విటమిన్లు (Vitamins)


విటమిన్లు (Vitamins)



మన ఆరోగ్యానికి విటమిన్‌లు చాలా అవసరం. పెద్దల నుంచి పిల్లల వరకు విటమిన్ల కొరతలేకుండా ఆరోగ్యంగా ఉంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు అంటున్నారు. అలాగాకుండా విటమిన్ల కొరతతో వ్యాధులు రావడం తప్పదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాంటి విటమిన్లు మనకు లభించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

విటమిన్ "ఎ": విటమిన్ "ఎ" కొరతతో కంటి చూపు మందగిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. క్యాల్షియం మన శరీరానికి అత్యవసరం. ఇందుకోసం మునగాకు, ఆకుకూరలు, వెన్న, కోడిగుడ్డు పచ్చసొన, చేపలనూనె వంటివి తీసుకోవాలి.

విటమిన్ బి కోసం... మాంసం, కోడిగుడ్డు, కాయగూరులు తీసుకుంటూవుండాలి. లేకపోతే.. అజీర్ణం, రక్త హీనత వంటి సమస్యలు తలెత్తుతాయి.

విటమిన్ సి కోసం.. ఆరెంజ్ పండ్లు, ద్రాక్ష, కూరగాయలు, ఉసిరికాయ, నిమ్మ, టమోటా, జామపండు, బంగాళాదుంపలు, బొప్పాయి, తమలపాకు వంటివి తీసుకోవాలి. విటిమిన్ సి కొరతతో మానసిక వేదన, ఎముకల్లో బలహీనత, అలసట వంటివి తప్పవు.

విటమిన్ డి కోసం.. సూర్యకిరణాలు మన శరీరంపై పడితే డి విటమిన్ తానే తయారు చేసుకుంటుంది. కోడిగుడ్డు, చేపలు, వెన్న వంటి పదార్థాల్లో డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. డి విటమిన్ కొరతతో ఎముకల్లో శక్తి తగ్గిపోతోంది. విటమిన్ ఇ.. కోసం గోధుమ, ఆకుకూరలు, తాజా కూరగాయలు తీసుకోవాలి.


ఇంజనీరింగ్‌ కోర్సులో తృతీయ సంవత్సరం తర్వత ?

ఇంజనీరింగ్‌ కోర్సులో తృతీయ సంవత్సరానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ద్వితీయ సంవత్సరం తర్వాత తృతీయ సంవత్సరంలోకి అడుగుపెతున్నామంటే.. ఒక రకమైన బాధ్యతాయుతమైన వాతావరణంలోకి ప్రవేశించడం వంటిది అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్‌ రెండో సంవత్సరానికి ఎంత జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటామో .. అదే విధమైన వ్యూహాన్ని ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరంలోనూ అనుసరించాలి. అప్పుడే ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా మార్గాన్ని సులభతరం చేసుకోవచ్చు. రెండు అంశాలు.. ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరంలో అపరిమిత స్వేచ్ఛ, నూతన వాతావరణం, కొత్త స్నేహితులు, ర్యాగింగ్‌.. ఈ అంశాలను అధిగమించి అకడమిక్‌ పరంగా కుదురుకునేలోపే రెండో సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. రెండో సంవత్సరంలో ఎంచుకున్న ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లకనుగుణంగా.. ఆయా బ్రాంచ్‌లలోని ప్రాథమిక అంశాలు, ఇతర బ్రాంచ్‌కు సంబంధించిన కొన్ని అంశాలను చదివి ఉంటారు. ఇక్కడ మార్కుల శాతంపై దృష్టిసారిస్తున్న క్రమంలోనే రెండో ఏడాది పూర్తవుతుంది. కాబట్టి ఈ మూడో సంవత్సరంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఈ సందర్భంగా అకడమిక్‌, కెరీర్‌ పరంగా రెండు అంశాలను గుర్తుంచుకోవాలి. అవి..అకడమిక్‌ పరంగా నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సులో సాధించే మార్కులు, సబ్జెక్టుపై పట్టు. రెండోది కెరీర్‌ పరంగా ఉద్యోగం, ఉన్నత విద్య అంశాల్లో స్పష్టతను ఏర్పర్చుకోవడం. ముఖ్యమైన దశ... మొదటి, రెండో సంవత్సరంలో థియరీ ఎక్కువగాను, ప్రాక్టికల్‌ వర్క్‌ తక్కువగా ఉంటుంది. కానీ మూడో సంవత్సరంలో అధ్యయనం మొత్తం అంతా అప్లికేషన్‌ ఓరియంటెడ్‌గా సాగుతుంది. మూడో ఏడాదిలో సబ్జెక్టులపై పూర్తి స్థాయి దృష్టి సారించి పట్టు సాధిస్తేనే భవిష్యత్తులో హాజరయ్యే గేట్‌, ఇతర పోటీ పరీక్షలు, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ వంటి అంశాల్లో విజయం సాధించడం వీలవుతుంది. ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో పోల్చితే మూడో సంవత్సరంలో సబ్జెక్టు పరిధి పెరుగుతుంది. ద్వితీయ సంవత్సరంలో కోర్‌ సబ్జెక్టులు, ఇంటర్‌ డిసిప్లినరీ సబ్జెక్టులు ఉంటాయి. అంటే ఒక బ్రాంచ్‌ విద్యార్థికి మరో బ్రాంచ్‌కు సంబంధించి కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాన్నే తీసుకుంటే రెండో సంవత్సరంలో థర్మోడైనమిక్స్‌, ఫ్లూయిడ్‌ మోకానిక్స్‌, ప్రొడక్షన్‌ టెక్నాలజీ వంటి ఫండమెంటల్‌ సబ్జెక్టులు ఉంటాయి. ఈ నేపథ్యంలో రెండో సంవత్సరంలో మెరుగైన మార్కులు సాధించడం కోసం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. మూడో సంవత్సరంలో మెకానికల్‌ బ్రాంచ్‌కు సంబంధించిన సబ్జెక్టులు చాలా వివరంగా, విస్తృతంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక కీలక అంశాన్ని గుర్తుంచుకోవాలి. ప్రిపరేషన్‌ సాగించేటప్పుడు పరీక్షల కోణంలో కాకుండా సబ్జెక్టుపై పట్టు సాధించే విధంగా అధ్యయనం సాగించాలి. ఎందుకంటే గేట్‌, ఇతర పోటీ పరీక్షల్లోనైనా.. సబ్జెక్టుపై విద్యార్థి అవగాహనను, పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. తృతీయ సంవత్సరంలోని సబ్జెక్టులు గేట్‌తోపాటు అఖిల భారత ఇంజనీరింగ్‌ సర్వీసు, ఇతర పోటీపరీక్షలకు ఎక్కువగా ఉపయోగపడతాయి. అందుకే మూడో సంవత్సరం మొత్తం అప్లికేషన్‌ ఓరియంటెడ్‌గా ప్రిపరేషన్‌ సాగించాలి. మ్యాథమెటికల్‌ ఓరియెంటేషన్‌ను గమనించి ఫార్ములాలు, ప్రిన్సిపల్స్‌ని బాగా అధ్యయనం చేయాలి. అప్పుడే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సాధ్యమవుతుంది. అందుకే ఈ సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి సారిస్తే స్కోరింగ్‌తోపాటు కాంపిటీటివ్‌ పరీక్షలు, ఉద్యోగ అవకాశాల్లో ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. మారుమూల ప్రాంతాల్లోని కాలేజీ విద్యార్థులకు మంచి ఫ్యాకల్టీ, లైబ్రరీ, ల్యాబ్‌ వంటివి అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి విద్యార్థులు ఇంటర్నెట్‌ను వినియోగించుకోవాలి. పైగా చాలా కంపెనీలు ఉద్యోగాలిచ్చేముందు ఇంటర్వ్యూల్లో థర్డ్‌ ఇయర్‌ సబ్జెక్టుల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాయి. అందుకే మూడో సంవత్సరం సబ్జెక్టులు అత్యంత కీలకంగా మారాయి. ప్రాక్టికల్‌ ఓరియంటెడ్‌గా గ్రిప్‌ సాధించే విద్యార్థులకు భవిష్యత్తు అవకాశాల్లో తిరుగుండదనే చెప్పాలి. ఒకరకంగా ఇంజనీరింగ్‌లో విద్యార్థి ప్రతిభ, సబ్జెక్టులపై పట్టు, నాలెడ్జ్‌ వంటివాటన్నింటినీ ప్రతిబింబించేది తృతీయ సంవత్సరమే. మార్కులతోనే భవిష్యత్‌... మరొక కీలక విషయం ఎటువంటి బ్యాక్‌లాగ్స్‌ లేకపోవడం. బ్యాక్‌లాగ్‌ విషయానికొస్తే..ఆయా సంవత్సరాలకు సంబంధించి.. ఆయా ఏడాదిలోనే ఉత్తీర్ణత సాధించాలి. బ్యాక్‌లాగ్స్‌ ఉంటే.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ పరిగణలోకి తీసుకోరు. మరోవైపు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఎంపికలో విద్యార్థుల సబ్జెక్ట్‌ స్కోరింగ్‌ కీలకపాత్ర పోషిస్తుందన్న సంగతి మర్చిపోకూడదు. సాధ్యమైనంత వరకూ మొదటి సంవత్సరం నుంచి ఏ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను ఆ సంవత్సరంలోనే పూర్తి చేయాలి. ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌, సీఎస్‌ఈ విద్యార్థులు..తాము సబ్జెక్టులో సాధించిన మార్కుల ఆధారంగానే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ముందస్తు ప్రణాళిక... కెరీర్‌లో ఎంతో కీలకమైన క్యాపంస్‌ ప్లేస్‌మెంట్స్‌కు కూడా ఈ ఏడాదిలోనే సన్నాహాలను మొదలు పెట్ట్టాలి. ఇందుకు కావాల్సిన గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ రౌండ్‌, సబ్జెక్టు ఇంటర్వ్యూ వంటి అంశాకనుగుణంగా సిద్ధం కావాలి. ప్రముఖ కంపెనీలు, వాటి పనితీరుతోపాటు ఉద్యోగాలు ఇవ్వడంలో ఎలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాయి ? వంటి వాటిపై దృష్టిసారించి దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగించాలి. కొన్నేళ్ల క్రితం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ మూడో సంవత్సరంలోనే జరిగేవి. కానీ నాస్కామ్‌, కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రస్తుతం చివరి సంవత్సరంలోనే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో విజయం సాధించడానికి కావాల్సిన సన్నాహాలను ఈ ఏడాదిలో పూర్తి చేసుకోవడం ఉత్తమం. సాఫ్ట్‌స్కిల్స్‌, గ్రూప్‌ డిస్కషన్‌ వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఇందుకోసం సబ్జెక్టుపై పట్టు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆర్గనైజింగ్‌ స్కిల్స్‌, ఇంగ్లిష్‌ భాషపై పట్టు, జట్టుగా పనిచేసే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం వంటి అంశాలపై ఈ సంవత్సరంలోనే సన్నాహకాలను పూర్తి చేసుకోవాలి. స్పష్టత... ఉన్నత విద్య, ఉద్యోగం.. అనే రెండు విషయాలపై మూడో ఏడాదిలోనే స్పష్టత ఏర్పర్చుకోవాలి. ఎందుకంటే నాలుగో ఏడాదిలో...ప్లేస్‌మెంట్స్‌, ప్రాజెక్టు వర్క్‌, గేట్‌ ప్రిపరేషన్‌ వంటి అంశాలతో సమయం సరిపోదు. కాబట్టి మూడో ఏడాదిలోనే ఈ విషయంలో స్పష్టంగా ఉండాలి. తదనుగుణంగా ప్రిపరేషన్‌ సాగించడం, స్కిల్స్‌ పెంచుకోవడం చేయాలి. ప్లేస్‌మెంట్స్‌ కంటే.. ఉన్నత విద్య దిశగా ఆలోచించడమే మంచిదని చెప్పొచ్చు. ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుంటే ఆల్‌రౌడ్‌ డెవలప్‌మెంట్‌ ముఖ్యం. సెమినార్స్‌, వర్క్‌షాప్స్‌, కాన్ఫరెన్స్‌లలో పాల్గొనాల్సి ఉంటుంది. నివేదికలు, పరిశోధనల ఫలితాలను ప్రజెంట్‌ చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇప్పట్నుంచే ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవాలి. కొంత మేరకు రీసెర్చ్‌ వర్క్‌ను ప్రారంభించాలి. విదేశాల్లో ఉన్నత విద్య దిశగా ఆలోచనలు ఉన్నా.. అందుకు తగ్గ సన్నాహాలను కూడా మూడో ఏడాదిలోనే ప్రారంభించాలి. అందుకు జీఆర్‌ఈ, టోఫెల్‌, ఇఈఎల్‌టీఎస్‌ వంటి పరీక్షలకు ప్రిపేర్‌ కావడం, హాజరు కావడం వంటి అంశాలకు ఈ సంవత్సరంలోనే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం ఆప్టిట్యూటడ్‌, రీజనింగ్‌, కంట్రోల్‌ ఆన్‌ ఇంగ్లిష్‌ వంటి అంశాలను బాగా అధ్యయనం చేయాలి. ఇంటర్న్‌ షిప్‌ కీలకం... మూడో సంవత్సరం విద్యార్థులకు ఎదురయ్యే మరొక కీలక అంశం.. ఇంటర్న్‌షిప్‌.. మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌ తర్వాత వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్‌ (ఇండిస్టీ ఓరియెంటెడ్‌ మినీ ప్రాజెక్ట్‌) ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ సాధనలో ఇంటర్న్‌షిప్‌ కూడా కీలకంగా మారింది. కాలేజీలో పుస్తకాల్లో చదువుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించేందుకు ఇంటర్న్‌షిప్‌ ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా కాలేజీ నుంచి బయటకు రాకముందే కొంతకాలంపాటు క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో విద్యార్థులు పాల్గొంటారు. - అనుభవజ్ఞుల పర్యవేక్షణలో పని అనుభవం సాంపాదిస్తారు. - అకడమిక్‌ నైపుణ్యాలతో పాటు పని అనుభవం (వర్క్‌ ఎక్పీరియన్స్‌) ఉన్న వారికి కంపెనీల రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుతున్నాయి. - ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నప్పుడు విద్యార్థులు కంపెనీలోని సీనియర్లతో నిరంతరం సంప్రదిస్తూ కెరీర్‌కు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. -బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సమయపాలన, ఒత్తిడిని జయించడం, ఆత్మవిశ్వాసం వంటి సాఫ్ట్‌స్కిల్స్‌ను అలవర్చుకోవడానికి ఇంటర్న్‌షిప్‌ వేదికగా నిలుస్తుంది. - ఇంటర్న్‌షిప్‌ చేశాక, దాన్ని ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి వనరుగా ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇంటర్న్‌షిప్‌ను ఏ విధంగానూ నిర్లక్ష్యం చేయకూడదు. - అంతేకాకుండా ఇంటర్న్‌షిప్‌కు అకడమిక్‌ పరంగా కొన్ని మార్కులను కూడా కేటాయించడం జరిగింది. - ఇంటర్నెట్‌ లేదా కాలేజీల్లోని ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్స్‌ ద్వారా ఇంటర్న్‌షిప్‌ ఆఫర్‌ చేసే కంపెనీల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. - బ్రాంచ్‌ల వారీగా ఇంటర్న్‌షిప్‌ కోసం ఎంచుకోవాల్సిన కంపెనీలు.. - మెకానికల్‌ - ఎల అండ్‌ టీ, ఎస్‌ఆర్‌ స్టీల్స్‌, వైజాగ్‌ స్టీల్స్‌, బీహెచ్‌ఈఎల్‌, హెచ్‌సిఎల్‌, మొదలైనవి... - సివిల్‌ - ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు, తదితరాలు.. - ఎలక్ట్రికల్‌ - ఎన్‌టీపీసీ, ఆర్‌టీపీపీ, వీటీపీఎస్‌, సాగర్‌, పవర్‌ జనరేషన్‌ యూనిట్స్‌ మొదలైనవి... - ఈసీఈ - బీడీఎల్‌, హెచ్‌ఏఎల్‌, ఇస్రో తదితరాలు.. - సీఎస్‌ఈ - టీసీఎస్‌, విప్రో, మైక్రోసాఫ్ట్‌ తదితరాలు.. కొన్ని సూచనలు : - మూడో సంవత్సరంలో అధ్యయనం మొత్తం అంతా అప్లికేషన్‌ ఓరియంటెడ్‌గా సాగుతుంది. మూడో ఏడాదిలో సబ్జెక్టులపై పూర్తిస్థాయి దృష్టి సారించి పట్టు సాధిస్తేనే భవిష్యత్తులో హాజరయ్యే గేట్‌, ఇతర పోటీ పరీక్షలు, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ వంటి అంశాల్లో విజయం సాధించడం వీలవుతుంది. - ప్రిపరేషన్‌ సాగించేటప్పుడు పరీక్షల కోణం (ఎగ్జామ్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ)లో కాకుండా సబ్జెక్టుపై పట్టు సాధించే విధంగా అధ్యయనం సాగించాలి. - ఉన్నత విద్య, ఉద్యోగం...అనే రెండు విషయాలపై మూడో ఏడాదిలోనే స్పష్టత ఏర్పర్చుకోవాలి. ఎందుకంటే నాలుగో ఏడాదిలో.. ప్లేస్‌మెంట్స్‌, ప్రాజెక్టు వర్క్‌, గేట్‌ ప్రిపరేషన్‌ వంటి అంశాల్లో సమయం సరిపోదు. - ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ సాధనలో ఇంటర్న్‌షిప్‌ కూడా కీలకంగా మారింది. కాలేజీలో పుస్తకాల్లో చదువుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించేందుకు ఇంటర్న్‌షిప్‌ ఉపయోగపడుతుంది. - ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌, సీఎస్‌ఈ విద్యార్థులు...తాము సబ్జెక్టులో సాధించిన మార్కుల ఆధారంగానే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ సంగతిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. - కెరీర్‌లో ఎంతో కీలకమైన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కు కూడా ఈ ఏడాదిలోనే సన్నాహాలు మొదలు పెట్టాలి.

ఉద్యోగాలు సమాచారం


ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) 
ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ-2015 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 విభాగాలు : ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌.
 అర్హత :సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు, గేట్‌-2015కు దరఖాస్తు చేసిన వారు అర్హులు.
 దరఖాస్తు : 20 డిసెంబరు నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.
చివరి తేదీ : 19 జనవరి 2015
 వెబ్‌సైట్‌ :www.ntpc.co.in 

ఇంజనీర్‌ ట్రెయినీలు ఉత్తరాఖండ్‌లోని తెహ్రి హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు : సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌.
 అర్హత : సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు, గేట్‌-2015కు దరఖాస్తు చేసిన వారు అర్హులు.
దరఖాస్తు : 1 డిసెంబరు నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది
. చివరి తేదీ : 31 జనవరి 2015
వెబ్‌సైట్‌ : www.thdc.gov.in

Followers