పవన్ కల్యాణ్ 'జనసేన'పై ఫిర్యాదు... 50 నోటుపై పవన్ బొమ్మ

pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. విషయం ఏంటంటే, 50 రూపాయిల నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో పవన్ కల్యాణ్ ఫొటోను పెట్టి, ఆ నోటును ఫేస్ బుక్ లో అప్ చేశారు. 
దీన్ని జనసేన పార్టీ పెట్టిందని ఆరోపిస్తూ కేసు పెట్టారు. గాంధీజీ బొమ్మ స్థానంలో పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టి మహాత్మా గాంధీని కించపరచారని మండిపడ్డారు. జనసేన పార్టీపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివాహానికి ముందే సెక్స్ సామర్థ్య పరీక్షలు.. మద్రాసు హైకోర్టు సలహా!

సంసారానికి పనికిరాని అనేక మంది పురుషులు, స్త్రీలు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత అటువంటి వారిని పెళ్ళాడిన భాగస్వాములు విడాకులు కావాలని కోరుతూ కోర్టుకు ఎక్కడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వివాహానికి ముందే అబ్బాయిలకు ఇంపోటెన్సీ (నపుంసకత్వం), అమ్మాయిలకు ఫ్రిజిడిటి (లైంగిక సామర్థ్యం) పరీక్షలను ఎందుకు తప్పని చేయకూడదంటూ మద్రాసు హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. 
 
పెళ్లి చేసుకోబోయే జంటకు వివాహానికి ముందే లైంగిక సామర్థ్య వైద్య పరీక్షలు నిర్వహించాలని మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే, లైంగిక సామర్థ్యం లేనివారు, సమస్యలు ఉన్నవారు వాటిని దాచిపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటే ఎందుకు ప్రశ్నించకూడదని, అలాంటి వారిపై చర్యలెందుకు తీసుకోరని హైకోర్టు నిలదీసింది. వివాహానికి ముందే వైద్య పరీక్షలు నిర్వహిస్తే లైంగిక సామర్థ్యం, వ్యాధుల వంటి వాటిపై అవగాహన కలుగుతుందని వ్యాఖ్యానించింది. సమస్యలను దాయడం ద్వారా మహిళలు నష్టపోయి, బాధితులుగా మిగులుతున్నారని న్యాయస్థానం తెలిపింది. దీనికి సరైన పరిష్కారం వివాహానికి ముందే వైద్య పరీక్షల నిర్వహణ అని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
 
నపుంసకుడైన భర్త నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలంటూ చెన్నైకు చెందిన ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్‌పై జస్టీస్ కృపాకరన్ విచారణ జరిపి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. పెళ్లికి ముందే కాబోయే భార్యాభర్తలకు లైంగి సామర్థ్య పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్రం ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా చట్టం రూపొందించడమో, సవరణ చేయడమో ఏదో ఒకటి చేయండని సూచించారు. తద్వారా పెళ్ళితో ఒక్కటయ్యే దంపతులు కలకాలం కలిసి జీవించేందుకు బాటలు వేయాలని కోరారు. 
 
అంతేకాకుండా, పెళ్లికి ముందు నపుంసకత్వాన్ని దాచే వారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. నపుంసకత్వాన్ని దాచి పెళ్లి చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిని మోసం చేసినట్లేని కూడా కృపాకరన్ వ్యాఖ్యానించారు. అందువల్ల పెళ్లికి ముందే లైంగిక సామర్థ్య పరీక్షలు చేయడం వల్ల వారిలో ఉండే నపుంసకత్వంతో పాటు దీర్ఘకాల వ్యాధులు కూడా బయటపడతాయని పేర్కొన్నారు. 

జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం ?




జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం? 
    మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నది సామెత. ప్రధాని ప్రకటించిన జన్ ధన్ యోజన పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ప్రయోజనాలు ప్రజలకు చేరాలంటే బ్యాంకు ఖాతాలు తెరవాల్సిందేనని ఆయన నొక్కి వక్కాణించారు. ఆగస్టు 28న దేశ వ్యాపిత కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కోటీ మందికిపైగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. అయితే ఈ ఖాళీ ఖాతాలతో ఏమిటి ప్రయోజనం అన్నదే ప్రధాన ప్రశ్న. ఇప్పటికే ఎన్నో ఎకౌంట్లు ఖాళీ గా వుండటం, వాటిని రద్దు చేసే విషయాన్ని బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. అయితే ఈ ఖాతాల వల్ల జీవిత భీమా, తదితర ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులు నేరుగా ఖాతాదారుల ఖాతాల్లోకి వచ్చి చేరుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే భవిష్యత్తులో ఈ ఖాతాల ద్వారా పేద ప్రజలకు ఏ మేరకు మేలు జరుగనుందో చూడాల్సి వుంది.
by: 10tv



Followers