పెళ్లయిన కొత్తలో... పొదుపు ఆలోచనలతో..


ఇద్దరి మనసులు కలిసిన శుభ వేళ.. వారిద్దరి ఆలోచనలు ఒక్కటైతే.. మాటల పూతోటల్లో తేలియాడాలన్న భావాలతో జీవిత గమ్యాన్ని 'పొదుపు'బంధంతో ముడివేస్తే.. అవధులు లేని ఆనందానికి మార్గాన్ని సృష్టిచుకుంటారు. ఇదేదో చమత్కారానికో.. లేక పదాతలో ఆకట్టుకోవడానికో అని భావిస్తే మీరూ తప్పులో కాలేసినట్లే... ఇది కొత్తగా పెళ్లైన వారిని ఉద్ధేశించినదే అయినా.. పెళ్లైన వారూ ఇప్పటి నుండైనా క్రయం తప్పకుండా జీవితం సాఫీగా సాగిపోవడానికి వీలుగా 'ఆర్ధిక' వంతెనను నిర్మించుకోవడం ఎంతో అవసరం. ప్రస్తు తం పెళ్లిళ్ల సీజన్‌ జోరుగా సాగుతున్న నేపథ్యంలో నేటి తరం వారు ఒక్క అడుగు పొదుపు, వారి జీవితానికి అవసరమైన ఆర్ధిక వనరులను సమకూర్చకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం ఎంతో అవసరం. వివాహం అనేది జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ఒక్క టైన దంపతులు జీవితాంతం ఎలా ఉండాలో నిర్ణయించుకోవడంలో ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉండాలి. అటువంటి సందర్భంలోనే కష్టాలకు స్వస్తి చెప్పి.. ఆనంద డోలికలల్లో తేలియాడే రోజులు ముందుంటాయి. ఇద్దరి మధ్య అవగాహన ముఖ్యం. అవగాహనతో పాటు సమా చారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఇంకా ముఖ్యం. కొత్తదంపతుల ఆలొ చనలు సమాంతరంగా ఉంటే.. ఆర్ధిక ఒడుదుడుకులను నెట్టుకు వచ్చే ఓర్పు నేర్పు వాటంతట అవే వస్తాయి. ఆర్ధిక సంబంధ విషయాలలో కొత్తగా పెళ్ళైన దంపతులు తీసుకోవాల్సిన జాగ్రతలు.. ఆర్ధికాంశాలతో కూడిన ఏడడుగులు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. వాస్తవాలను గుర్తించడం : వివాహం అయిత తరువాత భార్యా భర్తలిద్దరూ పూర్తి స్వేచ్ఛా వాతావరణంలో మనసువిప్పి మాట్లాడుకో వడం అవసరం. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలన్న చం దాన.. కష్టాలు నెత్తిన పడ్డాక ఆలోచనలు ప్రారంభించడం అంత మం చిది కాదు. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగస్తులయితే వారిద్దరికి వచ్చే నెల సరి ఆదాయం, ఖర్చులను మొదటి అంచనా వేసుకోవాలి. ఉన్నత చదువుల కోసం ఏదైనా బ్యాంక్‌ రుణాలు పొంది ఉంటే.. వాటిని సాధ్య మైనంత త్వరగా చెల్లించడం ముఖ్యం. తల్లితండ్రులు వారి ఉన్నత విద్యాభ్యాసానికో.. విదేశీ చదువులకో.. విదేశీ ఉద్యోగ అవకాశాలకో రుణాలు పొంది ఉంటే తిరిగి చెల్లించి మంచి రుణ చెల్లింపుల కుటుం బంగా జీవితపు తొలిమెట్టు ఎక్కడంలో ఎంతో సంతోషముంటుంది. మీ ఆలోచనలకు ఆర్ధిక స్థోమతను సరి చూసుకోవాలి : ఇక రెండవ మెట్టు ఎక్కేముందు ఒక్కసారి ఇద్దరి ఆలోచనలకూ పదును పెట్టండి. భవిష్యత్తులో ఎలాంటి ఇంటిని నిర్మించుకోవాలి భావిస్తు న్నారు..? ఎలాంటి వాహనాన్ని కొనాలని ఉత్సాహ పడుతున్నారు..? అసలు ఇంటికి కావలసిన ముఖ్యమైన వస్తువులు ఏంటి..? వాటికి ఎంత ఖర్చు అవుతుంది. ఊహించిన దానికంటే మరింత ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉంటే మీరు ఏదైనా బ్యాంక్‌ నుండి రుణ సదుపా యాన్ని పొందాల్సి ఉంటుంది. అలాంటి సమయంలోనే మీరు గతం లో రుణాలు తిరిగి చెల్లించడంలో ఎలాంటి రిమార్క్‌ లేకుండా ఉండ టం ఇప్పుడు మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇక ఆలోచిం చేది ఏముంది.. మీ రాబడిని ఊహించి రుణాలకు ప్రయత్నించండి. పొదుపు అలవాటు ఎంతో ముఖ్యం : పె ళ్ళైన కొత్తలో భార్యా భర్తలిద్దరూ చేసే ఖర్చులు ఆతరువాత పరిశీలించి చూస్తే గుండె గుభే లంటుంది. అయితే ముందు నుండీ ఒక ప్రణాళికా బద్ధంగా మీరు చేసే ప్రతీ పైసాని ఒక కాగితంపై రాసిపెట్టుకోవడం ఎంతో అవసరం. అలా చేయడం వల్ల మీరు ఖర్చు చేసే ప్రతీ రూపాయి అవసరంగా ఖర్చు చేశారో.. అనవసరమైన ఖర్చులకు వెళ్లిందో తెలుసుకోవడం ఎంతో తేలిక. మీరు ఖర్చుల జాబితాను పరిశీలించిన తరువాత ఆదా యంలోకి కొంత సొమ్మును 'పొదుపు' వైపు మళ్లించుకోవడం కీలక మైనది. మీ జీవితంలో భార్యాభర్తలు కావడంలో ఎటువంటి సంతో షాన్ని అనుభవించారో మీరు చేసే పొదుపు మూలంగా భవిష్యత్తులో అంతకు నూరు రెట్లు సంతోషాన్ని అనుభవిస్తారన్నది సత్యం. ఈ పొదుపును జీవితంలో ఒక అలవాటుగా చేసుకోవడం ఇద్దరికీ మంచిది. పొదుపు సొమ్ముపై దృష్టి పెట్టండి : ప్రతీ నెలానెలా లేదా ఏటా మీరు చెల్లిస్తున్న పొదుపు సొమ్ముపై మీరు దృష్టి పెట్టాలి. అయితే పొదుపు సొమ్మును ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవడానికి ప్రయత్నించ వద్దు. అలాగే ఫిక్సిడ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీనే మీరు ఉపయోగించుకోవాలే తప్ప. వాటి ప్రీమియం కాల పరిమితి పూర్తి కాకుండానే మధ్యలో రద్దు చేసుకోవడం, లేదా వాటిపై అధిక రుణాలు పొందడం కొంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అందువల్ల ఫిక్సిడ్‌ చేసిన వాటి కాలపరిమితి వరకూ వాటి జోలికి వెళ్లకుండా ఉండటం ఎంతో మేలు.


జలుబు, గొంతు నొప్పి ఉంటే...ఆరోగ్యదాయిని రెడ్‌ క్యాబేజి....కిడ్నీలు ఫెయిలయితే?

 జలుబు, గొంతు నొప్పి ఉంటే...

గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి గొంతులో పడేలా పుక్కిట పట్టాలి. పుక్కిట పట్టేప్పుడు సుమారు 10నుంచి 15 నిముషాలపాటు చేయాలి. రోజుకు 4నుంచి 6సార్లు పుక్కిట పట్టాలి. చల్లని నీళ్లు, ఐస్‌క్రీమ్‌, కూల్‌డ్రింక్‌ తీసుకున్నవారు వీలైనంత త్వరగా గోరు వెచ్చని నీటితో నీళ్లను పుక్కిలిస్తే జలుబు, గొంతు నొప్పి, బొంగురు గొంతు రాకుండా నివారించుకోవచ్చు. 


ఆరోగ్యదాయిని రెడ్‌ క్యాబేజి

 ఆకుపచ్చని ఆకుకూరలు, కాయగూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసినదే. కొన్ని రకాల కూరగాయలు సాధారణ ప్రయోజనాలను అందిస్తే, మరికొన్ని రకాల కూరగాయలు మరింత సమర్థంగా పని చేస్తాయి. ఒకే రకానికి చెందిన కూరగాయలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఉదాహరణకు వంకాయ ఊదా రంగులోనే కాకుండా, తెలుపు రంగులోనూ లభిస్తుందనే విషయం మనకు తెలిసినదే. క్యాప్సికమ్‌ ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. క్యాబేజ్‌ కూడా తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ఇలా భిన్న రంగులున్న కూరగాయలు, పండ్లు ఎంతో సమర్థంగా పని చేస్తాయి. ఎరుపు రంగులో ఉన్న కూరగాయలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, పెప్సిన్‌ పదార్థాలు పుష్కలంగా ఉండి, ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు యాపిల్‌, టమాటో, బెల్‌ పెప్పర్‌ వంటి ఎరుపు రంగు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. వీటిలో అనేక పోషక విలువలు ఉంటాయి. ఎరుపు రంగు క్యాబేజ్‌ ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలిద్దాం. బరువు తగ్గడం రెడ్‌ క్యాబేజిలో నీరు అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఊబకాయ సమస్య ఉన్నవారు బరువు తగ్గడానికి ఈ క్యాబేజి జ్యూస్‌ లేదా సలాడ్‌ రూపంలో తీసుకోవడం మంచిది. 



కిడ్నీలు ఫెయిలయితే?

 మన శరీరంలో అనేక క్రియలను నిర్వర్తించే అవయవాల్లో మూత్రపిండాలు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. చిక్కుడు గింజ ఆకారంలో రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఇవి కడుపులో వెనుకభాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఛాతీకి కింది భాగంలో ఎముకల మధ్య సురక్షితంగా ఇమిడి ఉంటాయి. ప్రతి మూత్రపిండం సాధారణంగా 10 సెంటీమీర్ల పొడవు, 5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. దీని బరువు 150నుంచి 170 గ్రాముల వరకూ ఉంటుంది. మూతపిండాలు శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థాలను మూత్రవిసర్జన ద్వారా బైటకు పంపుతుంది. వీటితోపాటు శరీరంలో నీటి సమతుల్యత, రక్తపోటు, రక్తపు గడ్డలు, కాల్షియం మొదలైన వాటిని నియంత్రిస్తుంది. మన శరీరంలో ప్రతి రెండు నిముషాలకు రెండు మూత్రపిండాలలో 1200 మిల్లిdలీటర్ల రక్తం శుభ్రమవుతుంది. 24 గంటలలో 1700 లీటర్ల రక్తం శుద్ది అవుతుంది. మూత్రపిండాల వ్యాధి లక్షణాలు ఉదయం నిద్ర లేచిన వెంటనే కళ్లు వాచి ఉండటం ఆకలి తక్కువగా ఉండటం, వాంతులు, వికారంగా అనిపించడం రాత్రిళ్లు ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం చిన్న వయస్సులోనే రక్తపోటు ఉండటం కొంచెం నడిస్తే ఆయాసం, నీరసంగా అనిపించడం ఆరు సంవత్సరాల తరువాత కూడా మంచంపై మూత విసర్జన చేయడం మూత్ర విసర్జన సమయంలో మంట, చీము, రక్తం రావడం, మూతం బొట్లు బొట్లుగా రావడం కడుపులో పుండ్లు కావడం, కాళ్లు, నడుము నొప్పులు పై లక్షణాలు ఏవైనా ఉంటే మూత్రపిండాల వ్యాధిగా అనుమానించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఎక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ దీనిలో క్రమబద్ధంగా పని చేస్తున్న మూత్రపిండాల హఠాత్తుగా తక్కువ సమయంలో పని చేయకుండా పోతాయి. దీనికి వాంతులు కావడం, మలేరియా, రక్తపోటు మొదలైనవి ప్రధాన కారణాలు. తగిన మందులు ఇవ్వడం, డయాలిసిస్‌ చేయడం ద్వారా సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు. క్రానిక్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ మూత్రపిండాలు మెల్లమెల్లగా దీర్ఘకాలంలో క్షీణిస్తుంటాయి. శరీరంలో వాపు రావడం, ఆకలి తక్కువగా ఉండటం, వాంతులు, నీరసం, మనస్సు సరిగ్గా లేకపోవడం, తక్కువ వయస్సులోనే రక్తపోటు అధికంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. రక్తపరీక్షలో క్రియాటిన్‌, యూరియాల పరిమాణం ద్వారా మూత్రపిండాలు పని చేసే విధానం గురించి తెలుసుకుంటారు. మూత్రపిండాల పనితీరుమందగించిన కొద్దీ రక్తంలో క్రియాటిన్‌, యూరియా పరిమాణం ఎక్కువవుతుంది. మూత్రపిండాలు అత్యధికంగా పాడైపోతే అంటే సామాన్యంగా క్రియాటిన్‌ 8 నుంచి 10 మిల్లిdగ్రాములు పెరిగినప్పుడు మందులు తీసుకున్నప్పటికీ ఆహార నియమాలు పాటించినప్పటికీ రోగి పరిస్థితిలో మెరుగు కనిపించదు. ఇటువంటి పరిస్థితుల్లో రెండు రకాల మార్గాలు ఉంటాయి. డయాలిసిస్‌, కిడ్నీ మార్పిడి. డయాలిసిస్‌ శరీరంలో రెండు మూత్రపిండాలు పాడైపోయినప్పుడు శరీరంలో అనవసరమై, విసర్జించబడిన పదార్థాలు, నీటి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని బయటకు పంపించే ప్రక్రియను డయాలిసిస్‌ అంటారు. మిషన్‌ ద్వారా శుద్ధి చేయడం (హీమోడయాలిసిస్‌) ఈ పద్ధతిలో హీమోడయాలిసిస్‌ అనే మిషన్‌ సహాయంతో కృత్రిమ కిడ్నీ (డయలైజర్‌)లో రక్తాన్ని శుద్ధి చేస్తారు. మిషన్‌ సాయంతో రక్తాన్ని శుభ్రపరిచి తిరగి శరీరంలోకి పంపుతుంటారు. రోగి ఆరోగ్యకరంగా ఉండటానికి వారానికి రెండు లేదా మూడుసార్లు డయాలిసిస్‌ చేయాల్సి ఉంటుంది. హీమోడయాలిసిస్‌ చేసుకునే సమయంలో రోగి మంచంపై పడుకుని ఉండగానే ఆహారం తీసుకోవడం, టి.వి. చూడటం వంటి పనులు చేసుకోవచ్చు. ప్రతిసారి డయాలిసిస్‌ చేసుకునేందుకు 4 గంటల సమయం పడుతుంది. పెరిటోనియల్‌ డయాలిసిస్‌ (పొట్ట డయాలిసిస్‌ సిఎపిడి) ఈ పద్దతిలో రోగి మిషన్‌ ఉపయగించుకుండా, నేరుగా ఇంట్లోనే డయాలిసిస్‌ చేసుకోవచ్చు. సిఎపిడిలో ఒక రకమైన అనువుగా ఉండే ఒక పైప్‌ను పొట్టలో అమరుస్తారు. ఈ పైప్‌ ద్వారా ప్రత్యేకమైన ఫ్లూయిడ్‌ను పంపుతారు. కొన్ని గంటల తర్వాత ఆ ద్రవాన్ని మళ్లిd బైటకు తీసినప్పుడు ద్రవంతోపాఉటగా వ్యర్థాలు కూడా బయటకు వచ్చేస్తాయి. యురినరీ ఇన్‌ఫెక్షన్‌ మూత్రం పోసేప్పుడు మంటగా ఉండటం, మాటిమాటికీ యూరిన్‌ రావడం, బొడ్డు కింద భాగంలో నొప్పి, జ్వరం రావడం యూరినరీ ఇన్‌ఫెక్షన్‌ ముఖ్య లక్షణాలు. దీన్ని మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో దీనికి చికిత్స ఇస్తున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం అవసరం. చికిత్స ఇవ్వడం ఆలస్యం చేసినా, సరైన చికిత్స ఇవ్వకపోయినా మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. డాక్టర్‌ శ్రీధర్‌ నెఫ్రాలజిస్ట్‌,గ్లోబల్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌ సెల్‌ : 9885376705



ఎపిపిఎస్‌సి ఎగ్జామ్స్‌కు ఏ పుస్తకాలు చదవాలి?


ఎపిపిఎస్‌సి వివిధ రిక్రూట్‌మెంట్లకు ప్రశ్నపత్రాలను రూపొందిం చేటప్పుడు ఏ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుంటుంది? ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు వంటివి రిఫరెన్స్‌గా తీసుకుంటుందా? ఎపిపిఎస్‌సి పరీక్షలకు ఏ పుస్తకాలు చదవడం మంచింది?- ఆర్. రమణ, నిజామాబాద్. జ : ఎపిపిఎస్‌సి నిర్వహించే పోటీపరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాల రూపకల్పనలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి పరీక్షకు సంబంధించి విడుదల చేసిన సిలబస్, ఆధారంగానే ప్రశ్నపత్రాలు రూపొందుతాయి. అయితే సిలబస్ రూపకల్పన సందర్భంలో మాత్రమే ఎపిపిఎస్‌సి పాత్ర ఉంటుంది. అదీ కూడా ఒక నిపుణులు కమిటీ సూచించిన విధంగానే సిలబస్‌ను ఫైనల్ చేయడం జరుగుతుంది. ప్రశ్న పత్రాల రూపకల్పన అంతా కూడా సంబందిత సబ్జెక్టు ఎక్స్‌ఫర్ట్స్‌తో జరుగుతుంది. ఇందులో ఎపిపిఎస్‌సి పాత్ర ఎంత మాత్రం ఉండదు. అయితే ఆయా సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌ను ఎంపిక చేయడంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎంపికలో సాధారణంగా సీనియర్ వెూస్ట్ ప్రొఫెసర్, సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన వర్తమాన అంశాలను నిరంతరం ఫాలో అవుతున్న వారికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్న పత్రాల రూపకల్పన సమయంలో ఎపిపిఎస్‌సి కేవలం సిలబస్‌ను మాత్రమే ఎక్ప్‌పర్ట్‌కు ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్నల స్థాయి, తీరు ఎక్స్‌పర్ట్ విచక్షణకే వదిలివేయడం జరుగుతుంది. ఎక్స్‌పర్ట్స్ సాధారణంగా ఆయా సిలబస్‌లోని అంశాలు గల స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ నుండే ప్రశ్నలను రూపొందించడం జరుగుతుంది. పబ్లికేషన్ డివిజన్, సమాచార మంత్రిత్వశాఖ ప్రచురించిన పుస్తకాలను, ఎన్‌సిఇఆర్‌టి, ప్రభుత్వ విభాగాలు రూపొందించిన పుస్తకాలు (తెలుగు అకాడమి లాంటివి) రిఫర్ చేసి ప్రశ్నలను రూపొందిస్తారు. అయితే పుస్తకాలలోని సమాచారాన్ని యథాతదంగా మాత్రం ఇవ్వడం జరగదు. అందువల్ల వీటిని చదివి అర్థం చేసుకోగలిగితేనే ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించడం సాధ్యం అవుతుంది. కాబట్టి చదివిన సమాచారాన్ని వివిధ కొణాలలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాసం ఎన్ని పేజీలు రాయాలి? ప్ర : గ్రూప్-1 మెయిన్స్‌లో ఎస్సే పేపర్‌లో రాయవలసిన మూడు వ్యాసాలలో ప్రతివ్యాసం మాములుగా ఎన్ని పేజీలు రాయాలి? కొంతమంది అభ్యర్థులు సగటున మూడు వ్యాసాలకు కలిపి 20 పేజీలు రాస్తుండగా, మరికొంతమంది అభ్యర్థులు చాలా ఎక్కువ పేజీలు రాయడం జరుగుతుంది. వీటిలో ఏది సరైన పద్ధతి?- కె. సుదీర్, కరీనంగర్. జ : గ్రూప్-1 జనరల్ ఎస్సే పేపర్‌లో మూడు గంటల సమయంలో మూడు వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం ఎన్ని పేజీలలో రాయాలన్న విషయం కేవలం అపోహ మాత్రమే. గతంలో ఒకే వ్యాసం రాసే పద్ధతి ఉండేది. మారిన నూతన విధానంలో ఇదే సమయంలో మూడు వ్యాసాలను రాయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రశ్న చాలా సుదీర్ఘంగా విభిన్న భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇది ఒక రకంగా గతంలోని ఆప్షనల్స్ పేపర్లలో వ్యాసరూప ప్రశ్నల కన్నా కొంచెం ఎక్కువ సమాధానాన్ని రాసే విధంగా ఉంటున్నాయి.జనరల్ ఎస్సే రాసేటప్పుడు పేజీల సంఖ్య కన్నా అందు బాటులో వున్న సమయంలో ప్రశ్నలో అడిగిన అన్ని అంశాలను సృశిస్తూ, మిగతా అభ్యర్థుల కన్నా నాణ్యమైన, ఖచ్చితమైన, నిర్థిష్ఠమైన , తక్కువ పదాలలో ఎక్కువ అర్థం వచ్చే విధంగా , సరళమైన భాషలో సులువుగా అర్థమయ్యే విధంగా వేగంగా రాయగలడం పై ప్రధానంగా దృష్టి సారించాలి.పేజీల సంఖ్య అనేది ముఖ్యంకాదు , సమాధానంలోని సమాచారం అత్యంత కీలకమని గుర్తించాలి. అయితే ఒక గంట సమయంలో, అక్షరాల సైజు సాధారణంగా రాయగల అభ్యర్థి అర్థమయ్యే రీతిలో కనిష్టంగా 8 పేజీలు, గరిష్టంగా 12 పేజీల వరకు రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇతరులను అనుకరించకుండా రైటింగ్‌లో వేగాన్ని పెంచుకోవడం, భాషపైన పట్టు సాధించడం, ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉండటం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వడం మంచిది. గ్రూప్-2 ఎకానమీ చదివేదెలా? ప్ర : నాది గ్రామీణ నేపథ్యం, కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేదు. సొంతంగా ప్రిపేర్ అవుతున్నాను. డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో పూర్తి చేశాను. గ్రూప్-2లో మొదటి, రెండవ పేపర్లకు భాగానే ప్రిపేరవుతున్నాను. కానీ ఎకానమి పేపర్ గందరగోళంగా ఉంది. ఎకానమీకి అకాడమీ పుస్తకాలు చదువుతున్నాను. కానీ అవి గ్రూప్-2 సిలబస్‌కు అనుగుణంగా లేకపోవడం వలన ఏవి చదవాలో, ఏవి వదిలేయాలో తెలియడం లేదు. ఎకానమీలో నేను గట్టెక్కడానికి పరిష్కారం చూపగలరు? - అప్పాన సూర్య, కొత్తకోట. జ : ముందుగా మీరు మానసికంగా ప్రిపేర్‌కావాలి. గ్రామీణ నేపథ్యం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌తో ఐ.ఎస్ సాధించిన ఉదహరణలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆత్మవిశ్వాసంతో ఆశావాద దృక్పథంతో ప్రిపేర్ కాగలిగితే అంతిమ విజయం మీదేనని బలంగా నమ్మాలి. వేలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలను పొందుతున్నప్పుడు అది మనెందుకు సాధ్యం కాదన్న ప్రశ్న వేసుకోవాలి. గ్రూప్-2లో ఉద్యోగం పొందాలంటే డిగ్రీలు, కోచింగ్‌లు, ఆర్థిక స్థోమత, అదృష్టం వంటి అంశాలకన్నా కఠోర దీక్షతో, పట్టుదలతో నిరంతరం తెలుసుకోవాలన్న తపనతో, సాధించాలన్న కసితో ఒక యజ్ఞంలాగా సరైన గైడెన్స్‌తో శాస్త్రీయ పద్ధతిలో ప్రిపేర్ కావడానికే అధిక ప్రాధాన్యనివ్వాలన్న విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇక గ్రూప్-2 ఎకానమి పేపర్‌లో అత్యదిక మార్కులు పొందాలంటే కొంచెం ఎక్కువ సమయం కేటాయించి, ఎక్కువగా కష్టపడటం తప్పనిసరి. ఎకానమికి సంబంధించిన మౌలికమైన అంశాలను తెలుసుకోవడానికి తెలుగు అకాడమి ఇంటర్ స్థాయి పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. అదే విధంగా గ్రూప్స్ పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అకాడమి పుస్తకాలను చదివేటప్పుడు, సిలబస్‌ను ముందు పెట్టుకొని అందులోని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పాయింట్ల రూపంలో నోట్ చేసుకోవాలి. అదే విధంగా రోజూ పేపర్లలో వస్తున్న ఎకానమీ సంబంధిత అంశాలను, పోటీపరీక్షల మ్యాగ్‌జైన్‌లలో వున్న అంశాలను నిరంతరం అనుసంధానించు కుంటూ చదవగలిగితే గరిష్ట మార్కులు పొందవచ్చు.

5 వ్యాసరూప నైపుణ్యాలకు పంచసూత్రాలు


డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాయడం చాలా కష్టమని, వాటిలో ఆశించిన మార్కులు సాధించడం అంత సలభం కాదని అభ్యర్థులు భావిస్తుంటారు. అయితే ఇందులో కొంత వాస్తవం ఉన్నా ఈ పరీక్షలకు అవసరమైన నైపుణ్యాలు పెంచుకుంటే వీటిలో కూడా విజయం సాధించవచ్చు. ఆ నైపుణ్యాలు ఏమిటో వివరంగా పరిశీలిద్దాం...పోటీపరీక్షలు రెండు రకాలుగా జరుగుతుంటాయి. అవి. 1. ఆబ్జెక్టివ్ పరీక్షలు, 2. డిస్క్రిప్టివ్ పరీక్షలు.పోటీపరీక్షల్లో ఎక్కువభాగం అబ్జెక్టివ్ తరహా పరీక్షలే ఉంటాయి. కానీ, కొన్ని ముఖ్యమైన పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఈ రెండూ కలిపి ఉంటాయి. ఉదాహరణకు జాతీయస్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-1 పరీక్షల్లో రెండవ దశ అయిన మెయిన్స్‌లో భాగంగా ఈ తరహా డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉంటాయి. మౌలిక ఉద్దేశ్యం ఏమిటి? సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 వంటి పోస్టులకు డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహించడం వెనుక ఉన్న మౌలిక ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుంటే ఈ తరహా పరీక్షలు రాయడానికి ఎటువంటి నైపుణ్యాలు అవసరవెూ అర్థమవుతుంది. సాధారణంగా ఆబ్జెక్టివ్ తరహా పరీక్షల్లో అభ్యర్థి ప్రశ్న క్రింద ఇచ్చే నాలుగు సమాధానాలలో సరైన దానిని గుర్తించాల్సి ఉంటుంది. దీని వలన అభ్యర్థి నాలెడ్జ్, అభ్యర్థి జ్ఞాపకశక్తి పరీక్షించినట్లవుతుందే తప్ప అంతకుమించి ఇతర ఏ నైపుణ్యాలు పరీక్షించడం వీలు కాదు. కానీ, వ్యాస రూప పరీక్షలలో (డిస్కిస్టివ్ పరీక్షలలో) అభ్యర్థి నాలెడ్జ్, జ్ఞాపకశక్తితో పాటు ఇంకా ఇతర నైపుణ్యాలు కూడా అంచనా వేయడానికి వీలవుతుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి వ్యక్తిత్వాన్ని ఎలా అంచనావేస్తారో అదే విధంగా డిస్కిప్టివ్ పరీక్షల ద్వారా కూడా అభ్యర్థి ఆలోచనా విధానం, సమస్యలను విశ్లేషించి పరిష్కారం చూపగల సామర్థ్యం , అతని అవగాహనా స్థాయితో పాటు అతని రైటింగ్ స్కిల్స్‌ను అంచనా వేయడానికి వీలవుతుంది.ఫలితంగా ఆయా పోస్టులకు సరైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి వీలు కలుగుతుంది. గ్రూప్-1, సివిల్ సర్వీసెస్ వంటి పోస్టులకు నిర్వహించే మెయిన్స్ పరీక్షల్లో ఆప్షనల్ సబ్జెక్టులతో పాటు జనరల్ స్టడీస్, జనరల్ ఎస్సే పేపర్లు ఉంటాయి. అయితే గ్రూప్-1, సివిల్ సర్వీసెస్ వంటి పోస్టులకు అప్షనల్ సబ్జెక్టుల్లో ప్రావీణ్యం వలన ప్రయోజనం ఉండదని గ్రహించి వాటి ప్రాధాన్యం తగ్గించి, కామన్ పేపర్లు ప్రవేశపెట్టారు. గ్రూప్-1లో ఆప్షనల్ పేపర్లు పూర్తిగా తొలగించగా సివిల్స్ మెయిన్స్‌లో రెండు ఆప్షనల్స్ బదులు ఒక ఆప్షనల్ ప్రవేశపెట్టారు. అయితే డిస్క్రిప్టివ్ పేపర్లు ఏవైనప్పటికీ ఆ పరీక్షల్లో రాణించాలంటే కొన్ని ప్రధానమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మెయిన్స్‌లో ఎస్సే ప్రిపేర్‌కు ఇవి చాలా అవసరం. 1. స్పష్టమైన భావవ్యక్తీరణ డిస్కిప్టివ్ పరీక్షల్లో రాస్తున్న అంశానికి సంబంధించిన సమాచారం సులభంగా అర్థం అయ్యేలా భావ వ్యక్తీకరణ సూటిగా ఉండాలి. ఒక అంశాన్ని సమర్థిస్తూ రాసినా, వ్యతిరేకిస్తూ రాసినా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు చదవగానే అర్థం అయ్యేలా ఉండాలి. ప్రశ్న ఒక కోణంలో అడిగితే, సమాధానం మరో కోణంలో రాయడం, అనవసర విషయాలు ప్రస్తావించడం వలన స్పష్టత లోపించి గందరగోళం ఏర్పడుతుంది. అడిగిన ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకొని అడిగినంత మేరకు నిర్థిష్టంగా రాయడం అలవాటు చేసుకోవాలి. ఇలా స్పష్టంగా, నిర్ధిష్టంగా రాయగల గాలంటే రాస్తున్న అంశంపై సమగ్రమైన అవగాహన, సంపూర్ణమైన సమాచారం ఉండాలి. అప్పుడే ప్రశ్నకు తగిన విధంగా సమాధానం రూపొందుతుంది. వ్యాసరూప పరీక్షల్లో రాసే సమాధానాలు అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానాన్ని, అవగాహనను తెలియజేస్తాయి కాబట్టి సమాధానం అన్ని అంశాలతో సమగ్రంగా, స్పష్టంగా, సూటిగా ఉండేలా రాయడం అలవర్చుకోవాలి. 2. విశ్లేషణా సామర్థ్యం డిస్క్రిప్టివ్ పరీక్షలలో ముఖ్యంగా ఎస్సే పేపర్‌లో విశ్లేషణ ఒక ప్రధానమైన లక్షణం. అడిగిన అంశాన్ని అన్ని కోణాల్లో మంచి, చెడులను సృ్పశిస్తూ విశ్లేషిస్తూ రాయడం అవసరం. ఉదాహరణకు ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులలో ఎవరూ నచ్చనప్పుడు వారినందరిని తిరస్కరించే హక్కు ఓటర్లకు కల్పించాలి అని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు అనుగుణంగా మొదటిసారి ఓటింగ్ యంత్రాలలో త్వరలో 5 రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలో 'ఎవరూ కాదు' అనే కొత్త మీటను ప్రవేశపెడుతున్నారు. ఈ సంస్కరణ నిజంగా భారత ఎన్నికల వ్యవస్థలో ఒక విప్లవాత్మక సంస్కరణే. అయితే ఈ సంస్కరణ వలన కలిగే ప్రయోజనాలు, ప్రభావాలను కూడా తెలుసుకొని వాటిని రాయగలిగితేనే సమాధానం విశ్లేషణాత్మకం అనిపించు కుంటుంది. అదే సమయంలో లోపాలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారాలు, సూచనలు కూడా అందించగలగాలి. ఈ విధమైన విశ్లేషణతో కూడిన సమాచారం వార్తాపత్రికలలో సంపాదకీ యాలు వంటి వాటిలో లభిస్తుంది. కాబట్టి వాటిని చదవడం ద్వారా విశ్లేషణాత్మకంగా రాసే సామర్థ్యం పెంపొందించుకోవచ్చు. 3. సృజనాత్మకత వ్యాసరూప పరీక్షల్లో మిగతా వాటికంటే ఎక్కువ మార్కులు సాధించాలంటే రాసే సమాధానాలు మిగిలిన వాటితో పోలిస్తే ప్రత్యేకంగా కనపడాలి. సమాధానాలు మూసపద్ధతిలో సాదా సీదాగా ఉంటే ఆ సమాధానాలు ఎగ్జామినర్‌ను ఆకర్షించడంలో వెనుకబడతాయి. సమాధానాలు నూతనంగా, విభిన్నంగా ఉంటే సహజంగానే వాటికి మంచి మార్కులు లభిస్తాయి. ఇతరులు రాసే పాయింట్లతో పాటు మరికొన్ని ప్రత్యేకమైన పాయింట్లు రాయడానికి ప్రయత్నించడం, సమాధానాలలో సమకాలీన అంశాలను జత చేయడం ద్వారా సమాధానాలలో నూతనత్వం ప్రతిఫలించేటట్లు చేయవచ్చు. దీనికి విస్రృ్తత అధ్యయనం చాలా అవసరం. వినూ త్నంగా సమాధానాలు రాసే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక అంశం గురించి ప్రిపేరయ్యేటప్పుడే ఆ అంశంపై ప్రశ్న వస్తే ఏ విధంగా విభిన్నంగా రాయవచ్చో ఆలోచించా లి. ఈ నైపుణ్యం అలవర్చుకోవడం అంత సులభం కాదు. కానీ, ప్రయత్నిస్తే త ప్పక సాధ్యమవుతుంది. 4. సరళమైన భాష ఇక వ్యాసరూప పరీక్షల్లో మరో ముఖ్యమైన అంశం. సరళమైన, భాషను ఉపయోగించడం. ఆడంబరమైన భాష, గ్రాంధికభాష ఉపయోగించకుండా సరళంగా రాయడం నేర్చుకోవాలి. కొంతమంది అభ్యర్థులు సమాధానాలలో వ్యవహరికం, గ్రాంథికం రెండింటిని కలిపి మిశ్రమ భాషగా రాస్తుంటారు. ఇవి సరైన పద్ధతి కాదు. భాష సహజంగా, చదువుతుంటే ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా, ఆహ్లదం కలిగించే విధంగా ఉండాలి. డిస్క్రిప్టివ్ పరీక్షల్లో భాషా నైపుణ్యాలకు కూడా చాలా ప్రాముఖ్యం ఉంటుంది. చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా సూటిగా, మనసుకు హత్తుకునేటట్లు రాయడం ఒక కళ. కేవలం భావానికి, అర్థానికి ప్రాధాన్యత ఇచ్చి భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోతే సమాధానాలు కృతకంగా ఉంటాయి. సమాధానాలు ఎంత సమగ్రంగా ఉన్నా, ఎంత విశ్లేషణతో కూడి ఉన్నా, అవి తెలిపేది భాష ద్వారానే కాబట్టి భాష అందంగా, సరళంగా, సహజంగా ఉండటం తప్పనిసరి. సమగ్రంగా ఉన్న సమాధానా లకు సహజమైన భాషతో పరిపూర్ణత చేకూరుతుంది. 5. సంక్షిప్తీకరించి రాయడం ఇక చివరగా వ్యాసరూప ప్రశ్నల్లో ఉండవలసిన నైపుణ్యం విషయాన్ని సంక్షిప్తంగా రాయడం, గ్రూప్-1, సివిల్స్ వంటి పరీక్షల్లో సమాధానాలకు పదనిబంధన ఉంటుంది. అందువలన అడిగిన ప్రశ్నకు అనుగుణంగా అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా తక్కువ పదాలలో ఎక్కువ అర్థం వచ్చే విధంగా రాయగలగాలి. గ్రూప్-1 మెయిన్స్‌లో ఎస్సే పేపర్ కాకుండా మిగతా పేపర్లలో ప్రతి ప్రశ్నకు కేవలం 12 నిమిషాలలోనే సమాధానం రాయవలసి ఉంటుంది.కాబట్టి ఆ తక్కువ సమయంలోనే ప్రశ్నను అర్థం చేసుకొని ఏం రాయాలో నిర్ణయించుకొని ఆ సమాధానం సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. అంటే తక్కువ సమయంలో, తక్కువ పదాలతో ప్రశ్నకు తగిన సమాధానాన్ని రాసే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ నైపుణ్యం అభివృద్ధి చేసుకుంటే నిర్దిష్ట సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం వీలవుతుంది. ఫలితంగా మిగతా వారికంటే ఎక్కువ మార్కులు లభిస్తాయి.ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్ స్కిల్స్ అన్నీ ఒక రోజులో నేర్చుకోవడం వీలుకాదు. ఇవి నిరంతర ప్రాక్టీస్ ద్వారానే అలవ డతాయి. అందువలన ముందునుంచే వెూడల్ సమాధానాలు రాయడం అలవాటు చేసుకొని వాటిని నిపుణులకు చూపించి వారి సల హాలు, సూచనలు పాటిస్తే మరింత ప్రయోజనం కలు గుతుంది.

ఏ పోస్టుకు ఏం చదవాలి?


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తుంటుంది.కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాటించే విధంగా ఎపిపియస్‌సికి క్యాలండర్ విధానం లేకపోవడంతో నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయన్నది ఖచ్చితంగా చెప్పలేం. అయితే త్వరలోనే ఎపిపియస్‌సి నుంచి పలు పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశం ఉంది. వాటిలో కొన్ని ముఖ్యమైన పోస్టులు, వాటి అర్హతలు, పరీక్షా విధానం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. గ్రూప్-2 ఎపిపియస్‌సి నిర్వహించే రిక్రూట్‌మెంట్లలో అన్నింటి కన్నా ఎక్కువగా అభ్యర్థులు పోటీపడేది గ్రూప్-2 పోస్టులే. ఇందులో రెండురకాల కేటగిరీ పోస్టులు ఉంటాయి. అవి 1. ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 2. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో డిప్యూటీ తహసిల్దార్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీసర్, సబ్ రిజిస్ట్రార్ వంటి పోస్టులు ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉంటాయి. వీటిలో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు , నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇప్పటి వరకు మూడు పేపర్లతో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించి ఆపై ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించేవారు. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కేవలం రాతపరీక్ష ఆధారంగా నియామకాలు జరిపేవారు. అయితే ఎపిపియస్‌సి సంస్కరణల్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలిపి గ్రూప్-1బి గా పేర్కొని ఇక నుండి వాటికి కూడా గ్రూప్-1లో మెయిన్స్ పరీక్షలు రాయాలని నిర్ణయించారు. అయితే అభ్యర్థుల కోరిక మేరకు రాబోయే నోటిఫికేషన్‌కు మాత్రమే పాత పద్ధతిలో ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహిస్తారు.ఇంటర్వ్యూ ఉండదు.ఆ తర్వాత రిక్రూట్‌మెంట్లకు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గ్రూప్-1 మాదిరిగా ప్రిలిమ్స్ మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల ఎంపిక విధానం ఉంటుంది. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కేవలం ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది.అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పొంది ఉండాలి. కొన్ని పోస్టులకు కామర్స్, ఎకనామిక్స్, మేథమెటిక్స్, లా సబ్జెక్టుల్లో డిగ్రీ, కంప్యూటర్స్‌లో సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. మొత్తం 3 పేపర్లు - ఆబ్జెక్టివ్ విధానం 1. జనరల్ స్టడీస్ - 150 మార్కులు 2. ఆంధ్రప్రదేశ్ సామాజిక, చరిత్ర, రాజ్యాంగ అవలోకనం - 150 మార్కులు 3. భారత ఆర్థికవ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ - 150 మార్కులు మొత్తం - 450 మార్కులు జూనియర్ లెక్చరర్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు పాఠాలు బోధించే జూనియర్ లెక్చరర్ పోస్టులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. రాతపరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. మొదటి దశ - రాతపరీక్ష - ఆబ్జెక్టివ్ విధానం. మొత్తం 2 పేపర్లు. 1. జనరల్‌స్టడీస్ - 150 మార్కులు 2. సంబంధిత సబ్జెక్టు - 300 మార్కులు మొత్తం - 450 మార్కులు. రెండవదశ ఇంటర్వ్యూ - 50 మార్కులు. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు డిగ్రీ కాలేజీలో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన లెక్చరర్ పోస్టులు. అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. ఇంకా నెట్ లేదా స్లెట్ పరీక్ష పాసై ఉండాలి. పి.హెచ్.డి పాసైన అభ్యర్థులకు నెట్/ స్లెట్ అర్హత నుంచి మినహాయింపు ఇస్తారు. ఎంపిక విధానం : ఎంపిక విధానం 2దశల్లో ఉంటుంది. -మొదటిదశ రాతపరీక్ష - ఆబ్జెక్టివ్ విధానం -మొదటి పేపర్ - జనరల్‌స్టడీస్ - 150 మార్కులు -ండవ పేపర్ - సంబంధిత సబ్జెక్టు - 300 మార్కులు -మొత్తం - 450 మార్కులు -ండవదశ - ఇంటర్వ్యూ - 50 మార్కులు గ్రూప్-4 పోస్టులు గ్రూప్-4 కింద వివిధ డిపార్ట్‌మెంట్లలో జూనియర్ అసి స్టెంట్ పోస్టులు, మరికొన్ని డిపార్ట్‌మెంట్లలో సూపర్‌వైజర్ వంటి అదే కేటగిరికి చెందిన పోస్టులు భర్తీ చేస్తారు. అర్హతలు : జూనియర్ అసిస్టెంట్లకు ఇంటర్, సూపర్‌వైజర్లకు ,ఎస్‌ఎస్.సి, లేదా తత్సమాన అర్హత. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. - రెండు పేపర్లు - ఆబ్జెక్టివ్ విధానం - పేపర్-1 జనరల్ స్టడీస్ - 150 మార్కులు - పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ - 150 మార్కులు - మొత్తం - 300 మార్కులు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వి.ఆర్.ఓ) గ్రామాలలో ప్రభుత్వ అధికారిగా శాంతిభద్రతల నుంచి అభివృద్థి పథకాల అమలు వరకు కీలక బాధ్యతలు నిర్వహించే విలేజ్‌రెవెన్యూ ఆఫీసర్ తహసిల్దార్ పర్యవేక్షణలో పనిచేస్తారు. విద్యార్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ద్వారా జరుగుతుంది. - రాత పరీక్షలో 100 మార్కులకు జనరల్‌స్టడీస్ పేపర్ ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటిసారిగా పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీని చేపడుతోంది. గ్రామీణా భివృద్ధిలో కీలక పాత్ర పోషించే గ్రామపంచాయితీకి సెక్రటరీగా ముఖ్యమైన విధులు, బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ర్టంలో 21,809 గ్రామాలు ఉన్నాయి. వీటికి పంచాయతీ సెక్రటరీని నియమించాల్సి ఉండగా కొన్ని చోట్ల కాంట్రాక్టు పద్ధతిలో పంచాయతి సెక్రటరీలను నియమించగా మరికొన్నిచోట్ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వీరిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడగా ఆన్‌లైన్ - దరఖాస్తుల పక్రియ ప్రారంభం కావాల్సిన దశలో వాయిదా పడింది. త్వరలో సెక్రటరీ పోస్టుల దరఖాస్తుల పక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ద్వారా ఉంటుంది. రాత పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. 1. జనరల్‌స్టడీస్ - 150 మార్కులు 2. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పేపర్ - 150 మార్కులు మొత్తం - 300 మార్కులు.


ఎంబిఎలో రిటైల్ మేనేజ్‌మెంట్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది?


ఎంబిఎలో రిటైల్ మేనేజ్‌మెంట్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది. ఈ కోర్సును ఏ ఇనిస్టిట్యూట్‌లు అందిస్తున్నాయి? -ఎస్.సాయిప్రమోద్, మిర్యాలగూడ. జ ః రిటైల్ మార్కెట్ మనదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. షాపర్స్ స్టాప్, వెస్ట్‌సైడ్, పాంటలూన్స్, లైఫ్‌స్టైల్, ఆర్.పి.జి. రిటైల్, క్రాస్‌వర్డ్, గ్లోబస్, రిలయన్స్ మోర్, బిగ్‌బజార్, హెరిటేజ్‌లాంటి మాల్స్ చిన్న చిన్న పట్టణాలలో కూడా వెలుస్తున్నాయి. ఈ సంస్థలలో సేల్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్, హెచ్.ఆర్. కస్టమర్ కేర్ లాంటి రంగాలలో నిపుణుల నియామకం జరుగుతుంది. ఇందులో రిటైల్ మేనేజిమెంట్ స్పెషలైజేషన్‌లో ఎం.బి.ఎ పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటాయి. వాల్‌మార్ట్‌లాంటి రిటైల్ దిగ్గజాల ప్రవేశంతో అవకాశాలు మరింత పెరుగుతాయి. ఎం.బి.ఎ.లో రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సును చాలా విద్యాలయాలు ఆఫర్ చేస్తున్నాయి. మన రాష్ట్రంలోని ఎం.బి.ఎ కళాశాలలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. Pune నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ఏయే కోర్సులు అందుబాటులో ఉంటాయి? ఈ సంస్థ బ్రాంచ్ హైదరాబాద్‌లో ఉందా? ఈ కోర్సులు చేయాలంటే ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడుతుంది? - ఆర్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ . అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థ. ఈ సంస్థ 50 దేశాలలోని విద్యా సంస్థలలో ఎక్స్‌చేంజ్ కార్యక్ర మాలను ఏర్పర్చుకుంది. ప్రస్తుతం ఈ సంస్థకు అహ్మాదాబాద్, గాంధీ నగర్, బెంగళూర్‌లలో క్యాంపస్‌లు న్నాయి. ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, మధ్యప్రదేశ్‌లలో క్యాంపస్‌లు ఏర్పాడు చేయాలని నిర్ణయించింది. హైదరాబాదులో క్యాంపస్ నిర్మాణానికి మే 25వ తేదీన శంఖుస్థాపన చేశారు. 2015-16 సంవత్సరానికి హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సంస్థ నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రొగ్రామ్ ఇన్ డిజైన్ (జి.డి.పి.డి) రెండున్నర సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రొగ్రామ్ ఇన్ డిజైన్ (పి.జి.డి.పి.డి) కోర్సులను ఆఫర్ చేస్తోంది. జిడిపిడి కోర్సును అహ్మదాబాద్ ఆఫర్ చేస్తోంది. పి.జి. కోర్సులు అన్ని క్యాంపస్‌లలో ఆఫర్ చేస్తోంది. డిగ్రీలలో 100 సీట్లు, పి.జిలో 245 సీట్లుంటాయి. ఈ క్రింది డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ప్రోడక్ట్ డిజైన్, ట్రాన్స్‌పొర్టేషన్ అండ్ ఆటోమోబైల్ డిజైన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరీయర్ డిజైన్, గేమ్ డిజైన్, అప్పరల్ డిజైన్ అండ్ మర్చండైజింగ్, లైఫ్‌స్టైల్ అక్సెసరీ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్ ఫిల్మ్‌డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, న్యూ మీడియా డిజైన్, సాఫ్ట్‌వేర్ అండ్ యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్, ఇన్‌ఫర్మేషన్ అండ్ డిజిటల్ డిజైన్, ఇన్‌ఫర్మేషన్ అండ్ ఇంటర్ ఫేస్ డిజైన్, డిజైన్ ఫర్ డిజిటల్ ఎక్సిపీరియన్స్, స్ట్రాటజీ డిజైన్ మేనేజ్‌మెంట్, డిజైన్ ఫర్ రిటైల్ ఎక్సిపీరియన్స్. ఈ కోర్సుల్లో ఎంపిక, సంస్థ నిర్వహించే డిజైన్ డిప్టిట్యూడ్ టెస్ట్ (డిఎటి)లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ప్రతి ఏటా నోటిఫికేషన్ సెప్టెంబర్/ అక్టోబర్ నెలల్లో వెలువడుతుంది. జనవరిలో డి.ఎటి పరీక్ష దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాలలో జరుగుతుంది. 2014-15 సంవత్సరానికి నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 2న ముగిసింది.దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష 2014 జనవరి 12న జరుగుతుంది. మీరు వచ్చే సంవత్సరానికి ఇప్పటి నుండి ప్రిపేర్ కావాలి. దీనికి గత సంవత్సర ప్రశ్నపత్రాలు పరిశీలించండి. పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్ www. nid.edu చూడగలరు. ప: ఆర్మీలోకి ప్రవేశించాలంటే ఎప్పటి నుంచి ప్లానింగ్ చేసుకోవాలి? 10 వరతగతి తర్వాత ? లేక ఇంటర్ తర్వాతా? దీనికి కావాల్సిన ప్రత్యేక అర్హతలు ఏవైనా ఉన్నాయా? వివరంగా తెలపండి.? -కె. సుధాకర్, నిజామాబాద్. జ ః ఆర్మీలోకి ప్రవేశించాలంటే రెండు దశలుగా ఆఫీసర్‌గా మరియు సైనికు డిగా (సోల్జర్) చేరవచ్చు. ఇంటర్మీడి యట్ అర్హతతో యు.పి.ఎస్.సి నిర్వహించే నేషనల్ డిఫెన్స్ ఎకాడమీ (ఎన్.డి.ఎ) పరీక్ష ద్వారా ఆఫీసర్‌గా చేరవచ్చు లేదా డిగ్రీ అర్హతతో కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ (సిడిఎస్) పరీక్ష రాసి ఆఫీసర్‌గా నేరుగా ఆర్మీలో చేరవచ్చు. పదవతరగతి అర్హతతో సైనికుడిగా చేరవచ్చు. ఇంటర్మీడి యట్ అర్హతతో సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్, సోల్జర్ నర్సింగ్, సోల్జర్ ట్రేక్స్‌మెన్‌గా చేరవచ్చు. అభ్యర్థులను శారీరక దారుఢ్య పరీక్షలు, మెడికల్ టెస్టులు, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులు కనీస ఎత్తు 165 సెంటిమీటర్లు ఉండాలి. బరువు 50 కేజీలు తగ్గకుండా ఉండాలి. ప్రతియేటా రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించి వివిధ రకాల సైనిక ఉద్యోగాలకు ఎంపిక చేయటం జరుగుతుంది. ప్రణాళిక బద్ధంగా ప్రిపేర్ అయితే ఎంపిక కావడం సుసాధ్యమే

Followers