కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పొడిగింపు

2005కు ముందు ఉన్న కరెన్సీ మార్చుకునేందుకు రిజర్వు బ్యాంక్‌ ఇచ్చిన గడువు మరింత పొడిగిం చారు. మరో వారం రోజుల్లో ఈ గడువు ముగియ నుండగా, ఈ ఏదాది చివరి వరకు (డిసెంబర్‌ 31) వరకు పొడిగించారు. ఈలోగా ప్రజలు తమ వద్ద ఉన్న 2005 పూర్వకంగానే కరెన్సీ నోట్లను రూ.500, రూ. 1000 సహా బ్యాంకుల్లో ఇచ్చేసి కొత్తగా మార్పిడి చేసుకునే వీలుంది. 2005 కంటే ముందునాటి రూ.500, రూ.1000 నోట్లను వెంటనే ఆయా బ్యాంకుల్లో ఇచ్చేసి వినియోగ దారులు మార్చుకోవాలని ఇప్పటికే ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించినా కొన్నికారణాలవల్ల గడు వును రెండుసార్లు పొడిగించారు. జూన్‌ 30లోగా రిజర్వు బ్యాంక్‌ ఆదేశాలు పాటించాలని చెప్పారు. -

'జ్యోతి లక్ష్మి' రివ్యూ



-సూర్య ప్రకాష్ జోశ్యుల హీరోయిన్స్ వేశ్య పాత్రలలో తెరపై కనపడటం కొత్తేమీ కాదు కానీ ...పూరి జగన్నాథ్ వంటి స్టార్ డైరక్టర్ చిన్న బడ్జెట్ లో... అదీ హీరోయిన్ ఓరియెంటెడ్ గా, అందులోనూ నవలా ఆధారం గా సినిమా చేయటం అనేది ఈ రోజుల్లో చెప్పుకోదగ్గ విశేషమే...అభినందించాల్సిన సంగతే. అయితే పూరి మేకింగ్ లోనూ, డైలాగులలోనూ చూపిన శ్రద్దను కథ, కథనం, ట్రీట్ మెంట్ లో చూపలేకపోయారు. సినిమాలో ఎత్తుకున్న విషయం పై చర్చ కన్నా సందేశం ఎక్కువైంది. పోనీ ఆ మెసేజ్ అయినా సరిగ్గా అందించారా అంటే పూర్తిగా సినిమాటెక్ లిబర్టీస్ తో నడుస్తూంటుంది. సెకండాఫ్ లో సందేశాలతో కూడిన ఉపన్యాసాలతో విసుగెత్తించారు. ముఖ్యంగా ఛార్మిని హీరో గా మలచాలన్న తాపత్రయంతో ఎత్తుకున్న పాయింట్ ని వదిలి కథని దారి తప్పించారు. శ్వేతాబసు ఉదంతంలో చెలరేగిన కాంట్రావర్శి అయిన... ఆ పారిశ్రామిక వేత్త ఎవరు అనే ఎలిమెంట్ తో సెకండాఫ్ నడిపేద్దామని చూసారు. ముఖ్యంగా మల్లాది వెంకట కృష్ణమూర్తి... 'మిసెస్‌ పరాంకుశం' నవల ని అప్ డేట్ చేసి అందించే ప్రక్రియలో నవలలో చర్చించిన మెయిన్ ఎలిమెంట్ ని వదిలేసి, విలన్ సంహారం, వేశ్యా సంస్కరణ వంటివి హెలెట్ చేసారు. ప్రోమోలు,పోస్టర్స్ చూసి థియోటర్ కు వెళ్లిన వారికి నిరాశనే కలిగించినట్లైంది. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు జ్యోతిలక్ష్మి (ఛార్మి) ఓ సెక్స్‌వర్కర్‌. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్య(సత్యదేవ్) ఆమెను చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఉండే చోటకి రోజూ వెళ్తూ...ఓ రోజు ..ఆమె వద్ద పెళ్లి ప్రపోజల్ పెట్టి...ఒప్పించి బయిటకు తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటాడు. మొదట్లో తిక్కగా బిహేవ్ చేసినా తర్వాత సత్య ..నిజమైన ప్రేమకు ఆమె ..అతనితో నిజాయితీగా జీవితం ప్రారంభిద్దామనుకుంటుంది. కానీ ఆమె గత జీవితం ఆమెను వెంబడిస్తుంది. ఆ వ్యభిచార గృహాల (కంపెనీ) రాకెట్ నడిపే...నారాయణ పట్వారీ (అజయ్ ఘోష్) డబ్బు సంపాదించే ఆమెను వదులుకోదలుచుకోడు. అతను చేతిలో పోలీసులు, డబ్బు, రౌడీలు ఉంటారు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. అంత పరర్ ఫుల్ విలన్ ని ఆమె ఎలా ఎదుర్కుని తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకుంది...మిగతా వ్యభిచారుల జీవితాలు సైతం ఎలా నిలబెట్టింది అనేది మిగతా కథ. నవలలో... ఓ సెక్స్ వర్కర్ ని పెళ్లి చేసుకున్న వాడు జీవితం ఎలా నడుస్తుంది...అదే సమయంలో సెక్స్ వర్కర్ ..మామూలు గృహిణిగా ఎలా ఎడ్జెస్ట్ అవుతుంది..చుట్టూ ఉన్న సమాజం సెక్స్ వర్కర్ వివాహాన్ని ఎలా స్వీకరిస్తుంది..మార్పు ని అంగీకరించే ప్రాసెస్ లో ఏ విధమైన ఇబ్బందులు ఆ సెక్స్ వర్కర్ కు పెడుతుంది అనే విషయాలు చుట్టూ తిరుగుతుంది. అయితే పూరి నవలను ఎడాప్ట్ చేసే పక్రియలో వాటిని ప్రక్కన పెట్టేసారు. వృభిచార కంపెనీ నడిపే పాత్రకు, హీరోయిన్ కు మధ్య కథను నడిపాడు. సాధ్యమైనంత యాక్షన్ ని చొప్పించే ప్రయత్నం చేసాడు. దాంతో అటు ఇటూ కాకుండా పులిహారలో చికెన్ బిర్యాని కలిపినట్లైంది. ఫైనల్ గా ... ఈ సినిమాలో పూరి సందేశం ఇచ్చినా నమ్ముకున్నది మాత్రం క్రైమ్ అండ్ సెక్స్ అని స్పష్టంగా అర్దమవుతుంది. అయితే వాటిని కూడా సరిగ్గా కథలో బ్లెండ్ చేయకుండా అవి ఎక్కడ హైలెట్ అవుతాయో అనే డౌట్ తో ...వాటిని సందేశంతో కవర్ చేయాలని ప్రయత్నించాడు. ఆ నిజాయితీ లోపమే సినిమాను ప్రక్కదారి పట్టించింది. బ్రహ్మానందం నుంచి కామెడీ....వేశ్య పాత్రలో ఉన్న ఛార్మి నుంచి శృంగార రసం, హీరో పాత్ర నుంచి హీరోయిజం, పూరి నుంచి పోకిరిలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేయకపోతే ఈ సినిమా నచ్చుతుంది. ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చార్మి నటన. మొదట వేశ్యగా...తర్వాత తనను ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి భార్యగా, సమాజంపై తిరగబడే ఆదిపరాశక్తిగా, తన సమస్యను తెలివిగా పరిష్కరించుకునే స్త్రీగా, ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయి నటించింది. అలాగే...సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పాపులర్ అయిన భధ్రం కూడా బ్రోకర్ పాత్రలో రాణించారు. ఛార్మిని సపోర్ట్ చేసే రౌడీ కొత్తతను బాగా చేసారు. సినిమాలో ఛార్మి పాత్రమైన సానుభూతి ఎక్కడా కలగదు. ఆ విధంగా సీన్స్ రాసుకోలేదు. దాంతో ఆమె తిరగబడుతున్నా ప్రేక్షకులు ఆమెతో సహాయానుభూతి కలగటం కష్టమై పోయింది. సెటప్ లో ఆ సీన్స్ కరెక్టుగా ఉంటే పేఆఫ్ చేసే క్లైమాక్స్ లో అద్బుతం జరిగేది. ఈ సినిమా లో బ్రహ్మానందం పాత్ర సినిమాకు మరో మైనస్ అని చెప్పాలి. కామెడీ మాట దేవుడెరుగు. జుగుప్స కలిగించింది. బ్రహ్మానందం వంటి కమిడియన్ పై మోతాదు మించిన డైలాగులు పెట్టడం, సీన్లు అల్లటం చేసారు. అలాగే కథకు కీలకమైన పాత్రగా చేయాలని చూడటం రసాభాస ను కలిగించింది. సినిమాకు కీలకమైన సెకండాఫ్ లో పూరి కేవలం యాక్షన్, సందేశం ఈ రెండే నమ్ముకున్నారు. అంతేకానీ కథలో ఉన్న బేసిక్ ఎమోషన్స్ ని రిజిస్టర్ కానివ్వలేదు. వాటిపై చర్చ చేయలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మారుతున్న మూడ్‌ను సినిమాటోగ్రాఫర్ పీజీ విందా సరిగ్గా క్యారీ చేశారు. ఎడిటింగ్ కూడా పూరి స్టైల్లో స్పీడుగానే నడిచిపోయింది. అసందర్భంగా వచ్చినా.... సునీల్ కశ్యప్ అందించిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. ముఖ్యంగా భాస్కరభట్ల రచన టైటిల్ సాంగ్ లో కొత్త పుంతలు తొక్కింది. నేపథ్య సంగీతం ఆకట్టుకునే ఉంది. ధనరాజ్, ఉత్తేజ్, సంపూర్ణేష్ బాబు, నెల్లూరి సప్తగిరి వీళ్లందరినీ క్లైమాక్స్ లో పెట్టారు కానీ రిజిస్టర్ అయ్యేలా కూడా చేయలేకపోయారు. కేవలం ప్రోమోల కోసమే వీరిని తీసుకున్నట్లు అనిపించింది. సినిమాలో ప్రియదర్శిని రామ్...కీలకమైన పోలీస్ పాత్రలో కనిపించారు. చాలా కాలం తర్వాత ఆయన తెరపై మెరిసారు. ఇప్పటికీ ఈ వయస్సులో ఆయన ఫెరఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయటం విశేషం. పాత్రలో లీనమై చేసి సినిమాకు ప్లస్ అయ్యారు. బ్యానర్: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ నటీనటులు: ఛార్మి కౌర్‌, సత్య, వంశీ, బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు తదితరులు సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, కథ: మల్లాది వెంకట కృష్ణ మూర్తి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. సమర్పణ: ఛార్మి కౌర్ విడుదల తేదీ: 12, జూన్ 2015.


మానవ హక్కుల దివిటీ మాగ్నాకార్టా


maanava hakkula diviti maagnaakaarta

గోరంత దీపం కొండంత వెలుగు..ఇది అక్షర సత్యం. మానవ హక్కుల ఉద్యమాల చారిత్రక, మహోన్నత ప్రయాణానికి మార్గనిర్దేశన చేసిన స్వేచ్ఛాయుత సామాజిక నియమావళే మాగ్నాకార్టా. ఎనిమిది శతాబ్దాల క్రితం అప్పటి ఇంగ్లాండ్ రాజు జాన్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఫలితమే ఈ మహోత్కృష్ట నియమావళి. రాజైనా పేదైనా అందరూ చట్టం ముందు సమానమేనని నాటి ఇంగ్లాండ్ ప్రజానీకం నినదించింది. రాజరికం, నిరంకుశత్వం, అరాచక పాలనలపై తిరుగుబాటు చేసి అనంతర కాలంలో యావత్ ప్రపంచం మానవ హక్కులకు పట్టం కట్టడానికి దోహదం చేసింది. మానవ విలువలంటే ఏమిటో తెలియని..నిరంకుశ పాలనలో బతికేస్తూ రాజులకు సాగిలపడటమే దైనందిన జీవితంగా భావించిన రోజుల్లోనే భావి మానవ హక్కుల మహా ప్రయాణానికి ఈ నియమావళి నాందీ ప్రస్తావన చేసింది. ఆ తిరుగుబాటు మొదట్లో కొందరు వ్యక్తులు తమ హక్కుల కోసం చేసిన పోరాటమే అయినా అది అనంతర కాలంలో ఆధునిక ప్రజాస్వామ్య దేశాకు బలమైన విలువల పునాదిగా మారింది. కింగ్‌జాన్ సంతకం చేసిన మాగ్నాకార్టా ఎన్నో మార్పులకు, చేర్పులకు లోనైనా భారత్ సహా వందకు పైగా దేశాలకు విలువల కరపత్రమే అయింది. రెండు వందల కోట్ల మంది ప్రజల జీవితాలను, జీవనాన్నీ ప్రభావితం చేస్తూనే ఉంది. మానవ,ప్రజాస్వామ్య, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కుల పరిరక్షణోద్యమాలకు అనునిత్యం వెలుగుదివ్వెగా భాసిల్లుతోంది. మానవ హక్కులను ఎప్పటికప్పుడు శక్తివంతంగా తీర్చిదిద్దడానికి, సరికొత్త విలువలతో ఉన్నత భావనలను పాదుగొల్పడానికి ఇది ఆధునిక సమాజంలోనూ ఎంతగానో దోహదం చేస్తోంది. స్వేచ్ఛాయుత జీవన హక్కులతో ముడివడి ఉన్న మానవీయ కోణాలను విస్తృతం చేస్తోంది. ఈ ఎనిమిది శతాబ్దాల కాలగతిలో ఎన్నో మార్పులు, ఎన్నో పరిణామాలు, ఎన్నో ఉత్కృష్ఠ ఘట్టాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ప్రతీది కూడా మనిషి సాధించిన ఆలోచనాత్మక, విజ్ఞానదాయక పరిణతికి తోడ్పడింది. అందుకే..నిన్న మొన్న జరిగిన పరిణామాలనే మర్చిపోతున్న నేపథ్యంలో 1215 జూన్ 15నాటి మాగ్నాకార్టా ఇప్పటికీ నిరుపమానంగా, జాజ్వల్యంగా వెలుగుతోందంటే..ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించే దేశాలకు స్ఫూర్తిదాయక మార్గదర్శకమైందంటే..దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెలుగు చిన్నదే అయినా శూన్యాన్ని తరిమికొట్టడంలో అజే య శక్తే అవుతుంది. తిరుగులేని ఇంగ్లాండ్ రాజే చట్టానికి లోబడి వ్యవహరించే అనివార్య పరిస్థితిని ఈ చారిత్రక ఒప్పందం కల్పించింది. ఆ పరిణామంతో నియంతృత్వ, తిరుగులేని అధికారాలు క్రమంగా పలుచబడుతూ ప్రస్తుతం ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆవిర్భావానికి దారితీసింది. ఈ ఎనిమిది శతాబ్దాల్లో మాగ్నాకార్టా ఉద్దేశిత సిద్ధాంతాలు, నియమాలూ కాలానుగుణంగా మార్పులు చెందుతూ, హద్దులనూ చెరిపేసుకుని విశ్వ జనీనమైన మానవ హక్కులకు ఊతాన్నిచ్చాయి. న్యాయ, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగాలూ శక్తివంతం కావడానికి దోహదం చేశాయి. భారత రాజ్యాంగానికి, అందులోని అత్యంత వౌలికమైన ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ్భావనలకు మాగ్నాకార్టానే స్ఫూర్తిదాయకమని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఒక్క భారత దేశమే కాదు, ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న అమెరికా రాజ్యాంగ రూపకల్పనలోనూ మాగ్నాకార్టా ముద్ర స్పష్టం. మానవ హక్కులు, పౌర హక్కులకు అగ్రరాజ్య రాజ్యాంగం తిరుగులేని పునాదులు వేయగలిగిందంటే..వీటి పరిరక్షణ విషయంలో రాజీలేకుండానే కొనసాగుతోందంటే అందుకు మాగ్నాకార్టా అందించిన స్ఫూర్తే నిదర్శనం. చట్ట పాలన ఎలా ఉండాలో చెప్పడమే కాకుండా, నియంతల అధికారాలకూ ఈ మహా నియమావళి కత్తెర వేసింది. నేడు మనం చెప్పుకుంటున్న మహిళా సమానత్వ హక్కులకూ ఎనిమిది శతాబ్దాల క్రితమే పునాది పడిందన్న నిజం ఈ మహోన్నత హక్కుల పత్రాన్ని విశే్లషిస్తే స్పష్టమవుతుంది. అన్ని విధాలుగా ఎంతో పరిణతి చెందిన ప్రజాస్వామ్య వాతావరణంలో జీవిస్తున్న మానవాళికి హక్కుల పరంగా, అధికారాల పరంగా ఇతరత్రా కూడా వారి స్వేచ్ఛాయుత జీవనానికి గండి కొట్టే అవాంఛనీయ పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. మహిళలు రక్షణ కోసం, విద్యార్థులు హక్కుల కోసం, కార్మికులు వేతనాల కోసం, నిరుద్యోగులు ఉపాధి కోసం చేస్తున్న చేస్తున్న ఆక్రందనలకు మూలం మాగ్నాకార్టానే. భారత రాజ్యాంగం, పౌర హక్కుల రూపకల్పనలో మాగ్నాకార్టా కనబరిచిన ప్రభావం తిరుగులేనిదే. దేశ ప్రజలకు ప్రాధమిక హక్కులను, స్వేచ్ఛనూ కల్పిస్తున్న రాజ్యాంగ 21వ అధికరణకు మాగ్నాకార్టానే మూలమని ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఈ నేపథ్యంలో ప్రస్తావించడం ఎంతైనా సముచితం. 'న్యాయపాలనలో జాప్యం జరుగకూడదు.ఎవరికీ అన్యాయం జరుగకూడదు.న్యాయం అమ్ముడు పోకూడదు'అన్న ఉదాత్త భావనలను నాడే ప్రోదిచేసుకున్న మాగ్నాకార్టా ప్రపంచ హక్కుల ఉద్యమాలన్నింటికీ దివిటీగానే పని చేసింది. ప్రజాస్వామ్య ప్రస్థానాలనూ, రాజ్యాంగాల ఆవిర్భావాన్ని, అత్యంత వౌలికమైన మానవీయ భావనలను బలంగా పాదుగొల్పే ప్రయత్నంలో మార్గదర్శనే కాదు, నిర్దేశనా చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజల ప్రాథమిక హక్కులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, రాజ్యాంగ పరమైన, పాలనాపరమైన విధానాలను మానవీయ కోణంలో రూపొందించుకోవాల్సిన అవసరమూ అంతే ఉంటుంది. భారత దేశ చట్ట, న్యాయ పాలనకు సంబంధించి అనేక కోణాల్లో మాగ్నాకార్టా స్ఫూర్తిదాయకమే అయింది. మిగతా దేశాల మాట ఎలా ఉన్నా మాగ్నాకార్టా భారత స్వాతంత్య్రోద్యమానికి తిరుగులేని శక్తిని అందించింది. ఆంగ్ల పాలకులపై రాజకీయ స్వేచ్ఛ కోసం మహాత్మాగాంధీ సాగించిన పోరాటానికి మాగ్నాకార్టానే మూలం. రాజకీయ హక్కుల సాథన, స్వేచ్ఛ సముపార్జన తమకు ముఖ్యమని చాటిచెప్పిన గాంధీ ఆ దశగానే దేశాన్ని ముందుకు నడిపించారు. ఆ మహోద్యమం ఫలించి భారతావని సర్వసత్తాక గణతంత్య్ర ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడానికి మూలం కూడా మాగ్నాకార్టానే. మూడువేల పదాలు, ఎన్నో నిబంధనలతో కూడిన మాగ్నాకార్టా నుంచే భారత రాజ్యాంగం మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాసామ్య విలువల వంటి ఉన్నత భావనలను పుణికి పుచ్చుకోగలిగింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అమలులో ఉన్న రాజ్యాంగాలను క్రోడీకరించే దేశ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నా..ఈ మొత్తం ప్రయత్నం వెనుక మాగ్నాకార్టా ప్రభావం చాలా స్పష్టం. 12శతాబ్ద కాలం నాటి సామాజిక, ఆర్థిక,రాజరిక, నిరంకుశ పరిస్థితుల పరీక్షలు నెగ్గి ఎప్పటికప్పుడు పునీతమవుతున్న మాగ్నాకార్టా తరగని వెలుగు దివ్వె. మానవ జాతి ఉన్నంత వరకూ, ఆక్రమణలు, అణచివేతలు, హక్కుల ఉల్లంఘనలు పేట్రేగుతున్నంత వరకూ ఇది తిరుగులేని స్ఫూర్తి మంత్రమే అవుతుంది. అంతిమంగా మానవ జాతి నాగరికంగా పరిణతి చెందడానికి, మానవీక కోణంలో రాణించడానికీ మాగ్నాకార్టా సాగించిన శతాబ్దాల ప్రయాణం నిరంతరం వెలుగుబాటను పట్టిస్తూనే వచ్చింది. మార్పు గుణాత్మకమైతే అది విలువలను ప్రోది చేస్తుంది. పరివర్తనాయుతమైన జీవన విధానానికి ప్రేరణ అవుతుంది. మాగ్నాకార్టాను ఈ కోణంలోనే పరిగణించాలి. అందులో ప్రవచించిన ప్రతి నిబంధన, ప్రతి డిమాండ్ ఆధునిక నాగరిక ప్రపంచావిష్కరణకు విశేషంగానే దోహదం చేసింది. మానవాళి చరిత్రలో ఎన్నో మధుర ఘట్టాలున్నాయి. ఎన్నో ఉత్కృష్ఠ పరిణామాలూ ఉన్నాయి. వీటిలో కొన్ని మాయని మచ్చలుగా మిగిలిపోతే ఇంకొన్ని సరికొత్త చరిత్రనే సృష్టించాయి. చారిత్రక గమనాన్ని నిర్దేశించడమే కాదు..అసలు ఉన్నతమైన జీవన ప్రమాణం ఏమిటో ప్రబోధించాయి. అదే క్రమంలో విలువలతో కూడిన ఉన్నత భావనలకూ ఉద్దీపనగా నిలిచాయి. ఇలాంటి ఘట్టాలెన్నింటినో తనలో ఇముడ్చుకుంటూ, ఎప్పటికప్పుడు నిగ్గుదేలుతూ సాగిన మానవ హక్కుల మహా ప్రయాణమే మాగ్నాకార్టా. కాలమేదైనా, పాలనా విధానమేదైనా..పాలకుల ధోరణులు ఒక్కటే రీతిలో ఉంటాయి. నాటి నిరంకుశ పాలకుడు కింగ్‌జాన్‌పై జరిగిన తిరుగుబాటుకు హక్కుల సాధనే కార ణం. చట్టాలు అందరికీ సమానమన్నదే మూ లం. నేడూ అలాంటి పరిస్థితులు,సవాళ్లనే మానవాళి ఎదుర్కొంటోంది. దేశమేదైనా హక్కులకు దిక్కులేని పరిస్థితులు నేడూ అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. ఎనిమిది శతాబ్దాలను పూర్తి చేసుకుంటున్న మాగ్నాకార్టానే ఇలాంటి హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తి. ప్రాథమిక హక్కుల సాధనకు ఎనలేని దీృప్త. చిత్రం... మాగ్నాకార్టాపై సంతకం చేస్తున్న కింగ్ జాన్

జగమంత యోగా.. గిన్నిస్‌లో జాగా


jagamanta  yoga.. ginnislo  jaaga

యోగా.. ప్రపంచమంతా పఠిస్తున్న జపం. 5 వేల ఏండ్లకింద భారత్‌లో ఆవిర్భవించిన ఈ శక్తి.. అంతర్జాయతీయ యోగా దినోత్సవంతో విశ్వమంతా వ్యాపించింది. ఏకంగా 177 దేశాలు యోగా ఔన్నత్యానికి వినమ్రంగా తలవంచాయి. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి నుంచి ఈఫిల్ టవర్ వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సియాచిన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు యోగా జయకేతనం ఎగురువేసింది. ఆదివారం ఈ చరిత్రాత్మక ఘట్టానికి భారత్ నాయకత్వం వహిస్తూ.. దేశంలో కనీవిని ఎరుగని రీతిలో యోగా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోదీ సహా 35వేలమంది ఒకేసారి యోగాభ్యాసం చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ యోగాపథ్‌గా మారింది. ఇంత పెద్దఎత్తున ప్రజలు ఒకేసారి యోగా చేయడం, అందులోనూ 84 దేశాలకు చెందిన జాతీయులు పాల్గొనడంతో రెండు గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయి. -రెండు రికార్డులు సొంతం -చరిత్రాత్మక ఘట్టానికి భారత్ నాయకత్వం -ఢిల్లీలో యోగాపథ్‌గా మారిన రాజ్‌పథ్ -దేశవిదేశాల్లో ఉత్సాహంతో యోగాభ్యాసం -ప్రపంచశాంతికి ఇది నాంది: ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌లో మైనస్ 4 డిగ్రీల చలిలో కూడా భారత సైనికులు యోగా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. యోగా డేను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ ప్రపంచ శాంతి, సమైక్యతను నెలకొల్పడానికి కొత్త శకం ఆరంభమైందన్నారు. ఈ రోజు యోగా దినోత్సవంతో మానవ మేధస్సుకు శిక్షణ అందించే కార్యక్రమానికి నాంది పలికామని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల మంది యోగా దినోత్సవాన్ని జరుపుకొనడం గొప్ప విషయమని.. ఇదంతా భారత్ గొప్పతనమేనని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ కొనియాడారు. న్యూఢిల్లీ, జూన్ 21: కుల, మత, వర్ణ, దేశాలు, ప్రాంతీయాల కతీతంగా యోగా ఔత్సాహికులంతా చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచారు. అంతర్జాతీయ తొలి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతా యోగా కేంద్రంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని, వాతావారణ ప్రతికూల పరిస్థితులను, పలు ప్రాంతాల్లో వెల్లువెత్తిన నిరసనల్ని పక్కనబెట్టి ఆదివారం ఉదయమే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది యోగా ఔత్సాహికులు చాపలు, ఇతర సామాగ్రిని చేతబట్టుకొని ఉత్సాహంతో తమ తమ ప్రాంతాలకు చేరుకున్నారు. పార్కులు, చర్చిలు, నివాసాలు, మిలటరీ స్థావరాలు, గగన తలాలతోపాటు విశ్వవ్యాప్తంగా 44 ఇస్లామిక్ దేశాలతోపాటు 177 దేశాల్లో జరిగిన అంతర్జాతీయ యోగా ఉత్సవాలకు భారత్ నాయకత్వం వహించింది. ప్రాచీన సంప్రదాయ యోగాసనాలు, విన్యాసాలతో ఆకట్టుకున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం నుంచి ఈఫిల్ టవర్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.., సియాచిన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు.. ప్రపంచశాంతిని, సమగ్రత, ఐక్యతను చాటిచెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, రాజకీయవేత్తలు, అధికారులు, త్రివిధ దళాలు, రైల్వే, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వర్గాలు మెగా ఈవెంట్‌లో పాలుపంచుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యోగా డే వేడుకల్ని ప్రారంభించారు. ఆధునిక జీవిన విధానంలో తలెత్తే శారీరక వైకల్యాన్ని అధిగమించే అద్భుతమైన శక్తి యోగాకు ఉందని ప్రణబ్ పేర్కొన్నారు. ఎన్నో శతాబ్దాల నుంచి యోగా సాధనకు భారత్ ప్రధాన కేంద్రమని అన్నారు. దేశరాజధాని ఢిల్లీలో రాజపథ్‌లో 37 వేల మందితో నిర్వహించిన మెగా యోగా ఈవెంట్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన అతిపెద్ద యోగా శిబిరం రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నది. భారీ సైజులో ఏర్పాటు చేసిన డిజిటల్ స్కీన్లపై హిందీ, ఆంగ్ల భాషల్లో యోగాసనాలకు సంబంధించిన సూచనల్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా రిపబ్లిక్ పరేడ్ వేడుకల మాదిరిగానే రాజ్‌పథ్ చుట్టుపక్కల దాదాపు ఐదువేల మంది భద్రతాసిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. రాజ్‌పథ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. రంజాన్ ఉపవాసాలు పాటిస్తున్నా.. ఈ వేడుకకు హాజరుకావడం విశేషం. యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్‌శాఖ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తపాల బిళ్లలను, రూ.10, రూ.100 నాణేలను ప్రధాని మోదీ విడుదల చేశారు. పలురాష్ర్టాల్లో కేంద్ర మంత్రులు: తెలంగాణ, ఏపీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, పలు రాష్ర్టాల్లో నిర్వహించిన వేడుకల్లో భారీసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాష్ర్టాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో కేంద్రమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో సంజీవయ్యపార్కులో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, దత్తాత్రేయ, లక్నోలో హోంమంత్రి రాజ్‌నాథ్, కోచీలో రైల్వేమంత్రి సురేశ్ ప్రభు, కోల్‌కతాలో హర్షవర్థన్, రవిశంకర్ ప్రసాద్, చెన్నైలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వేసిన ఆసనాలు ఇవే... ఉదయమే చాపతో రాజ్‌పథ్‌కు వచ్చిన ప్రధాని మోదీ మొత్తం 21 అసనాలు వేశారు. పాదహస్త ఆసనం, అర్థచక్ర ఆసనం, త్రికోణాసనం, దండాసనం, అర్థ ఉష్ట్రాసనం, వజ్రాసనం, శశాంకాసనం, విక్రాసనాలను వేశారు. సెల్ఫీలకు ప్రధాని నో...: ఏ కార్యక్రమం జరిగినా.. సందర్శకులతో ఎప్పుడూ మొబైల్ ఫోన్లలో సెల్ఫీ ఫోటోలకు ఫోజిచ్చే ప్రధాని మోదీ ఈసారి అలాంటి కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తన ప్రసంగం తర్వాత యోగా కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన తన స్థానానికి చేరుకున్న మోదీ.. ఓ మహిళా వాలంటీర్ సెల్ఫీ దిగడానికి రాగా.. ముకులిత హస్తాలతో ఆమె విజ్ఞప్తిని నిరాకరించారు. సియాచిన్‌లో సైనికుల యోగా విన్యాసాలు ఏడాది పొడుగునా మంచు దుప్పటి పరుచుకున్నట్లు కనిపించే సియాచిన్ యుద్ధ స్థావరంలో త్రివిధ దళాలకు చెందిన భారత సైనికులు యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సముద్ర మట్టానికి 18800 అడుగుల ఎత్తైన ప్రదేశంలో.. మైనస్ 4 డిగ్రీల వాతావారణాన్ని తట్టుకునేలా ప్రత్యేక దుస్తులు ధరించి సైనికులు యెగా కార్యక్రమాల్ని నిర్వహించారు. లడఖ్, కార్గిల్‌తోపాటు దక్షిణ చైనా సముద్ర ప్రాంతమంతా విస్తరించిన సైనిక దళాలకు చెందిన సిబ్బంది యోగాసనాలు వేశారు. మెగా ఈవెంట్‌కు రెండు గిన్నిస్ రికార్డులు రాజ్‌పథ్‌లో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు లభించింది. ఒకే ప్రదేశంలో 84 దేశాలకు చెందిన జాతీయులతోపాటు 35,985 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం రెండు రికార్డు సొంతం చేసుకున్నది. ఈ రికార్డులను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు వెరిఫికేషన్ గ్లోబల్ హెడ్ మార్కో ఫ్రిగట్టి ధ్రువీకరించారు. ఒకే రోజు రెండు రికార్డులను సొంతం చేసుకోవడం దేశానికి గర్వ కారణమని కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాదనాయక్ మీడియాతో అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. 2005 నవంబర్ 19న గ్వాలియర్‌లోని జీవాజి వర్సిటీలో వివేకానంద కేంద్రం పర్యవేక్షణలో 362 పాఠశాలలకు చెందిన 29,973 మంది విద్యార్థులు 18 నిమిషాలపాటు యోగాసనాల కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.


మళ్లీ ఎమర్జెన్సీ రాదని చెప్పలేం...... బీజేపీ నేత అద్వానీ పరోక్ష వ్యాఖ్యలు


malli emarjensi raadani cheppalem



ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయ్ -మోదీ సర్కారుపై బీజేపీ నేత అద్వానీ పరోక్ష వ్యాఖ్యలు -అద్వానీ చెప్పింది అక్షర సత్యం: విపక్షాలు -ఆయన వ్యవస్థ గురించి చెప్పారు.. వ్యక్తుల గురించి కాదు: 2015 జూన్ 18: బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి వచ్చే వాతావరణం కనిపిస్తున్నదంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలపై పరోక్ష విమర్శలు గుప్పించారు. బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారారనే అర్థం స్ఫురించేలా మాట్లాడారు. దేశంలో రాజకీయ నాయకత్వం బలహీనపడిందని, దాంతో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు బలపడుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ మార్గదర్శక మండలి సభ్యుడుగా కూడా ఉన్న అద్వానీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అద్వానీ మాటలు నూటికి నూరుపాళ్లు నిజమని విపక్షాలు పేర్కొన్నాయి. బీజేపీ ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ నుంచే తీర్పు వెలువడిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అయితే, బీజేపీ, ఆరెస్సెస్ మాత్రం ఆచితూచి స్పందించాయి. అద్వానీ వ్యక్తుల గురించి మాట్లాడలేదని, వ్యవస్థ గురించి చెప్పారని అభిప్రాయపడ్డాయి. విధ్వంసకర శక్తులు బలపడ్డాయి దేశంలో రాజకీయ నాయకత్వం బలహీనం కావటంతో విధ్వంసకర శక్తులు బలపడ్డాయని అద్వానీ అన్నారు. ఈ పరిణామం వ్యవస్థల ధ్వంసానికి దారితీయవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ, చట్ట రక్షణ వ్యవస్థల కంటే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకత్వంలో పరిణతి లేదని చెప్పను. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరోసారి అత్యవసర పరిస్థితి రాదన్న నమ్మకంలేదు. మన రాజకీయ వ్యవస్థలోని అత్యున్నత నాయకత్వం నుంచి ఆ మేరకు భరోసా రావటంలేదు. ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత లోపించింది. రాజకీయ నాయకత్వం బలహీనంగా మారటంతో నాకు దానిపై నమ్మకం పోయింది. అత్యవసర పరిస్థితి విధించటం అంత తేలికేం కాదు. కానీ, ఆ పరిస్థితి రాదని మాత్రం చెప్పలేను అని పేర్కొన్నారు. ఇంధిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1975 నుంచి 1977 వరకు దేశంలో మొదటిసారి అత్యవసర పరిస్థితి విధించారు. ప్రతిపక్ష నేతలందరినీ జైళ్లలో పెట్టారు. నాటి ఎమర్జెన్సీకి త్వరలో 40 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా అద్వానీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2013లో నరేంద్రమోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అద్వానీ, ఆ తర్వాత బీజేపీలో దాదాపు ఒంటరయ్యారనే అభిప్రాయం ఉంది. ఆయన గతంలోకూడా మోదీ ప్రభుత్వ తీరును పరోక్షంగా తప్పుపట్టారు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు తరుచూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండటం, ఘర్‌వాపసీ పేరుతో ఆరెస్సెస్ శాఖలు మత మార్పిడులకు పాల్పడుతుండటంతో మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అద్వానీ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అద్వానీ వ్యాఖ్యలు మోదీ సర్కారుపై కాదు: బీజేపీ, ఆరెస్సెస్ అద్వానీ ఎమర్జెన్సీ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించినవి కాదని బీజేపీ, ఆరెస్సెస్ ప్రకటించాయి. బీజేపీ మార్గదర్శక మండలి సభ్యుడైన అద్వానీ ప్రధాని మోదీకి ఈ విధంగా సందేశం ఇస్తారని తాను భావించటంలేదని ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య అన్నారు. ఏమైనా చెప్పదలిస్తే ఆయనకు నేరుగా మోదీని కలిసే స్థాయి ఉందని తెలిపారు. ఆయనకు ఏదో సందేశం ఇవ్వాలన్న ఉద్దేశం కనిపించటంలేదని పేర్కొన్నారు. అద్వానీ వ్యాఖ్యలు వ్యక్తులను ఉద్దేశించినవి కావని, వ్యవస్థల గురించే ఆయన మాట్లాడారని బీజేపీ ప్రతినిధి ఎంజే అక్బర్ అభిప్రాయపడ్డారు. అద్వానీ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. కానీ, దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు లేవు. ఆ యుగం ముగిసిపోయింది. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం ఎంతో శక్తిమంతమైంది అని పేర్కొన్నారు. అద్వానీ మాటలు అక్షర సత్యాలు: ప్రతిపక్షాలు ఎల్‌కే అద్వానీ వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలన్నీ సమర్థించాయి. మోదీ ప్రభుత్వ విధానాల తీరును అద్వానీ పరోక్షంగా వెల్లడించారని పేర్కొన్నాయి. -మోదీ పాలనలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయని అద్వానీ చెప్పకనే చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ చదివితే ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆయన పాలనపై అధికార పార్టీ నుంచే తీర్పు వెలువడింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారో.. ఇక్కడ ఎవరి ప్రభుత్వం ఉందో.. ప్రధాని ఎవరో.. అన్నీ ఆయనకు తెలుసు. బీజేపీలో అద్వానీ రాజనీతి నిపుణుడు. ఆయన చెప్పింది పూర్తిగా నిజం. -టామ్ వాదక్కన్, కాంగ్రెస్ ప్రతినిధి -బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుల్లో అద్వానీ ఒకరు. ఆయన ఆందోళనను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీహార్ రాష్ట్రం ప్రతిరోజూ ఎమర్జెన్సీ పరిస్థితులనే ఎదుర్కొంటున్నది. - నితీశ్‌కుమార్, బీహార్ ముఖ్యమంత్రి. -దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి విధించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అద్వానీజీ సరిగ్గానే చెప్పారు. మోదీ సర్కారు మొదటి ప్రయోగం ఢిల్లీయేనా? - అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి. -అద్వానీ సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన మాటల్లోని అంతరార్థం స్పష్టంగా అర్థమవుతున్నది. మోదీ ప్రభుత్వంలో అధికార దర్పం ఛాయలు కనిపిస్తున్నాయి. -సీతారాం ఏచూరి, సీపీఎం జాతీయ కార్యదర్శి -అద్వానీ లేవనెత్తిన విషయంపట్ల ఆయన సీరియస్‌గా ఉంటే సూటిగానే చెప్పాలి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రతిపక్షాల నుంచి విమర్శలెదుర్కొన్నారు. కానీ, ఇప్పుడు అధికారపక్షం నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. మోదీ ప్రభుత్వం పార్లమెంటును, ఇతర వ్యవస్థలను బలహీనపరుస్తున్నది


టోల్‌ఫ్రీ నెంబర్లు..




ఈ నెంబర్లకు కాల్ చెయ్యండి.. ఖర్చు లేకుండా సేవలు పొందండి.
100: ఎక్కడైనా ఏదైనా కొట్లాట జరుగుతున్నదా.. శాంతిభద్రతలను కాపాడాలి అంటే.. ఇలా పలు నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకుంటే ఎంతో ఉపయోగం.
101: ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే సంబందిత స్థలం, వంటి వివరాలతో ఫోన్‌ చేయాల్సిన నెంబరు
104: గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలను అందించేందుకు మొబైల్‌ వైద్య సర్వీసులను పిలిచేందుకు.
108: ఎక్కడైనా ఎవరైనా ఆకస్మికంగా ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతుంటే వారిని అత్యవసరంగా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించాంటే వైద్యసేవలకోసం.
1090: శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు సరిగా పని చేయడంలేదా, దరఖాస్తులు ఇచ్చినా తీసుకోవడం లేదా అయితే పోలీసులపై ఫిర్యాదు చేయాలంటే ఎవరికి చేయాలో తెలియదా, అయితే ఫిర్యాదు కోసం.
1091: మీకు ఎక్కడైనా ఈవ్‌ టీజింగ్‌ దృశ్యాలు కనిపించాయా? వరకట్నం కారణంగా ఇబ్బందులు పడుతున్నారా? ఇటువంటి వాటితో పాటు అత్తమామల హింసలను, అకతాయిల అగడాలను గురించి సమాచారం కోసం.
1098: 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలపై వేధింపులు జరుగుతున్నాయా? ఎక్కడైనా తప్పి పోయారా వంటి వాటిపై సమాచారం ఇచ్చేందుకు.
1100: మీ సేవా కేంద్రాలు సరిగా పనిచేయడం లేదా? దరఖాస్తు చేసుకున్న ధృవ పత్రాలను నిర్ణీత సమయంలోగా ఇవ్వడం వంటి తదితర అంశాలపై ఫిర్యాదు కోసం.
1500: బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు సంబంధించిన సమాచారం కోసం
133355: విద్యుత్‌ సమస్యలకు సంబంధించి సమాచారం కోసం
155321: ఉపాధి హామీ పధకంలో కూలీలకు అన్యాయం జరుగుతోందా? కూలీ డబ్బులు ఇవ్వడం లేదా అయితే..
155361: ప్రభుత్వ కార్యాలయాలకు మీరు వెళ్ళినపుడు అక్కడ మిమ్నల్ని ఇబ్బందులు పెడుతున్నారా?
1800-180-5232: తపాల బీమాలో చేరాలనుంకటే వివిధ వివరాలకు..
1800-200-4599: ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోయినా, బస్సులలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా..
1800-425-3536: రైతులకు పంటసాగులో సమాచారం



KU Degree Results 2015 KU UG Results 2015



ku degree results 2015  ku results 2015  ku UG  results  ku results 2015  ku   results  ku results manabadi 2015  ku revaluation results 2015


ku degree results 2015  ku results 2015  ku UG  results  ku results 2015  ku   results  ku results manabadi 2015  ku revaluation results 2015



TSMS 6th Class Entrance Exam 2015 Results,


TSMS 6th Class Entrance Exam 2015 Results,TSMS 6th Class Admission Test 2015 Results,TS/Telangana Results for Model School 6th Class Entrance,TS Model Schools Online Application 2015





TSMS 6th Class Entrance Exam 2015 Results,TSMS 6th Class Admission Test 2015 Results,TS/Telangana Results for Model School 6th Class Entrance,TS Model Schools Online Application 2015

ఆ కాలమ్ ఎందుకు చేర్చలేదు?


యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో థర్డ జెండర్ కాలమ్ ను చేర్చకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మంగళవారం జస్టిస్ ముక్త గుప్తా, పీఎస్ తేజీలతో కూడిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం, యూపీఎస్ ఈలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సుప్రీం స్పష్టమైన తీర్పు ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు మండి పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రాన్స్ జెండర్ల పట్ల వివక్ష తగదని కోర్టు పేర్కొంది. జెండర్ కారణంగా ట్రాన్స్ జెండర్స్ ను ఎలా అడ్డుకుంటారని కోర్టు ప్రశ్నించింది. కాగా ఆగస్టు 23 న జరిగే ఈ పరీక్షకోసం ఇచ్చిన ప్రకటనలో్ థర్డ్ జెండర్ కాలమ్ లేకపోవడంపై దాఖలైన పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై జూన్ 17 లోపు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని యూపీఎస్ సీని ఆదేశించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు జూన్ 19తో ముగియనుంది కనుక ఈ లోపుగానే వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. కాగా ట్రాన్స్ జెండర్ లను మనుషులుగా గుర్తించాలని, విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని దాఖలైన పిటిషన్ పై ఏప్రిల్ 15, 2014 సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన వారిని వెనుబడిన తరగతులవారికి వర్తించే అన్ని రిజర్వేషన్స్ వర్తింప చేయాలని, వారికోసం ప్రత్యేకంగా థర్డ్ జెండర్ కాలమ్ ను చేర్చాలని కేంద్రం ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొన్ని సంస్థలు స్పందించిన ఈ ఆదేశాలను అమలు చేస్తున్నాయి కూడా.


Mahatma Gandhi University, Nalgonda UG Results 2015

MAHATMA GANDHI UNIVERSITY Results
























Tags:mahatma gandhi university mahatma gandhi university school of distance education  mahatma gandhi university distance education courses  mahatma gandhi university ranking  mahatma gandhi university results  mahatma gandhi university distance education  mahatma gandhi university wardha  mahatma gandhi university chitrakoot  mahatma gandhi university 2015   mahatma gandhi university nalgonda results  mahatma gandhi university results  mahatma gandhi university nalgonda degree 1st year results  osmania university  mahatma gandhi university distance education  mahatma gandhi university nalgonda contact number  mg university nalgonda  mahatma gandhi university nalgonda degree exam timetable 2015

వాజపేయి జీవితం దేశానికే అంకితం



వాజపేయికి బంగ్లా ప్రకటించిన యుద్ధ విమోచన గౌరవ అవార్డును అందుకున్న ప్రధాని మోదీ -తనతో సహా ఎంతోమంది రాజకీయనేతలకు వాజపేయి స్ఫూర్తి అని వెల్లడి -ప్రతిపక్ష నేత ఖలీదా జియాతో భేటీ.. ఢాకేశ్వరి ఆలయం, రామకృష్ణ మఠ్‌ను సందర్శించిన మోదీ ఢాకా, జూన్ 7: మాజీ ప్రధాని వాజపేయిని బంగ్లాదేశ్ ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించడం ఎంతో గర్వకారణమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ విముక్తికి ప్రతిపక్ష నేత హోదాలో వాజపేయి ఎనలేని కృషి చేశారని వెల్లడించారు. బంగ్లా విముక్తికి క్రియాశీల పాత్రపోషించినందుకు వాజపేయికి బంగ్లాదేశ్ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక యుద్ధ విమోచన గౌరవ (లిబరేషన్ వార్ హానర్) పురస్కారాన్ని.. ఆయన తరఫున ప్రధాని నరేంద్రమోదీ అందుకున్నారు. బంగ్లాదేశ్ అధ్యక్ష భవనమైన బంగభవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఈ పురస్కారాన్ని మోదీకి అందజేశారు. అనంతరం మోదీ ప్రసంగిస్తూ.. తనతో సహా మరెంతోమంది రాజకీయ నేతలకు వాజపేయి స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్నందున వాజపేయి ఈ అవార్డు స్వీకరించేందుకు రాలేకపోయారని చెప్పారు. అటల్ బిహారీ వాజపేయి వంటి నాయకుడికి పొరుగుదేశంనుంచి గొప్ప పురస్కారం లభించినందుకు దేశ ప్రజలందరూ గర్వపడాల్సిన రోజు. ఆయన జీవితం మొత్తం దేశసేవకే అంకితమిచ్చారు. రాజకీయ కోణంలో ఆలోచిస్తే.. నాతో సహా దేశంలోని ఎంతోమంది రాజకీయ నేతలకు ఆయన గొప్ప స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. బంగ్లాదేశ్ విముక్తికి వాజపేయి చేసిన పోరాటాన్ని ఆహుతుల హర్షధ్వానాల మధ్య మోదీ గుర్తుచేశారు. నాడు వాజపేయి ప్రతిపక్ష నాయకుడిగా బంగ్లా విముక్తికి సత్యాగ్రహ దీక్ష చేపట్టారని పేర్కొన్నారు. అందులో యువ వలంటీర్‌గా తాను కూడా పాల్గొన్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజల కల నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామని తెలిపారు. జూన్ 6, 1971న పార్లమెంట్‌లో వాజపేయి ప్రసంగిస్తూ.. బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని..
బంగ్లా పోరాట యోధులకు తగిన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ విముక్తి పోరులో భారత్ అండగా ఉండటం బంగ్లాదేశ్ అదృష్టమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రానికి వాజపేయి గొప్ప సహకారం అందించారని ఆమె కొనియాడారు. కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీకి అధ్యక్షుడు హమీద్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు హమీద్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్‌స్వరూప్ ట్వీట్ చేశారు. కాగా, భారత కంపెనీలకు రెండు ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు అనుమతిస్తూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. మొంగ్లా, భెరమారాలో రెండు సెజ్‌ల ఏర్పాటుకు బంగ్లాదేశ్ అనుమతిచ్చింది. ప్రధాని మోదీ పర్యటనను బంగ్లా మీడియా కీర్తించింది. అన్ని పత్రికలు మోదీ పర్యటనతో కొత్త అధ్యాయం ప్రారంభమైందని కొనియాడాయి. మోదీతో ప్రతిపక్షనేతల భేటీ ప్రధాని మోదీతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా భేటీ అయ్యారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. అంతకుముందు బంగ్లాదేశ్ ప్రతిపక్ష నాయకురాలు రౌషన్ ఎర్షాద్ సమావేశమయ్యారు. అనంతరం పలు వామపక్ష పార్టీ నేతలతో భేటీ అయ్యారు. కాగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య బస్సు సర్వీసుకు తమకేమీ అభ్యంతరం లేదని ఖలీదా జియాకు చెందిన పార్టీ ప్రకటించింది. అయితే బంగ్లాదేశ్‌కు ఫీజు చెల్లించాలని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. బంగ్లా సరిహద్దు వెంట కంచె బంగ్లాదేశ్‌తో ఉన్న నదీ సరిహద్దు వెంట తేలికపాటి కంచె వేయాలని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) నిర్ణయించింది. నది మధ్యనుంచి ఈ కంచె వేయాలని అధికారులు ప్రణాళికలు రచించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) చేపడుతుందని కోల్‌కతాలో బీఎస్‌ఎఫ్ ఐటీ సందీప్ సలుంకె తెలిపారు. ఢాకేశ్వరి ఆలయంలో మోదీ పూజలు 12వ శతాబ్దానికి చెందిన ఢాకేశ్వరి (ఢాకా దేవత) ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. బంగ్లాదేశ్‌లోని అత్యధికమంది హిందువులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన ఈ ఆలయంలో మోదీ 15నిమిషాలపాటు గడిపారు. ఈ సందర్భంగా విమోచన యుద్ధంలో సెక్టార్ కమాండర్ మేజర్ జనరల్‌గా పనిచేసిన సీఆర్ దత్తా మోదీకి తెలుపు, ఎరుపు రంగుల దట్టీ కట్టారు. ఈ దేవత పేరునుంచే ఢాకాకు ఆ పేరు వచ్చిందని కొందరి విశ్వాసం. 1996లో ఈ ఆలయాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని.. జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించింది. అనంతరం మోదీ రామకృష్ణ మిషన్‌ను సందర్శించారు. ఒప్పందాలను తక్షణమే అమలుచేస్తాం -సంయుక్త ప్రకటనలో ప్రధానులు మోదీ, హసీనా ఢాకా, జూన్ 7: భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను తక్షణమే అమల్లోకితెస్తామని రెండు దేశాలు ప్రకటించాయి. చరిత్రాత్మకమైన భూ సరిహద్దు ఒప్పందంతో సహా అన్నింటినీ సహకారాత్మక ధోరణితో అమలు చేస్తామని రెండు దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, షేక్ హసీనా ఆదివారం ఢాకాలో సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. పౌర అణు విద్యుత్, పెట్రోలియంతోపాటు పునరుత్పాదక విద్యుత్ రంగంలోనూ కలిసికట్టుగా పనిచేస్తామని కొత్త తరం- కొత్త దిశ పేరిట విడుదల చేసిన ప్రకటనలో ఇద్దరు నేతలు పేర్కొన్నారు. భారత్-బంగ్లా మధ్య కుదిరిన ఒప్పందాలు వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇద్దరు ప్రధానులు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ప్రకటన వెల్లడించింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు తమ తమ భూభాగాల్లో ఎలాంటి కార్యకలాపాలను అనుమతించబోమని అంగీకరించారు. తీస్తాకు మానవతాకోణంలో పరిష్కారం: మోదీ ఢాకా, జూన్ 7: భారత్-బంగ్లాదేశ్ పక్కనే ఉండటం కాదని.. కలిసి నడుస్తాయి కూడా అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తీస్తా నదీ జలాల పంపిణీ రాజకీయ కోణంతో కాకుండా.. మానవతాకోణంలో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ భారత్‌కు చికాకు వ్యవహారంలా మారిందని ధ్వజమెత్తారు. ఢాకాలోని బంగబంధు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ఢాకా యూనివర్సిటీలో ప్రసంగిస్తూ.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా ధీరోదాత్తంగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. అనంతరం మోదీ రెండురోజుల బంగ్లాదేశ్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు.



ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య కన్నుమూత


ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య ఈరోజు (08/06/2015) ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జానపదం నవలలు రచించి సాహితీ రంగంలో విశేష ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్దతులను ఆయన తన నవలల్లో చిత్రీకరించారు.రంగాచార్య జీవిత విశేషాలు...* 1928లో వరంగల్‌ జిల్లా చినగూడూరులో జన్మించారు.* నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు.* 1951-57 మధ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.* 1957-88 మధ్య సికింద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఉద్యోగం చేశారు.* 'చిల్లర దేవుళ్లు' నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.* తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించారు.* శ్రీమద్రామాయణం, శ్రీమహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు.* 'జీవనయానం' పేరుతో ఆత్మకథను
రచించారు.* అభినవ వ్యాసుడిగా బిరుదు పొందారు.* దేహదాసు ఉత్తరాలు, శ్రీ మహాభారతము, జీవనయానం, చతుర్వేద సంహిత, అమృత ఉపనిషత్తు, అమృతంగమయ తదితర రచనలు చేశారు.కేసీఆర్‌ సంతాపందాశరథి రంగాచార్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి రంగాచార్య అని ఆయన కొనియాడారు. తన రచనల ద్వారా సామాజిక స్ఫూర్తిని ప్రదర్శించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన దాశరథి:
చంద్రబాబుప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం ప్రకటించారు. సాహితీ ప్రక్రియల్లో దాశరథి చేసిన కృషి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిందని కొనియాడారు.


ట్రాల్‌టుంగా... సాహసులకే ప్రవేశం...


traaltunga...
saahasulake praveshan...



పర్వతారోహకులు ప్రపంచంలోని పర్వత శిఖరాలను అధిరోహించడం తెలిసిందే. అయితే నార్వేలోని ట్రాల్‌టుంగా పర్వతంపైకి చేరుకోవాలంటే గుండె ధైర్యం కావాల్సిందే. ఎందుకంటే శిఖరం ఒక వైపు అంచు పర్వతశ్రేణుల్లో వుండి మిగతా మూడువైపులా ఎటువంటిపట్టువుండదు. దూరం నుంచి చూసేవారికి ఎలాంటి ఆధారం లేని బండపైన వున్నట్టు కనిపిస్తుంది. ఈ ప్రదేశం రింజ్‌డల్స్‌వాట్‌నెట్‌ సరస్సుకు సమీపంలో వుంది. నిత్యం ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు అనేకమంది సాహసయాత్రికులు వస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడం గమనార్హం.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలుగా గుర్తించిన టాప్‌ 20 నగరాల్లో భారత్‌ కు చెందిన 13 నగరాలను గుర్తించారు. ఇదిలా ఉంటే ఈ పట్టికలో చైనా నుంచి కేవలం 3 నగరాల్లో మాత్రమే ఉన్నాయి. భారత్ లో పెరుగుతున్న వాయు కాలుష్యం ఫలితంగా సుమారు 66 కోట్ల భారతీయుల సగటు ఆయుర్దాయం 3.2 సంవత్సరాలు తరిగిపోతోందని అధ్యయనాల్లో తేలింది. అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ కూడా ఉంది. టాప్‌ 10 కాలుష్య నదుల్లో గంగా, యమునా ఇక ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నదులుగా పేరొందిన టాప్‌ 10 నదుల్లో గంగా, యమున నదులను కూడా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే చైనా నుంచి మాత్రం కేవలం ఒక నది మాత్రమే ఈ జాబితాలో ఉంది. ఫిబ్రవరిలో విడుదల చేసిన మరో జాబితాలో గుజరాత్‌ లోని వాపీ, ఒడిషాలోని సుకిందా నదీపారివాహిక ప్రాంతాలు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించింది. ఇక దేశంలో 290 నదుల్లో కాలుష్య ప్రభావితమైనవిగా గుర్తించారు. దీని ప్రభావం నేరుగా 8వేల 400 కి.మీ పరిధిలోని జనావాసాలపై పడుతోంది. పారిశ్రామికంగా భారత్‌ చైనాలు పోటీ భారత్ చైనాలు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకుగానూ పలు రంగాల్లో పోటీ పడుతున్నాయని ప్రపంచ విపణిలో గత రెండుదశాబ్దాలుగా ఉన్న మాటే ముఖ్యంగా పారిశ్రామిక వృద్ధిలో భారత్‌ చైనాలు పోటీ పడుతున్నాయి. కర్బన ఉద్గారాల్లో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటే భారత్‌ మూడో స్థానంలో ఉంది. అటు చైనా ప్రపంచ ఉత్పత్తి రంగానికే తల మాణికంగా నిలిచింది. ఈ పరిణామంలో భారత్‌ చైనాల్లో పర్యావరణ కాలుష్యం పెరిగిపోయింది. కాలుష్య నివారణకు చైనా కఠిన చట్టాలు ఇరు దేశాల్లో గత దశాబ్దం వరకూ కాలుష్య సూచీల్లో సమాన స్థాయిలో గణాంకాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం చైనా మాత్రం భారత్‌ కన్నా పరిస్థితిని మెరుగుపరుచుకుంది. గడిచిన పదేళ్లలో చైనా నదీ జలాల కాలుష్యాన్ని తొలగించేందుకు పెద్ద ఎత్తున ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టింది. ఇక వాయు కాలుష్య నివారణకు చైనా కఠినమైన చట్టాలు అమలు చేసింది. గత పదిహేనేళ్లతో పోల్చి చూస్తే బీజింగ్‌ నగరంలో 40 శాతం వాయు కాలుష్యం తగ్గింది. సరిగ్గా పదిహేనేళ్ల కాలంలో మన దేశరాజధాని ఢిల్లీలో 20 శాతం వాయు కాలుష్యం పెరిగింది. మన దేశంలో కేవలం కోయంబత్తూరు మాత్రమే కాస్త కాలుష్య సూచీల్లో కాస్త మెరుగ్గా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పరిశ్రమలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రోగ్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పరిశ్రమలను మాత్రం నియంత్రించడం లేదు. ఫలితంగా సుమారు 66 కోట్ల మంది భారతీయుల ఆయుర్దాయం సగటున 3.2 సంవత్సరాలు తగ్గిపోయిందనే చేదు నిజం బయట పడింది.

తుది దశకు ఉద్యోగుల విభజన.

ఉద్యోగుల తాత్కాలిక విభజన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. శుక్రవారం జరిగిన కమల్‌నాథన్‌ కమిటీ భేటీలో పలు అంశాలపై క్లారిటీ వచ్చింది. 4 శాఖలు మినహా మిగతా అన్ని శాఖల్లోనూ... ఉద్యోగుల విభజన దాదాపుగా పూర్తయింది. ఈ నెలాఖరులోపు 90 శాతం వరకు ఉద్యోగుల పంపిణీ పూర్తవుతుంది. ఇవాళ మరోసారి కమలనాథన్ కమిటీ భేటీ కానుంది. పలు శాఖలపై ఏకాభిప్రాయం.. ఉద్యోగుల తాత్కాలిక విభజనపై కమల్‌నాథన్ కమిటీ కసరత్తులు చేసింది. తెలంగాణ సచివాలయంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు... కమిటీతో శాఖల వారీగా ఉద్యోగుల విభజనపై చర్చించారు. మొత్తం పదిశాఖల విభజనపై ఏకాభిప్రాయం కుదరింది. హోం, అగ్రికల్చర్, ప్లానింగ్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, రెయిన్ షాడో ఏరియా డెవలప్‌మెంట్‌ , వికలాంకుల సంక్షేమం, కుటుంబ సంక్షేమశాఖ, భూగర్భజల, గ్రామీణ నీటిపారుదల శాఖల్లో ఉద్యోగుల విభజనపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మరో 16 శాఖలపై రానున్న క్లారిటీ.. ఈ రోజు జరిగే భేటీలో మరో 16 శాఖల ఉద్యోగుల విభజనపై క్లారిటీ ఇవ్వనుంది. సంక్షేమశాఖ, పాఠశాల విద్య, పంచాయతీరాజ్‌, విద్యుత్, దేవాదాయ, ఉద్యానవనశాఖ, ఢిల్లీలోని ఏపీభవన్‌ వంటి కీలక శాఖల గురించి సీఎస్‌లు చర్చించనున్నారు. ఇది పూర్తైతే 60 శాఖల ఉద్యోగుల విభజన పూర్తైనట్లే. ఐతే ఉద్యోగుల సంఖ్య తేలని పోలీసు, టాస్క్‌ఫోర్స్, మెడికల్ అండ్ హెల్త్, ప్రొటోకాల్‌ శాఖల్లో మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. దీంతో ఆయా శాఖల విభజన మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ఐతే ఉద్యోగుల సంఖ్యను తేల్చేందుకు ఈ నెల 12న కమల్‌నాధన్‌ కమిటీ ప్రత్యేకంగా భేటీ కానుంది. జూన్ చివరికల్లా పూర్తికానున్న తాత్కాలిక విభజన.. ఈ నాలుగు శాఖలు మినహా అందరు ఉద్యోగుల విభజనను జూన్ చివరికల్లా పూర్తి చేయనుంది. ఈ నాలుగు శాఖల్లో జిల్లాల వరకు ఏ సమస్యా రాకున్నా హైదరాబాద్‌లో పనిచేసే ఉద్యోగుల్లో మాత్రం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయా శాఖలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో రాష్ట్రస్థాయి శాఖలుగా పరిగణించాల్సి ఉంది. కాని విభజన చట్టంలోని 18జీ, 18ఎఫ్‌లలో మాత్రం ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేయాలని పేర్కొన్నారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరితే తప్ప విభజన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేలా లేదు. సూపర్‌ న్యూమరి పోస్టులపై క్లారిటీ కరువు.. అంతేగాక సూపర్‌ న్యూమరీ పోస్టులపై కూడా ఇరురాష్ట్రాలు క్లారిటీ ఇవ్వటం లేదు. మొదట్లో ఇద్దరు సీఎంలు ఒక అవగాహనకు వచ్చినా.. కమిటి భేటీలో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉత్పన్నమైన ఖాళీల్లో... ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కార్ ఓకే చెప్పింది. కాని అందుకు ఏపీ ప్రభుత్వం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై కమల్‌నాథన్ కమిటీ తదుపరి సమావేశాల్లో చర్చించనుంది. జులైలో అభ్యంతరాల స్వీకరణ.. ఇక ఉద్యోగుల విభజనపై జులైలో అభ్యంతరాలను స్వీకరిస్తామని కమిటీ స్పష్టం చేసింది. మొత్తానికి ఎన్నో చర్చలు, మరెన్నో గందరగోళాల మధ్య.... ఉద్యోగుల విభనన తుదిదశకు చేరుకుది. ఐతే తాత్కాలిక విభజనకే ఏడాది సమయం పడితే...శాశ్వత విభజనకు, కోర్టు వివాదాల పరిష్కారానికి మరెంత కాలం పడుతుందోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియా మ్యాప్ లోకి తెలంగాణ ఎంటర్...

indiya myaap loki telangaana entar...  


తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. కానీ అధికారిక చిత్రపటం లేదు. తాజాగా ఇండియా మ్యాప్‌లోకి తెలంగాణ ఎంటరైంది. తెలంగాణ అధికారిక మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ చిహ్నంగా చూపించింది. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, ఆచారవ్యవహారాల వివరాలు సైతం మ్యాప్‌లో ఉన్నాయి. 12వ పెద్ద రాష్ట్రంగా తెలంగాణ.. తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా అధికారికంగా విడుదల చేసింది. దేశంలోని 12వ పెద్ద రాష్ట్రంగా తెలంగాణను పేర్కొంది. రాష్ట్ర సరిహద్దులను నిర్ధారిస్తూ... అన్ని వివరాలను వివరించింది. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక ఉన్నాయి. మ్యాప్‌లో కాకతీయ కళాతోరణానికి సర్వే ఆఫ్‌ ఇండియా పెద్ద పీట వేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వివరాలు.. ఇక జిల్లా కేంద్రాలు, హైవేలు, నదులు, ప్రాజెక్టులు, నదీ మార్గాలు, చారిత్రక స్థలాలు, పుణ్యక్షేత్రాలు సహా అన్ని పర్యాటక ప్రదేశాలను మ్యాప్‌లో స్పష్టంగా కనబడతాయి. తెలంగాణ సంస్కృతిని.. తెలుగు, నిజాం, మొగలాయి, పర్షియన్‌ సంప్రదాయాల కలబోతగా అభివర్ణించింది. అన్ని ప్రధాన పండుగలతో పాటు బతుకమ్మ, బోనాల పండుగలను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారని పేర్కొంది. ఇక జిల్లాల వారిగా 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వివరాలను కూడా పొందుపరిచింది. 10 భాషలతో కూడిన మ్యాప్... మ్యాప్‌లో హైదరాబాద్‌-సికింద్రాబాద్ జంటనగరాలను సర్వే ఆఫ్ ఇండియా హైలైట్ చేసింది. హైదరాబాద్‌ సిటీ మ్యాప్‌తో పాటు మెట్రో రైల్ రూట్‌మ్యాప్‌ను కూడా పొందుపరిచింది. హైదరాబాద్‌ నుంచి ఉన్న రైలు, రోడ్డు, విమాన మార్గాలను మ్యాప్‌లో సూచించింది. తెలంగాణ జిల్లాల నుంచి పలు ప్రముఖ ప్రాంతాలకు ఉండే దూరాన్ని సైతం పొందుపరిచింది. హైదరాబాద్‌ సగటు ఉష్ణోగ్రత వివరాలు కూడా మ్యాప్‌లో ఉన్నాయి. మొత్తం 10 భాషలతో కూడిన మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది.




నేడు తెలంగాణ రాష్ట్ర ఎడ్ సెట్ 2015

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఎడ్ సెట్ శనివారం నిర్వహించనున్నారు.ఈ పరీక్షకు 64,231 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 134 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షను నిర్వహించనున్నారు.

ఫొటోలు దాచుకోవడానికి గూగుల్‌ నుంచి మరో ప్రత్యేక 'సేవ'


ఫొటోలు, వీడియోలు దాచుకోవడానికి గూగుల్‌ ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసింది. 'గూగుల్‌ ఫొటోస్‌' పేరుతో వినియోగదారులకు మరో కొత్త సేవను ఉచితంగా అందించబోతోంది. ప్రస్తుతం జరుగుతున్న గూగుల్‌ డెవలపర్స్‌ సదస్సులో ఈ కొత్త సేవను ప్రకటించింది. ఈ సర్వీస్‌ ద్వారా వినియోగదారులు ఉచితంగా ఫొటోలు, వీడియోలు భద్రపరుచుకోవచ్చు. గూగుల్‌ ప్లస్‌తో ఎలాంటి సంబంధంలేని ఈ యాప్‌ ద్వారా అపరిమిత మెమొరీని ఉచితంగా ఉపయోగించుకునే సౌకర్యం గూగుల్‌ కల్పిస్తోంది. ఇప్పటికే గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ప్లస్‌లలో ఫొటోలు, వీడియోలు భద్రపరిచే సౌకర్యం ఉన్నప్పటికీ పరిమిత మెమొరీలో సాధ్యమవుతుంది. వాటితో పోలిస్తే గూగుల్‌ ఫొటోస్‌లో మరెన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో హై రిజల్యూషన్‌ ఫొటోలు పెట్టుకోవచ్చు. ఫొటో ఎడిటర్‌, కొలాజ్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, యాపిల్‌ సాధనాల్లో యాప్‌ రూపంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. వెబ్‌ ద్వారానూ ఈ ఫొటో సర్వీస్‌ సేవలను వినియోగించుకోవచ్చు. 


KUPGCET 2015 HALL TICKET DOWNLOAD



KUPGCET 2015 Hall Tickets KUCET e-Hall Ticket 2015 Download - kuexams.comTRB Hall Ticket 2015 Download of Post Graduate Assistant - Check ...PECET 2015 Hall Ticket Download - ANU B.P.Ed., U.G.D.P.Ed ...ANU Hall Ticket 2015 Download - Acharaya Nagarjuna University ...IDE Hall Ticket 2015 - Career Portal Forum for Recruitment



KUPGCET 2015 HALL TICKET DOWNLOAD




KUPGCET 2015 Hall Tickets KUCET e-Hall Ticket 2015 Download - kuexams.comTRB Hall Ticket 2015 Download of Post Graduate Assistant - Check ...PECET 2015 Hall Ticket Download - ANU B.P.Ed., U.G.D.P.Ed ...ANU Hall Ticket 2015 Download - Acharaya Nagarjuna University ...IDE Hall Ticket 2015 - Career Portal Forum for Recruitment

OUCET 2015 HAll TICKETs Time table of OUCET-2015 OUCET 2015 Notification


 Time table of OUCET-2015 entrance test OUCET-2015 entrance tests will be conducted from 08.06.2015 OUCET 2015 Notification Osmania University OUCET Hall Ticket 2015 Download





 Time table of OUCET-2015 entrance test OUCET-2015 entrance tests will be conducted from 08.06.2015 OUCET 2015 Notification Osmania University OUCET Hall Ticket 2015 Download




'నేనెవరిని' అంటున్న 'బాహుబలి'


'nenevarini' antunna 'baahubali'



ఎట్టకేలకు 'బాహుబలి' ట్రైలర్‌ విడుదలైంది. హిందీలో కరణజోహార్‌ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. తెలుగులో ఉదయమే అన్ని థియేటర్లలో ట్రైలర్స్‌ వెళ్ళాయి. కాగా, విలేకరులకు ప్రత్యేకంగా ప్రసాద్‌మల్టీప్లెక్స్‌లో సోమవారంనాడు 4గంటలకు ట్రైలర్‌ చూపించారు. హాలీవుడ్‌ సినిమాను చూసిన రేంజ్‌లో ఆ ట్రైలర్‌ వుంది. డాల్బీ సౌండ్‌లో ఎఫెక్ట్‌గా అనిపించిన ఆ ట్రైలర్‌లో.. బాహుబలి పాత్రధారి ప్రభాస్‌ను ఓ సన్నివేశంలో కొండిపాంతంవారు చూసి గౌరవంగా నమస్కారం చేస్తుంటారు.. వీరంతా నాకెందుకు నమస్కారంపెడుతున్నారు.. అసలు నేనెవర్ని' అంటూ ప్రశ్నిస్తాడు. అమరేంద్రబాహుబలి వంశీయుడువు అంటూ వాయిస్‌ ఓవర్‌ వినిపిస్తుంది. ఇది ఓ రాజవంశానికి చెందిన చరిత్రగా చెప్పేశాడు. అప్పటి కాలంనాటి రాజవంశీయులు బానిన వ్యవస్థలు వంటి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలిసింది. తన వంశాన్ని నమ్ముకున్న ప్రజలకు బాహుబలి ఏంచేశాడనేది మొదటిపార్ట్‌గా కన్పిస్తుంది. కాగా, ఈచిత్రం జులై 12న విడదులచేయడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


శ్రీలంక తెరపై తమిళ కూటమి

శ్రీలంకలో మైనార్టీ తమిళులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు తమిళ రాజకీయ పార్టీలు కొత్త రాజకీయ కూటమిగా ఏర్పడాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకూ తమిళులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన పార్టీ 'తమిళ జాతీయ కూటమి' దేశ ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో వున్న తమిళులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నదని పశ్చిమ ప్రావిన్స్‌లోని తమిళులకు చెందిన మైనార్టీ పార్టీ డెమొక్రాటిక్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ నేత మనో గణేశన్‌ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కూటమిలో భాగస్వాములు కాబోతున్న మరో రెండు పార్టీలు సెంట్రల్‌ హిల్‌ ప్లాంటేషన్స్‌ ప్రాంతానికి చెందినవని వివరించారు. తమిళులు కేవలం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో మాత్రమే కాక పశ్చిమ, వాయవ్య, మధ్య, నైరుతి రాష్ట్రాల్లోనూ నివశిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ప్రాంత తమిళులకు టిఎన్‌ఎ ప్రాతినిధ్యం వహించటం లేదని అందువల్లే ఆయా ప్రాంతాలకు చెందిన తమిళ పార్టీలు నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కర్స్‌ (ఎన్‌యుడబ్ల్యు), కంట్రీస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (యుసిపిఎఫ్‌)లతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. భారత సంతతి తమిళులన్న మాటను నిలిపివేయాలని వారు కేవలం తమిళులు మాత్రమేనని
వారికి భారత సంతతి అన్న తోక ఎందుకని ఆయన ప్రశ్నించారు. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ కొత్త తమిళ కూటమి అధికార యుఎన్‌పికి చెందిన ప్రధాని రణిల్‌ విక్రమిసంఘేకు కీలకం కానున్నది. గణేశన్‌ దీర్ఘకాలంగా యుఎన్‌పి మిత్రుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

బంగ్లాతో మైత్రికి బలమైన సందేశం

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేకడెహ్రాడూన్‌: భారత్‌-బంగ్లా భూ సరిహద్దు ఒప్పందం బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం... ఆ దేశంతో భారత్‌ మైత్రికి బలమైన సందేశమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై దేశమంతా ఏకతాటిపై నిలుస్తుందని ఇది సూచించిందని పేర్కొన్నారు. సోమవారమిక్కడ ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా చట్టసభల పనిదినాలు తక్కువగా నమోదవుతుండటంపట్ల ఆందోళన వ్యక్తంచేసిన ఆయన... సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించకూడదంటూ శాసనకర్తలకు సూచించారు. పార్లమెంటు, రాష్ట్ర శాసనవ్యవస్థలు ఏటా 100 రోజుల పనిదినాలను కలిగిఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో 'త్రీడీ': ప్రజాస్వామ్యంలో డిబేట్‌(చర్చ), డిస్సెంట్‌(భిన్నాభిప్రాయం), డెసిషన్‌(నిర్ణయం) అనే మూడు 'డీ'లు ఉండాలని ప్రణబ్‌ పేర్కొన్నారు. డిస్‌రప్షన్‌(అంతరాయం) అనే 'డీ' ఉండకూడదన్నారు. ప్రజలే తమ ప్రభువులన్న విషయాన్ని శాసనకర్తలు గుర్తుంచుకోవాలన్నారు.

బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పందానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ వారం బంగ్లాదేశ్‌ పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో భారత్‌-బంగ్లాదేశ్‌ భూ సరిహద్దు ఒప్పందం(ఎల్‌.బి.ఎ.)పై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. పొరుగు దేశంతో సంబంధాలు బలపరచుకునేందుకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. సరిహద్దుల్ని కొంతమేర మార్చుకునేందుకు 1974లోనే ఒప్పందంపై సంతకాలు జరిగాయి. బంగ్లాదేశ్‌ పార్లమెంటు దీనికి వెంటనే ఆమోదం తెలపగా, భారత పార్లమెంటు మాత్రం గత నెలలోనే ఆమోదించింది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు అయినప్పటికీ 50% రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాలనే నిబంధన దీనికి వర్తించదని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్ని నిర్ణయించుకోవడంతో పాటు భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు 17,160 ఎకరాల భూమి బదలాయింపునకు ఒప్పందం వీలు కల్పిస్తుంది. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు 7110 ఎకరాల భూమి లభిస్తుంది.

చార్మినార్‌ వద్ద ఉచిత వైఫై సేవలు ప్రారంభం

హైదరాబాద్‌: చార్మినార్‌ వద్ద ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఈ సేవలను ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ-2014 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో ఫలితాలను విడుదల చేశారు. గతనెల 9,10,11 తేదీల్లో ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షలు జరిగాయి. మొత్తం 10,313 పోస్టులకు 3లక్షల 90వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఫలితాల విడుదల అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... అభ్యంతరాలన్నీ పరిశీలించి 13 పొరపాట్లను గుర్తించామని, నిపుణుల ద్వారా వాటిని సవరించి ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు.







 http://www.results.manabadi.co.in/


Tags : DSC 2015 Results 2015,DSC 2015 Biological Science Results,DSC 2015 Physics Results,DSC 2015 Science Results,DSC 2015 Maths Results,DSC 2015 SA Non Languages Results 2015,DSC 2015 SA Language Results 2015,AP DSC 2015 Results 2015,AP DSC 2015 Results 2015,AP DSC Secondary Grade Teachers Results 2015,DSC 2015 Urdu Language Pandit Special School Results,DSC 2015 Language Pandit Special School Results,DSC 2015 Languages Special 2015,AP DSC SGT Results 2015,Second Grade Teacher AP DSC Results 2015,AP DSC PET Results 2015,AP DSC Physical Education Teacher Results 2015, Schools9 AP DSC Results 2015 DSC 2015 DSC 2015 Results 2015,DSC 2015 Biological Science Results,DSC 2015 Physics Results,DSC 2015 Science Results,DSC 2015 Maths Results,DSC 2015 SA Non Languages Results 2015,DSC 2015 SA Language Results 2015,AP DSC 2015 Results 2015,AP DSC 2015 Results 2015,AP DSC Secondary Grade Teachers Results 2015,DSC 2015 Urdu Language Pandit Special School Results,DSC 2015 Language Pandit Special School Results,DSC 2015 Languages Special 2015,AP DSC SGT Results 2015,Second Grade Teacher AP DSC Results 2015,AP DSC PET Results 2015,AP DSC Physical Education Teacher Results 2015, Schools9 AP DSC Results 2015 DSC 2015

వాట్స్‌యాప్‌ ని మించిన ఫీచర్లతో టెలిగ్రామ్‌


 ఏ స్మార్ట్‌ఫోన్ చూసినా వాట్స్‌యాప్ అప్లికేషను తప్పనిసరిగా ఉంటుంది. సందేశాలను పంపడానికి ఉపయోగించే అప్లికేషన్‌లలో వాట్స్‌యాప్‌దే ప్రధమస్థానం. వాట్స్‌యాప్‌కి దీటయిన ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టెలిగ్రామ్‌ వేగంగా విస్తరిస్తుంది. ప్రధానిచే ప్రస్తావించబడిన ఈ టెలిగ్రామ్‌ మెసెంజర్ యాప్ ఒపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ కావడం విశేషం. వాట్స్‌యాప్‌ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసినప్పటికి టెలిగ్రామ్‌ ఇంత పోటి ఇవ్వడానికి కారణం వాట్స్‌యాప్‌ ని మించిన ఫీచర్లే అని చెప్పుకోవచ్చు.
  • వాట్స్‌యాప్ కన్నా వేగవంతంమైనది, తేలికైనది.
  • కొంతకాలం తర్వాత కొనుక్కోమని అనదు. ఉచితం మరియు ప్రకటనలు(యాడ్స్) ఉండవు.
  • వాట్స్‌యాప్ వలే కాకుండా ఎన్ని పరికరాలలో అయినా ఇన్‌స్టాల్ చేసుకొని ఏకకాలంలో వాడుకోవచ్చు.
  • ప్రముఖ మొబైల్ ఆపరేటింగ్ సిస్టములతో పాటు అన్ని డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టములలో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇన్‌స్టాల్ చేసుకోండి.
  • ఇన్‌స్టాల్ చేసుకోకుండా వాడుకోవడానికి వెబ్‌వెర్షను కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ చూడండి.
  • బద్రతకి ప్రాధాన్యతనివ్వడంతో పాటు నిర్ణీత సమయంలో చెరిగిపోయేటట్లు రహస్య సందేశాలను పంపుకునే సౌలభ్యం.
  • వాట్స్‌యాప్‌ని పోలిన అలవాటయిన ఇంటర్‌పేజ్‌తో వాడడం సులభం.
  • 200 సభ్యులతో పెద్ద గ్రూప్‌ తయారుచెసుకోవచ్చు. గ్రూపులో ఆన్‌లైన్‌లో ఉన్నవారిని సులభంగా గుర్తించవచ్చు.
  • 1జిబి పెద్దపరిమాణం గల ఫైళ్ళను కూడా పంపుకోవచ్చు. వీడియోలు మరియు చిత్రాలే కాకుండా ఎటువంటి పైల్ అయినా పంపుకోవచ్చు. 
  • పూర్తిగా క్లౌడ్ అధారిత సర్వీసు కావడం వలన ఏ పరికరం నుండయినా ఫైళ్ళను తెరవవచ్చు.
  • మెరుగైన నోటిఫికేషన్ సెట్టింగులు.


చేతిలో స్కానర్ పెట్టుకొని ఊరంతా వెతకడం ఎందుకు?



మనం ఏదైనా డాక్యుమెంట్ స్కాన్ చేసుకోవాలంటే బయట నెట్ సెంటర్ కి వెళ్ళడం కాని స్కానర్ ఉన్న చోటికి వెళ్ళి డాక్యుమెంట్ స్కాన్ చేసుకుంటాము. కానీ మన చేతిలోనే స్కానర్ ఉన్న విషయం తెలియక డబ్బు వృధా చేసుకుంటాము. స్మార్ట్ ఫోన్లు ఈ రోజుల్లో చాలా మంది దగ్గర కనిపిస్తున్నాయి. మన ఫోన్ లో ఒక చిన్న అప్లికేషన్ ఇంస్టాల్ చేసుకోవడం ద్వారా మన స్మార్ట్ ఫోన్ ని స్కానర్ గా మార్చుకోవచ్చు. కాం స్కానర్ అను ఈ సాఫ్ట్ వేర్ ని ప్లే స్టోర్ నుండి ఉచితంగా పొందవచ్చు. ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాం స్కానర్ ని ఉపయోగించి మనం ఏదైనా డాక్యుమెంట్ ని స్కాన్ చేసుకొని పిడియఫ్ గా లేదా జెపిజి గా బధ్రపరుచుకోవచ్చు. మామూలు స్కానర్ ని ఉపయోగించి స్కాన్ చేసిన డాక్యుమెంట్ వలే దీనిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కాం స్కానర్ కొనే వెర్షన్ని ఉచితంగా పొందవచ్చు. చేయవలసిందల్లా కాం స్కానర్ సైటులో నమోదు చేసుకొని కాం స్కానర్ ని మితృలతో షేర్ చేసుకోవడమే.


నా ఫోన్‌కి ఎప్పుడు ఆండ్రాయిడ్ 5.0 అప్‌డేట్ వస్తుంది?


ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ విడుదలైన తరువాత అందరు నా ఫోన్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చా, నా ఫోన్‌కి అప్‌డేట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. వారి సందేహాలకు తీర్చడం కోసం ఈ పోస్టు రాయడం జరిగింది. 
             ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమును గూగుల్ తయారుచేస్తుంది అని అందరికి తెలిసిందే. ఆండ్రాయిడ్ కొత్త వెర్షను విడుదల చేసిన తరువాత దాని సోర్స్‌కోడ్‌ని దింపుకొనేదుందుకు వీలుగా ఆండ్రాయిడ్ డెవలపర్ సైటులో పెడుతుంది. దీనిని ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అంటారు. తరువాత ఆండ్రాయిడ్ పరికరాల తయారీదారులు మరియు కస్టం రామ్‌ విడుదలచేసే అభివృద్దికారులు ఆ సోర్స్ కోడ్‌ని ఉపయోగించుకొని వారి పరికరాలకు అనుగుణంగా తయారుచేసి, బాగానే పనిచేస్తుందో లేదో పరిక్షించిన తరువాత అప్‌డేట్‌ని విడుదల చేస్తుంటారు. దీనికి సుమారుగా మూడు నెలల కన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు. తయారీదారుల ప్రాధాన్యత క్రమాన్ని బట్టి ఇంకా ఆలస్యం కావచ్చు లేదా అసలు అప్‌డేట్ విడుదలచేయకుండా ఉండవచ్చు. అది పూర్తిగా తయారీదారు ఆర్ధిక వెసులుబాటును బట్టి ఉంటుంది. అయితే గూగుల్ ముందుగా తను కొత్తగా విడుదల చేస్తున్న నెక్సస్ పరికరాలను కొత్త వెర్షను ఆండ్రాయిడ్ తో విడుదలచేస్తుంది. దాని తరువాత నాలుగైదు వారాల్లో గూగుల్ తను విడుదలచేసిన పాత నెక్సస్ పరికరాలకు అప్‌డేట్‌ విడుదలచేస్తుంది అది కూడా విడుదలయి రెండు సంవత్సరాలు దాటని వాటికి మాత్రమే. 
           నెక్సస్ పరికరాల తరువాత వంతు ఆండ్రాయిడ్ వన్ పరికరాలది. గూగుల్ భాగస్వామ్యంతో విడుదలచేయబడిన ఈ తక్కువ ఖరీదు ఆండ్రాయిడ్ ఫోన్‌లు రావడమే సరికొత్త వెర్షనుతో వచ్చాయి. గూగుల్ ముందుగా ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా వాటికి లాలిపప్ అప్‌డేట్‌ను సాధ్యమైనంత తొదరగా ఇచ్చే అవకాశం ఉంది.
            మోటోరోలాను గూగుల్ లినోవోకి అమ్మివేసినప్పటికి తరువాత లాలిపప్ అప్‌డేట్ అందుకువి ఖచ్చితంగా మోటో శ్రేణి పరికరాలే. ఇప్పటికే మోటోరోలా మోటో ఎక్స్ (ఒకటోతరం, రెండోతరం), మోటోజి (ఒకటోతరం, రెండోతరం), మోటో ఇ, డ్రయిడ్ ఆల్ట్రా, డ్రాయిడ్ మాక్స్ మరియు డ్రయిడ్ మినిలకు అప్‌డేట్ విడుదల్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దానిని ఇక్కడ చూడవచ్చు.
           తరువాత వన్‌ ప్లస్ వన్. ఇది ఇంకా మన దేశంలో విడుదలకాలేదు. తొదరలోనే విడుదలచేయాడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వన్‌ ప్లస్ వన్ ఆండ్రాయిడ్ ఆధారిత సైనోజెన్ మోడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 
         హెచ్‌టిసి తన వన్ శ్రేణి పరికరాలకు 90 రోజుల్లో లాలిపప్ అప్‌డేట్ అందిస్తానని ప్రకటించింది. మిగిలిన వాటి గురించి ప్రకటించలేదు.
          సోనీ ఎన్ని రోజులలో అప్‌డేట్ విడుదల్చేసానో చెప్పనప్పటికి తన జెడ్ శ్రేణి పరికరాలకు లాలిపప్ అప్డేట్ తొందరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది.
        యల్‌జి కూడా లాలిపప్ అప్డేట్ ఎప్పుడుని చెప్పనప్పటికి జి2 మరియు జి3 కి తొదరలోనే విడుదల చేసే అవకాశాలు అన్నాయి.
       సాంసంగ్ కూడా ఇప్పటివరకు తన అప్‌డేట్ ప్రణాళికలను ప్రకటించ లేదు. అయితే ముందుగా ఎస్5, ఎస్4 మరియు కొత్తగా‌ఈమద్య వచ్చిన నోట్, టాబ్ లకు అప్డేట్ రావచ్చు. మిగిలిన పరికరాలకు లాలిపప్ ఇస్తుందో లేదో సాంసంగ్ చెప్పవలసిఉంది.
           వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి విడుదయ్యే ఫోన్‌లు చాలా వరకు లాలిపప్ తో రావచ్చు.
        తయారీదారులు అప్‌డేట్‌లు ఇవ్వకుండా వదిలేసిన పరికరాలకు కొత్త వెర్షను రుచిచూపించే సయనోజెన్ మోడ్ సుమారు మూడూ నెలల తరువాత  ప్రముఖ పరికరాలకు సయనోజెన్ మోడ్ 12 ద్వారా స్థిరమైన లాలిపప్ రుచిని చూపించవచ్చు. ఇంకా ముందుగానే పలు పరికరాలకు సైనోజెన్ మోడ్ అస్థిర విడుదలలు వస్తాయి.



ఉచిత ఆఫీస్ 4.4 విడుదలైంది


 ఖరీదైన ఆఫీస్ అప్లికేషన్లకు దీటయిన ఉచిత ప్రత్యామ్నాయం లిబ్రేఆఫీస్. ఉచితంగా లభించే ఈ లిబ్రేఆఫీస్ సాఫ్ట్‌వేర్ విండోస్, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేరును ఉపయోగించి ప్రజా డాక్యుమెంటు ఫార్మాటు అయిన ఒపెన్ డాక్యుమెంటు ఫార్మాటులో మనం డాక్యుమెంట్లు తయారువేసుకోవచ్చు. అంతే కాకుండా యమ్‌ఎస్‌ ఆఫీస్ ని ఉపయోగించి తయారుచేసిన డాక్యుమెంట్లను కూడా ఈ లిబ్రేఆఫీసును ఉపయోగించి మార్పులు చేసుకోవచ్చు. 
 
 
  ఈ మధ్య విడుదలైన లిబ్రేఆఫీసు 4.4 ని ఇప్పటి వరకు విడుదలైన వాటిలో అందమైనదిగా చెప్పవచ్చు. వాడుకరిని ఆకట్టుకునే పలు పైమెరుగులతో పాటు ఎన్నో ఉపయుక్తమైన విశిష్టతలతో విడుదలైన లిబ్రేఆఫీస్ 4.4 ముఖ్యమైన మార్పులను క్రింది చిత్రంలో చూడవచ్చు.
 
 
 థీం మార్చుకునే సదుపాయం ఉన్న లిబ్రే ఆఫీస్ 4.4 లో వచ్చిన పూర్తి మార్పుల వివరాలకు ఇక్కడ చూడండి. 
 
 సరికొత్త వెర్షను లిబ్రేఆఫీస్ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది లింకుకు వెళ్ళండి.


వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ స్పామ్‌


 ఈ మధ్య వాట్స్‌యాప్‌లో వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడంకోసం మన మిత్రులచే సందేశం పంచబడుతుంది. ఈ సందేశం ప్రకారం మనం వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడం కోసం ఆ సందేశాన్ని పదిమంది తోను మరియు మూడు గ్రూపులలోను పంచుకొని సందేశంలో ఇవ్వబడిన లంకెలోకి వెళ్ళి మొబైల్ నెంబరు ద్వారా వీడియో కాలింగ్ నమోదు చేసుకొమ్మని ఉంది. మనం మొబైల్ నెంబరును నమోదు చేసిన తరువాత వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ సర్వరుకు కలుపబడుతున్నట్లు మనకు వివిధ రకాల స్టేటస్‌లను చూపించి ఒక కాళీ పాప్‌అప్‌ తెరవబడుతుంది. ఈ తతంగం అంతా నిజంగానే వీడియో కాలింగ్ వస్తున్నట్లుగానే మనల్ని నమ్మించే విధంగా ఉంటుంది. ఇది కేవలం మన ఫోను నంబరును మరియు మన ఫోనులో ఉన్న సమాచారాన్ని దొంగిలించడానికి తయారుచేయబడిన ఒక స్పామ్‌ సందేశం మాత్రమే. దీని ద్వారా వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ రాదు. అది తెలియక చాలా మంది వారి సమాచారాన్ని అందించడమే కాకుండా ఈ సందేశాన్ని వివిధ గ్రూపులలోను మిత్రులతోను పంచుకోని వారిని కూడా ఈ స్పామ్‌ బారిన పడేస్తున్నారు. కనుక వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఈ స్పామ్‌ సందేశాన్ని షేర్ చేయకండి. ఈ స్పామ్‌ బారిన పడకుండా మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి.


How to remove your photo background in online


ఏ మాత్రం ఫొటో ఎడిటింగ్ పరిగ్నానం లేని వాళ్ళకి ఫొటో యొక్క బ్యాక్‌గ్రౌండ్‌
  అత్యంత సులభం గా తొలగించుటకు ఆన్‌ లైన్‌ లో ఈ సైట్ చాలా చక్కగా
 ఉపయోగపడుతుంది . ఇది చాలా సులభం ..ఒక రకంగా చెప్పాలంటే
 editing softwares లో కన్నా ఇధే సులభం అనుకోవచ్చు .

దీని కోసం ముందుగా మనం  http://clippingmagic.com   అనే ఈ సైట్ లోకి ఎంటర్ అవ్వాలి ఇక్కడ అంతా అందరికీ సులభం గా అర్ధమయ్యే రీతిలో సులభం గా ఉంటుంది ... మొదటగా
 మనకు కావాల్సిన ఇమేజ్ ని అప్‌లోడ్‌ చేసిన తర్వాత క్రింది చిత్రం లో విధం గా హెల్ప్ మెనూ కనిపిస్తుంది .

ఆ తర్వాత మీకు కనిపించే టూల్స్ లో ఆకుపచ్చ టూల్ మనకు కావాల్సిన బాగం ఉంచేది ....ఎర్ర టూల్ మనకు వద్దనుకున్నది తొలగించేది ...
చివరగా మీకు పని పూర్తి అయితే మీకు కావాల్సిన ఇమేజ్ క్రింది విధం గా వస్తుంది ... దానిని మనం 
డౌన్‌లోడ్ చేస్కుంటే సరిపోతుంది ...


Mobile లో మీరు ఎంత Net Use చేస్తున్నారో ఎప్పటికప్పుడు track చేస్కోవడం ఎలా ?


Mobile లో internet కోసం మనం 2G,3G Recharges చేపిస్తూ ఉంటాం ...కానీ ఎంత Net వాడుతున్నామో ఎప్పటికప్పుడు Track  చేస్కోకపోతే మన mobile లో ఉన్న balance ఖాళీ అయిపోతుంది. ముఖ్యంగా  postpaid వాడేవాళ్ళకి Bill తడిచి మోపెడవుతుంది. ఇలాంటి తిప్పలు లేకుండా Android mobile లో ఒక మంచి app play store లో లభిస్తుంది. దీనిలో మనం చేయవలసిందల్లా ఎంత Data Usage Limit దాటిన వెంటనే మీకు remind చేయాలో ఒక్కసారి Set చేస్కుంటే చాలు  అది మమ్మల్ని alert చేయడం మాత్రమే కాకుండా మీరు ఎప్పటికప్పుడు ఎంత Net Use చేస్తునారో ట్రాక్ చేస్కోవచ్చు . ఏ Application కి ఎంత Net వాడారో కుడా అన్ని వివరాలు detailed గా తెల్సుకోవచ్చు.

దీని కోసం మీరు Android mobile play store "Onavo Count | Data Usage" అనే app వెతికి Install చేస్కోవచ్చు.

మొబైల్ లో ఉన్న సిస్టం అప్ప్స్ డిలీట్ చేయటం ఎలా ?


మొబైల్ యూజర్స్ కి సుభవార్త. మీ మొబైల్ లో తక్కువ మెమరీ తో ఇబ్బంది పడుతున్నార. కొత్త అప్లికేషనులు ఇన్స్టాల్ చేయటానికి మెమరీ సరిపోవటం లేదా ? అయితే మీరు ఇక ఇబ్బంది పడవలసిన అవసరం లెదు. కింద చూపించిన విధంగా ఫాలో అవ్వండి. 
సాధారణంగా మనం మొబైల్ కొన్నప్పుడు కంపెనీ ప్రొమొషన్స్ కోసం కానీ, కస్టమర్ నీడ్స్ కోసం కానీ మనకు తెలియని లేదా అవసరం లేని చాలా అప్లికేషన్స్ మొబైల్ లో ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఈ అప్లికేషన్స్ సాధారణంగా అన్ ఇన్స్టాల్(remove ) చేయటానికి వీలుకాదు. దీనివల్ల మన మొబైల్ లో సగం మెమరీ వేస్ట్ అవుతుంది. ఈ కింద చూపించిన విధంగా చేస్తే మనకు అవసరం లేని అప్లికేషన్స్ అన్ ఇన్స్టాల్ చేయవచ్చు. 


  • మొదటిగా దీనికోసం మీరు కంప్యూటర్ ఉపయోగించాల్సి ఉంటుంది   
  • కంప్యూటర్ లో మీరు ఒక సాఫ్ట్వేర్(software ) డౌన్లోడ్ చేయాలి. 
  • మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ పేరు Kingo Root(కింగో రూట్ ). 
  • కింగో రూట్ ని డౌన్లోడ్ చేయటానికి కింద చూపించన లింక్ మీద క్లిక్ చేయండి. 
  • http://www.kingoapp.com/ (డౌన్లోడ్ లింక్ )
  • కింగో రూట్ ని ఇన్స్టాల్ చేయండి. 
  • ఇన్స్టాల్ చేసిన కింగో రూట్ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేయండి . 
  • తర్వాత మీ మొబైల్ లో USB DEBUGGING మోడ్ ని యాక్టివేట్ చేయండి. దీన్ని యాక్టివేట్ చేయటానికి మీ మొబైల్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి అప్లికేషన్స్ పార్ట్ ని ఓపెన్ చేయాలి, అందులో మీకు డెవలప్మెంట్(DEVELOPMENT ) పార్ట్ కనపడుతుంది దాన్ని ఓపెన్ చేయండి. అందులో మీకు USB DEBUGGING ఆప్షన్ ఉంటుంది దాని ఆక్టివేట్ చేయండి . 
  • ఇప్పుడు మీ మొబైల్ ని డేటా కేబుల్ ద్వారా కంప్యూటర్ కి కనెక్ట్ చేయండి.. 
  • కనెక్ట్ చేసిన తర్వాత మీ స్క్రీన్ మీద కింగో  రూట్ సాఫ్ట్వేర్ కింద చూపించిన విధంగా కనబడుతుంది . 

  • మీ మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత 5 నిమషాలు వెయిట్ చేయండి. కింగో రూట్ ఆటోమేటిక్ గా మీ మొబైల్ డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. తర్వాత మీకు పైన రెండవ బొమ్మలో చూపించిన విధంగా మీ మొబైల్ మోడల్ ని చూపిస్తుంది . 
  • తర్వాత రూట్(Root ) బటన్ క్లిక్ చేయండి 
  • మీ మొబైల్ రూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దయచేసి మీ మొబైల్ ని కదిలించవద్దు. 
  • రూట్ కంప్లీట్ ఐన తర్వాత కింద చూపిన విదంగా మెసేజ్ వస్తుంది. 

  • ఫినిష్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ విజయవంతంగా రూట్ చేయబడింది 
  • ఇప్పుడు మీ మొబైల్ ని కంప్యూటర్ నుంచి డిస్ కనెక్ట్ చేయండి . 
  • తర్వాత మీ మొబైల్ లో ప్లే స్టోర్ నుంచి Explorer  యాప్ ని ఇన్స్టాల్ చెయన్ది. 
  • ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన Explorer అప్లికేషన్  ఓపెన్ చేయండి. 
  • ఇందులో మీకు కిందకు వెళితే System  అని ఫోల్డర్ ఉంటుంది . దాన్ని ఓపెన్ చేయండి 
  • అందులో మీకు App  అనే ఫోల్డర్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి. అందులో మీకు ఇన్స్టాల్ అయ్ ఉన్న అప్ప్స్ కనపడతాయి. అందులో మీకు ఉపయోగం లేని అప్లికేషను మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి అందులో డిలీట్ ఆప్షన్స్ క్లిక్ చెయన్ది. ఇప్పుడు మేం మెమరీ ఫ్రీ అవుతుంది 




Followers