థైరాయిడ్ కు హోమియో నుంచి ఉపశమనం

శరీరంలోని ప్రధాన జీవక్రియలన్నింటినీ నియంత్రించే ఒక కేంద్ర బిందువు థైరాయిడ్ గ్రంథి. ఇది మెడ ముందు భాగంలో ఉంటుంది. జీవక్రియలకు అవసరమైన హార్మోన్లన్ని ఈ గ్రంథిలోనుంచే ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లు రక్తంలో కలిసి శరీరమంతా తమ విధులు నిర్వహిస్తూ ఉంటాయి. పిల్లల శారీరక మానసిక ఎదుగుదలలో ఈ హార్మోన్ల పాత్ర కీలంకంగా ఉంటుంది. ఇక గుండె, జీర్ణవ్యవస్థ, విసర్జన లాంటి జీవక్రియలన్నింటినీ ఈ హార్మోన్లు క్రమబద్ధం చేస్తాయి. అయితే శరీరంలో ఈ హార్మోన్నల పరిమాణం తగ్గిపోయినపుడు జీవక్రియల వేగం కూడా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఒక వేళ ఈ హార్మోన్ల పరిమాణం పెరిగిపోతే జీవక్రియల వేగం కూడా పెరిగి పోతుంది. ఇలా పెరగడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ యాంటీ బాడీస్ ఉత్పన్నం కావడమే ఈ హార్మోన్ హెచ్చుతగ్గులకు ప్రధాన కారణం. హైపోథైరాయిడిజం - నిజానికి హార్మోన్లు తగ్గిపోవడమే ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య. పురుషుల్లో కన్నా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యలో థైరాయిడ్ గ్రంథికి విరుద్ధంగా శరీరంలో కొన్ని యాంటిబాడీస్ పెరుగుతాయి. ఫలితంగా గ్రంథి క్రమంగా క్షీణిస్తూ పోతుంది. ఆ క్రమంలో శరీర క్రియలన్నీ తమ సహజవేగాన్ని కోల్పోతాయి. అయినా చాలా కాలం దాకా ఈ వ్యాధి లక్షణాలేవీ స్పష్టంగా కనిపించవు. ఒక్కోసారి నెలలు, ఏళ్లు గడిచిన వ్యాధిగ్రస్తులు తమ సమస్యను గుర్తించలేరు. ఎలా తెలుస్తుంది? తొందరగా అలసిపోవడం, కాళ్లు చేతుల్లో నొప్పులు, మలబద్ధకం, శరీరం బరువు పెరిగిపోవడం, వాతావరణం ఏ కాస్త చల్లగా ఉన్నా విపరీతంగా వణికి పోవడం, ముఖం పాదాల్లో వాపు రావడం, పగటి వేళ ఎక్కువగా నిద్ర రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు చర్మం పాలిపోవడం, జుట్టు రాలిపవోడం వంటివి కూడా ఉంటాయి. మహిళల్లో ఈ హార్మోన్ లోపాలు ఉంటే నెలసరి సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ సమస్య ఉన్న స్త్రీలు గర్భం ధరించినపుడు వీరి హార్మోన్లను సాధారణ స్థాయిలో ఉంచడానికి మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేదంటే తల్లిలోని ఈ లోపం గర్భంలోని శిశువు ఎదుగుదలను దెబ్బతీస్తుంది. హార్మోన్లు తక్కువగా ఉంటే అసలు గర్భమే రాకుండా పోవచ్చు. ఎదిగే పిల్లల్లో హార్మోన్లు తక్కువగా ఉంటే అసలు గర్భమే రాకుండా పోవచ్చు. ఎదిగే పిల్లల్లో హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయితే వారి శారీరక మానసిక వృద్ధి కుంటుపడుతుంది. థైరాయిడ్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఇది అధిక రక్తపోటుకు కొలెస్ట్రాల్ పెదగడానికి దారి తీయవచ్చు. పైగా గుండె చుట్టు నీరు చేరి కొన్ని గుండె జబ్బులకు కూడా కారణం కావచ్చు. హార్మోన్లు తక్కువగా ఉన్న వారిలో ఆకలి మాములుగానే ఉంటుంది. కానీ, తీసుకున్న ఆహారంలోని కాలరీలు చాలా తక్కువగా ఖర్చు అవుతాయి. అందువల్ల మీరు ఎంత తక్కువగా తిన్నా కూడా శరీరం బరువు పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ సమస్య ఉన్న వారు చికిత్సల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. హైపర్ థైరాయిడిజం హార్మోన్లు అవసరానికి మించి ఉత్పన్నం కావడం ఇందులోని సమస్య. కాకపోతే ఈ సమస్య చాలా కొద్ది మందిలోనే కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్న వారిలో గొంతు భాగంలో వాపు కళ్లు ఉబ్బెత్తుగా బయటికి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో జీవక్రియల వేగం పెరిగిపోతుంది. విపరీతంగా ఆకలిగా ఉండడంతో పాటు కాలరీలు చాలా వేగంగా ఖర్చు అవుతాయి. అందుకే ఎంత తిన్నా శరీరం బరువు తగ్గిపోతూనే ఉంటుంది. దీనికి తోడు కాళ్లు చేతులు వణకడం, మాట తడబడటం, నాడీ వేగం పెరగడం గుండె దడ మొదలువుతాయి. ఎముకల నుంచి కాల్షియం బయటికి వెళ్లిపోవడం ఇందులో మరో సమస్య. వీరిలో జీవక్రియల వేగం బాగా పెరిగిపోతుంది. విపరీతంగా ఆకలిగా ఉండడంతో పాటు కాలరీలు చాలా వేగంగా ఖర్చు అవుతాయి అందుకే ఎంత తిన్నా శరీరం బరువు తగ్గిపోతూనే ఉంటుంది, దీనికి తోడు కాళ్లు చేతులు వణకడం, మాట తడబడటం, నాడీ వేగం పెరగడం, గుండె దడ మొదలవుతాయి. ఎముకల నుంచి కాల్షియం బయటికి వెళ్లిపోవడం ఇందులో మరో సమస్య. దీని వల్ల ఎముకలు బాగా బలహీన పడుతాయి. రక్తపోటు సాధారణంగా ఉంటుంది. కానీ, భావోద్వేగాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కళ్లు మరింతగా పొడుకువస్తాయి. కళ్లలలో తెమ తగ్గి ఎర్రబడతాయి. తొలుత సాధారణ దృష్టి లోపాలు ఏర్పడినా ఒక దశలో చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిలో గుండె వేగం బాగా పెరగడం వల్ల గుండె దెబ్బ తినే అవకాశం కూడాఉంది. వీటిలో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే హోమియో నిపుణులను సంప్రదించాలి. సాకాలంలో చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి వల్ల వచ్చే దుష్పరిమాణాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

వెంట్రుక పెరుగుదలకు ఆవ నూనె


అందం దుమ్ము, ధూళి, కాలుష్యం, పోషకాహార లోపం.. చిన్నాపెద్దల్ని బాధిస్తున్నాయి. ఈ ప్రభావం శిరోజాల మీద పడడంతో అతిగా వెంట్రుకలు రాలడం, నిర్జీవమవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు ఉపశమనంగా కొన్ని జాగ్రత్తలు ఇంట్లోనే తీసుకోవచ్చు.. ఆవ నూనె ఆవనూనెలో కొన్ని ఉసిరిముక్కలు, మెంతి గింజలు కలిపి వేడిచేయాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈ నూనెను వెచ్చబరిచి కుదుళ్లకు పట్టించాలి. రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూతో మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా 2-3 నెలలు చేస్తే జుట్టు రాలడం తగ్గడమే కాదు, ఒత్తుగా పెరుగుతుంది. 2-3 నెలలకు ఒకసారి చిట్లిన వెంట్రుకల చివరలను కత్తిరించాలి. దీని వల్ల వెంట్రుక పెళుసుబారి, తెగిపోకుండా బలంగా పెరుగుతుంది. హెయిర్ కలర్, సీరమ్, కండిషనర్స్, కర్లింగ్ మెషిన్ లేదా రీ బాండింగ్ ఉత్పత్తులు వెంట్రుకలను దెబ్బతీస్తాయి. పొడిబారేలా చేసి, వెంట్రుక పెరుగుదలను నిరోధిస్తాయి. అందుకని వీటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. కేశాలంకరణలో తప్పనిసరి అయితే, నిపుణుల సూచనలు పాటించాలి. ప్రతిరోజూ వెంట్రుక పెరుగుదల ఉంటుంది. తాజా పండ్లు, బాదంపప్పు, గుడ్డులోని తెల్లసొన, ఉసిరిక పొడి, నీరు వెంట్రుక బలానికి, నిగనిగలాడుతూ పెరగడానికి దోహదం చేస్తాయి.

పక్షవాతము ఉంటె..?


గుండెపోటుతో పాటు సరిసమానంగా ఎక్కువమందిలో కనిపిస్తున్న వ్యాధి పక్షవాతం. మన అవయవాలకు సంబంధించిన కండరాలను, వాటి కదలికలను నియంత్రించే నాడీకణాలు పనిచేయలేకపోయినప్పుడు ఎదురయ్యే సమస్యే పక్షవాతం. మెదడుకు కలిగే రక్త ప్రసరణలో ఎటువంటి అంతరాయం కలిగినా, రక్తపోటు పెరిగినా, నరాల నిర్మాణలోపాలు కలిగినా పక్షవాతం రావచ్చు. తలనొప్పి, మగతగా ఉండటం, కళ్లు తిరుగుతున్నట్టు ఉండటం, గందరగోళం లాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తుంటే అవి పక్షవాతానికి సూచనలుగా భావించవచ్చు. కొన్నిసార్లు రక్తప్రసారంలో ఏర్పడిన అడ్డంకులు వాటికవే కరిగిపోతాయి. ఇలాంటప్పుడు లక్షణాలు ఎంత తొందరగా కనిపిస్తాయో అంత త్వరగా కనుమరుగవుతాయి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం మాట్లాడటంలో ఇబ్బంది, చూపు దెబ్బతినడం, హఠాత్తుగా తిమ్మిర్లు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏదో ఒక పక్కన ముఖం, కాళ్లూచేతులు పడిపోవచ్చు. ఇలాంటప్పుడు ప్రతీ క్షణం అమూల్యమైనదే. సమయం మించిపోతే పక్షవాతానికి గురైన అవయవాలను మళ్లీ కదిలేలా చేయడం కష్టం అవుతుంది. పక్షవాతాన్ని అతి త్వరగా గుర్తించడం వల్ల వైద్యసహాయం కూడా సకాలంలో అందించవచ్చు. అందుకే నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ పక్షవాతమా కాదా అన్నది తెలుసుకోవడానికి ఎఫ్‌ఏఎస్‌టీ (ఫాస్ట్) అన్న పరీక్షను సూచిస్తోంది. ఎఫ్ - ఫేస్ : రోగి నవ్వినప్పుడు ముఖం ఒకవైపు వంగిపోతుందా? ఏ - ఆర్మ్స్ : రెండు చేతులనూ పైకి ఎత్తమన్నప్పుడు ఒక చేయిని ఎత్తలేకపోవడం, కిందకి పడిపోవడం జరుగుతోందా? ఎస్ - స్పీచ్ : మాట తడబడుతూ, మూతి వంకరగా అవుతోందా? టీ - టైమ్ : పైన చెప్పిన మూడు లక్షణాలు కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

ఫోన్ జబ్బు


అవసరం మేరకు వాడితే ఏ వస్తువైనా క్షేమమే. హద్దు దాటితే మాత్రం ఏదైనా ప్రమాదకరమే. దురదృష్టం ఏమిటంటే సెల్‌ఫోన్ వినియోగం అనేది యువతలో అవసరానికి మించి జరుగుతోంది. బెంగుళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసెన్సైస్ 'సెల్‌ఫోన్ అధిక వినియోగం-దుష్పరిణామాలు' అనే అంశంపై ఇటీవల ఒక నివేదికను వెలువరించింది. దీని ప్రకారం 'నోమో ఫోబియా'కు గురవుతున్న యువత రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, సెల్‌ఫోన్ తనకు దూరమై పోతుందనే భయమే - 'నోమోఫోబియా.' లక్షణాలు: ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ఇష్టపడరు. తరచుగా మిస్‌డ్ కాల్స్, మెసేజ్‌లను చెక్ చేసుకుంటారు. ఫోన్ రీఛార్జీలో ఉందా, లేదా అనేది తరచుగా చెక్ చేసుకుంటారు. బాత్‌రూమ్‌లోకి కూడా సెల్‌ఫోన్ తీసుకువెళతారు. సెల్‌ఫోన్ రింగ్ అవుతున్నట్లు భ్రమ పడుతుంటారు. పంపిన ఎస్.ఎం.ఎస్‌కు ఎప్పుడు సమాధానం వస్తుందా అని అదే పనిగా ఎదురుచూస్తుంటారు. ఏ పని చేస్తున్నా దృష్టి మాత్రం సెల్‌ఫోన్ మీదే ఉంటుంది. సెల్‌ఫోన్ రెండు నిమిషాల పాటు కనిపించకపోయినా.దాన్ని ఎవరో దొంగిలించినట్లు ఆందోళన పడిపోతారు. ఏ విషయం మీదా దృష్టి నిలపలేకపోవడం, సమూహంలో ఒంటరి కావడం, అకారణ ఆందోళనకు గురికావడం లాంటి ఎన్నో సమస్యలు 'నోమోఫోబియా'వల్ల వస్తున్నాయి. రానున్న కొద్దిరోజుల్లో మానసిక రుగ్మతల జాబితాలో ఈ నోమోఫోబియా ఎక్కనుంది. అంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 'అవసరం మేరకు వాడండి' అని నిపుణులు చెబుతున్న మాటను తు.చ. తప్పకుండా పాటించండి. నోమోఫోబియాకు దూరంగా ఉండండి.

వెన్నునొప్పి సమస్యలకు చక్కని పరిష్కారం

వ్యాధులన్నీ ప్రాణాంతకం కావు. కాని కొన్ని వ్యాధులు మాత్రం శరీరాన్ని నిర్జీవంగా మార్చివేస్తాయి. అలాంటిదే ఈ వెన్నునొప్పి, సయాటికా సమస్యలు కూడా. జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి. ఈ సమస్యను ముందే గుర్తించి వైద్య చికిత్సలు తీసుకుంటే వెన్నునొప్పి శాశ్వతంగా తగ్గడమే కాదు, జీవితం పునశ్శక్తిని పొందుతుంది. ఈ ప్రయోజనాలన్నీ నెరవేరేది ఆయుర్వేద వైద్యంలోనే. వెన్నునొప్పి మొదట్లో అంతా సామాన్యంగానే అన్పిస్తుంది.కాని ఒక దశలో పక్షవాతంలా జీవితాన్ని కుప్పకూల్చేస్తుంది. వెన్నునొప్పి, సయాటికా సమస్యలు నిజంగా మనిషిని అస్తవ్యస్తం చేస్తాయి. అయితే అత్యంత తీవ్రమైన ఈ రెండు సమస్యలు ఆధునిక జీవనవిధానంతో వచ్చేవే. పైగా ఈ సమస్యలు ఏదో ఒక ఐదేళ్లు వచ్చిపోయేవి కాదు. ఏళ్లతరబడి మంచాన పడివుండేలా చేస్తాయి. దీనితో రోగి శారీరకంగా, మానసికంగా అసహనానికి, ఆగ్రహానికి లోనవుతారు. ఇది అన్ని వయసుల వారిని నిలువునా కుంగదీస్తుంది. వెన్నెముక అనేది శరీరం మొత్తానికి కరెంటును సప్లయి చేసే ఒక పవర్‌హౌస్, కాళ్లనొప్పులు, వెన్నుభాగంలో పొడిచినట్లు, మొద్దుబారినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. ఈ వెన్నునొప్పి బాగా ముదిరితే పురుషుల్లో అంగస్తంభనలు తగ్గిపోవడం, స్త్రీలలో జననాంగం పొడిబారిపోవడం జరుగుతుంది. వెన్నుపాములోని నరాలు, డిస్క్‌లు ఒత్తిడికి గురైతే కాళ్లూచేతులు పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. సర్జరీతో జరిగేదేమిటి? వెన్నునొప్పితో వెళితే అల్లోపతి వైద్యాలు మొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లు, బెడ్ రెస్ట్. ఎక్కువరోజులు పెయిన్ కిల్లర్లు వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. సర్జరీ దాకా వెళితే పెద్దమొత్తంలో ఖర్చు కావడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం పెద్దగా ఉండదు. సర్జరీ వల్ల కలిగే ప్రయోజనాల విషయంలో వారిచ్చే గ్యారెంటీ కూడా ఏమీ ఉండదు. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే చెప్పలేం. మరో సర్జరీ కూడా అవసరం రావచ్చు. ఆయుర్వేదం ఏం చేస్తుంది? ముందుగా వెన్నునొప్పి రావడానికి గల కారణాలను ఆయుర్వేదం కనిపెడుతుంది. శరీరంలో వాతం ఎక్కువ అయినప్పుడు వెన్నునొప్పికి, కాలు అంతటా పాకే సయాటికా నొప్పికి మూలమవుతుంది. చికిత్సావిధానంలో లిగమెంట్లు, టెండాన్లు, డిస్క్‌లు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం ఆయుర్వేద చికిత్స ద్వారానే సాధ్యపడుతుంది. దానితో పాటు నరాల వ్యవస్థను ఉత్తేజపరచడం ద్వారా వెన్నునొప్పి తగ్గడమే కాకుండా మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ చికిత్సలో మేరు చికిత్సలు, మర్మచికిత్సలు, పంచకర్మ చికిత్సలు కీలకపాత్ర వహిస్తాయి. కాబట్టి ఆయుర్వేద వైద్య చికిత్సల ద్వారా మీ వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారాన్ని పొందండి.



ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌

ఎంబీబీఎస్‌ ప్రవేశాల కోసం ఈ నెల 30వ తేదీ నుంచి రెండు తెలుగు రాషా్ట్రలలో కౌన్సెలింగ్‌ జరగబోతోంది. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు మంగళవారం రాత్రి ఇందుకోసం జీవో నెం 42ను విడుదల చేశారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ ఐదవ తేదీ వరకు జరగనుంది. ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు ఆగస్టు 30, 31 సెప్టెంబర్‌ ఒకటో తేదీల్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సెప్టెంబర్‌ 2, 3, 4, 5 తేదీలలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సమయం తక్కువగా ఉండటంతో ఈ ఏడాది రెండు రాషా్ట్రలలో ఐదు సెంటర్లలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ, వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ, విశాఖలోని ఆంధ్రా యూనవర్సిటీ, విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలలో కౌన్సెలింగ్‌ జరగనుంది. ఎన్‌సీసీ, ఆర్మీ కేటగిరీ అభ్యర్థులకు సెప్టెంబర్‌ 7వ తేదీన, క్రీడల కేటగిరీ, వికలాంగులకు, పోలీస్‌, సైన్యంలో పనిచేస్తున్న వారి పిల్లలకు 8న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఈ ఏడాది స్విమ్స్‌లోని పద్మావతి మహిళా మెడికల్‌ కాలేజీలో అదనంగా పెరిగిన 150 సీట్లను కూడా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ భర్తీ చేస్తుంది.
30వ తేదీన ఒకటవ ర్యాంకు నుంచి 1500 వరకు, 
31న 1501 నుంచి 4500 వరకు, 
 సెప్టెంబర్‌ ఒకటిన 4501 నుంచి 8500 ర్యాంకుల వరకు పొందిన అభ్యర్థులు హాజరు కావాలి. 
రిజర్వు కేటగిరీ అభ్యర్థులు 
 సెప్టెంబరు 2న ఒకటి నుంచి 3000 ర్యాంకుల వరకు, 
3న 3001 నుంచి 6500 వరకు, 
4న 6501 నుంచి 10వేల వరకు, 
5న 10001 నుంచి 25 వేల ర్యాంకు వరకు హాజరు కావాలి.

పరీక్షల విధానాన్ని సమూలంగా సంస్కరించబోతున్నాం. (Telangana)


9, 10వ తరగతుల్లో తిరిగి 11 పేపర్లకే ప్రభుత్వం మొగ్గు ఇంటర్నల్స్ నిర్వహణ సహా పలు అంశాలకు మాత్రం గ్రీన్‌సిగ్నల్ హైదరాబాద్: పరీక్షల విధానాన్ని సమూలంగా సంస్కరించబోతున్నాం.. భారీ ఎత్తున మార్పులు చేయబోతున్నాం.. అంటూ ఊదరగొట్టిన విద్యాశాఖ చివరికి తుస్సుమనిపించింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా. తొమ్మిది, పదో తరగతుల్లో తిరిగి పాత విధానంలో 11 పేపర్ల నిర్వహణకే మొగ్గుచూపింది. అయితే ఇంటర్నల్ పరీక్షల నిర్వహణ, సహపాఠ్య కార్యక్రమాలకు మార్కులు, రాత పరీక్షకు అదనంగా 15 నిమిషాల సమయం కేటాయింపు వంటి పలు సంస్కరణలకు మాత్రం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ మంగళవారం సవరణ ఉత్తర్వులు (జీవో నం.2) జారీ చేశారు. ఈ సంస్కరణలు ఈ విద్యా సంవత్సరం నుంచే 9, 10వ తరగతుల్లో అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. దీని ప్రకారం 2015 మార్చి/ఏప్రిల్‌లో జరిగే పరీక్షల్లోనే ఈ సంస్కరణలు అమలుకానున్నాయి. మార్పు చేసిన సిలబస్, పుస్తకాలకు అనుగుణంగా పరీక్షల విధానంలోనూ భారీ సంస్కరణలు తెస్తామంటూ ప్రకటనలు చేసిన విద్యాశాఖ అధికారులు.. తొలుత 7 పేపర్ల విధానాన్ని(సైన్స్‌లో రెండు, మిగతా సబ్జెక్టుల్లో ఒక్కొక్కటి చొప్పున) ప్రతిపాదించారు. తర్వాత వాటిని తొమ్మిది పేపర్లకు మార్పు చేశారు. భాషా సబ్జెక్టుల్లో ఒక్కో పేపర్, భాషేతర సబ్జెక్టుల్లో రెండు పేపర్ల చొప్పున మొత్తం తొమ్మిది పేపర్ల పరీక్షా విధానం అమలుకు మే 14న ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నం.17) కూడా జారీ చేసింది. రెండు పేపర్లు ఉన్న సబ్జెక్టుల్లో ప్రతి పేపర్‌లోనూ (కనీసం 14 మార్కులు) పాస్ కావాల్సిందేనని నిబంధన విధించింది. అంతేకాదు ఇంటర్నల్ పరీక్షలనూ ప్రవేశపెట్టి వాటిలోనూ పాస్ కావాల్సిందేనని పేర్కొంది. తీరా ఇప్పుడు ప్రధానమైన ఈ మూడు అంశాలను తొలగిస్తూ. 11 పేపర్ల పాత పరీక్ష విధానానికే మొగ్గు చూపింది. అయితే ఒక సబ్జెక్టుకు ఉండే రెండు పేపర్లలో కలిపి పాస్ మార్కులు వస్తే చాలని సరళీకరించింది. దీంతోపాటు విద్యార్థి పాస్/ఫెయిల్ నిర్ధారణలో ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. విద్యార్థి గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ యావరేజీ నిర్ధారణలో మాత్రం ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అమల్లోకి రానున్న సంస్కరణలు.. 9వ, 10వ తరగతుల్లో ఇంటర్నల్స్ విధానం అమల్లోకి వస్తుంది. ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకే రాత పరీక్ష ఉంటుంది. మిగతా 20 మార్కులు ఇంటర్నల్ పరీక్షలు, సహ పాఠ్య కార్యక్రమాలకు ఉంటాయి. రాత పరీక్షలోని 80 మార్కుల్లో 35 శాతం (28 మార్కులు) వస్తే పాస్ అయినట్లే. హిందీ/ఉర్దూ (ద్వితీయ భాష) మినహా మిగతా సబ్జెక్టులకు ఒక్కో పేపరుకు 40 మార్కుల చొప్పున 80 మార్కులకు రెండు పేపర్లు ఉంటాయి. హిందీ/ఉర్దూకు మాత్రం ఒకటే పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. జవాబుపత్రాల రీవాల్యుయేషన్ ఉండదు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. రాత పరీక్షకు ఇచ్చే సమయాన్ని పెంచారు. 2.30 గంటలతో పాటు అదనంగా 15 నిమిషాలు ప్రశ్నపత్రాన్ని చదువుకునేందుకు ఇస్తారు. ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్స్‌కు 20 మార్కులు ఉన్నా.. వాటిలో పాస్ కావాలన్న నిబంధన ఉండదు. ఇంతకుముందు ప్రతిపాదించినట్లుగా వాటిల్లోనూ 7 మార్కులు రావాలన్న అంశాన్ని తొలగించారు. ఇంటర్నల్ మార్కులను ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్‌లు సరిగ్గా ఇచ్చారా? లేదా? అనేది తనిఖీ చేసేందుకు జిల్లా విద్యా శాఖ అధికారి నేతృత్వంలో మోడరేషన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇంటర్నల్ మార్కుల జాబితాను ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపాల్సి ఉంటుంది. ప్రైవేటు పాఠశాలలైతే కరస్పాండెంట్ సంతకంతో పంపించాలి. వాటిలో తేడాలు ఉంటే పాఠశాల గుర్తింపును రద్దుచేస్తారు. రెగ్యులర్‌గా పాఠశాలల్లో చదువుకోని వారు ప్రైవేటు విద్యార్థులుగా పరీక్ష రాయడానికి ఇక వీలు లేదు. అలాంటివారు నేషనల్/రాష్ట్ర ఓపెన్ స్కూల్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల్లోనే పదో తరగతి పరీక్షలు రాసుకోవాలి. కాంపోజిట్ కోర్సులో ఇప్పుడు నాలుగు భాషలు చదువుతున్నారు. త్రిభాషా సిద్ధాంతం ప్రకారం ఇకపై మూడు భాషలే చదవాలి. ఇందులో తెలుగు, సంస్కృతంకు 80+20 మార్కులు ఉంటాయి. తెలంగాణ జిల్లాల్లో 6వ తరగతిలో చేరే ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలుగును లేదా హిందీని ద్వితీయ భాషగా ఎంచుకోవాలి. గతంలో ద్వితీయ భాషగా ఉన్న ఇంగ్లిష్‌ను తొలగించారు. 7వ తరగతిలో వారికి ద్వితీయ భాష నుంచి మినహాయింపు ఉంటుంది. ఓరియంటల్ ఎస్సెస్సీలో తెలుగు/ఉర్దూకు ఉన్న 80 మార్కులను 100 మార్కులకు పెం చారు. 200 మార్కులకు నిర్వహించే ఓరి యంటల్ సబ్జెక్టుల్లో మరో రెండు పేపర్లలో 100 మార్కులకు ఒక పేపరు ఉంటుంది. వాటిల్లో రాతపరీక్షకు 80 మార్కులు, 20 మార్కులు ఇంటర్నల్స్‌కు ఉంటాయి. ఇదీ పేపర్లు, మార్కుల విధానం.. సబ్జెక్టు పేపర్-1 పేపర్-2 ఇంటర్నల్స్ మొత్తం ప్రథమ భాష (తెలుగు/హిందీ/ఉర్దూ) 40 40 20 100 ద్వితీయ భాష(హిందీ/ఉర్దూ) 80 0 20 100 తృతీయ భాష (ఇంగ్లిష్) 40 40 20 100 గణితం 40 40 20 100 సైన్స్ 40 40 (జీవశాస్త్రం) 20 100 సోషల్ 40 40 20 100 మొత్తం 280 200 120 600 కొత్త గ్రేడింగ్ విధానం గ్రేడ్ మార్కులు జీపీఏ(శాతంలో) ఎ1 91-100 10 ఎ2 81-90 9 బి1 71- 80 8 బి2 61- 70 7 సి1 51- 60 6 సి2 41-50 5 డి 35- 40 4 ఇ 0 - 34 3


IIFT గురించి తెలుసుకుందాం.


Table1కళాశాల గురించి IIFT ఎంట్రన్స్ పరీక్ష ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) అడ్మిషన్ కోసం రాయాలి. ఈ కళాశాలను 1963లో భారత ప్రభుత్వం స్థాపించింది. ఈ కళాశాల నిలకడగా ప్రతి ఏడాది టాప్ 20 ఎంబీఏ కళాశాలలో ఒకటిగా గుర్తింపు పొందుతూ ఉంది. ఈ కళాశాలను భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్య నిర్వహణ, మానవ వనరులను అభివృద్ధి పరచడం ద్వారా ఎగుమతులు పెంచడం, ఉన్న డేటాని విశ్లేషించి, పరిశోధన నిర్వహించడంలాంటి వాటికోసం స్థాపించింది. ఈ కళాశాలకు రెండు క్యాంపస్‌లు ఉన్నాయి. ఢిల్లీలోని క్యాంపస్‌లో 150-160 సీట్లు ఉంటాయి. కోల్‌కత్తా క్యాంపస్‌లో 60 సీట్లు ఉన్నాయి. ఈ కళాశాల ఇంటర్నేషనల్ బిజినెస్ (MBA-IB)లో ఎంబీఏ అందిస్తుంది. మొత్తం వార్షిక ఫీజు రూ. 6.75 లక్షలు table2IIFT అడ్మిషన్ ప్రక్రియ అన్ని టాప్ కళాశాలల లాగానే IIFTలో కూడా రెండు దశల ప్రవేశ ప్రక్రియ ఉంటుంది. 1.IIFT ప్రవేశ పరీక్ష 2. గ్రూప్ అభ్యాసం, ఎస్సే రైటింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ మాకున్న అనుభవాన్ని బట్టి IIFT వెబ్‌సైట్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ప్రతి రౌండ్ వెయిటేజీ ఈ విధంగా ఉంటుంది. రాతపరీక్ష: 65 శాతం (గ్రూప్ డిస్కషన్-10 శాతం, ఎస్సే రైటింగ్-10 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూ15 శాతం) table3IIFT ప్రవేశ పరీక్ష.. ఈ పరీక్ష గురించి అత్యంత కష్టమైనా విషయం పరీక్ష ప్యాటర్న్ ఊహించడం. ప్రతి ఏడాది ఏదో ఒక మార్పు వస్తూనే ఉంది. 5 నుంచి 6 ఏళ్లుగా ప్రశ్నల సంఖ్య, ప్రతి ప్రశ్నకు మార్కులు, సెక్షన్ల సంఖ్య మారుతూనే ఉంది. ఈ మార్పులే ఈ పరీక్షని మిగతా వాటి కంటే కష్టంగా చేస్తున్నాయి. మార్పు లేకుండా ఉన్నవి మొత్తం మార్కులు, పరీక్ష సమయం. పరీక్షలో మొత్తం 100 మార్కులు , మొత్తం table4సమయం 120 నిమిషాలు (రెండు గంటలు). పరీక్షలో ముల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో రీడింగ్ కాంప్రహెన్షన్, జనరల్‌నాలెడ్జ్ అవగాహన, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎనాలిసిస్‌లో నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్టు ప్రతి ప్రశ్నకు వేరుగా మార్కులు ఉంటాయి. కానీ ప్రతి తప్పు సమాధానానికి ఉన్న మార్కులలో మూడో వంతు నెగటివ్ మార్కులు ఉంటాయి. పేపర్ ఎలా వచ్చినా 40 + మార్కులు చాలా మంచి స్కోర్‌గా పరిగణించ బడుతుంది. table5 కొన్నేళ్లుగా పరీక్ష తీరు.. క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఎప్పుడు కూడా చాలా లెక్కలు చేసే విధంగా ఉంటుంది. కొన్నిసార్లు వేదిక్‌మ్యాథ్స్ టెక్నిక్స్ నుంచి ప్రశ్నలు డైరెక్ట్‌గా కూడా అడిగారు. అందుకే అందరు కూడా ఈ పరీక్ష కోసం వేదిక్ మ్యాథ్స్, ప్రాథమిక లెక్కింపు పద్ధతులు నేర్చుకోవాలి. కొనిసార్లు ప్రశ్నలు కాంప్లెక్స్ నంబర్స్ నుంచి కూడా వచ్చాయి. ఇది మిగతా మేనేజ్‌మేంట్ పరీక్షల్లో ఉండవు. కొన్నేళ్లుగా ఈ సెక్షన్ ఇలా ఉంది. డేటా ఇంటర్‌ప్రిటేషన్ కొన్నిసార్లు ఈ సెక్షన్ వేరుగా వచ్చింది. ఇంకొన్ని సార్లు రీజనింగ్‌లో భాగంగా వచ్చింది. ఎప్పుడు కూడా ఇవి చాలాకష్టంగా, పెద్దగా, ఎక్కువ సమయం తీసుకుంటాయి. అందుకే ఏ సెట్ ఎంచుకుంటాం అనేది ఇందులో చాలాముఖ్యం. కొన్ని సంవత్సరాలుగా ఈ సెక్షన్ ఇలా ఉంది. table6లాజికల్ రీజనింగ్ అన్నిటికంటే ఈ సెక్షన్ కొంచెం సులువుగా ఉంటుంది. అయితే రక్త సంబంధాలు, ఇన్‌పుట్ - అవుట్‌పుట్, కోడింగ్ - డీకోడింగ్ లాంటి ప్రశ్నలు తరుచుగా వస్తాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ సెక్షన్ ఇలా ఉంది. రీడింగ్ కాంప్రెహెన్షన్ ఈ సెక్షన్ కొన్నిసార్లు వెర్బల్‌లో భాగంగా, ఇంకొన్ని సార్లు వేరుగా వచ్చింది. ఎలా వచ్చినా కూడా, ప్రతి ఏడాది కనీసం నాలుగు ప్యాసేజిలు, ప్రతి ప్యాసేజిలో కనీసం మూడు ప్రశ్నలు ఉంటాయి. ప్యాసేజిలు పెద్దగా ఉంటాయి, కానీ పెద్ద కష్టంగా ఉండవు. కొన్నేళ్లు ఈ సెక్షన్ ఇలా ఉంది. వెర్బల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్‌లాగే వెర్బల్ సెక్షన్ మిగతా సెక్షన్ల కన్నా సులువుగా ఉంటుంది. ప్రశ్నలు పదజాలం, వ్యాకరణం, పారా జంబుల్స్ వంటి వాటి నుంచి ఉంటాయి. కొన్నిసార్లు ప్రశ్నల్లో లాటిన్ పదాలతో విద్యార్థులు ఆశ్చర్యానికి గురి కావొచ్చు. జనరల్ నాలెడ్జ్ చాలామంది విద్యార్థులు ఈ సెక్షన్లో నష్టపోతారు. ప్రశ్నలు సులభంగా ఉన్నా కూడా జనరల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతారు. అంతేకాదు ఈ సెక్షన్ క్యాట్‌లాంటి వేరే పరీక్షల్లో ఉండదు. కాకపోతే ఈ సెక్షన్‌లో కటాఫ్ ప్రతి ఏడాది చాలా తక్కువగా ఉంది. సాధారణంగా ఇందులో మ్యాచ్ ది ఫాలోయింగ్ లాంటి ప్రశ్నలు ఉంటాయి. కొన్నేళ్లుగా ఈ సెక్షన్ ఇలా ఉంది. table7IIFT కోసం సరైన వ్యూహం అభ్యాస్ నుంచి చాలామంది విద్యార్థులు కొన్ని ఏళ్లుగా ఈ ప్రతిష్ఠాత్మక కళాశాలలో ఎంపిక అయ్యారు. వారితో మాట్లాడడం, గత కొన్నేళ్లుగా పరీక్ష రాసిన వారిన అనుభవం, గత సంవత్సర కటాఫ్‌ల ఆధారంగా మేము ఈ పక్క టేబుల్ ఇస్తున్నాం. ముఖ్యమైన తేదీలు IIFT 2014 నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ఆన్‌లైన్ (ఒక క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ / డిమాండ్ డ్రాఫ్ట్ ఉపయోగించి) లేదా పోస్ట్ ద్వారా చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకొనేవారు, దరఖాస్తు కాపీ IIFT అడ్మిషన్ కార్యాలయానికి సెప్టెంబర్ 3వ తేదీ లోపు పంపాలి. ఈ సంవత్సరం IIFT పరీక్ష నవంబర్ 23న జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం ww.iift.edu వెబ్‌సైట్ చూడండి.



ఇంపార్టెంట్ టెన్త్ పేపర్స్


తొమ్మిది, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సంస్కరణలకు రానున్నాయి. 2014-15 విద్యా సంవత్సరం నుంచే ఈ సంస్కరణలు అవుల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమల్లో ఉండగా, ఇప్పుడు 9, 10 తరగతులకు కూడా ఇది వర్తింప జేస్తున్నారు. పదో తరగతి పరీక్షా పేపర్ల సంఖ్యలో మార్పులేదు. ఇప్పుడు కూడా 11 పేపర్లే ఉంటాయి. 80 మార్కులకు పరీక్షలు, 20 మార్కులకు అంతర్గత మూల్యాంకనం ఉంటుంది. అయితే విద్యార్థులు 80 మార్కులలో 28 మార్కులు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. మొత్తం 100 మార్కులకు మాత్రం 35మార్కులు వస్తేనే పాస్‌ అయినట్లు పరిగణిస్తారు. మూల్యాంకనంలోనూ పలు మార్పులు చేశారు. అంతర్గత మూల్యాంకనానికి మార్కులు నిర్ణయించలేదు. పరీక్షల సంస్కరణల అమలుపై ఈ ఏడాది మే 14న జారీచేసిన ఉత్తర్వుల (జీ.వో.ఎం.ఎస్‌.నెం.17)కు పలు వివరణలు, సవరణలు చేస్తూ తెలంగాణ విద్యాశాఖా కార్యదర్శి వికాస్‌రాజ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పేపర్‌లోనూ 80 శాతం వూర్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. మిగతా 20 శాతం వూర్కులకు అంతర్గత మూల్యాంకనం నిర్వహిస్తారు. పరీక్షల సవుయాల్లో స్వల్పంగా వూర్పులు చేశారు. ఇప్పటి వరకు అన్ని సబ్జెక్టుల పరీక్షలకు 2.30 గంటల సవుయం కేటాయిస్తుండగా, ఇకపై లాంగ్వేజెస్‌కు 3 గంటలు కేటాయించారు. ఇందులో ప్రశ్నపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు ప్రత్యేకించారు. ఇక నాన్‌ లాంగ్వేజెస్‌ సబ్జెక్టుల విషయానికి వస్తే పరీక్షకు 2.30 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాల సవుయం కేటాయించారు. ఇప్పటి వరకు సెకండ్‌ లాంగ్వేజ్‌ (తెలుగు/హింది) మినహా మిగతా సబ్జెక్టులకు పాస్‌ మార్కులు 35 శాతం కాగా సంస్కరణల్లో భాగంగా ఇకపై అన్ని పేపర్లలోనూ 35 శాతం వూర్కులు వస్తేనే పాస్‌ అయినట్లు పరిగణిస్తారు. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ నాలుగు సార్లు నిర్వహించి వాటి సగటును లెక్కిస్తారు. ఆ వూర్కులను పాఠశాల విద్యా సంచాలకునికి పంపిస్తారు. పాఠశాలకు వెళ్లి చదువుకోని ప్రైవేట్‌ అభ్యర్థులు ఓపెన్‌ స్కూలు పద్దతిలోనే పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పాఠశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఈ సంస్కరణలు వర్తిస్తాయి. మార్కుల పంపిణీ.(సవరించిన గ్రేడింగ్‌ టేబుల్‌ గ్రేడ్‌ మార్కుల గ్రేడ్‌ పాయింట్లు) ఎ1 91-100 10 ఎ2 81-90 9 బి1 71-80 8 బి2 61-70 7 సి1 51-60 6 సి2 41-50 5 డి 35-40 4 ఇ 0-34 3


Followers