Know your polling booth in Andhra Pradesh and India



Voters can easy to identify their polling booth by SMS. This SMS service fluctuates from state to state. 
  • Kerala – ELE<space>Voter ID Card No. to 54242 or 537252
  • Chandigarh – BTH<space>Voter ID Card No. to 9216164606
  • Andhra Pradesh – Vote<space>Voter ID Card No. to 9246280027
  • Karnataka – Send SMS as KAEPIC<space>Voter ID Card No. to 9243355223
  • Tamil Nadu – EPIC<space>Voter ID Card No. to 9444123456
  • Odisha – CEOODI<space>ED<space>Voter ID Card No. to 9238300131
  • West Bengal – WBEC<space>Voter ID Card No. to 51969
  • Uttar Pradesh – UPEPIC<space>Voter ID CARD No. to 9212357123


హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవికి గూగుల్ నివాళి





హ్యూమన్ కంప్యూటర్‌గా పేరుపొందిన ప్రముఖ గణిత మేధావి శకుంతలా దేవి 84వ జయంతి సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించింది. సెర్చ్ పేజీలో ఆమె బొమ్మతో కూడిన ప్రత్యేక డూడుల్‌ను ఉంచింది. డిజిటల్ అంకెల రూపంలో గూగుల్ అక్షరాలను రూపొందించి, వాటి పక్కన శకుంతలా దేవి బొమ్మ, ఎస్ డి అనే అక్షరాలతో డూడుల్‌ను తయారు చేసింది. ఆమె నవ్వుతున్నట్లుగా ఉన్న చిత్రాన్ని ఉంచింది. శకుంతలా దేవిని అందరూ హ్యూమన్ కంప్యూటర్ అంటారు. ఆమె లెక్కల్లో ఎన్నోసార్లు కంప్యూటర్ కంటే ఫాస్ట్‌గా చేశారు.
కాగా, హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన శకుంతలా దేవి 21 ఏప్రిల్ 213న కన్నుమూశారు. కొన్నాళ్లుగా శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న శకుంతలా దేవి చికిత్స కోసం ఓ ఆసుపత్రిలో చేరారు. గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఏప్రిల్ 21న ఉదయం 8:15 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ పబ్లిక్ ట్రస్ట్ ట్రస్టీ డిసి శివదేవ్ తెలిపారు. శకుంతలాదేవికి ఒక కుమార్తె ఉన్నారు. ఆమె 1929 నవంబర్ 4న సంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి సర్కస్‌లో పని చేసేవారు. మూడేళ్ల వయసులోనే పేకలతో ట్రిక్కులు చేయడంలో శకుంతల ప్రతిభను ఆయన గుర్తించారు. ఎంత ప్రతిభ ఉన్నా.. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేకపోయారు. తల్లిదండ్రులు ఆమెను ఒకటో తరగతిలో చేర్చినప్పటికీ.. నెలకు రూ.2 ఫీజు కట్టలేక మధ్యలోనే బడి మాన్పించేశారు. అయితే, ఆమె ప్రతిభ గురించి అన్ని దిక్కులా వ్యాపించింది. ఆరేళ్లప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌లో, ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై వర్సిటీలో.. గణితంలో తనకున్న ప్రావీణ్యాన్ని ఆమె బహిరంగంగా ప్రదర్శించారు. 1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గాన్ని ఆమె తన మనసులోనే గుణించి 50 సెకన్లలో సమాధానం చెప్పి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆమె చెప్పిన సమాధానాన్ని ద్రువీకరించుకోవడానికి శాస్త్రజ్ఞులు ఆ అంకెను వేగవంతమైన యూనివాక్ 1108 కంప్యూటర్‌కు ఫీడ్ చేయగా.. ఇదే సమస్యను పరిష్కరించడానికి దానికి ఒక నిమిషంపైగానే సమయం పట్టింది. అలాగే, 1980 జూన్ 18న.. ఇంపీరియల్ కాలేజ్, లండన్ కంప్యూటర్ విభాగం వారు ఆమెకు ఒక పరీక్ష పెట్టారు. కంప్యూటర్ అప్పటికప్పుడు ఇచ్చిన రెండు పదమూడు అంకెల సంఖ్యలను గుణించి ఫలితం చెప్పమన్నారు. ఆ ప్రశ్నకు ఆమె సరిగ్గా 28 సెకన్లలో సమాధానం చెప్పి వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. గత శతాబ్దిలో ఏ ఏడాదిలో ఏ నెలలో ఏ తేదీన ఏ వారం వచ్చిందో.. నిద్రలో లేపి అడిగినా ఠక్కున చెప్పే మేధస్సు ఆమె సొంతం. అంతేకాదు, ఆమె రచయిత్రి కూడా. గణితం, జ్యోతిషాలను అంశాలుగా తీసుకుని.. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథబ్లిట్, ఎవేకెన్ ద జీనియస్ ఇన్ యువర్ చైల్డ్, ఇన్ ద వండర్‌లాండ్ ఆఫ్ నంబర్స్ వంటి పుస్తకాలు రాశారు. అత్యుత్తమ, నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్


Followers