మీ కంప్యూటర్ నెమ్మదించటానికి 10 కారణలు..?



mi kampyutar nemmadinchataaniki 10 kaaranalu..? కంప్యూటర్ పనితీరు నెమ్మదించటానికి కారణాలు చాలానే ఉంటాయి. ప్రధానంగా ఇతర డివైజ్‌ల ద్వారా మీ పీసీలోకి వ్యాప్తిచెందే వైరస్‌లు సిస్టంను పూర్తిగా దెబ్బతీస్తాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు అందకపోవటం కూడా పీసీ పనితీరు పై ప్రభావం చూపుతుంది. మీ కంప్యూటర్ నెమ్మదించటానికి 10 కారణలు అలానే వాటిని నివారించేందుకు పలు సూచనలను మీ ముందుంచుతున్నాం.. మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది. చిందర వందరగా డెస్క్‌టాప్ మీ పీసీ డెస్క్‌టాప్‌ను వీలైనంత వరకు క్లీన్‌గా ఉంచండి. యానిమేటెడ్ వాల్ పేపర్లు, స్ర్ర్కీన్ పేపర్లు కంప్యూటర్ వేగాన్ని పూర్తిగా తగ్గించివేస్తాయి. ఇంటర్నెట్ బ్రౌజింగ్ పూర్తి అయిన వెంటనే బ్రౌజింగ్ హిస్టరీతో పాటు కుకీలసు డిలీట్ చేయండి. మీ పీసీని ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేస్తుండాలి. పీసీ నెమ్మందిచడానికి పాత సాఫ్ట్‌వేర్‌ కూడా ఓ కారణం కావొచ్చు. అనవసర ప్రోగ్రామ్‌లను పీసీ నుంచి తొలిగించకపోవటం కూడా కంప్యూటర్ నెమ్మదించటానికి ప్రధాన ఓ కారణం. కాబట్టి, మీ పీసీలోని అనవసర ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది. పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నవీరణలు పీసీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి. సీ డ్రైవ్ అలానే ఆపరేటింగ్ సిస్టం పై ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల కంప్యూటర్ వేగం నిదానిస్తుంది. కాబట్టి ఈ రెండింటి పై ఒత్తిడి పడకుండా చూసుకోండి. పీసీలోని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. లేకుంటే పీసీ పనితీరు నిదానిస్తుంది. మీ పీసీలో తరచూ ఇంటర్నెట్ వాడుతున్నారా..? అయితే, మాల్‌వేర్స్ రోజు పెరగుతూనే ఉంటాయి. వాటిని తరచూ స్కాన్ చేస్తూ డిలీట్ చేస్తుండాలి.



మీ కంప్యూటర్ నెమ్మదించటానికి 10 కారణలు..?


మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో టెక్స్ట్ మెసేజ్‌లు డిలీట్ అయ్యాయా..?


mi aandraayid fonlo tekst mesejlu dilit


అనుకోకుండా నా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని మెసెజ్‌లన్ని డిలీల్ చేసేసాను..?, వాటిని రికవర్ చేసుకునే మార్గం ఏదైనా ఉందా..?, 99 శాతం ఖచ్చితత్త్వంతో మీ ఎస్ఎంఎస్‌లను రికవర్ చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ సమయం అనేది చాలా ముఖ్యం. డేటా రికవరింగ్ ప్రక్రియ అనేది కొద్ది పోర్షన్ మెమరీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, మీ డివైస్‌లోని ఎస్ఎంఎస్‌లు డిలీట్ అయిన వెంటనే స్పందించాల్సి ఉంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో డిలీట్ అయిన టెక్స్ట్ సందేశాలను రికవర్ చేసుకునే మార్గాలను మీ ముందుంచుతున్నాం... మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని డిలీట్ అయిన టెక్స్ట్ సందేశాలను రికవర్ చేసుకునేందుకు అనేక పీసీ ఆధారిత టూల్స్ అందుబాటులో ఉన్నాయి.వాటిలో ఎక్కువగా వాడుతున్నవి...Coolmuster Android SMS+Contacts Recovery, Android Data Recovery ముందుగా మీరు ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పీసీలో ఇన్‌స్టాల్ చేయండి. ఆ తరువాత యూఎస్బీ కేబుల్ సహాయంతో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను డేటా రికవరీ ప్రోగ్రామ్ ఇన్‌స్టాల్ చేయబడిన పీసీకి కనెక్ట్ చేయండి. ఆ తరువాత ప్రోగ్రామ్ లోని నిబంధనలను అనుసరిస్తూ డేటా రికవరీకి ఉపక్రమించండి. రికవర్ అయిన డేటాను ముందగా పీసీలో సేవ్ చేసుకుని ఆ తరువాత ఫోన్ లోకి బదిలీ చేసుకోండి.



మీ వాట్సాప్ అకౌంట్‌లోని వీడియోలను దాచేయాలంటే..?


mi vaatsaap akountloni vidiyolanu daacheyaalante..?


మీ వాట్సాప్ అకౌంట్ గ్యాలరీలోని ఫోటోలు ఇంకా వీడియోలను ఎవరికి కనిపించకుండా దాచేయలనుకుంటున్నారా..? యాప్ లాక్ పేరుతో ఓ అప్లికేషన్ అందుబాటులో ఉన్నప్పటికి ఫోటోలు ఇంకా వీడియోలు గ్యాలరీలో కనిపిస్తూనే ఉంటాయి. గ్యాలరీని మొత్తం లాక్ చేసేందుకు గ్యాలరీ లాక్ అందుబాటులో ఉన్నప్పటికి అంతగా శేయస్కరం కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి..? మీ వాట్సాప్ అకౌంట్ గ్యాలరీని లాక్ చేయటం కన్నా హైడ్ చేయటం ద్వారా ఎక్కువ సెక్యూరిటీని పొందవచ్చు. మరో ఆసక్తికర విషయమేమింటే మీ వాట్స్‌వాప్ గ్యాలరీని హైడ్ చేసేందుకు ఏ విధమైన థర్డ్ పార్టీ యాప్ సహకారం అవసరం లేదు. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి వాట్సాప్ డైరక్టరీని మీ ఫోన్ ఎస్‌డీ కార్డ్‌లోకి యాక్సెస్ చేసుకునేందుకు ఓ ఫైల్ మేనేజర్ యాప్ అవసరమవుతుంది. మీ ఫోన్‌లో ఏ విధమైన ఫైల్ మేనేజర్ యాప్ ఇన్‌స్టాల్ చేసి లేనట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ES File Exploreను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ES File Explore యాప్‌ను ఓపెన్ చేయండి. ఆ తరువాత వాట్సాప్ మీడియా ఫోల్డర్‌కు నావిగేట్ అవ్వండి. Home > sdcard > WhatsApp > Media. మీడియా ఫోల్డర్ క్రింద 'WhatsApp Images' పేరుతో సబ్ ఫోల్డర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫోల్డర్ పేరను '.WhatsApp Images'గా మార్చండి. ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ఎదైనా ఫోల్డర్‌కు రీనేమ్ చేయాలంటే ఆ ఫోల్డర్ పై లాంగ్ ప్రెస్ చేసినట్లయితే రీనేమ్ ఆప్షన్ స్ర్కీన్ క్రింది భాగంలో ప్రతక్షమవుతుంది. రీనేమ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మీరు వాట్సాప్ గ్యాలరీలోకి వెళ్లండి. ఏ విధమైన వాట్సాప్ ఫోటోలుగానీ, వీడియోలు గానీ మీకు కనిపించవు. హైడ్ కాబడిన ఫోటోలు ఇంకా వీడియోలు తిరిగి కనిపించాలంటే '.WhatsApp Images' ఫోల్డర్ పేరులోని ( . ) తొలగించినట్లయితే వీడియోలు, ఫోటోలు తిరిగి వాటి స్థానాల్లోకి వచ్చేస్తాయి. ఈ సింపుల్ ట్రిక్‌ను ప్రదర్శించటం ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ల‌లోని గ్యాలరీలను ఎవరికంటా పడకుండా భద్రంగా హైడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకోవటం ఏలా..?


ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు మన మిత్రులు అలానే శ్రేయోభిలాషులకు సోషల్ మీడయా నెట్‌వర్క్స్ అలానే మొబైల్ టెక్స్ట్ మెసెజ్‌ల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతుంటాం. ఒక్క పండుగ సమయాల్లో మాత్రమే కాదు గ్రూప్ కార్యక్రమాలు, పార్టీలు, హాలిడే మీటింగ్‌లు ఇలా అనేక కార్యక్రమాలను పురస్కరించుకుని బల్క్ ఎస్ఎంఎస్ ఆప్షన్‌లను వినియోగించుకుంటుంటాం. అయితే, ఇటీవల కాలంలో ప్రభుత్వం విధిస్తోన్న తాత్కాలిక ఆంక్షలు కారణంగా అన్ని వేళల్లో బల్క్ ఎస్ఎంఎస్‌లు సాధ్యం కావటం లేదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇన్‌స్టెంట్ మొబైల్ మెసేజిగంగ్ యాప్ వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను షేర్ చేసుకునేందుకు పలు తీరదైన దారులను ఇప్పుడు చూద్దాం.... మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా 25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను పంపుకునే వీలుంది. అయితే మీ విలువైన సమయాన్ని కాస్తంత వెచ్చించి కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి ఎస్ఎంఎస్‌ను షేర్ చేయవచ్చు. ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌లోని యాక్టివ్ చాట్స్ పేజీని ఓపెన్ చేయండి. ఆ తరువాత మెనూ సాఫ్ట్ 'కీ'ని ప్రెస్ చేసి More option పై ట్యాప్ చేయండి. మోర్ ఆప్షన్ మెనూలోని Broadcast messageను సెలక్ట్ చేసుకోండి.తదుపరి చర్యలో భాగంగా మీరు ఎస్ఎంఎస్ పంపాలనకుంటున్న మిత్రల కాంటాక్ట్‌లను టిక్ మార్క్ చేయండి. ఇప్పుడు Broadcast message బాక్సులో ఎస్ఎంఎస్‌ను టైప్ చేసి సెండ్ బటన్ పై ప్రెస్ చేయండి. అవసరమనుకుంటే తరువాతి బ్యాచ్‌కు ఆ ఎస్ఎంఎస్‌ను పంపేందుకు కాపీ చేసుకోండి. వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకునే Broadcast message ఫీచర్ అన్ని ఫ్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చూడండి మరి.

Followers