పద్మవిభూషణులు!



padmavibhushanulu!
 భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ష్టాత్మకప్రతిష్ఠాత్మక 'పద్మ' అవార్డుల జాబితాను కేంద్రం సిద్ధం చేసింది. వివిధ రంగాలలో ప్రతిభను కనపరిచిన కనబరిచిన 148 మందికి ఈ అవార్డును రాష్టప్రతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అందుకోనున్నట్టు సమాచారం. బీజేపీ నేత అద్వానీతో పాటు అమితాబ్‌, అమితాబ్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్‌, యోగా గురు బాబారాందేవ్‌ రాందేవ్‌లకు పద్మవిభూషణ్‌ పురస్కారాలు దక్కను న్నాయని తెలుస్తోంది. దిలీప్‌ కుమార్‌, ఎన్‌.గోపాలస్వామిలను పద్మభూ షణ్‌ అవార్డులకు కేంద్రం ఎంపికచేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వీరితోపాటు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, పి.వి.సింధు, సర్దార్‌ సింగ్‌, సింగ్‌, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ తదితరులకు కూడా 'పద్మ' అవార్డులను అందుకోనుననట్లు తెలుస్తోంది. వీరితో పాటు 'పద్మ' పురస్కారాలను అందుకోనున్నవారిలో దర్శకుడు సంజయ్‌ లీలాభన్సలి,భన్సాలి, సల్మాన్‌ ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌, భారత హాకీ జట్టు కెప్టెన్‌సర్దారా సింగ్‌, చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ శశికిరణ్‌ కృష్ణన్‌, కుస్తీ వీరుడు సుషీల్‌ కుమార్‌, ఆయన కోచ్‌ సత్పాల్‌, ఎవరెస్ట్‌ ఎక్కిన తొలి వికలాంగురాలు అరుణి మా సిన్హా, దివంగత నటుడు ప్రాన్‌, చీఫ్‌ ఎలక్షన్‌ కమీషనర్‌ ఎన్‌ గోపాలస్వా మి, సీనియర్‌ లాయర్‌ హరీష్‌ సాల్వే, హెచ్‌ సీఎల్‌ చీఫ్‌ శివ నాడార్‌, సంగీత దర్శకుడు అను మాలిక్‌లు అవార్డులు అందుకోనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. చంద్రయాన్‌ను విజయవంతం చేసిన ఎస్‌.కే.శివకుమార్‌, తుం కూర్‌ సిద్ధగంగా మఠం హెడ్‌ శివ కుమారస్వామి, జగద్గురు రామణానందాచా ర్య, స్వామి రమభదచ్రార్య, స్వామి సత్యమిత్రా నంద గిరి తదితరులు కూడా అవార్డులను అందుకోనున్నట్లు తెలుస్తోంది. అవార్డుల విషయంలో కేంద్రం నేడు అధికారిక ప్రకటన వెలువరించే అవకాశాలు వున్నాయి.

పాపులేషన్ క్లాక్ : ఈ రోజుకి భారత దేశ జనాభా 128,76,92,601. ఎలా చెప్పగలం ?


paapuleshan klaak : ee rojuki bhaarata
పాపులేషన్ క్లాక్... 16.01.2015 నాటికి భారత దేశం జనాభా 128,76,92,601. అరె.. ఇది భళే ఉందే. సాధారణంగా క్లాక్ అంటే టైం చెప్పేది కానీ, ఇలా జనాభా చెప్పే క్లాక్ ఉందా.. అవును ఈ క్లాక్ ఉంది. వారు ఏ రోజుకారోజు జనాభా ప్రతీ రోజు చెబుతారా... అరే ఇది భళే ఉంది. దాదాపు 5 వేల కిలో మీటర్ల పరిధి ఉన్న భారత దేశంలో ఏ మూలన ఎవరు పుడుతున్నారు..? ఎంత మంది పుడుతున్నారు.? ఎంత మంది చనిపోతున్నారు.. ? ఇవన్నీ లెక్కేసి జనాభా చెప్పేయడం అంత సులభమా..? ఎలా చెబుతారు.? రండి తెలుసుకుందాం. దేశంలోని చాలా విశ్వ విద్యాలయాలలో పాపులేషన్ స్టడీస్ అని ఒక విభాగం ఉంటుంది. దీని పనే అది. జనాభా మీద స్టడీస్ చేయడమే. పురుషులెందరున్నారు..? స్త్రీలు ఎంతమంది ఉన్నారు.? వారిలో యువతులెంత మంది.? యువకులెంత మంది.? వితంతవులెంత మంది ? ఎంత మంది చనిపోతున్నారు? ఎంత మంది పుడుతున్నారు? మనిషి సగటు జీవిత కాలమెంత? ఇలాంటి ఎన్నో అంశాలపై పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఆ విభాగం ఏ రోజుకారోజు జనాభాను ఇట్టే లెక్కగడుతుంది. అది ఇప్పటి నుంచి కాదు. 1982 నుంచి చేస్తూనే ఉన్నారు. సాధారణంగా అయితే పదేళ్ళకొకమారు ప్రభుత్వం జనాభా లెక్కలను గణిస్తారు. ఇది మనకు తెలిసిందే.. ముంబయిలోని పాపులేషన్ విభాగం దినసరి లెక్కలను చెబుతుంది. ఇలా చెప్పడాన్నే 'పాపులేషన్ క్లాక్' అంటారు. పాత జనాభాను లెక్కేసుకుని జనాభా పెరుగుదల శాతం, పుట్టుక శాతం, మరణించే శాతం, అలాగే జీవన ప్రమాణాలను లెక్క గట్టి జనాభాను లెక్కిస్తారు. ఏ రోజుకారోజు ' పాపులేషన్ క్లాక్ ' ద్వారా జనాభాను ప్రకటిస్తారు. ఈ లెక్కల్లో 0.12 నుంచి 0.5 శాతం తేడాతో ఇట్టే చెప్పేస్తారు. 2011లో జనాభా లెక్కలకు పాపులేషన్ క్లాక్ కు కేవలం 12 లక్షల జనాభానే తేడా వచ్చింది.



వాటర్‌గ్రిడ్‌కు నిధులివ్వండి

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా రక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్ట తలపెట్టిన ప్రతి ష్టాత్మక వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో సగాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్‌, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారంనాడిక్కడ టీఆర్‌ఎస్‌ పార్ల మెంట్‌ సభ్యుడు బి.వినోద్‌కుమార్‌, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి తేజావత్‌ రామచంద్రు నాయక్‌తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో సమావేశమైన ఆయన జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిర్మాణ వ్యయంలో తొంభై శాతాన్ని, సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద రాష్ట్రాల సేద్యపు నీటిపారు దల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందజే స్తున్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయ నున్న వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు కూడా కేంద్రం నిధులు విడుదల చేసి సహకరించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలనే తపనతో తమ రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నందున నిర్మాణ వ్యయంలో కనీసం యాభై శాతాన్ని భరించాలని విజ్ఞప్తి చేసినట్లు ఆ తర్వాత విలేఖ రులతో మాట్లాడిన మంత్రి తారక రామారావు తెలియజేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రితో పాటు జౌళి శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌, కార్మిక మంత్రి బండారు దత్తాత్త్రేయ, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి వై.సుజనా చౌదరిలతో కూడా విడివిడిగా సమావేశమైన తెలంగాణ మంత్రి రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం రూపొందించిన వివిధ అభివృద్ధి ప్రణాళికలకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని అర్థించినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనలన్నింటికీ కేంద్ర మంత్రులు సానుకూలంగా ప్రతిస్పందించారని చెప్పారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఒక మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌, మరో మెగా హాండ్లూమ్‌ క్లస్టర్‌లను ఆర్థిక మంత్రి ప్రకటించే అవకాశముందన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన స్థలాన్ని అందజేస్తే కరీంనగర్‌ జిల్లా బీడీ కార్మికుల కోసం రెండు వందల పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రిని నెలకొల్పేందుకు కార్మిక మంత్రి అంగీకరించారని వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా, సిరిసిల్లలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక ఐటీఐని స్థాపిం చాలని కోరడంతో పాటు కరీంనగర్‌ జిల్లాలో గతంలో నెలకొల్ప తలపెట్టిన యాభై పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి స్థాయిని రెండు వందల పడకలకు పెంచాలని బండారు దత్తాత్త్రేయను కోరినట్లు ఆయన చెప్పారు. జౌళి శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌కు కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌, నల్గొండ జిల్లా పోచం పల్లి లేదా మెదక్‌ జిల్లా దుబ్బాక లేదా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక చోట మెగా హాండ్లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను సమర్పించి నట్లు తెలిపారు. ఈ రెండు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ఇప్పటికే ఆర్థిక శాఖకు పంపినందున వీటిని వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించే అవకాశముందని విశ్వసిస్తు న్నట్లు చెప్పారు. వీటితో పాటు వరంగల్‌ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష మగ్గాలతో ఏర్పాటు చేయతలపెట్టిన టెక్స్‌టైల్‌ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వ మద్దతును, ఎన్‌టిసి సహకారాన్ని కోరామని, తెలంగాణలో ఒక జౌళి పరిశోధనా సంస్థను, మూడు నాలుగు చోట్ల టెక్స్‌టైల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్లను నెలకొల్పాలని కోరినట్లు చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి వాటర్‌గ్రిడ్‌కు ఆర్థిక సహాయాన్ని కోరడంతో పాటు పూర్వపు అవిభక్త రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన 13 జిల్లాలలో తొమ్మిది తెలంగాణలోనే ఉన్నప్పటికీ ఈ ఏడాది కేవలం మూడు జిల్లాలకు మాత్రమే రూ. 66 కోట్ల నిధులను విడుదల చేయడాన్ని ఆయన దృష్టికి తెచ్చి మిగిలిన జిల్లాలకు కూడా నిధుల విడుదలను కోరానని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెలంగాణలో 78 మండలాలకే కుదించబోతున్నట్లు వస్తున్న వార్తలను ప్రస్తావించి ఉపాధి హామీ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కుదించరాదని డిమాండ్‌ చేశామని కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణలోని 150 మండలాలలో మహిళా స్వయం సహాయక బృందాల లింకేజి కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ. 235 కోట్ల నిధుల్లో రూ. 56 కోట్లు మాత్రమే విడుదలైనందున మిగిలిన మొత్తాన్ని సత్వరమే మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి మూడు మాసాలకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 223 కోట్లను మంత్రి ఈరోజే విడుదల చేసినట్లు తెలంగాణ మంత్రి వివరించారు. వాటర్‌ గ్రిడ్‌, చెరువుల పునరుద్ధరణ ప్రాజెక్టులను స్వయంగా చూసేందుకు కేంద్ర మంత్రిని రాష్ట్రంలో పర్యటించాలని కోరినట్లు కూడా ఆయన తెలియజేశారు. కేంద్ర సైన్స్‌, టక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరితో కూడా సమావేశమైన తెలంగాణ మంత్రి రాష్ట్ర విభజనకు ముందు గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా బుద్వేలు వద్ద నెలకొల్పాలని ప్రతిపాదిం చిన సైన్స్‌ సిటీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఐటీ రంగంలో తీహాబ్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌కు మౌలిక వసతులను కల్పించడంలో కేంద్రం సహకరించాలని అభ్యర్థించినట్లు చెప్పారు. తెలంగాణలో పరిశోధనలకు ఊతమిచ్చేలా ప్రతి జిల్లాలో ఇంక్యుబేషన్‌ సెంటర్లను కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా ఆయన కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఒబామా ఆగ్రా పర్యటన రద్దుకు భద్రతే కారణమా?


obaama aagra paryatana radduku bhadrate kaaranama?

అమెరికా అధ్యక్షుడి రాకతో భారత్ అంత హడావుడి నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ఏర్పాట్లతో తెగ హైరానా పడుతున్న భారత ప్రభుత్వం ఆయన ఆగ్రా పర్యటన రద్దు తో ఒక్కసారి కంగు తింది. ఏది ఏమైనా అది భద్రత కారణాల వల్లే అని స్పష్టమైంది. కాని మన దేశం లో భద్రత విషయం లో కొంచెం భయపడాల్సిన అవసరం ఉందని అగ్ర రాజ్య నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తుంది. అందుకే ఒబామా తన భారత పర్యటన ను కుదించుకున్నట్లు తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఏ అమెరికా అధ్యక్షుడు కూడా మన దేశం లో పర్యటించటానికి వచ్చి మళ్ళి తమ ప్రణాళిక ను సవరించుకున్న దాఖాలాలు లేవు. ఇప్పుడు ఒబామా కొన్ని కారణాలతో తన ప్రణాళిక ను మార్చుకున్నాడు. ఏది ఏమైనా ఇది కొంచెం మన భారత ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ఆయన గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే. ఇప్పటివరకు మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షులు ఎవరెవరన్నది కూడా ఆసక్తికరమైన విషయమే. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 67 ఏళ్లయినా.. ఇప్పటికి ఒబామాతో కలిపి కేవలం ఆరుగురు అధ్యక్షులు మాత్రమే అమెరికా నుంచి వచ్చారు. ఎవరు కూడా ముందే నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం ఆ ప్రణాళిక ని అనుసరించిన వాళ్ళే కావటం గమనార్హం. ఇంతకుముందు 1959 సంవత్సరంలో ఐసన్ హోవర్, 1969లో రిచర్డ్ నిక్సన్, 1978లో జిమ్మీ కార్టర్, 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్, 2006లో జార్జ్ డబ్ల్యు బుష్, 2010లో బరాక్ ఒబామా మన దేశంలో పర్యటించారు. ఇప్పుడు ఒబామా.. రెండోసారి మన దేశానికి వస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఒబామా పర్యటన పట్ల భారత ప్రభుత్వం చాల శ్రద్ధ తీసుకొని కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది.

Followers