రశ్నలు అభ్యర్థుల విజయాన్ని శాసిస్తాయి. రీజనింగ్ విభాగంలో కొంత కఠినమైన ప్రశ్నలు, లాజికల్‌స్కిల్స్‌లో యావరేజ్‌స్థాయిలో ప్రశ్నలు వచ్చాయి. వీటిలో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత మంచి ర్యాంకు వస్తుంది.మొత్తం మీద 150 మార్కులకు గాను 130 పైగా సాధిస్తేనే ఉద్యోగావకాశాలు ఉంటాయి. పేపర్ -2: రూరల్‌డెవలప్‌మెంట్‌పై కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పేపర్ అభ్యర్థులను అంతగా భయపెట్టలేదు. దీనిలో అడిగిన ప్రశ్నలు వాస్తవరూపంలో కనిపించేవి కావడం విశేషం. అభ్యర్థి ఉద్యోగంలో చేరిన తర్వాత చేయాల్సిన విధులపై కావల్సిన ప్రాథమిక సమాచారాన్ని అడగడం మంచి పరిణామం. దీనిలో అకౌంట్స్‌పై అడిగిన ప్రశ్నల్లో 15 వరకు సాధారణస్థాయిలో ఉన్నాయి. మిగిలిన 10 ప్రశ్నలు కఠినస్థాయిలో ఉన్నాయి. ఓవరాల్‌గా పరిశీలిస్తే ఈ పేపర్‌లో కూడా 125 - 135 మార్కులు సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. సగటు అభ్యర్థిని దష్టిలో ఉంచుకొని పేపర్స్ తయారుచేశారు. ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ పరిక్షించేవిధంగా ఉండడంపై అభ్యర్థులు, విద్యావేత్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ పేపర్లలో కొన్ని ప్రశ్నలు రిపీట్ కావడం గమనార్హం. అదేవిధంగా మెంటల్‌ఎబిలిటీ ప్రశ్నలస్థానంలో అరిథ్‌మెటిక్ ప్రశ్నలు అడగడంపై అభ్యర్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తం మీద రెండు పేపర్స్‌లో కలిపి జనరల్ అభ్యర్థులకు 270పైగా మార్కులు వస్తేనే ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన వీఆర్వో, వీఆర్‌ఏ ఫలితాల వలే సెంట్ మార్కులు కూడా వచ్చే అవకాశం ఉందని కొంతమంది పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్కొంటుండం గమనార్హం. ఏదేమైనా ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే

గుణకారం వద్దు- లాజిక్ చాలు


1135x35795x5385x4275=? పై సమీకరణంలో చివరి రెండు అంకెలేవీ? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే, మొత్తం గుణించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంతకు ముందు, 5 ఒకట్ల స్థానంలో ఉన్నప్పుడు, దానికి ముందు, అంటే పదులు లేదా వందల స్థానాల్లో సరి లేదా బేసి సంఖ్యలు ఉన్నప్పుడు, వచ్చే జవాబులను పరిశీలిస్తే, తేలిగ్గా సమాధానం కనుగొనేందుకు వీలుంటుంది. కింది మూడింటిని పరిశీలించండి..... 1. 25x25=625, 2. 35x35=1225. 3. 15x 25=375 ఇందులో మొదటి సమీకరణంలో ముందు, రెండు ఉంది, అది సరి సంఖ్య, ఈ సమీకరణంలో వచ్చిన జవాబు 625. దీనిలో గుర్తించాల్సింది ఏంటంటే, అయిదుకు ముందు, సరి సంఖ్య ఉంటే, అ రెండు సంఖ్యలను గుణిస్తే, వచ్చే జవాబులో చివరి రెండు సంఖ్యలు 25 అయి ఉంటాయి. 45X45, లేదా 65x65, ఇలా ఏ సమీకరణాన్ని తీసుకున్నప్పటికీ సమాధానంలో చివరి రెండు సంఖ్యలు 25 ఉంటాయి. అదే విధంగా రెండో సమీకరణం 35x35, దీని జవాబులోనూ చివరి రెండు అంకెలు 25గానే ఉన్నాయి. దీని ఆధారంగా గుర్తించాల్సిన అంశం ఏమిటంటే, ఒకట్ల స్థానంలో ఉండి, దానికి ముందు, అంటే పదులు లేదా వందల స్థానంలో సరి లేదా బేసి సంఖ్యలు ఉంటే, వచ్చే బ్దంలో చివరి రెండు అంకెలు 25గా ఉంటాయి. ఇప్పుడు మూడో సమీకరణాన్ని పరిశీలిస్తే, ఒక దానిలో అయిదుకు ముందు బేసి సంఖ్య (15), మరో దానిలో అయిదుకు ముందు సరిసంఖ్య (25), ఉంది, ఇలా రెండు విభిన్న సంఖ్యలు ఉన్నప్పుడు వచ్చే ఫలితంలో చివరి రెండు అంకెలు 75 అయి ఉంటాయి. ఈ మూడు అంశాల ఆధారంగా పైన ఇచ్చిన సమీకరణంలో సమాధానాన్ని అత్యంత తేలిగ్గా కనుక్కోవచ్చు. 1135x35795x5385x4275=? ఇందులో నాలుగు సంఖ్యలు ఉన్నాయి. మొదటిది 1135, ఇందులో అయిదుకు ముందు 113 ఉంది, ఇది బేసి సంఖ్య, అలాగే రెండో సంఖ్య, 35795, ఇందులో అయిదుకు ముందు 3579 ఉంది, ఇది బేసి సంఖ్య. ఈ రెండు సంఖ్యలను గుర్తిస్తే, ఖచ్చితంగా చివరి రెండు అంకెలు 25 అయి ఉంటాయి (ఇంతకు ముందు చెప్పినట్లు, అయిదుకు ముందు రెండు బేసి సంఖ్యలు ఉన్న పక్షంలో ఫలిత లబ్ధంలో చివరన 25 ఉంటుంది.) ఇప్పుడు చివరి రెండు సంఖ్యలను పరిశీలిస్తే, 5385, అయిదుకు ముందు 538 ఉంది, ఇది సరి సంఖ్య, దీనిని 4275తో గుణించాలి, ఈ సంఖ్యలో 5 కు ముందు 427 ఉంది, ఇది బేసి సంఖ్య, కాబట్టి , చివరి రెండు పదాలను గుణిస్తే, వచ్చే ఫలిత లబ్ధంలో చివరి రెండు పదాలు 75 అయి ఉంటాయి. (ఇంతకుముందు పేర్కొన్నట్లు సరి, బేసిలు ఉండి, చివరన అయిదు ఉంటే, వాటి ఫలిత లబ్ధంలో చివరన 75 ఉంటుంది.) ఇప్పుడు తొలి రెండింటి లబ్ధం 25 కాగా చివరి రెండు అంకెల లబ్ధం 75. వీటిని గుణిస్తే, కచ్చితంగా అంతిమ సంఖ్యలు7,5లు వస్తాయి.. ఎందుకంటే సరి, బేసిలు ఉండి, చివరన అయిదు ఉంటే, వాటి ఫలిత లబ్ధంలో చివరన 75 ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాం. అయిదుకు ఉన్న ఈ ప్రత్యేకతని ఇలా తేలిగ్గా అర్థం చేసుకుంటే, చాలా తేలికగా సమాధానాలు గుర్తించొచ్చు. అయిదుతో తేలిగ్గా వర్గాలు కనుగొనే మరో టెక్నిక్‌ను పరిశీలిద్దాం. 25x25=625, 55x55=3025. చివరన అయిదు ఉన్న ఏ సంఖ్యావర్గమైనా అంతకు ముందు ఉన్న పదానికి ఒకటి కలిపి గుణించాలి, అంటే 55x55లో, చివరి రెండు పదాలు 25, తెలిసిందే, పదుల స్థానంలో 5 ఉంది కాబట్టి, అయిదును, దాని తర్వాత వచ్చే 6తో గుణించాలి, 5x6=30, కాబట్టి మొత్తం సమాధానం 3025 అవుతుంది. 75x75, దీనికి సమాధానం నేరుగా 7x8 చేయాలి(ఎందుకంటే పదుల స్థానంలో 7 ఉంది కాబట్టి), దీనికి జవాబు 5625. నియమంః గుణించాల్సిన రెండు సంఖ్యల ఒకట్ల స్థానంలో ఉన్న రెండు అంకెల మొత్తం 10 అయి ఉండి, దానికి ముందు ఉన్న సంఖ్యలు సమానంగా ఉండే అన్ని సంఖ్యలకు ఈ నియమం వర్తిస్తుంది. ఉదాహరణకు.. 72x78=, ఇందులో ఒకట్ల స్థానంలో ఉన్న 8, 2 లను కలిపితే 10 వస్తుంది, అలాగే పదుల స్థానంలో రెండింటిలోనూ ఒక అంకె, 7 ఉంది కాబట్టి, దీనికి కూడా ఈ నియమం వర్తిసుంది, కాబట్టి దీని జవాబు, 8x2=16, 7x8=56, 5616. 93x97=, 9021. పెద్ద సంఖ్యలో, ఒకట్లు, పదుల స్థానాల్లో ఉండే అంకెల మొత్తం, 100 అయితే ఈ నియమం కొంచెం మార్చి, అనువర్తింప చేసుకోవచ్చు. ఎలాగంటే.... 298x202=?, ఇందులో 98 (మొదటి సంఖ్యలోనివి), 02 (ండో సంఖ్యలోనివి)కలిపితే 100 వస్తుంది, దీనికి సమాధానం గుర్తించాల్సిన తీరు... 98x02=196 ఇందులో మనకు నాలుగు అంకెలు ఉన్నాయి అవి, 9, 8, 0, 2. కాని వచ్చిన సమాధానంలో 196లో మూడు అంకెలే ఉన్నాయి, కాబట్టి దీనికి ముందు 0ను చేర్చాలి, అంటే మన సమాధానంలో చివరి నాలుగు అంకెలు 0196, ఇప్పుడు వందల స్థానంలో ఉన్న 2, ఆ తర్వాత వచ్చే, 3తో గుణించగా, సమాధానం 6వస్తుంది, కాబట్టి మొత్తం జవాబు 60196. మరో ఉదాహరణ పరిశీలిద్దాం 3996x3004=? 996, 004 కలిపితే, మొత్తం 1000 అవుతుంది. ఇందులో 996 ను రెండో అంకెలోని ఒకట్ల స్థానంలో ఉన్న నాలుగుతో గుణించగా, 398ని రెండో సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న నాలుగుతో గుణిస్తే సమాధానం 3984 వస్తుంది, ఇందులో నాలుగు అంకెలు ఉన్నాయి. కాని మనకు మొత్తం పదాలు, 9, 9, 8, 0, 0, 4. మొత్తం ఆరు అంకెలు ఉన్నాయి కాబట్టి, 3984కు ముందు, రెండు సున్నాలను చేర్చుతాం, ఆ తర్వాత, వేల స్థానంలో రెండు సంఖ్యల్లోనూ మూడు ఉంది కాబట్టి, మూడును ఆ తర్వాత సంఖ్య అయిన నాలుగుతో గుణిస్తే, 12 వస్తుంది, కాబట్టి మొత్తం సమాధానం 12003984. ఇప్పుడు, ఈ సంఖ్యకు సమాధానం నోటితో చెప్పండి, 998x902=.....


Telugu Varnamala - తెలుగు వర్ణమాల


తేనెకన్నాతీయనిది మన తెలుగు భాష

 

తెలుగు వర్ణమాల

అచ్చులు

అ ఆ ఇ ఈ ఉ ఊ 


ఋ ౠ ఌ ౡ


ఎ ఏ ఐ 


ఒ ఓ ఔ 


ఉభయాక్షరములు
అఁ అం అః
హల్లులు
క ఖ గ ఘ ఙ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ
శ ష స హ
ళ ఱ క్ష

గుణింతాలు

క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః


ఖ, ఖా, ఖి, ఖీ, ఖు, ఖూ, ఖె, ఖే, ఖై, ఖొ, ఖో, ఖౌ, ఖం, ఖః


గ, గా, గి, గీ, గు, గూ, గె, గే, గై, గొ, గో, గౌ, గం, గః


ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః
చ, చా, చి, చీ, చు, చూ, చె, చే, చై, చొ, చో, చౌ, చం, చః


ఛ, ఛా, ఛి, ఛీ, ఛు, ఛూ, ఛె, ఛే, ఛై, ఛొ, ఛో, ఛౌ, ఛం, ఛః


జ, జా, జి, జీ, జు, జూ, జె, జే, జై, జొ, జో, జౌ, జం, జః


ఝ, ఝా, ఝి, ఝీ, ఝు, ఝూ, ఝె, ఝే, ఝై, ఝొ, 

ఝో, ఝౌ, ఝం, ఝః


ట, టా, టి, టీ, టు, టూ, టె, టే, టై, టొ, టో, టౌ, టం, టః


ఠ, ఠా, ఠి, ఠీ, ఠు, ఠూ, ఠె, ఠే, ఠై, ఠొ, ఠో, ఠౌ, ఠం, ఠః


డ, డా, డి, డీ, డు, డూ, డె, డే, డై, డొ, డో, డౌ, డం, డః


ఢ, ఢా, ఢి, ఢీ, ఢు, ఢూ, ఢె, ఢే, ఢై, ఢొ, ఢో, ఢౌ, ఢం, ఢః


ణ, ణా, ణి, ణీ, ణు, ణూ, ణె, ణే, ణై, ణొ, ణో, ణౌ, ణం, ణః


త, తా, తి, తీ, తు, తూ, తె, తే, తై, తొ తో, తౌ, తం, తః


థ, థా, థి, థీ, థు, థూ, థె, థే, థై, థొ, థో, ధౌ, థం, థః


ద, దా, ది, దీ, దు, దూ, దె, దే, దై, దొ, దో, దౌ, దం, దః


ధ, ధా, ధి, ధీ, ధు, ధూ, ధె, ధే, ధై, ధొ, ధో, ధౌ, ధం, ధః


న, నా, ని, నీ, ను, నూ, నె, నే, నై, నొ, నో, నౌ, నం, నః


ప, పా, పి, పీ, పు, పూ, పె, పే, పై, పొ, పో, పౌ, పం, పః


ఫ, ఫా, ఫి, ఫీ, ఫు, ఫూ, ఫె, ఫే, ఫై, ఫొ, ఫో, ఫౌ, ఫం, ఫః


బ, బా, బి, బీ, బు, బూ, బె, బే, బై, బొ, బో, బౌ, బం, బః


భ, భా, భి, భీ, భు, భూ, భె, భే, భై, భొ, భో, భౌ, భం, భః


మ, మా, మి, మీ, ము, మూ, మె, మే, మై, మొ, మో, 

మౌ, మం, మః


య, యా, యి, యీ, యు, యూ, యొ, యే, యై, యొ, 

యో, యౌ, యం, యః


ర, రా, రి, రీ, రు, రూ, రె, రే, రై, రొ, రో, రౌ, రం, రః


ల, లా, లి, లీ, లు, లూ, లె, లే, లై, లొ, లో, లౌ, లం, లః


వ, వా, వి, వీ, వు, వూ, వె, వే, వై, వొ, వో, వౌ, వం, వః


శ, శా, శి, శీ, శు, శూ, శె, శే, శై, శొ, శో, శౌ, శం, శః


ష, షా, షి, షీ, షు, షూ, షె, షే, షై, షొ, షో, షౌ, షం, షః


స, సా, సి, సీ, సు, సూ, సె, సే, సై, సొ, సో, సౌ, సం, సః


హ, హా, హి, హీ, హు, హూ, హె, హే, హై, హొ, హో, హౌ, 

హం, హః

Tags:Telugu Varnamala - తెలుగు వర్ణమాల


Board of Intermediate Education Intermediate first year and second year 2014

Office of the Secretary,
Board of Intermediate Education,
A.P., Nampally, Hyderabad.
PRESS RELEASE - Date: 16-11-2013.

It is hereby informed that the Intermediate first year and second year 2014 Time Table / Schedule for conducting Intermediate Public Examinations March 2014 is revised with second language under Part-II is on the 1st day of the commencement of the Examinations and English Paper under Part-I shifted to 2nd day of the Examinations keeping in view of the interest of the rural students and with the approval of the Chairman of the Board of Intermediate Education & Hon'ble Minister (S.E) Govt of A.P. Inter 1st year and 2nd year 2014 Time-Table is given below:

TIME TABLE - (Revised) THEORY - Time: 9.00 A. M to 12.00 P.M.

1st Year Time Table

2nd Year Time Table

Day & Date Subject Day & Date Subject
WEDNESDAY
12-03-2014
PART - II:
2nd LANGUAGE PAPER-I
THURSDAY
13-03-2014
PART - II:
2nd LANGUAGE PAPER-II
FRIDAY
14-03-2014
PART - I:
ENGLISH PAPER- I
SATURDAY
15-03-2014
PART - I:
ENGLISH PAPER- II
MONDAY
17-03-2014
PART-III:
MATHEMATICS PAPER-I A
BOTANY PAPER-I
CIVICS PAPER-I
PSYCHOLOGY PAPER-I
TUESDAY
18-03-2014
PART-III:
MATHEMATICS PAPER-II A
BOTANY PAPER-II
CIVICS PAPER-II
PSYCHOLOGY PAPER -II
WEDNESDAY
19-03-2014
MATHEMATICS PAPER - I B
ZOOLOGY PAPER - I
HISTORY PAPER - I
THURSDAY
20-03-2014
MATHEMATICS PAPER- II B
ZOOLOGY PAPER- II
HISTORY PAPER- II
FRIDAY
21-03-2014
PHYSICS PAPER -I
ECONOMICS PAPER- I
CLASSICAL LANGUAGE PAPER- I
SATURDAY
22-03-2014
PHYSICS PAPER -II
ECONOMICS PAPER- II
CLASSICAL LANGUAGE PAPER- II.
MONDAY
24-03-2014
CHEMISTRY PAPER - I
COMMERCE PAPER - I
SOCIOLOGY PAPER - I
FINE ARTS, MUSIC PAPER - I
TUESDAY
25-03-2014
CHEMISTRY PAPER -II
COMMERCE PAPER -II
SOCIOLOGY PAPER - II
FINE ARTS, MUSIC PAPER - II
WEDNESDAY
26-03-2014
GEOLOGY PAPER- I
HOME SCIENCE PAPER - I
PUBLIC ADMINISTRATION PAPER-I
LOGIC PAPER- I
BRIDGE COURSE MATHS PAPER- I
(FOR B.P.C STUDENTS)
THURSDAY
27-03-2014
GEOLOGY PAPER- II
HOME SCIENCE PAPER- II
PUBLIC ADMINISTRATION PAPER-II
LOGIC PAPER - II
BRIDGE COURSE MATHS PAPER-II
(FOR B.P.C STUDENTS)
FRIDAY
28-03-2014
MODERN LANGUAGE PAPER - I.
GEOGRAPHY PAPER- I
SATURDAY
29-03-2014
MODERN LANGUAGE PAPER - II.
GEOGRAPHY PAPER- II.

a) Environmental Education Examination on 31-01-2014 from 10.00 A.M to 1.00 P.M (One day).
b) Practical Examinations from 12-02-2014 to 04-03-2014.
The above dates are applicable to Intermediate Vocational Course Examinations also. However, the Vocational courses Time Table will be issued separately.
NOTE: This is not an advertisement item.

SECRETARY

APPSC Panchayat Secretary Answer key 23rd February 2014 APPSC Key

APPSC Panchayat Secretary Answer key 23rd February 2014 at APPSC answer key – Paper I General studies ... Answers will be available in pdf format. Check answers, download and save and take print out, APPSC Panchayat Secretary Answer Key 2014 will be uploaded soon at ... their answers can download complete paper solution whenever it is.. Download APPSC Panchayat Secretary Answer Key Here









APPSC Panchayat Secretary Answer key Exam date - 23.02.2014

APPSC Panchayat Secretary Exam 2014 Scheduled on 23.02.2014 in 2406 Exam centers all ... Panchayat Secretary Question Paper& Key, APPSC Answer key Panchayat Secretary 2014 APPSCAPPSC Answer key Panchayat Secretary 2014 APPSC,APPSC Panchayat Secretary Answer Key / Solved Papers 2014 : APPSC Panchayat Secretary Answer key for Grade IV Exam.

Paper - I (G S) with Key
Series D

www.eenadupratibha.net


విద్యుత్ నిరోధానికి ప్రమాణం



http://cdn.newshunt.com/fetchdata2/20140215/namasthe/CurrentAffairs/images/350x350_IMAGE27158863.png

టాన్స్ ఫార్మర్ ద్వారా AC కరెంట్‌ని ప్రసారం చేసినట్టయితే ఆ ప్రసార నష్టం తక్కువగా ఉంటుంది. కానీ DC కరెంట్‌ను ప్రసారం చేసినట్టయితే ప్రసార నష్టం ఎక్కువగా ఉంటుంది. ఓమ్ : రాబర్ట్ సైమన్ ఓమ్‌ను ప్రవేశపేట్టాడు. -స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఒక తీగ ద్వారా ప్రవహిస్తున్న విద్యుత్ దానిలోని ప్రొటెన్షియల్ తేడాకు అనుపాతంలో ఉంటుంది iav i = I/RXV i = V/R లేదా i = IR లేదా i = V/R ఈ సమీకరణంలో R = విద్యుత్ నిరోధం విద్యుత్ నిరోధం : -ఏదైనా ఒక వలయం గుండా లేదా తీగగుండా విద్యుత్ ప్రవహిస్తున్నా ఆ ప్రవాహాన్ని అడ్డగించి లేదా వ్యతిరేకించే ధర్మమే విద్యుత్ నిరోధం -విద్యుత్ నిరోధానికి ప్రమాణం ఓమ్ విద్యుచ్చాలక బలం : -ఎలక్ట్రానులను అధిక పొటెన్షియల్ గల బిందువు వైపునకు తరలించడానికి విద్యుత్‌ఘటం చేసే పనిని విద్యుచ్చాలక బలం(e.m.f) అంటారు. -దీనికి ప్రమాణం వోల్టు -విద్యుచ్చాలక బలం అందించు సాధనాలను విద్యుచ్చాలక పీటాలు అంటారు. ఉదా : విద్యుత్ జనరేటర్, సైకిల్ డైనమో. విశిష్ట నిరోధం : -వాహక ప్రమాణ పొడవుపై ఉండే నిరోధాన్ని విశిష్ట నిరోధం అంటారు. -విశిష్ట నిరోధానికి ప్రమాణం- వోమ్ మీటర్ రియోస్టాట్ : ప్రయోగశాలలో విద్యుత్ వలయాల్లోని విద్యుత్ ప్రవాహాన్ని తగ్గించడానికి/పెంచడానికి ఉపయోగించే పరికరాన్ని రియోస్టాట్ అంటారు. అతివాహకత్వం : -ఉష్ణోగ్రతను తగ్గిస్తూపోతే కొన్ని పదార్థాల నిరోధకత ఒకానొక ఉష్ణోగ్రత వద్ద ఒక్కసారిగా శూన్యమవుతుంది. ఆ ఉష్ణోగ్రతను సందిగ్ధ ఉష్ణోగ్రత అంటారు. ఆ స్థితిలో పదార్థాన్ని అతివాహకం(Super conductor) అంటారు. -పాదరసం అతివాహక ఉష్ణోగ్రత 4.2 కెల్విన్లు -అతివాహకత్వంను కనుగొన్న శాస్త్రవేత్త కామన్ లింక్స్ ఓమ్. విద్యుత్ ప్రవాహంపై ఉష్ణోగ్రత ప్రవాహం : -ఉష్ణోగ్రతను పెంచినట్లయితే వాహకాల నిరోధం పెరిగి వాటి ద్వారా ప్రవహించే విద్యుత్ తగ్గిపోతుంది. ట్రాన్స్‌ఫార్మర్ : తక్కువ వోల్టేజి నుంచి ఎక్కువ వోలేజికి లేదా ఎక్కువ ఓల్టేజి నుంచి తుక్కువ ఓల్టేజికి విద్యుత్ సరఫరా చేయడానికి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఉపయోగిస్తారు. ఇది పరస్పర ప్రేరణ లేదా అనూహ్య ప్రేరణ అను సూత్రం ఆధారంగా అనిచేస్తుంది. -ఈ సూత్రాన్ని లెంజ్ ప్రతిపాదించాడు. -ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మొదటి ట్రాన్స్‌ఫార్మర్‌ను మైఖేల్ ఫారడే నిర్మించాడు. -సాధారణంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను సులభంగా అయస్కాంతీకరణం చెందే సాఫ్ట్ ఐరన్‌తో నిర్మిస్తారు. సోలినాయిడ్ : ఒక పొడవైన విద్యుద్బంధకపు స్థూపాకార గొట్టాన్ని తీసుకొని దాని చుట్టూ విద్యుద్బంధకపు పూతగల రాగి తీగను ఖాళీ లేకుండా దగ్గరగా చుట్టినట్లయితే దానిని సోలినాయిడ్ అంటారు. దాని గుండా విద్యుత్ ప్రవహింపజేస్తే దండయస్కాంతం వలె అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. విద్యుత్ విశ్లేషనం : విద్యుత్‌ను ఉపయోగించి, సమ్మేళనాలను రసాయనికంగా విభజించి, వాటి మూలకాలుగా మార్చే ప్రక్రియను విద్యుత్ విశ్లేషనం అంటారు. విద్యత్ విశ్లేషనం ఉపయోగాలు : ఎలక్ట్రో ప్లేటింగ్ : ఇనుము తుప్పు పట్టకుండా నిరోధించడానికి, దానిపై నికెల్ లేదా క్రోమియం పూతను విద్యుద్విశ్లేషణం ద్వారా ఏర్పడేటట్లు చేస్తారు. గిల్టినగల తయారీ : తక్కువ ఖరీదుగల ఇత్తడి వంటి లోహంతో నగలు తయారుచేసి దానిపై విద్యుద్విశ్లేషణం ద్వారా బంగారు పూత పూస్తారు. లోహ సంగ్రహణం : విద్యుద్విశ్లేషణం ద్వారా లోహ ఖనిజాల నుంచి పరిశుభ్రమైన లోహాలను పొందవచ్చు. -విద్యుద్విశ్లేషణం ఉపయోగించి ఎలక్ట్రిక్ ప్రింటింగ్, గ్రామ్‌ఫోన్ రికార్డులు తయారు చేస్తారు. ఫ్యూజ్ : ఇది టిన్‌నొడ్ మిశ్రమంతో చేసిన తక్కువ ద్రవీభవన స్థానం గల వైరు ముక్క బల్బు : -విద్యుత్ బల్బును థామస్ ఆల్ఫా ఎడిసిన్ కనుగొన్నాడు. -విద్యుత్ బల్బులో వేడెక్కే భాగం ఫిలమెంట్ -ఫిలమెంట్‌ను సాధారణంగా టంగ్‌స్టన్‌తో తయారు చేస్తారు. -బల్బుల్లో ఆర్గాన్, నియాన్ వంటి జడవాయువులతో నింపుతారు.

రైల్వే బడ్జెట్

కేంద్ర రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే తన తొలి రైల్వే బడ్జెట్‌ను ఫిబ్రవరి 12, 2014న లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఎన్నికల నేపథ్యంలో ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం వేయలేదు. రూ 1,60,775 కోట్ల మేర సరకు రవాణా ఆదాయమే లక్ష్యంగా ఈ దఫా రైల్వే బడ్జెట్ పట్టాలనెక్కింది. కొత్తగా 72 రైళ్లను రైల్వే మంత్రి ప్రతిపాదించారు. ఇందులో 17 ప్రీమియం, 38 ఎక్స్‌వూపెస్, 10 పాసింజర్ రైళ్లతో పాటు నాలుగు మెమో, మూడు డెమో రైళ్లున్నాయి. మన రాష్ట్రానికి తాజా బడ్జెట్‌లో కొంత ప్రాధాన్యం పెరిగిందనే చెప్పొచ్చు. వివిధ అంశాల వారీగా రైల్వే బడ్జెట్‌ను పరిశీలిస్తే.. భద్రతకు సంబంధించిన అంశాలు: కాపలాలేని క్రాసింగ్‌లను పూర్తిగా తొలగించేందుకు చర్యలు. ఇప్పటి దాకా కాపలాలేని 5, 400 క్రాసింగ్‌లను పూర్తిగా తొలగించారు. రైళ్లు ఢీ కొనకుండా దేశీయంగా అభివృద్ధి పరచిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు రైల్వే మంత్రి ప్రతిపాదించారు. ఇటీవలే పలు రైళ్లలో అగ్ని ప్రమాదాలు భారీ ఎత్తున జరిగిన నేపథ్యంలో ఆ తరహా ప్రమాదాల నివారణకు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని రాజధాని ఎక్‌వూపెస్‌లో చేపట్టనున్నారు. ఇది విజయవంతమైతే అన్ని రైళ్లకు క్రమంగా విస్తరిస్తారు. సదుపాయాల కల్పన: కర్ణాటక, జార్ఖంఢ్, మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ తదితర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల సాయంతో వ్యయ వాటా విధానంతో మౌలిక సదుపాయాలను పెంచనున్నారు. రైల్వే రంగంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రతిపాదనలు చేశారు. రైల్వే టారిఫ్ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ప్రయాణ, రవాణా చార్జీలను సహేతుకంగా నిర్ణయించడంలో స్వతంత్ర ప్రతిపత్తి ఈ సంస్థకు ఉంటుంది. పర్యావరణ పెంపునకు దోహదపడే పలు చర్యలను కూడా తాజా బడ్జెట్‌లో రైల్వే మంత్రి ప్రతిపాదించారు. రైల్వే ఎనర్జీ మేనేజ్‌మెంట్ అమలుల్లోకి రానుంది. పవన, సౌరశక్తిలను వినియోగించే ప్రాజెక్టులను చేపట్టనున్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించి 40% మేర రాయితీని ఇందులో ప్రతిపాదించనున్నారు. బయో టాయిపూట్ల వినియోగాన్ని 2, 500 రైళ్లకు విస్తరించారు. నిధుల సమీకరణకు రుణాలు:రూ. 13, 800 కోట్ల మేర రుణాలను మార్కెట్ల నుంచి రైల్వే శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకోనుంది. రైలు వ్యాగన్లు, కంటెయినర్ల తయారీకి గానూ వీటిని వినియోగించనున్నారు. ఇందుకుగానూ రూ 12, 800 కోట్లను కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద మరో రూ 6, 005 కోట్లను సమీకరించాలని నిర్ణయించారు. ఇది సాకారం అయితే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు రూ. 19, 805 కోట్ల మేర నిధులను సమీకరించుకుంటుంది. బడ్జెట్‌లో ఆంధ్రవూపదేశ్ భారీగా కాకున్నా, ఈ దఫా రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రవూపదేశ్‌కు కొంత మేర ప్రయోజనం దక్కింది. దేశ వ్యాప్తంగా ప్రతిపాదితమైన 55 ఎక్స్‌వూపెస్ రైళ్లలో, 15 దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండనున్నాయి. ఇవి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గుండా ప్రయాణించనున్నాయి. తాజా బడ్జెట్‌లో రెండు డబుల్ డెక్కర్ ఎక్సవూపెస్ రైళ్లను ప్రతిపాదించారు. ఇవి రెండు ఆంధ్రవూపదేశ్ రాష్ట్రానికే దక్కాయి. రాష్ట్ర రాజధానిలోని కాచిగూడ నుంచి తిరుపతికి, ఒక డబుల్ డెక్కర్ పరుగులు తీయనుంది. హైదరాబాద్ గుల్బర్గాల మధ్య ఇంటర్ సిటీ ఎక్సవూపెస్ రానుంది. చార్జీల మోత పెంచనప్పటికీ, రైల్వే టారీఫ్ అథారిటీ ఏర్పాటు, పరోక్షంగా చార్జీల పెంపునకు ఉద్దేశించిందేని భావించవచ్చు. మరో మూడు నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో చార్జీల పెంపు వంటి నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పొచ్చు. నిజానికి ఈ టారీఫ్ ఏర్పాటు, 2012లో ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌లోనే 2012 లోనే నాటి రైల్వే శాఖ మంత్రి దినేశ్ ద్వివేదీ ప్రతిపాదించారు. మరో వైపు రైల్వే మంత్రులుగా ఉన్నవారు, సొంత రాష్ర్టం, లేదా సొంత నియోజకవర్గానికి అధిక లబ్ధి పొందేలా నిర్ణయాలు తీసుకోవడం పరిపాటిగా మారింది. ప్రస్తుత రైల్వే మంత్రి అదే తీరును ప్రదర్శించారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న గుల్బర్గా నియోజక వర్గానికి మంచి ప్రాధాన్యం ఇచ్చారు. కొత్తగా వచ్చిన రైళ్లలో సుమారుగా 15, ఈ నియోజకవర్గం గుండా పరుగులు తీయనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా రానున్న ఎనిమిది ఎక్సవూపెస్ రైళ్లలో అయిదు ఉత్తర కర్ణాటకలో ఉన్న గుల్బర్గా మీదుగా ప్రయాణించేవే. ఉత్తర కర్ణాటకకు అత్యంత సమీపంలో ఉన్న రెండు లైన్ల డంబ్లింగ్ సర్వేకు కూడా రైల్వేమంత్రి పచ్చజెండా ఊపారు. రైల్వే బడ్జెట్ చరిత్ర: భారత సాధారణ బడ్జెట్ నుంచి, రైల్వే బడ్జెట్‌ను 1924లో వేరు చేశారు. పది మంది సభ్యులతో కూడిన విలియం ఆక్‌వర్త్ నేతృత్వంలోని కమిటీ సూచన మేరకు, రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చాక, తొలి రైల్వే శాఖ మంత్రిగా జాన్ మత్తాయ్ బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా రైల్వే బడ్జెట్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం 24 మార్చి, 1994లో చేశారు. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో వరుసగా ఆరు సార్లు నాటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రవేశపెట్టారు. యూపీఏ-2 హయాంలో ఆరుగురు రైల్వే శాఖ బాధ్యతలు నిర్వహించారు. తొలుత ఆ పదవిలో నియామకం అయిన తృణమూల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. దీంతో అదే పార్టీకి చెందిన దినేశ్ త్రివేదీ రైల్వే మంత్రి అయ్యారు. అయితే ఆయన 2012 బడ్జెట్‌లో రైల్వే చార్జీలు పెంచడంతో మమత ఒత్తిడి మేరకు ఆయన పదవీత్యాగం చేయాల్సి వచ్చింది. అదే పార్టీకి చెందిన ముకుల్ రాయ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే యూపీఏ కూటమి నుంచి తృణమూల్ వైదొలగడంతో తాత్కాలికంగా సీజీ జోషీ అదనంగా రైల్వే శాఖ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం పూర్తి స్థాయి మంత్రిగా పవన్ కుమార్ బన్సల్‌ను నియమించారు. అయితే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన కూడా వైదొలిగారు. దీంతో మల్లికార్జున ఖర్గే ఆ బాధ్యతలను చేపట్టారు. ఇతర ముఖ్యాంశాలు: ఆదాయ అంచనాలు - ప్రయాణికుల ద్వారా రూ 45, 255 కోట్లు -సరకు రవాణా చార్జీల ద్వారా రూ 1,05,770 కోట్లు - ఇతరేతర మార్గాల ద్వారా రూ 9, 700 కోట్లు -4,556 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ, 2,027 కిలోమీటర్ల మేర కొత్త మార్గాల నిర్మాణం -దేశ వాణిజ్య రాజధాని ముంబై, అలహాబాద్‌ల మధ్య హైస్పీడ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం/ ఈ ఏడాది ఏప్రిల్ కల్లా పూర్తి చేసేలా లక్ష్యం. - ప్రస్తుతం దేశంలో రెండే రెండు రాష్ట్రాల్లో రైల్వే సౌకర్యాలు అందుబాటులో లేవు, అవి అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఈ రెండు రాష్ట్రాలకు ఈ ఏడాది రైల్వే సౌకర్యాలు అందుబాట్లోకి రానున్నాయి. -19 కొత్త లైన్ల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో సర్వే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అయిదు డంబ్లింగ్ ట్రాక్‌లకు కూడా సర్వే చేస్తారు. -దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జులై నుంచి ఏసీ ఈఎంయూ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. -టికెట్ కన్‌ఫర్మ్ అయిన పక్షంలో ప్రయాణికుల మొబైల్‌కు సంక్షిప్త సందేశం రానుంది. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా మరికొన్ని ఆహార కేంద్రాలు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. -వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ 1.6 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యం -ప్రత్యేక పార్శిల్ రైళ్లలో పాల రవాణ చేపట్టాలని నిర్ణయం -ప్యాంట్రీలలో ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో ఎలక్ట్రిక్ వంట పరికరాలు -రాష్ట్ర 13వ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. ద్రవ్యవినిమయ బిల్లు- 2014ను ఉభయ సభలు ఆమోదించడంతో శాసన సభ నిరవధికంగా వాయిదా పడింది. -గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ సమావేశమయ్యారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల తరువాత నరేంద్ర మోడీకి వీసా ఇవ్వడానికి అమెరికా నిరాకరిస్తూ వస్తోంది. గత 13 ఏళ్లలో ఓ విదేశీ రాయబారి స్థాయి అధికారి గాంధీనగర్ రావడం ఇదే ప్రథమం. -సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఒక తోకచుక్కను యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి 'టోటాస్' అని పేరు పెట్టారు. -సైనిక యుద్ధట్యాంకులకు 'నైట్ విజన్' పరికరాలను సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి. రూ. 1,800 కోట్లతో ఈ పరికరాల కొనుగోలు ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 14 -ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో డిసెంబర్ 28న ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. -ఇండోనేసియాలోని జావా దీవిలోని 'మౌంట్ కెలూద్' అగ్నిపర్వతం గురువారం రాత్రి బద్దలైంది. దీంతో బూడిద, శకలాలు 18 కిలోమీటర్ల దూరం వరకు వెదజిల్లాయి. -బ్లడ్ కేన్సర్ (ల్యుకేమియా) వ్యాపించడానికి కారణమవుతున్న 'బీఆర్‌జీ1' అనే జన్యువును కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియెల్ శాస్త్రవేత్తలు గుర్తించారు.

బిల్లులు, సభలు- రాజ్యాంగ పద్ధతులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ఏ సభలో ప్రవేశపెట్టాలన్న అంశంపై అంతకు ముందే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విభిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఒక బిల్లు చట్టంగా మారాలంటే, లోక్‌సభలో మూడు దశలు, రాజ్యసభలో మూడు దశలు దాటాల్సి ఉంటుంది. తాజాగా పునర్వ్యవస్థీకరణ బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలని భావించారు. అయితే ఇది ద్రవ్యబిల్లు అన్న అంశం తెరపైకి రావడంతో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎందుకంటే ద్రవ్యబిల్లు, లేదా ఆర్థిక బిల్లులను కేవలం లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలని రాజ్యాంగం నిర్దేశించింది. ద్రవ్య లేదా మనీ బిల్లుకు సంబంధించిన నిర్వచనం అధికరణం 110లో పేర్కొన్నారు. ఒక బిల్లు, ద్రవ్య బిల్లా కాదా అన్న అంశాన్ని నిర్ణయించే అధికారం, లోకసభ స్పీకర్‌దే. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం. అయితే ద్రవ్య బిల్లులకు సంబంధించి రాష్ర్టపతికి పాకెట్ వీటో అధికారం లేదు (అధికరణం 111) ద్రవ్యబిల్లు, ఆర్థిక బిల్లుకు కూడా తేడా ఉంది. ద్రవ్య బిల్లులో ముఖ్యంగా ఆరు అంశాలు ఉంటాయి. పన్ను విధింపు లేక చెల్లింపునకు సంబంధించింది ప్రభుత్వం తీసుకునే రుణాలు సంఘటిత నిధికి సంబంధించి ప్రభుత్వ గణాంకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల తనిఖీకి సంబంధించిన అంశాలు ద్రవ్యబిల్లులో ఉంటాయి. ఈ పరిధిలోకి రాని, ఇతర ఆర్థిక అంశాలను కలిగి ఉన్న బిల్లులను ఆర్థిక బిల్లులు అంటారు. ఆర్థిక బిల్లులకు సంబంధించి స్పీకర్ నిర్ణయం ఉండదు. అలాగే ద్రవ్య, ఆర్థిక బిల్లుల మధ్య కొన్ని సారూప్యాలు కూడా ఉంటాయి. ఈ రెండింటిని మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదు. రెండింటిని లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి పూర్వానుమతి తప్పనిసరి. ఆర్థిక బిల్లుల ఆమోదం సాధారణ బిల్లుల ఆమోదం తరహాలోనే ఉంటుంది. సాధారణ బిల్లులను ఏ సభలో అయిన ప్రవేశపెట్టొచ్చు. అధికరణం 123 ప్రకారం, రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్‌లు కూడా పార్లమెంట్ అనుమతి పొందాల్సి ఉంటుంది. లేదా అవి రద్దు అవుతాయి. ఇటీవలి కాలంలో, ఆహార భద్రత చట్టం, నిర్భయ చట్టం కూడా మొదట ఆర్డినెన్స్‌ల రూపంలో వచ్చి, తర్వాత చట్టసభల్లోకి ప్రవేశించి చట్టాలుగా మారాయి. లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని ప్రధాన అంశాలు ప్రస్తుత రాజధాని హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒకే గవర్నర్ ఉంటారు. ఉమ్మడి రాజధానిగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తం ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటుకు నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. 45 రోజుల్లో ఇది తన సిఫారసులను ఇస్తుంది. నీటి పంపకాలకు సంబంధించి కేంద్రం ఒక అత్యున్నత మండలిని ఏర్పాటు చేస్తుంది. కష్ణా, గోదావరి జలాల పంపకాలను ఇది పర్యవేక్షిస్తుంది తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉంటాయి. అలాగే తెలంగాణలో 119 శాసనసభ స్థానాలు, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 175 శాసనసభ స్థానాలు ఉంటాయి. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ ప్రాజెక్ట్ హోదానిస్తారు. కొత్త రాష్ట్రంలో హైకోర్ట్ ఏర్పాటు చేసే వరకు ప్రస్తుతం రాష్ట్రంలోని సర్వోన్నత న్యాయస్థానమే, ఇరు రాష్ర్ర్టాలకు ఉమ్మడిగా కొనసాగుతుంది. సాధారణ బిల్లు- ఆమోదం పొందే తీరు సాధారణ బిల్లును లోక్‌సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. ఆయా సభలో ఆమోదించిన వెంటనే రెండో సభకు పంపిస్తారు. రెండో సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. లేదా సవరణ చేసి తిరిగి మొదటి సభకు పంపించవచ్చు. లేదా ఆరు నెలల పాటు పెండింగ్‌లో ఉంచవచ్చు. బిల్లు స్వభావాన్ని బట్టి ఆ అంశం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందో ఆ మంత్రి ఆ బిల్లును ప్రవేశ పెట్టడం రివాజు. ఉభయసభల సమావేశం : ఉభయ సభల సమావేశానికి సంబంధించి అధికరణం 108లో పేర్కొన్నారు. ఉభయ సభల సమావేశ పరిచే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే దీనికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఏ అంశంపైనయినా సందిగ్ధత నెలకొంటే ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ తరహా సమావేశం తొలిసారిగా 1961లో వరకట్న నిషేధ బిల్లుకు సంబంధించిన అంశంపై నిర్వహించారు. 1978లో బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించి నిర్వహించిన ఉభయ సభల సమావేశం రెండోది. (పోటా) ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ యాక్ట్ బిల్లుకు సంబంధించి 2002లో మూడోసారి ఉభయ సభల సమావేశం జరిగింది. రాజ్యాంగ సవరణ బిల్లును రెండు సభలు విడివిడిగా ఆమోదించాలి. ఈ అంశంలో ఉమ్మడి సమావేశానికి ఆస్కారం లేదు. ఏదైనా బిల్లుకు సంబంధించి లోతైన అధ్యయనం అవసరం అని భావిస్తే స్టాండింగ్ కమిటీలకు ఆయా సభలు సిఫారసు చేస్తాయి. బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాక రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. ద్రవ్య బిల్లును మాత్రం విధిగా రాష్ట్రపతి ఆమోదించవలసి ఉంటుంది. మిగతా బిల్లులను మాత్రం ఆమోదించవచ్చు లేదా తన దగ్గరే ఉంచుకోవచ్చు. రాష్ట్రపతి సంతకం చేసిన రోజే ఆయా బిల్లులు చట్టంగా మారుతాయి. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్రపతి విధిగా ఆమోదించాల్సి ఉంటుంది.


Degree B.A., B.Sc., B.Com., B.B.M., B.C.A., General, Vocational Kakatiya University Annual Exam 2014

Tags:Kakatiya University Degree Time Table 2014Kakatiya University, Conduct Degree B.A., B.Sc., B.Com., B.B.M., B.C.A., General, Vocational, Kakatiya University Annual Exam 2014 Kakatiya University is one of the well identified universities in the India. The Kakatiya University




Kakatiya University Degree Time Table 2014Kakatiya University, Conduct Degree B.A., B.Sc., B.Com., B.B.M., B.C.A., General, Vocational, Kakatiya University Annual Exam 2014 Kakatiya University is one of the well identified universities in the India. The Kakatiya University

సూక్ష్మ జీవులు- వ్యాధులు


సూక్ష్మ జీవులు- వ్యాధులు
  • లూయీ పాశ్చర్ ను Father of  Microbiology గా పిలుస్తారు.
  • సూక్ష్మ జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని " మైక్రోబయాలజీ" లేదా సూక్ష్మ జీవశాస్త్రం అంటారు.
  • సూక్ష్మ జీవులను 1674 లో తొలిసారిగా "ఆంటోనీవాన్ లీవెన్ హుక్ " కనుక్కున్నాడు.
  • సూక్ష్మ జీవులు - రకాలు:  1. వైరస్   2. బాక్టీరియా    3. ప్రోటోజోవా   4. శైవలాలు     5.శీలీంధ్రాలు . 

వైరస్:

  • మొదట వైరస్ లను కనుక్కున్న శాస్త్రవేత్త "ఐవనోవిస్కి"
  • వైరస్  అంటే లాటిన్ భాషలో "విషం" అని అర్థం.
  • వైరస్ అని పేరు పెట్టిన వ్యక్తి - బైజరింక్.
  • వైరస్ లను గురించి చేసే అధ్యయనాన్ని "వైరాలజీ" అంటారు.
జలుబు:

  • రినోవైరస్ ద్వారా జలుబు
  • గాలి, ప్రత్యక్ష స్పర్శ ద్వారా సోకును.
పోలియో:
  • ఎంటిరోవైరస్ / పోలియో వైరస్ వల్ల .
  • కలుషితాహారం నీరు ద్వారా వ్యాపిస్తుంది.
  • పోలియో వ్యాధిలో చిన్న పిల్లల్లో చాలకనాడులు దెబ్బతింటాయి.
డెంగ్యూజ్వరం:
  • డెంగ్యు వైరస్ (అర్బో వైరస్)
  • ఏడిస్ ఈజిప్టు దోమ ద్వార వ్యాపించింది.
  • ఈ వ్యాధి వల్ల రక్తఫలకికలు/ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది.
రాబిస్ (జలభీతి)
  • రాబిస్ వైరస్ (రాబ్డోవైరస్)
  • రేబిస్ వ్యాధి కేంద్ర నాడీవ్యవస్థను బలహీనం చేయడం వల్ల నీటిని చూస్తే భయం కలుగును (హైడ్రోఫోబియా)
  • పిచ్చికుక్కకాటు ద్వారా వ్యాపిస్తుంది.
ఎయిడ్స్  (AIDS):
  • అక్వైర్డ్ ఇమ్యునో డెఫిసియన్సీ సిండ్రోమ్
  • రక్తం, లైంగిక సమ్బంధం, సూదులు, ద్రవాలు ద్వారా వ్యాపిస్తుంది.
  • H.I.V వైరస్ ని కనుగొన్న శాస్త్రవేత్త - ల్యూక్ మాంటెగ్నియర్ (పారిస్) ,రాబర్ట్ గాలో (అమెరికా).
  • ప్రపంచంలో తొలి ఎయిడ్స్ కేసు: 1981 వ సం. అమెరికాలో... భారత్ లో 1986 May లో చైన్నెలో(మద్రాస్)
  •  H.I.V ని గుర్తించడానికి ఉపయోగించి రక్త పరీక్షలు: ఎలీసా, P.C.R, వెస్ట్రన్ బ్లాట్
  • ELISA :  Enzyme Linked Immuno Sarbent Assay
  • ఎలీసా ను ఎంగ్వల్ & ప్లర్ మన్ లు 1970 లో కనుగొన్నారు.
  • NACO - నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
  • నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పూణెలో కలదు.
  •  ఎయిడ్స్ సమాచారం కోసం Toll Free No: 1097
  •  ఎయిడ్స్  నివారణకు వాడే ఔషదాలు:  AZT, DDI, DDC























VRO , VRA Qustions and Answer Objections

Tag : Village Revenue Officers & Village Revenue Assistants
Tag : Village Revenue Officers & Village Revenue Assistants

AP TET Hall Ticket Download

Tag : Ap Tet Hall ticket download
Tag : Ap Tet Hall ticket download

Followers