భారత్ స్టాక్ ఎక్సేంజీల గురించి మీకు తెలియని నిజాలు?


bhaarat staak eksenjila gurinchi miku teliyani

సాధారణంగా చాలా మందికి స్టాక్ మార్కెట్లపై పెద్దగా అవగాహాన ఉండదు. స్టాక్ మార్కెట్ల సూచీలు, షేర్ విలువలు గురించి తెలుసుకోవాలని ఏమంత ఆసక్తి కూడా కనబర్చరు. ప్రపంచంలో అతి పెద్ద స్టాక్ ఎక్సేంజీల్లో ఉన్న భారత స్టాక్ మార్కెట్ల గురించి పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. భారత్‌లో ఉన్న రెండు అతి పెద్ద స్టాక్ ఎక్సేంజ్‌లు ఉన్నాయి. అవి ఒకటి బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), రెండవది నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ). ఈ రెండు స్టాక్ ఎక్సేంజీల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. సాధారణంగా స్టాక్ ఎక్సేంజీల్లో ట్రేడింగ్, సూచీలు, లాభాలు, నష్టాలు ఎక్కవగా వింటూ ఉంటాం. వీటితో పాటు చాలా మందికి భారత్ స్టాక్ ఎక్సేంజ్‌ల గురించి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం. భారత్‌లో ప్రజలు వారి సొమ్ముని ఎక్కువ భాగం బ్యాంకుల్లో పొదుపు చేసేందుకే ఆసక్తిని కనబరుస్తున్నారు. కేవలం 2 శాతం మంది మాత్రమే స్టాక్ మార్కెట్లో ఈక్విటీల రూపంలో పొదుపు చేస్తున్నారు. మరికొంత మంది బంగారం కోనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రపంచంలో కెల్లా అత్యధిక కంపెనీల షేర్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ చేయబడ్డాయి. రెండింటీలో కలిసి సుమారు 9000 కంపెనీలు లిస్ట్ కాబడ్డాయి. ఎక్కువ షేర్లు కలిగిన కంపెనీగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) మొదటి స్ధానంలో ఉండగా, దేశీయంగా ఎల్ఐసీ ఎక్కువ షేర్లు కలిగిన సంస్ధగా స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ కాబడి ఉంది. మొత్తం కంపెనీల్లో సుమారు 6000 కంపెనీల షేర్లు అంతంత మాత్రంగానే ట్రేడ్ అవుతున్నాయి. ఎక్కువగా 3000 కంపెనీలకు చెందిన లిస్టెడ్ ట్రేడ్ మాత్రమే ట్రేడ్ అవుతుంటాయి. ఉత్పన్నాల మార్కెట్లో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ రెండో అతి పెద్ద వాల్యూమ్స్‌ను కలిగి ఉంది. ఇండెక్స్ ఆఫ్షన్స్‌లో రెండో స్ధానంలో ఉండగా, స్టాక్ ఇండెక్స్ ఫీచర్స్‌లో మూడో స్ధానంలో కొనసాగుతుంది. గత మూడేళ్లలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారులు పెట్టుబడులు పట్టేందుకు నెమ్మదిగా తిరిగి వస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ. 93 లక్షల కోట్లు కాగా జీడీపీలో ఇది 86 శాతానికి సమానం. సెన్సెక్స్, నిఫ్టీ విభాగాల్లో ఈ ఏడాది భారతీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్ధాయి ప్రదర్శనను కనబర్చాయి. పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో డబ్బుని పొందారు. 2011, 2012 సంవత్సరానికి గాను నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఎలక్ట్రానిక్ బుక్ ఆర్డర్ ద్వారా అత్యధిక ఈక్వీటీ షేర్లలో ట్రేడింగ్ నిర్విహించిన సంస్ధగా రికార్డు సాధించింది.

Aadhra Bank aadhaar seeding


Department of Financial Services, Ministry of Finance has issued instructions on opening of beneficiary’s Bank accounts and seeding (mapping) their Aadhaar Number for Direct Benefit Transfer (Electronic Benefit Transfer - EBT) under various Government Schemes. These benefits will directly be credited to the Bank accounts of the customers. To avail these benefits, linking of AADHAAR number to Bank account is made mandatory.

To facilitate our esteemed customers, our Bank has launched multiple channels for submission of Seeding Request.

Seeding Request will be processed by Bank subject to satisfactory verification of AADHAAR credential.

The following channels are available to submit AADHAAR seeding request :

  • Internet Banking : (Only for Retail Internet Banking Customer) :

    • Customer has to login to Internet Banking using his/her User ID and Password.
    • Click on the link in the home page “Registration of Aadhaar Number in Internet Banking “.
    • Enter and confirm the 12 digit Aadhaar number in the respective fields.
    • Select the Savings account for which Aadhaar number is to be linked.
    • To know the status about Linking and Rejection of Aadhaar number click on "Inquiry"

  • Andhra Bank ATMs :

    • Customer inserts ATM/Debit card in any Andhra Bank ATM and selects AADHAAR registration option available under Services category.
    • ATM will prompt the customer to enter AADHAAR number twice.
    • On completion, customer will receive receipt of seeding the request.

  • Using SMS :

    • This facility is enabled only for our Bank’s customers registered for mobile alerts.
    • Customer has to send an SMS to the 56161 the AADHAAR request as per below format. The syntax for sending the SMS is given below :
      • AADHAAR <space> 15 digit Bank Account Number <space> 12 digit AADHAAR Number
      • where "AADHAAR" is the keyword for sending the message.
    • Upon successful registration of AADHAAR number, customer will receive an SMS in his/her mobile inbox.
Note: On successful linking / delinking of AADHAAR number to the customer account, an SMS alert will be sent to the customer’s registered mobile number with the Bank.

సుకన్య సమృద్ధి యోజన ఖాతాని ఏయే బ్యాంకులు అందిస్తున్నాయి?


sukanya samruddhi yojana khaataani eye byaankulu

గత నెలలో బేటీ బచా వో.. బేటీ పఢావో ఉద్యమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ సుకన్య సమృద్ధి యోజనను హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆడపిల్లల పట్ల వివక్షను అంతం చేసి లింగ అసమానతలను రూపుమాపాలనే నినాదంలో ఈ పథకం ముందుకెళ్తుంది. ఆడ పిల్లలకు ప్రత్యేక ఖాతాలు తెరవడం వల్ల ఆర్థిక సాధికారత లభిస్తుందని, తద్వారా వారిని మగ పిల్లలతో సమానంగా సంరక్షించేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. 9.1 శాతం వడ్డీ లభించే ఈ ఖాతాలో జమ చేసుకున్న సొమ్ముకు ఆదాయపన్ను మినాహాయింపు కూడా ఉంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఏయే బ్యాంకుల్లో తెరవచ్చు? తపాలా కార్యాలయాల్లో కానీ, అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన ఏ శాఖలోనైనా కానీ వెయ్యి రూపాయాల కనీస డిపాజిట్‌తో పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు ఎప్పుడైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవవచ్చు. ఒక వార్షిక సంవత్సరంలో గరిష్టంగా రూ. లక్షన్నర వరకు జమ చేసుకునేందుకు వీలుంది. 
ఏయే బ్యాంకుల్లో ఈ ఖాతాలను తెరవచ్చో చూద్దాం. 
సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ వల్ల ప్రయోజనాలు: 
ఈ పథకం కింద ఆడ పిల్ల తల్లితండ్రులు తమ పదేళ్ల లోపు వయస్సు గల కుమార్తె ల పేరిట బ్యాంకు ఖాతా తెరవొచ్చు. తల్లితండ్రులు ఈ ఖాతాలో రూ.1,000 మొదలుకొని లక్షన్నర రూపాయల వరకు జమ చేయవచ్చు. ఈ ఖాతాలో జమ చేసిన డబ్బుకు ఇతర పథకాల కన్నా బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి. ఖాతా ప్రారంభించినప్పటి నుంచి 21 సంవత్సరాల నగదు వెనక్కి తీసుకునేవీలుండదు. ఒక వేళ 18 ఏళ్లు వయసొచ్చిన తర్వాత అమ్మాయి వివాహం కోసం కానీ, చదువుల కోసం కానీ జమ చేసిన మొత్తంలో 50 శాతం వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తొలి విడతలో దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో 'సుకన్య' ఖాతాలు తెరుస్తారు. ఈ వంద జిల్లాలలో హర్యానా రాష్ట్రంలోని 12 జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ పథకం కోసం కేంద్రం రూ. వంద కోట్ల మూలధనం కేటాయించింది. ఈ పథకానికి సినీ నటి మాధురి దీక్షిత్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

మొబైల్ బ్యాంకింగ్ వల్ల లాభాలు.. నష్టాలు?


mobail byaanking valla laabhaalu.. nashtaalu?


మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏ సమయంలోనైనా సురక్షితంగా బ్యాంక్ ఖాతాను నిర్వహించుకునే వెసులుబాటు. రెండేళ్ల క్రితమే మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినా, ఈ సదుపాయం వినియోగిస్తున్న వారు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. 81 కోట్ల మొబైల్‌ కనెక్షన్లు ఉన్న దేశంలో, భవిష్యత్తులో మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగదార్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగానికి ఏ విధమైన రుసుమును బ్యాంకులు వసూలు చేయడం లేదు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కటీ మన ముంగిటకే వస్తున్నాయి. అలాగే ఇప్పుడు బ్యాంక్ లావాదేవీల్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకే ఉదాహారణే ఈ మొబైల్ బ్యాంకింగ్. మనం ఎక్కడ ఉంటే అక్కడినుంచే మొబైల్ ఫోన్ ద్వారా కేవలం ఒక్క ఎస్‌ఎంఎస్ పంపిస్తే మనకు కావాల్సిన సేవలపై బ్యాంకు ఆదేశాలు ఇవ్వడమే మొబైల్ బ్యాంకింగ్. ఈ మొబైల్ బ్యాంకింగ్ వల్ల కొన్ని ప్రయోజనాలుంటే మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. 
మొబైల్ బ్యాంకింగ్ వల్ల ప్రయోజనాలు: 
 * ఎప్పుడైనా బ్యాంకింగ్: మొబైల్ బ్యాంకింగ్ సహాయంతో ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా బ్యాంకు లావాదేవీలను నిర్వహించవచ్చు. ముఖ్యంగా నాన్ బ్యాంకింగ్ అవర్స్‌లో ఇది ఎంతగానో ఉపయోగం. మీరు ఇంట్లో నుంచే మీ డెస్కటాప్, ల్యాప్ టాప్‌ల సాయంతో బ్యాంకింగ్ లావాదేవీలు చేయవచ్చు. 
 * మొబైల్ బ్యాంకింగ్ ఉచితం: మొబైల్ బ్యాంకింగ్ అనేది ఉచితం. దీనికి బ్యాంకులు ఎలాంటి రుసుము వసూలు చేయవు. దీనికల్లా మీరు చేయాల్సింది మీ మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవడమే. 
* సెక్యూర్ బ్యాంకింగ్: బ్యాంకులు మొబైల్ అప్లికేషన్‌ని ప్రారంభిస్తాయి. వాటిని మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటాం. బ్యాంకు లావాదేవీలు అన్నీ కూడా బ్యాంకు సర్వర్‌లోనే నిక్షిప్తం అవుతాయి. మీ ఫోన్ లేదా సిమ్ కార్డులో స్టోర్ అవ్వవు. మొబైల్ బ్యాంకింగ్ వల్ల నష్టాలు: 
 * స్మార్ట్ ఫోన్ లేని వారు మొబైల్ బ్యాంకింగ్ లావా దేవీలను నిర్వహించ లేరు. * మీ స్మార్ట్ ఫోన్‌లో వైరస్ ఉన్నట్లైతే మొబైల్ బ్యాంకింగ్ కన్నా, ఇంటర్నెట్ బ్యాంకింగే అత్యంత ఉత్తమం అని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు. 
* మార్కెట్లో స్మార్ట్ ఫోన్‌లకు తక్కువ యాంటీ వైరస్ సాప్ట్ వేర్లు ఉండటం మరో కారణం. మొబైల్ బ్యాంకింగ్ సేఫ్‌గా నిర్వహించాలంటే స్మార్ట్ ఫోన్‌లో యాంటీ వైరస్ తప్పనిసరి. మొబైల్ బ్యాంకింగ్‌లో పేరు ఎలా నమోదు చేసుకోవాలి: 
* మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం పొందాలనుకునే వారు ఆ సదుపాయం అందిస్తున్న ఏదైనా ఒక బ్యాంకులో ఖాతాదారులైవుండాలి. 
* దేశంలోని మొబైల్ సర్వీసులు అందిస్తున్న సంస్థల్లో ఏదో ఒక సంస్థ చందాదారులై ఉండాలి. ఆ మొబైల్ సంస్థకు, బ్యాంకుకు మధ్య మొబైల్ బ్యాంకింగ్ సేవలందించే విషయంలో భాగస్వామ్య ఒప్పందం కలిగివుండాలి. మీ మొబైల్ నెంబరును బ్యాంక్‌కు తెలియజేయాలి. 
* మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందాలనుకునే వారు సంబంధిత బ్యాంకులో నిర్దిష్ట దరఖాస్తు ఫారం పూర్తి చేయడం ద్వారా ఆ సేవలను తమకు విస్తరింపజేయాలంటూ బ్యాంకును అభ్కర్ధించాలి. ఏ ఖాతా ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుకోవాలనుకుంటున్నారో ఆ ఖాతాను మీ ఖాతా ఐడీని అనుసంధానం చేయాలి. ఒక ఖాతాదారుడు ఒకే ఐడీతో గరిష్టంగా అయిదు ఖాతాలతో అనుసంధానం కావచ్చు. 
 * సంబంధిత బ్యాంకు మీకు మొబైల్ బ్యాంకింగ్ పిన్ ఇస్తుంది. ఆ పిన్ ఆధారంగా లావాదేవీలు నిర్వహించుకోవాలి. మీకు ఇచ్చిన పిన్ నెంబరు చాలా జాగ్రత్తగా టైప్ చేయాలి. పొరపాటున తప్పుడు నెంబరు టైప్ చేయకూడదు. ఒకవేళ పొరపాటున టైప్ చేసినా మూడుసార్లు వరుసగా తప్పుడు నెంబరు టైప్ చేస్తే ఖాతా స్తంభించిపోతుంది.
 మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎలాంటి సేవలు పొందవచ్చు: 
1. ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలు 
2. గతంలో చేసిన మూడు లావాదావీల వివరాలు 
3. చెక్ బుక్ 
 4. చెక్ పేమెంట్ నిలిపివేతకు ఆదేశం జారీచేసే అవకాశంవుంది 
 5. ఫిక్స్‌డ్ డిపాజిట్ వివరాలు 
6. విద్యుత్, మొబైల్ ఫోన్, బేసిక్ ఫోన్ బిల్లుల చెల్లింపులు
 తదితర సేవలను వినియోగించుకోవచ్చు


బ్యాంకు మిత్ర ఎవరు? ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకు ఎలా సాయం చేస్తారు?


byaanku mitra evaru? pradhaanamantri jan dhan

ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్ ధన్ యోజన పథకం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'బ్యాంకు మిత్ర' పనిచేస్తున్నారు. బ్యాంకు సేవలు లేని గ్రామాల్లో బ్యాంకుల గురించి ప్రజలకు తెలియజేసే ఏజెంటే 'బ్యాంకు మిత్ర'. బ్యాంకులు, ఏటీఎమ్‌లు లేని ప్రాంతాల్లో వీరి చేస్తున్న కృషి అభినందనీయం. జన్ ధన్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను చేర్చించడంలో వీరి కృషి అమోఘం. బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు గాను ప్రజల వద్ద నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని వాటిని సరైనవిగా ధృవీకరించుకుని బ్యాంకుల్లో ఇస్తుంటారు. బ్యాంకుల్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో, అప్లికేషన్స్ ఎలా నింపాలో కస్టమర్లకు తెలియపరుస్తుంటారు. ప్రజలకు బ్యాంకు ఖాతాల్లో నగదు ఏవిధంగా డిపాజిట్ చేయాలి, ఏవిధంగా నగదు విత్ డ్రా తీసుకోవాలి లాంటి విషయాలు చెప్తుంటారు. వీటితో పాటు భారత్‌లో బ్యాంకింగ్ అనుభవం లేనటువంటి ప్రజలకు, బ్యాంకులకు మధ్య అనుసంధాన కర్తగా ఈ బ్యాంక్ మిత్ర పనిచేస్తుంటారు. బ్యాంకుకు సంబంధించిన విషయాలు, నియమాలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. 'బ్యాంకు మిత్ర' గా ఎవరు కాగలరు? బ్యాంకు లావాదేవీల గురించి తెలిసిన వారిని బ్యాంకు మిత్రగా తీసుకుంటారు. సాధారణంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగులు, చిన్న మొత్తాల పొదుపు సంస్ధలకు చెందిన ఉద్యోగులు బ్యాంకు మిత్రగా ఉండేందుకు అర్హులు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం గురించి: భారతదేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బ్యాంకింగ్ రంగం సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాని నరేంద్రమోడీ "ప్రధానమంత్రి జన్ ధన్ యోజన" (పీఎంజేడీవై) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా బ్యాంకు ఖాతా తెరవడం వల్ల రుణాలు, కాల పరిమితి డిపాజిట్ల వంటి సౌకర్యాలు పొందవచ్చు. ఈ పథకం ద్వారా కనీస మొత్తం డిపాజిట్ చేయనవసరం లేకుండానే ఖాతాలను తెరవచ్చు. ఖాతా తెరిచిన ఆరు నెలల పాటు సక్రమంగా నడిపితే బ్యాంకు ఒక వెయ్యి రూపాయల పరిమితితో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించడం తోపాటు రుణ పరిమితిని రూ. 5వేల వరకు పెంచుతారు. ఖాతాను తెరిచిన 42 రోజుల నుంచి లక్ష రూపా యల బీమా సౌకర్యం కల్పించనున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేస్తారు. తద్వారా లబ్ధిదారులకు వంటగ్యాస్, వృద్ధాప్య పింఛన్, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.

ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన: ప్రత్యేకతలు


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన 2015-16 బడ్జెట్‌లో ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని గురించి వివరించారు. అసలు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం అంటే ఏమిటీ? దీని ప్రత్యేకలు ఏంటో చూద్దాం. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం ముఖ్య ఉద్దేశ్యం జీవిత బీమా కవరేజి. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పేరిట కొత్తగా చేపడుతున్న పథకం నిరుపేదలకు కాస్త ఊరటనిస్తుంది. 
ఎవరెవరు ఈ పథకం కిందకు అర్హులు చూద్దాం. 
1. బ్యాంకు ఖాతా కలిగి ఉండి, 18-50 ఏళ్ల మధ్య వయసున్నవారు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకానికి అర్హులు. 
2. ఈ పథకంలో చేరాలనుకునే వారు 50 ఏళ్లు నిండక ముందే చేరాల్సి ఉంది. ప్రీమియం పూర్తైన తర్వాత కూడా 55 ఏళ్ల పాటు ఇందులో కొనసాగవచ్చు.
3. 18-50 ఏళ్లలోపు ఉన్న వారు 12 వాయిదాల్లో రూ. 330 ప్రీమియం చెల్లించాలి. 
4. చందాదారులు ఖాతా నుండి ప్రీమియం చెల్లింపు నేరుగా బ్యాంకు ద్వారా తీసుకోబడుతుంది. 
5. ఏదైనా ప్రమాదం వల్ల చనిపోతే, ఈ పథకం కింద రూ. 2 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నారు. 
6. ఈ పథకం కింద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ప్రతి ఏడాది దానికదే పునరుద్ధరణ, రెండోది ఎంపిక వ్యక్తిగతం. 
7. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద ఖాతాలు తెరిచిన వారికే ఈ పథకం వర్తిస్తుంది. పెన్షన్ ఫండ్‌లో పొదుపు చేసే వారికి రూ. 50 వేల వరకు రాయితీ.


Followers