చలో అసెంబ్లీకి సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీలు


chalo asembliki siddhamavutunna aandhrapradesh angan vaadilu



హైదరాబాద్:మన దేశంలో ఈ వ్యవస్థే లేకపోతే దాదాపు ఆరు కోట్ల మంది చిన్నారులు ఏమయ్యోవారో! తలచుకోవాలంటేనే భయమేస్తోంది. నిజమే. గత నలభై ఏళ్ల కాలంలో దాదాపు ఆరుకోట్ల మంది పసిపిల్లల ప్రాణాలు నిలబెట్టిన ఘనత అంగన్‌వాడీలకే దక్కుతుంది. అంతేనా దాదాపు కోటి మందికి పైగా గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీల సహకారంతో పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే గతంలో సగర్వంగా చెప్పుకుంది. మన దేశంలోని 13 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 18 లక్షలమంది వర్కర్లు, సహాయకుల అంకుఠిత సేవలే ఇందుకు కారణమనడంలో సందేహం లేదు. చిన్నారుల ఆలనా పాలనా.... ప్రతి రోజూ కొన్ని లక్షల మంది చిన్నారుల ఆలనా పాలనా చూసి, వారి మోముల్లో చిరునవ్వులు పూయిస్తున్న అంగన్‌వాడీల జీవితాల్లో మాత్రం మందహాసం కనిపించడం లేదు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లు కూడా అంగన్‌వాడీల సమస్యలను తీర్చే ప్రయత్నాలు చేయకపోవడం బాధాకరం. తెలంగాణ బడ్జెట్‌లో ఎంతోకొంత వేతనాలు పెంచిన్నప్పటికీ, కేంద్ర బడ్జెట్‌, ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లు పూర్తిగా నిరాశ పరిచాయి. 55వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు..... ఆంధ్రప్రదేశ్‌లో 55వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. కొన్ని లక్షల మంది చిన్నారులకు ఇవి అమ్మ ఒడి లాంటివి. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ సేవలు అందిస్తూ వుంటారు. గర్భిణీలకు, బాలింతలకు, ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, వైద్య ఆరోగ్య స్పృహను పెంపొందించడం, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేయడం లాంటి బాధ్యతలను నిర్వర్తించేది అంగన్‌వాడీలే. బాలింత మరణాలు, శిశు మరణాలు నివారించడంలో వీరి పాత్ర కీలకం. ప్రభుత్వ తీరు ఆందోళనకరం.... ఇలాంటి గురుతర బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్‌వాడీల విషయంలో కొంత కాలంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అంగన్‌వాడీల నిర్వహణలో రాజకీయ జోక్యమూ మితిమీరుతోందన్న విమర్శలున్నాయి. తెలంగాణలోని అంగన్‌వాడీలు ఈ నెల నుంచి 7500 రూపాయల వేతనం అందుకోబోతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో వీరు 4200 రూపాయలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రోజుకి ఏడు ఎనిమిది గంటలు శ్రమిస్తున్నవారికి ఇంత తక్కువ వేతనం ఇవ్వడం అన్యాయం కాకపోతే మరేమిటి? అందులోనూ చిన్నపిల్లలను డీల్‌ చేయడం అత్యంత ఓర్పు, సహనాలతో కూడుకున్న వ్యవహారం. వృత్తిపర ఒత్తిడి మాత్రం తీవ్రంగా.... అంగన్‌వాడీలకు ఇస్తున్నది అతి తక్కువ వేతనాలే అయినా వారి మీద వృత్తిపర ఒత్తిడి మాత్రం తీవ్రంగానే వుంటోంది. వారి చుట్టూ ఎన్నో రాజకీయాలు. నిత్యం అభద్రత. ప్రభుత్వాలు మారిన్నప్పుడల్లా చాలామంది అంగన్‌వాడీల పోస్టులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు ఎవరిని ఏ కారణంతో తీసేస్తారో అర్ధంకాని దురావస్థ. ఇక స్థానిక రాజకీయ నేతల పెత్తనం సరేసరి. అధికార పార్టీ పెట్టే ప్రతి మీటింగ్‌కీ వీరు హాజరుకావాల్సిందే. ఎవరైనా హాజరుకాకపోతే ఇక వారి మెడ మీద కత్తి వేలాడుతూనే వుంటుంది. వీటికి తోడు అధికారుల వేధింపులూ తప్పవు. ఒక్కొక్కసారి లైంగిక వేధింపులనూ భరించాల్సి వస్తోందంటే అంగన్‌వాడీలు ఎలాంటి పరిస్థితుల్లో బతకాల్సి వస్తుందో అర్ధం చేసుకోవచ్చు. గొంతెమ్మ కోర్కెలు కావు... దేశవ్యాప్తంగా వున్న 18 లక్షల మంది అంగన్‌వాడీలు గొంతెమ్మ కోరికలేవీ కోరడం లేదు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, కనీస వేతనం ఇవ్వాలనీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలనీ, రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని మాత్రమే కోరుకుంటున్నారు.



స్టాప్‌లర్‌తో కుట్లు వేసిన డాక్టర్


staaplarto kutlu vesina daaktar



ఏదైనా పెద్ద గాయమైతే డాక్టర్లు కుట్లు వేస్తారు. అయితే వరంగల్ జిల్లాలోని ఓ డాక్టర్ గాయానికి కుట్లు వేయకుండా స్టాప్‌లర్‌తో పిన్నులు వేసి పంపించాడు. దాంతో గాయం తిరగబెట్టింది. ఇలా స్టాప్‌లర్‌తో 'కుట్లు' వేసిన డాక్టర్ ఏ ఆర్.ఎం.పీ. డాక్టరో కాదు.. ఎంబీబీఎస్ వెలగబెట్టిన డాక్టరే. తొర్రూరు మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ అనే మహిళ తన భర్త కూర్మయ్యతో కలసి ద్విచక్ర వాహనం మీద వెళ్తూ వుండగా ప్రమాదానికి గురైంది. దాంతో ఆమె నుదుటి మీద గాయమైంది. ఈ భార్యాభర్తలు తొర్రూరులోని ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరకి వెళ్ళారు. ఆయనగారు గాయాన్ని తీవ్రంగా పరీక్షించి, గాయానికి స్టాప్‌లర్‌తో పిన్నులు వేయడం మొదలుపెట్టాడు. అది చూసి అదిరిపోయిన ఆమె భర్త పిన్నులు వేస్తున్నారేంటని ప్రశ్నిస్తే, ఆ డాక్టర్ ''డాక్టర్ నువ్వా నేనా?'' అని సీరియస్‌గా ప్రశ్నించడంతో ఆమె భర్త మిన్నకుండిపోయాడు. ఆ తర్వాత ఆ పిన్నుల ధాటికి గాయానికి సెప్టిక్ అయి బాధ పెరిగింది. దాంతో ఆమె వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్ళింది. అక్కడి డాక్టర్లు ఈ నిర్వాకం చూసి నోళ్ళు తెరిచారు. ఈ నిర్వాకం గురించి తెలుసుకున్న మీడియా స్టాప్‌లర్‌ డాక్టర్ దగ్గరకి వెళ్ళి ఇలా కుట్లేశారేంటి అని అడిగితే, ఇప్పటి వరకు చాలామందికి ఇలా పిన్నులు వేశాను.. ఎవరికీ ప్రాబ్లం రాలేదని చెప్పడంతో అందరూ బిత్తరపోయారు.


మలేషియా విమానం మాయమై ఏడాది



అదేమీ చిన్న వస్తువు కాదు. భారీ విమానం. సరిగ్గా సంవత్సరం క్రితం 239 మందితో ప్రయాణిస్తున్న మలేషియా విమానం మాయమై పోయింది. ప్రపం చంలోని అత్యా దునిక సాంకేతిక పరి కరాలు ఆ విమానం ఎక్కడ ఉం దన్న సం గతిని గుర్తించలేకపోయాయి. విమాన శిథిలాలు కాదుకదా, దానికి సంబంధించిన చిన్న రేకుముక్క కూడా దొరకలేదు. వరల్డ్‌ ఎయిర్‌ లైన్‌ హిస్టరీలో అత్యంత విషాదకర సంఘటనగా చరిత్రకెక్కిన దుర్ఘటనలో విమానం కూలిపోయిందని భావిస్తున్న అనుమానిత ప్రాంతాన్ని అణువణువునా శోధిస్తున్నా, సమ యం ఏడాది కావడం మినహా, ఏ ఆధారమూ లభించలేదు. ప్రయాణికుల బంధువులు మాత్రం విమానం కూలిపోయిందన్న విషయం ఆధారాలతో నిర్థారణ కాకుండా ప్రయాణికులు చని పోయారని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. విమానాన్ని హైజా క్‌ చేశారనీ, తమవాళ్లను ఎవరో కిడ్నాప్‌ చేశారని నమ్ముతున్న వారూ వున్నారు. మొత్తం 23 వేల చదరపు మైళ్లు వెతకాలని లక్ష్యంగా పెట్టుకున్న మలేషియా అధికారులు, ప్రస్తుతానికి 10 వేల మైళ్లు వెతికారు. మిగిలిన ప్రాంతాన్ని మేలోగా పూర్తి చేసి విమానాన్ని కనిపెడ తామని మాత్రం చెబుతున్నారు.

కేజీ టు పీజీని నీరుగార్చే ప్రసేక్త లేదు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కేజీ టు పీజీని నీరుగార్చే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక కేజీ టు పీజీని పటిష్టంగా అమలు పరచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నా మన్నారు. దీనికి సంబంధించి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా పాలసీని రూపొందిస్తామని చెప్పారు. శాసనసభలో శనివారం సభ్యులు కే లక్ష్మణ్‌, జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ కేజీ టు పీజీ విషయమై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘా లతో చర్చించి అమలుచేస్తామన్నారు. ఈ పాలసీని అసెంబ్లీలో సైతం చర్చకు పెడతామని చెప్పారు. నాణ్యతతో కూడిన ఉచిత విద్య అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దశలవారీగా కామన్‌ స్కూలు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వ, ప్రవేటు రంగంలో 43,861 పాఠశాలలు ఉన్నాయని, వీటిలో 59,54,376 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. కాగా మరో 46 వేల మంది పిల్లలు బడి బయట ఉన్నారన్నారు. వీరందరకూ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. అదేవిధంగా విద్యా హక్కు చట్టం విష యమై కమిటీని వేశామని, ఇది నివేదికను సమర్పించగానే దానిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలు ఉన్న చోట్ల విద్యార్థులు లేరని, విద్యా ర్థులు ఉన్న చోట సరిపడా ఉపాధ్యాయలు లేరని ఇటువంటి లోపాలను సరిచే స్తామన వెల్లడించారు. దేశానికే ఆదర్శవంతమైన విద్యా పాలసీని అందించా లన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి కడియం తెలిపారు. అలాగే పువ్వాడ అజయ్‌కుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఎమ్‌సెట్‌ ఉమ్మడిగా నిర్వహించాలనేది ఆంధ్ర ప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో లేదని తేల్చిచె ప్పారు. ఈనేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎంసెట్‌ను నిర్వహి స్తున్నామని చెప్పారు. విభజన చట్టంలోని 10వ షెడ్యూల్డ్‌లో ఉన్న సంస్థలను మాత్రమే ఉమ్మడిగా నిర్వహించుకోవాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంసె ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎంసెట్‌ నిర్వహణ, ఇంజనీరింగ్‌, మెడికల్‌ సీట్ల ఎంపికకు ఎటువంటి ఇబ్బందులు లేవని మంత్రి పేర్కొన్నారు.


నవాజ్ షరీఫ్‌కు మోడీ ఫోన్


ప్రపంచ కప్ 2015 నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం ఫోన్ చేశారు. ఆదివారం నాడు (15వ తేదీన) పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో మోడీ స్వయంగా నవాజ్ షరీఫ్‌కు ఫోన్ చేసినట్లు విదేశాంగ శాఖ అధికారి ఒకరు చెప్పారు. క్రికెట్ గురించి వారి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు చెప్పారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు ఒకరి జట్టుకు మరొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారన్నారు. 1992లో పాకిస్తాన్ కప్పు గెలవడాన్ని మోడీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు ప్రారంభించాలని షరీఫ్ కోరారు. త్వరలో జరిగే కామన్వెల్త్ దేశాల సమావేశానికి కార్యదర్శులను పంపుదామని, అక్కడ వారు తాజా పరిస్థితులను చర్చిస్తారని మోడీ చెప్పారని తెలుస్తోంది.

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ - కెటిఆర్


మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ తప్పకుండ కల్పిస్తామని ప్రకటించారు కెటిఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించామని తెలిపారు. ఉర్దూ మీడియం పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. మైనార్టీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.


Followers