Showing posts with label SI. Show all posts
Showing posts with label SI. Show all posts

సాధన చేస్తే ఎస్‌.ఐ. మీరే!

SI, Notification, Jobs,  si notification telangana 2015  si notification 2016 in ap  si notification 2016  up si notification  si notification in ap 2016 communication si notification 2016  ssc si notification 2016  ap police communication si notification

సాధన చేస్తే ఎస్‌.ఐ. మీరే!

ఎస్‌.ఐ. పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి చేసిన ప్రకటన ఆశావహుల్లో ఉత్సాహం నింపింది. డిగ్రీ అర్హత ఉన్నవారు శారీరక సామర్థ్య, రాత పరీక్షల్లో తగిన ప్రణాళికతో కృషిచేస్తే కచ్చితంగా విజయం సాధించవచ్చు! పో లీస్‌, స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌, తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ విభాగంలో ఎస్‌.ఐ., రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టుల నియామకం చేయనున్నారు. డిగ్రీ అర్హత అయినప్పటికీ ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైతే సరిపోతుంది.
సివిల్‌, ఏఆర్‌ విభాగాలకు మహిళలూ, పురుషులూ దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. మార్చి 3 వతేదీలోపు అభ్యర్థులు దరఖాస్తులు పంపుకోవాలి. ప్రాథమిక రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, తుది రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రెండు రాతపరీక్షల్లో దాదాపు ఒకే సిలబస్‌ ఉంది. కానీ తుది పరీక్షలో ప్రశ్నల తీరు లోతుగా ఉండే అవకాశం ఉంది. మొదటిసారిగా ఈ నియామకాల్లో సివిల్‌ విభాగంలో, ఏఆర్‌ విభాగంలో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించారు. అభ్యర్థులు మూడు దశల్లో ప్రతిభ చూపటం ద్వారా ఉద్యోగం సాధించవచ్చు. మొదటి దశ: ప్రాథమిక రాతపరీక్ష (200 ప్రశ్నలు, ఆబ్జెక్టివ్‌ పద్ధతి) ఎ) అరిథ్‌మెటిక్‌, టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ (100 మార్కులు) బి) జనరల్‌ స్టడీస్‌ (100 మార్కులు)
రెండో దశ: శారీరక సామర్థ్య పరీక్ష మూడో దశ: తుది రాత పరీక్ష పేపర్‌ 1- అరిథ్‌మెటిక్‌, టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ (200 మార్కులు) పేపర్‌ 2- జనరల్‌ స్టడీస్‌ (200 మార్కులు) పేపర్‌ 3- ఇంగ్లిష్‌ (డిస్క్రిప్టివ్‌) (100 మార్కులు) పేపర్‌ 4- తెలుగు/ఉర్దూ భాషా పరిజ్ఞానం (డిస్క్రిప్టివ్‌) (100 మార్కులు) పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 17, 2106. www.tslprb.in అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ అరిథ్‌మెటిక్‌లోని వివిధ అంశాలను విస్తృతంగా సాధన చేయాలి. 6,7,8,9 తరగతుల్లోని గణిత పుస్తకాలను బాగా అభ్యాసం చేయాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌, క్వికర్‌ మ్యాథ్స్‌, టాటా మెక్‌గ్రాహిల్‌ పుస్తకాలు ఉపయోగపడతాయి. ఆర్‌ఆర్‌బీ, ఐసెట్‌, ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో గతంలో అడిగిన ప్రశ్నలను సాధన చేస్తే చాలా ప్రయోజనకరం. కొత్త అభ్యర్థులకు రీజనింగ్‌ పరిచయం లేనిది. వారు చదివిన తరగతుల్లో ఎక్కడా ఉండదు. కాబట్టి దీనిపై శ్రద్ధపెడితే మార్కులు తెచ్చుకోవచ్చు. వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌ అంశాలను బాగా నేర్చుకోవాలి. ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌, టాటా మెక్‌గ్రాహిల్‌ రీజనింగ్‌ పుస్తకాలు చదివితే సరిపోతుంది.
భౌగోళిక వ్యవస్థకు సంబంధించి దేశ, రాష్ట్ర అంశాలను పట్టిక రూపంలో చదివితే బాగా అర్థమవుతాయి. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులూ, రాజ్యాంగ సవరణల దగ్గర్నుంచి కీలక అంశాలన్నీ ముఖ్యమే. 8 నుంచి ఇంటర్‌ వరకూ సివిక్స్‌, తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగపడతాయి.
జనరల్‌స్టడీస్‌ ఇందులో ఎక్కువ సిలబస్‌ ఉండటంతో పాటు కొత్త అంశాలను చేర్చారు. స్టాండర్డ్‌ జీకేలో జాతీయ అంతర్జాతీయ సదస్సులు, అవార్డులు, బహుమతులు, క్రీడలు, విజేతలు, వార్తల్లోని వ్యక్తులు మొదలైనవి ప్రశ్నలుగా వస్తాయి. తీవ్రవాద సంస్థలు, కేంద్ర రాష్టాల సామాజికాభివృద్ధి కార్యక్రమాలు, ప్రధాన ఉద్యమాలు, పురాతన కట్టడాలు మొదలైనవీ చదవాలి. ప్రాచీన, మధ్యయుగ చరిత్ర, ఇంకా ఆధునిక భారతదేశ చరిత్రలో జాతీయోద్యమం ముఖ్యం. భౌగోళిక వ్యవస్థకు సంబంధించి దేశ, రాష్ట్ర అంశాలను పట్టిక రూపంలో చదివితే బాగా అర్థమవుతాయి. 6 నుంచి 10 తరగతుల జాగ్రఫీ పాఠ్యాంశాలు బాగా చదవాలి. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులూ, రాజ్యాంగ సవరణల దగ్గర్నుంచి కీలక అంశాలన్నీ ముఖ్యమే. 8 నుంచి ఇంటర్‌ వరకూ సివిక్స్‌, తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగపడతాయి. జనరల్‌ సైన్స్‌లో మానవ నిర్మాణం, వ్యాధులు, శాస్త్ర సాంకేతిక ఆధునిక అంశాలు ప్రధానమైనవి. తుది పరీక్ష రెండో పేపర్‌ అయిన జనరల్‌స్టడీస్‌లో వ్యక్తిత్వ వికాస పరీక్ష భాగంగా ఉంది. దీనిలో నైతిక విలువలు, లింగ వివక్ష, బలహీనవర్గాల స్థితిగతులు, సామాజిక చైతన్యం, మనో వికాసం లాంటి అంశాలున్నాయి. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ- తెలంగాణ వాదం (1948-1970), సమీకరణ దశ (1971-1990), తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా (1991-2014) ఈ పేపర్లో ప్రత్యేక భాగంగా ఉంది. హైదరాబాద్‌ సంస్థానంలో తెలంగాణ విలక్షణ సంస్కృతి, భౌగోళిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక పార్శా్వలపై అవగాహన పెంచుకోవాలి. పేపర్‌-3, పేపర్‌-4: ఇంగ్లిష్‌, తెలుగు/ఉర్దూ అభ్యర్థికి ఉన్న కనీసం భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించటం ఈ పేపర్ల లక్ష్యం. రెండూ వ్యాసరూప (డిస్క్రిప్టివ్‌) పేపర్లే. పేపర్‌-3లో అభ్యర్థి ఆంగ్ల భాషా సామర్థ్యాలను పరీక్షిస్తారు. దీనిలో చిన్న వ్యాసాలు, లేఖ, ఆంగ్లం నుంచి తెలుగు అనువాదం వంటి ప్రశ్నలుంటాయి. దీనిలో ప్రతి అంశాన్నీ తప్పకుండా రాయటం మేలు. లేఖా రచనలో పేరు, తేదీ, స్థలం అంశాలు మర్చిపోకుండా రాయాలి. జనరల్‌ ఎస్సే కోసం పోలీసు విభాగానికి సంబంధం ఉండే అంశాలు, ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యల సమాచారం సేకరించి సాధన చేయాలి. పేపర్‌-4లో తెలుగు భాషను సరిగా ఉపయోగించటం, లేఖనంలో ప్రతిభను ఇందులో పరీక్షిస్తారు. చిన్న వ్యాసం, లేఖా రచన, పేరాగ్రాఫ్‌, తెలుగు నుంచి ఆంగ్లానికి అనువాదం మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి.
అ భ్యర్థులు దరఖాస్తు చేసిన తేదీ నుంచి ఉదయం, సాయంత్రం వివిధ ఇవెంట్ల సాధనకు కొంత సమయం కేటాయించాలి. అభ్యర్థులు స్పోర్ట్స్‌ షూ ధరించి సాధన చేస్తే సౌకర్యంగా ఉంటుంది. నిర్ణీత సమయాన్ని ముందుగానే నిర్ణయించుకోకుండా వారం రోజులపాటు 15 నిమిషాలు, తర్వాత వారం రోజులు 20 నిమిషాలు, ఆపై వారం 20-30 నిమిషాలు ఆగకుండా పరుగెత్తాలి. ఇలా చేస్తే శ్వాసపై నియంత్రణ పెరుగుతుంది. ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టులో పురుష అభ్యర్థులకు 100 మీ. పరుగు, హై జంప్‌, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌, 800 మీ. పరుగు; మహిళా అభ్యర్థులకు 100 మీ. పరుగు, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌ విభాగాలుంటాయి. కాబట్టి నిర్ణీత దూరాలను కేటాయించిన సమయాల్లో పూర్తిచేయాలి. ఇందులో ప్రతిభ కనబరిచినవారి మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. సాధనలో భాగంగా పరుగుపందెం మొదలుపెట్టేముందు వార్మప్‌ 15 నిమిషాలు చేయాలి. వార్మప్‌ చేసిన తర్వాతే పరుగు ప్రారంభించాలనేది తప్పనిసరిగా పాటించాలి. పందెం ముగిశాక 10-15 నిమిషాలు స్ట్రెంత్‌ ఎక్సర్‌సైజులు (పుషప్‌లు, సిటప్‌లు, స్కిపింగ్‌...) చేయాలి. ఇంకా జంపింగ్‌ లాంటి వ్యాయామాలు చేయాలి.
ఈ వ్యాయామాలు చేయటం వల్ల కండరాల సామర్థ్యం పెరగడం, ఎముకల పటుత్వం సాధ్యమై ఇవెంట్సులో సమర్థంగా పాల్గొనగలుగుతారు. ఈ ఎక్సర్‌సైజులు ముగిశాక 10-15 నిమిషాలు స్ట్రెచింగ్‌ కసరత్తులను భాగంగా చేసుకోవచ్చు. ఈ సాధన సమయంలో సరైన పౌష్టికాహారం, గుడ్లు, పాలు, పండ్ల రసాలు తప్పకుండా తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. పురుష అభ్యర్థులు లాంగ్‌, హైజంప్‌ ఇవెంట్లలో సపోర్టర్స్‌ వంటివి వాడటం మంచిది. పరుగును మట్టిరోడ్డుపై లేదా గ్రౌండులోప్రాక్టీసు చేయడం ఉత్తమం.
పరుగు సమయంలో చేతులూ కాళ్ళూ బిగించరాదు. పరుగెత్తేటపుడు నోటిలో గుడ్డలూ, నిమ్మకాయలూ లాంటివి పెట్టుకోవడం సరి కాదు. మద్యపానం, ధూమపానం లాంటివాటికి దూరంగా ఉండాలి. తారురోడ్డుపై పరుగు సాధన చేయకూడదు.

Followers