సిల్వర్‌ వాటర్‌ అని దేనిని అంటారు?


జ్వరాన్ని చూసే థర్మా మీటర్‌ పగిలి పోయినప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చిన మెరిసే పదార్ధాన్ని గమనించారా? ఆ పదార్ధమే మెర్క్యూరీ. ఇది పట్టుకోవటానికి దొరకదు. జారి పోతుంది. దీన్నే పాదరసం అని అంటారు. ఇది ద్రవ రూపంలో ఉండే ఒక లోహం. ఇది అద్భుతంగా మెరుస్తుంది. డియోస్కొరైడ్స్‌ అనే శాస్త్రవేత్త హైడ్రార్జియం అనే సాంకేతిక నామాన్ని ఈ లోహానికి పెట్టాడు. అంటే లాటిన్‌ భాషలో సిల్వర్‌ వాటర్‌ (వెండి నీరు) అని అర్ధం. దీని రసాయన సంకేతం హెచ్‌.జి. అని గుర్తిస్తారు. ఈ లోహానికి మెర్క్యూరీ అనే పేరును రోమ్‌ పౌరులు పెట్టారు. ఈ లోహం నున్నటి నేలపై పడినప్పుడు దాన్ని చురుకైన కదలికలు తెలివికి, చురుకుతనానికి నిదర్శనంగా భావించే వారి దేవుడు మెర్క్యూరీని గుర్తుకు తెచ్చేవి. దాంతో ఈ లోహానికి మెర్క్యూరీ అని పేరు పెట్టడమే సరి అయినదని వారు భావించారు.

Followers