బీహార్ ముఖ్యమంత్రిగా కొలువుదీరిన నితీశ్.. ఇది నాలుగోసారి


బీహార్ రాజకీయాలకు తెరపడింది. తిరిగి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాష్ట్రానికి ఆయన సిఎం కావడం ఇది నాలుగోసారి. నితీశ్ తన మంత్రివర్గాన్ని ఒకే మారు ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు 22 మంది మంత్రులుగా కొలువుదీరారు. గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠి సిఎంతో సహా అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో 20 మంది గతంలో నితీశ్‌ కేబినెట్‌లోనూ, ఆ తరువాత మాంఝీ కేబినెట్‌లోనూ కొనసాగారు. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు వీరిలో 18 మంది నితీశ్‌కు మద్దతుగా పదవులకు రాజీనామాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులెవరూ పాల్గొనలేదు. ఆసాంతం జనతా పరివార్‌ నేతల సందడి కనిపించింది. ఈ కార్యక్రమానికి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, హెచ్‌డీ దేవెగౌడ, అఖిలేశ్‌ యాదవ్‌, అభయ్‌ చౌతాలాలతోపాటు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అసోం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌(కాంగ్రెస్‌) కార్యక్రమానికి హాజరు అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక పార్టీలు ఏకమవ్వాల్సిన అవసరముందని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను మమత, అఖిలేష్‌, గొగోయ్‌తోపాటు ఇతర నేతలు సమర్థించారు. కాగా, సీఎం నితీశ్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. నితీశ్ ప్రమాణస్వీకారోత్సవంలో మాజీ ముఖ్యమంత్రి మాంఝీ పాల్గొనడం కొసమెరుపు



ఒబామా హెలికాఫ్టర్ కాబిన్... మేడిన్ ఇండియా.. అదీ హైదరాబాద్ లో..



ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన అమెరికా అధ్యక్షుడు హెలికాప్టర్ తయారీలో ఇండియా భాగస్వామ్యం ఉంటుంది. ఆయన కూర్చునే హెలికాఫ్టర్ కాబిన్ మన ఇండియాలోనే తయారవుతుంది. అందునా మన హైదరాబాద్ లో.. ఏం నమ్మశక్యం కాలేదా... నిజమండి బాబు ఆయన ప్రయాణం చేసే హెలికాఫ్టర్ కాబిన్ ఇక్కడే తయారవుతుంది. ఎక్కడ? ఎలా? రండీ తెలుసుకుందాం.. ప్రపంచంలోని చాలా మంది వివిఐపిలు ఎస్-92 హెలికాఫ్టర్లలో ప్రయాణిస్తారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రయాణించే హెలికాప్టర్లు కూడా ఇవే. ఇవి అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడి ఉంటాయి. వీటిని సికోర్సకీ తయారు చేస్తుంది. ఆ కంపెనీ వాటిలో కాబిన్లు తయారు చేసే కాంట్రాక్టను భారత దేశానికి చెందిన ప్రిస్టేజియస్ కంపెనీ టాటాతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని టాటా కంపెనీ హైదరాబాద్ లో తయారు చేస్తోంది. అదే సమయంలో అమెరికా తమ అధ్యక్షుడి కోసం వినియోగించే హెలికాఫ్టర్లను త్వరలో మార్చనున్నది. ఆయన భద్రత కోసం 21 కొత్త హెలికాఫ్టర్లను రంగంలోకి దించనున్నది. వాటిని తయారు చేసే వేల కోట్ల కాంట్రాక్టును సికోర్సకీ కంపెనీ గతేడాదే చేజిక్కించుకుంది. ఈ అంశాన్ని ఆ కంపెనీ వ్యవహారాల అధ్యక్షుడు సమీర్ మెహతా తెలిపారు. 21 హెలికాఫ్టర్ల కేబిన్లను హైదరాబాద్ లోనే తయారు చేయనున్నారు. చివరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రయాణించే హెలికాఫ్టర్ కాబిన్ కూడా ఇక్కడే తయారు కానున్నది. బహుశా మన మోడీ చెప్పే మేక్ ఇన్ ఇండియా అంటే ఇదేనేమో

Followers