కాకతీయులు - పరిపాలనాంశాలు Telangana History


కాకతీయులు సంప్రదాయ రాజరికం అమలు చేశారు. సంప్రదాయ పద్ధతిలో అంటే తండ్రి నుంచి కుమారునికి వారసత్వంగా రాజ్యం సంక్రమిస్తుంది. రాజులకు ప్రజా శ్రేయస్సు, ప్రజలకు రాజులయెడల అనురక్తి, కలిగించేటట్లు ఎలా పరిపాలన చేయాలో, కాకతీయుల నుంచే కన్పిస్తుంది.


ఏ రాజులైనా నేర్చుకోవాల్సిన అంశాలు?


-ముఖ్యంగా కాకతీయులు ప్రజల్లో జాతీయభావం, సమైక్య దృష్టి, దేశాభిమానం, పెంపొందించాల్సిన అవసరం ఉందని గ్రహించిన తొలి రాజులు. కాకతీయ సామ్రాజ్యాన్ని అనన్య సామాన్యంగా తీర్చిదిద్ది, అనితర సాధ్యమైన రీతిలో పాలించారు.

పాలనలో గమనించాల్సిన విషయాలు


-రాజ ముద్ర: వరాహ లాంఛనం- వరాహాన్ని కాకతీయులు తమ రాజముద్రగా ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం?

-హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రంలో పడవేసినప్పుడు విష్ణువు వరాహావతారం ఎత్తి భూమిని రక్షించాడు. అలాగే భూమిని రక్షించాలనే ఉద్దేశంతో కాకతీయులు వరాహాన్ని రాజలాంఛనంగా చేసుకున్నారు.

-గరుడ ధ్వజం: అంటే వారి జెండా మీద గరుడ పక్షి బొమ్మ ఉండేది. (గరుడ ఎంత ఎత్తులో వెళ్తున్నా భూమిపై ఉన్న చిన్న సూదిని కూడా గుర్తించగలిగే శక్తి గరుడ పక్షికి ఉంది. ప్రజల సమస్యలేంటో తెలుసుకొని పరిపాలించే శక్తి ఒక్క కాకతీయులకే సాధ్యం)

-విశాల ప్రపంచంలో అనంత కాలగమనంలో జన్మించిన కోట్లాది స్త్రీలల్లో అఖండ మణిద్వీపం రుద్రాంబ (రుద్రమదేవి మహారాజు, మొట్టమొదటి హిందూ సామ్రాజ్ఞి)ను అందించిన ఘనత కాకతీయలదే.

-(హిందూ రాజవంశాలలో స్త్రీని సింహాసనం ఎక్కించిన అపూర్వ గౌరవం కాకతీయులది).

-ప్రథమంగా ఒక వేదికపై రెండు సింహాసనాలు వేసుకొని పాలించడం, దత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి కూడా కాకతీయ వంశంలోనే జరిగింది.

-మంత్రిమండలి: రాజ్యక్షేమం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేయడం, రాజుకు సహకరించేందుకు మంత్రి పరిషత్తు ఉండేది.

-భట్టారక నియోగాధిపతి: సమర్థ్దులైన మంత్రుల ఎంపికలో కీలకపాత్ర పోషించేదిగా శ్రీనీలకంఠశాస్త్రి, పరబ్రహ్మశాస్త్రి, గులాం యాజ్దానీ, సోమశేఖర శర్మ, సింథియా తాల్‌బోట్ (అమెరికా) మొదలైన వారు కాకతీయుల పాలనపై స్పష్టమైన అభిప్రాయాలు తెలిపారు.
రాజరిక సిద్ధాంతం: కాకతీయుల కాలంలో రాజు దైవాంశ సంభూతుడు. రాజుకు అసమానమైన అధికారాలు ఉండేవి.

-హిందూ ధర్మశాస్ర్తాలను అనుసరించి రాజనీతి జరిగింది. యాజ్ఞవల్కుని న్యాయస్మృతిని కేతన, విజ్ఞానేశ్వరీయం పేరుతో తెలుగులో అనువదించాడు.(విజ్ఞానేశ్వరుడు మితాక్షరి పేరుతోయాజ్ఞవల్కస్మృతికి వ్యాఖ్యానం రచించెను. దానిని తెలుగులో కేతన అనువదించెను. ఇది తెలుగులో వచ్చిన తొలి న్యాయశాస్త్రం. శిక్షాస్మృతి, ఇది భారతదేశంలో మనుస్మృతి, యజ్ఞవల్కస్మృతి, పరాశస్మృతి, నారదస్మృతి మొదలైనవి. లీగల్ గ్రంథాలు, శిక్షాస్మృతులు రచించిరి. తెలుగులో తొలిసారిగా కేతన కాకతీయుల కాలంలో రచించడం గర్వకారణం)

-రాజనీతిపై కాకతీయుల కాలంలో స్వయంగా ప్రతాపరుద్రుడు -1 నీతిసారం రచించెను. ఇంకనూ బద్దెన (సుమతిశతకం) నీతిశాస్త్రముక్తావళి, మడికి సింగన సకలనీతి సమ్మతం మొదలైనవి రచించెను.


కాకతీయుల రాజ్య విభజన

రాజ్య విభజన: కాకతీయులు పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని కొన్ని నాడులుగా విభజించారు. నాడులను తిరిగి స్థలాలుగా విభజించారు. స్థలాలను తిరిగి గ్రామాలుగా విభజించారు. ఒక స్థలంలో 10 నుంచి 60 గ్రామాలు ఉంటాయి. వాడి భూమి, సీమ అనే పదాలు నాడు అనే పదానికి సమానార్థాకాలు. పన్నిద్దరు ఆయంగార్లు అని అంటారు. (ఆయం అనగా పొలం. గ్రామంలో కొంత పొలం(ఆయం) వీరికి ఇవ్వబడుతుంది. వీరికి జీతాలుండవు. రాజు ఈ విధంగా ఇచ్చిన దానిపై (ఆయం) పన్ను కట్టనవసరం లేదు. అంతేకాకుండా గ్రామంలో పండిన పంటలో కొంతభాగం ఆయంగార్లకు ఇస్తారు)

-1. కరణం 2. రెడ్డి 3. తలారి 4. పురోహితుడు 5. కమ్మరి 6. కంసాలి 7. వడ్రంగి 8. కుమ్మరి 9. చాకలి 10. మంగలి 11. శెట్టి 12. చర్మకారుడు

-పై వారందరూ పన్ను మినహాయింపు పొందిన పొలం కల్గియున్నారు. కాబట్టి ఆయంగార్లుగా పిలవబడ్డారు.

నాయంకర విధానం 


-కాకతీయుల పరిపాలన ముఖ్యంగా జాగీర్దారీ లేదా భూస్వామ్య వ్యవస్థ (ప్యూడలిజం)పై ఆధారపడి ఉంది. వీరు ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని నాయంకర విధానం అని అంటారు. రాజ్యాన్ని అనేక రాష్ర్టాలుగా విభజించి వాటికి పరిపాలనాధిపతులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. వీరిని నాయంకరులు అని అంటారు. వీరు ఎక్కువగా వెలమ, రెడ్డి, బ్రాహ్మణ కులాలకు చెం దినవారే.

-ఈ నాయంకరులు చక్రవర్తి (రాజు) నుంచి భూములను పొంది వాటి నుంచి వచ్చే ఆదాయంతో చతురంగ బలాలను పొషించి, యుద్ధసమయాల్లో చక్రవర్తికి తోడ్పడేవారు. సాధారణంగా రాజ్యంలోని దాదాపు నాల్గోవంతు భూమి ఈ నాయంకరుల ఆధీనంలో ఉం డేది. కాకతీయులు ప్రవేశపెట్టిన ఈ నాయంకర విధానం తర్వాత విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి చెంది ఆంగ్లేయ రాజ్య నిర్మాణం వరకు అవిచ్ఛిన్నంగా వర్ధిల్లింది.


పరిశ్రమలు


-పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో 20కి మించి వస్ర్తాలను గురించి పేర్కొన్నాడు. ఓరుగల్లులో చిత్తరువులు రాసే 1500 ఇండ్లు ఉన్నాయని. ఏకామ్రనాథుడు రాశాడు. పాల్కురికి బసవపురాణంలో 50 రకాల వస్ర్తాల పేర్లును పేర్కొన్నాడు. కొన్ని ముఖ్యమైన పరిశ్రమల పేర్లు...
1. నిర్మల్ - కత్తుల పరిశ్రమ -ఇక్కడి కత్తులు సిరియా దేశానికి ఎగుమతి అయ్యేవి.
2. గోల్కొండ - వజ్రాల పరిశ్రమ - ప్రపంచంలోనే అగ్రస్థానం - తర్వాత గొల్కొండ రాజ్యానికి మార్పు
3. ఓరుగల్లు - రత్నకంబళ్లు తివాచీలు, సువాసనలు ఇచ్చే బియ్యం
4. చండూరు - కంచు గంటలు, పాత్రలు, పల్లాలు (పల్లెములు)
5. నర్సాపురం - నౌకాపరిశ్రమ. ఏకైక నౌకానిర్మాణపరిశ్రమ

-ఇంకనూ పారిశ్రామిక రంగంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అనేక విధాల వస్ర్తాలు వాడుకలో ఉన్నాయి. సన్నని నూలు వస్ర్తాలు, అద్దకపు వస్ర్తాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ఈ ఎగుమతులతో ఆసియాలోనే భారతదేశానికి, కాకతీయ రాజ్యానికి విదేశీ ఆదాయం ఎక్కువగా వచ్చేది. దీంతో తుర్కష్కులకు కంటగింపు అయ్యెను.

-కాకతీయుల సముద్రవ్యాపారం విశేషంగా వృద్ధిచెందుట వల్ల నౌకా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. కాకతీయుల ముఖ్యమైన నౌకా కేంద్రం మోటుపల్లి. నేడు అది ప్రకాశం జిల్లాలో ఉంది. (క్రీడాభిరామంలో దేశీ, విదేశీ వస్త్ర వ్యాపారం గురించిన వివరాలు ఉన్నాయి)
కృష్ణపట్నం,మోటుపల్లి, మైసోలియా, ఘంటసాల నాటి ప్రధాన ఓడరేవులు. సుగంధ ద్రవ్యాలు, దంతవస్తువులు, విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ఈ ప్రాం తంలో గణపతి దేవుడు అభయ శాసనం వేయించాడు. సముద్రపు దొంగలను అణిచివేసెను.

ముఖ్యమైన అధికారులు


-అష్టాదశ తీర్థులు - 18 మంది అధికారులు (మడికి సింగన గ్రంథంలో వివరాలు కలవు)
-మౌర్యుల కాలంలో ప్రజా అధికారులను తీర్థులు అనేవారు.
-నగరి శ్రీకావళి: అంతఃపురాన్ని ఎల్లవేళలా కాపాడే రక్షకుడు.
-భహత్తర నియోగాధిపతి: 72 శాఖలకు పై అధికారిగా పనిచేసేవారు.
-ఆయంగార్లు: 12 మంది. వీరినే పన్నిద్దరు ఆయంగార్లు అంటారు.

ముఖ్య ఉద్యోగులు


- తలారి - గ్రామ రక్షకుడు
--కరణం - గ్రామ లేఖకుడు
-బోయ - గ్రామ సేవకుడు
- సంధి విగ్రహీ - విదేశాంగ మంత్రి



ముఖ్యమైన పన్నులు


1. తోటపై తోంఘ్ట పన్ను
2. పచ్చిక బీళ్లపై పుల్లరి పన్ను వసూలు చేసేవారు. పన్ను వసూలు చేయు అధికారాలను కాలకాండు అంటారు.
3. దశబంద ఇనాము: 1/10 వంతు చెరువుల కింద వ్యవసాయం చేసే రైతులు చెల్లించాలి
4. ఇల్లరి: గృహాలపై విధించే పన్ను దక్షిణ భారతదేశంలోనే కాకతీయుల కాలంనాడు ఎక్కువ పన్నులు విధించబడెను.
5. పుట్టిపహండి: ధనరూపంలో చెల్లించే పన్ను
6. పుట్టి కొలుచు: ధాన్య రూపంలో చెల్లించే పన్ను
7. మగము: వర్తకుల నుంచి భూయజమానులు వసూలు చేయు పన్ను
8. సింగినాదం- హెచ్చరికలు చేసేవార్కి చెల్లించు పన్ను

ముఖ్యమైన రవాణా మార్గాలు


1. ఓరుగల్లు నుంచి మంథెన వరకు
2. బళ్లారి నుంచి చిత్తూరు వరకు
3. రాయచూర్ నుంచి కొలనుపాక వరకు
4. బీదర్ -కొలనుపాక, కళ్యాణి - కొలనుపాక వరకు
5. బీదర్ - పటాన్‌చెరు - గోల్కండ వరకు
6. వరంగల్ నుంచి వాడపల్లి వరకు ప్రధానమార్గాలుగా చెప్పవచ్చును.


ముఖ్యమైన నాణేలు


-గద్వాణం : బంగారు నాణెం
-రూకము: వెండి నాణెం
- అన్నెము : రాగి నాణెం
-తార : వెండినాణెం
-నాణెల గురించి బాపట్ల శాసనంలో వివరించబడెను. తర్వాత 18వ శతాబ్దం నాటికి దక్షిణ భారతదేశంలో పోర్చుగీసులు క్రుజుడో నాణెం ప్రవేశపెట్టిరి. దాంతో గద్వాణం ప్రస్తుతం డాలర్ ముందు రూపాయిలా బక్కచిక్కి పోయింది.

భూమి విభజన


1. వెలిమ చేను: మెట్టభూమి, వర్షాధార భూమి, (పన్నులు తక్కువ)
2. నీరు భూమి: పల్లపు ప్రాంతం, మాగాణి భూమి (పన్నుల భారం ఎక్కువ)
3. తోట భూమి : ఉద్యానవనాలు, తోటల భూములు (2 లేదా 3 సంవత్సరాల కొకసారి పన్నుల విధింపు)
కోల/గడ: 1. భూమిని కొలుచు సాధనం. అంటే ఇది 32 జానలు కలిగి ఉండును.
2. మర్తురు : 50 నుంచి 100 సెంట్ల
భూమిని మర్తురు అనేవారు



సైన్య విధానం:


కాకతీయ రాజులు అపారమైన సైన్యాన్ని పోషించారు. వీరు చతురంగ బలాలను కలిగిఉన్నప్పటికీ రథ బలానికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వలేదు.
1. అత్యధిక సంఖ్యలో కాల్బలం (సైనికులు) -
9 లక్షలు
2. అశ్వబలం (గుర్రాలు) - 20 వేలు
3. గజబలం (ఏనుగులు) - 100




సైన్యాధిపతులు:


1. జాయపసేనాని - గజసేనాని - గణపతిదేవునికి
2. మారయ - అశ్వసేనాని - ప్రతాపరుద్రునికి

బిరుదులు పొంది ఉన్నారు. నాయంకరుల సైన్యం కంటే చక్రవర్తుల సైన్యం ఎక్కువగా ఉండేది. కాకతీయ వీరులు కత్తిసాములో జగత్ ప్రసిద్ధులు. రాజులు ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు గ్రామాలను బహుమానంగా ఇచ్చుటయే గాక...
1. కోట గెల్పట్టు
2. ద్వీపల ముంతక
3. వెలనాటి ధూషక వంటి బిరుదులు ఇచ్చి గౌరవించేవారు.
Dr.Murali


Followers