విద్యుత్ నిరోధానికి ప్రమాణం



http://cdn.newshunt.com/fetchdata2/20140215/namasthe/CurrentAffairs/images/350x350_IMAGE27158863.png

టాన్స్ ఫార్మర్ ద్వారా AC కరెంట్‌ని ప్రసారం చేసినట్టయితే ఆ ప్రసార నష్టం తక్కువగా ఉంటుంది. కానీ DC కరెంట్‌ను ప్రసారం చేసినట్టయితే ప్రసార నష్టం ఎక్కువగా ఉంటుంది. ఓమ్ : రాబర్ట్ సైమన్ ఓమ్‌ను ప్రవేశపేట్టాడు. -స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఒక తీగ ద్వారా ప్రవహిస్తున్న విద్యుత్ దానిలోని ప్రొటెన్షియల్ తేడాకు అనుపాతంలో ఉంటుంది iav i = I/RXV i = V/R లేదా i = IR లేదా i = V/R ఈ సమీకరణంలో R = విద్యుత్ నిరోధం విద్యుత్ నిరోధం : -ఏదైనా ఒక వలయం గుండా లేదా తీగగుండా విద్యుత్ ప్రవహిస్తున్నా ఆ ప్రవాహాన్ని అడ్డగించి లేదా వ్యతిరేకించే ధర్మమే విద్యుత్ నిరోధం -విద్యుత్ నిరోధానికి ప్రమాణం ఓమ్ విద్యుచ్చాలక బలం : -ఎలక్ట్రానులను అధిక పొటెన్షియల్ గల బిందువు వైపునకు తరలించడానికి విద్యుత్‌ఘటం చేసే పనిని విద్యుచ్చాలక బలం(e.m.f) అంటారు. -దీనికి ప్రమాణం వోల్టు -విద్యుచ్చాలక బలం అందించు సాధనాలను విద్యుచ్చాలక పీటాలు అంటారు. ఉదా : విద్యుత్ జనరేటర్, సైకిల్ డైనమో. విశిష్ట నిరోధం : -వాహక ప్రమాణ పొడవుపై ఉండే నిరోధాన్ని విశిష్ట నిరోధం అంటారు. -విశిష్ట నిరోధానికి ప్రమాణం- వోమ్ మీటర్ రియోస్టాట్ : ప్రయోగశాలలో విద్యుత్ వలయాల్లోని విద్యుత్ ప్రవాహాన్ని తగ్గించడానికి/పెంచడానికి ఉపయోగించే పరికరాన్ని రియోస్టాట్ అంటారు. అతివాహకత్వం : -ఉష్ణోగ్రతను తగ్గిస్తూపోతే కొన్ని పదార్థాల నిరోధకత ఒకానొక ఉష్ణోగ్రత వద్ద ఒక్కసారిగా శూన్యమవుతుంది. ఆ ఉష్ణోగ్రతను సందిగ్ధ ఉష్ణోగ్రత అంటారు. ఆ స్థితిలో పదార్థాన్ని అతివాహకం(Super conductor) అంటారు. -పాదరసం అతివాహక ఉష్ణోగ్రత 4.2 కెల్విన్లు -అతివాహకత్వంను కనుగొన్న శాస్త్రవేత్త కామన్ లింక్స్ ఓమ్. విద్యుత్ ప్రవాహంపై ఉష్ణోగ్రత ప్రవాహం : -ఉష్ణోగ్రతను పెంచినట్లయితే వాహకాల నిరోధం పెరిగి వాటి ద్వారా ప్రవహించే విద్యుత్ తగ్గిపోతుంది. ట్రాన్స్‌ఫార్మర్ : తక్కువ వోల్టేజి నుంచి ఎక్కువ వోలేజికి లేదా ఎక్కువ ఓల్టేజి నుంచి తుక్కువ ఓల్టేజికి విద్యుత్ సరఫరా చేయడానికి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఉపయోగిస్తారు. ఇది పరస్పర ప్రేరణ లేదా అనూహ్య ప్రేరణ అను సూత్రం ఆధారంగా అనిచేస్తుంది. -ఈ సూత్రాన్ని లెంజ్ ప్రతిపాదించాడు. -ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మొదటి ట్రాన్స్‌ఫార్మర్‌ను మైఖేల్ ఫారడే నిర్మించాడు. -సాధారణంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను సులభంగా అయస్కాంతీకరణం చెందే సాఫ్ట్ ఐరన్‌తో నిర్మిస్తారు. సోలినాయిడ్ : ఒక పొడవైన విద్యుద్బంధకపు స్థూపాకార గొట్టాన్ని తీసుకొని దాని చుట్టూ విద్యుద్బంధకపు పూతగల రాగి తీగను ఖాళీ లేకుండా దగ్గరగా చుట్టినట్లయితే దానిని సోలినాయిడ్ అంటారు. దాని గుండా విద్యుత్ ప్రవహింపజేస్తే దండయస్కాంతం వలె అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. విద్యుత్ విశ్లేషనం : విద్యుత్‌ను ఉపయోగించి, సమ్మేళనాలను రసాయనికంగా విభజించి, వాటి మూలకాలుగా మార్చే ప్రక్రియను విద్యుత్ విశ్లేషనం అంటారు. విద్యత్ విశ్లేషనం ఉపయోగాలు : ఎలక్ట్రో ప్లేటింగ్ : ఇనుము తుప్పు పట్టకుండా నిరోధించడానికి, దానిపై నికెల్ లేదా క్రోమియం పూతను విద్యుద్విశ్లేషణం ద్వారా ఏర్పడేటట్లు చేస్తారు. గిల్టినగల తయారీ : తక్కువ ఖరీదుగల ఇత్తడి వంటి లోహంతో నగలు తయారుచేసి దానిపై విద్యుద్విశ్లేషణం ద్వారా బంగారు పూత పూస్తారు. లోహ సంగ్రహణం : విద్యుద్విశ్లేషణం ద్వారా లోహ ఖనిజాల నుంచి పరిశుభ్రమైన లోహాలను పొందవచ్చు. -విద్యుద్విశ్లేషణం ఉపయోగించి ఎలక్ట్రిక్ ప్రింటింగ్, గ్రామ్‌ఫోన్ రికార్డులు తయారు చేస్తారు. ఫ్యూజ్ : ఇది టిన్‌నొడ్ మిశ్రమంతో చేసిన తక్కువ ద్రవీభవన స్థానం గల వైరు ముక్క బల్బు : -విద్యుత్ బల్బును థామస్ ఆల్ఫా ఎడిసిన్ కనుగొన్నాడు. -విద్యుత్ బల్బులో వేడెక్కే భాగం ఫిలమెంట్ -ఫిలమెంట్‌ను సాధారణంగా టంగ్‌స్టన్‌తో తయారు చేస్తారు. -బల్బుల్లో ఆర్గాన్, నియాన్ వంటి జడవాయువులతో నింపుతారు.

Followers