Showing posts with label Andhra Pradesh jobs. Show all posts
Showing posts with label Andhra Pradesh jobs. Show all posts
AP TET & TRT 2014 New Exam Pattern
ఆంధ్రప్రదేశ్‌లోని డీఎస్సీ Andhara Pradesh DSC 2014
ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల ఎదురుచూపులు
ఫలించబోతున్నాయి. డీఎస్సీ-2014 ప్రకటనను ఏపీ ప్రభుత్వం గురువారం
జారీచేయబోతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు
ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 'ఈనాడు'కు
వెల్లడించారు. డీఎస్సీని ఇకపై...ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ
టెస్ట్-కమ్-టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ( టెట్- కమ్- టీఆర్టీ)గా
వ్యవహరించబోతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం మేరకు,
మంత్రి గంటా ఆదేశాలను అనుసరించి మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి
అధర్‌సిన్హా డీఎస్సీ-2014 అర్హతలపై బుధవారం రాత్రే మార్గదర్శకాలు విడుదల
చేశారు. తొలుత నిర్ణయించిన ప్రకారం 10,500 వరకు ఉపాధ్యాయ పోస్టులను
భర్తీచేయాలని నిర్ణయించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...9061 ఉపాధ్యాయ
పోస్టుల భర్తీకి ప్రకటన జారీ కాబోతోంది.ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్
(ఎస్‌జీటీ) పోస్టులు 6244, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1849, ఇతర
పోస్టులు ఉన్నాయి. కోతపడినవన్నీ ఎస్జీటీ పోస్టులే. ట్రైబల్, మున్సిపల్
శాఖకు చెందిన 1280 టీచర్ పోస్టుల భర్తీపై స్పష్టత
రావాల్సి ఉంది. సెప్టెంబరు 5వ తేదీనే ఈ డీఎస్సీ జారీ చేయాల్సి
ఉండగా...బీఎడ్ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించే విషయమై
కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో మంత్రి
గంటా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నుంచి కూడా
బీఎడ్ వారికి ఎస్జీటీ పోస్టులకు అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తులు
వచ్చినప్పటికీ... సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర మార్గదర్శకాల దృష్ట్యా ఏమీ
చేయలేకపోయినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ ఏపీ ప్రభుత్వానికి సూచనప్రాయంగా
తెలియజేసింది. నెలలు గడిచినా ప్రకటన రాక అభ్యర్థుల్లో ఆందోళన అలముకోవడంతో
రాష్ట్రప్రభుత్వం ప్రకటన జారీకి సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని డీఎస్సీ ,Andhara Pradesh DSC 2014
డీఎస్సీ, టెట్ రెండూ ఒకేసారి నిర్వహిస్తాం: మంత్రి గంటా (A P)
ఈ ఏడాది జరగనున్న డీఎస్సీ, టెట్ ఒకేసారి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్
మాననవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురుపూజోత్సవం రోజైన
సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 3న న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల మంత్రుల సమావేశంలో
పాల్గోనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. సెప్టెంబర్ 5వ తారీఖున
విజయవాడలో అధికారకంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,500 ఉపాధ్యాయ పోస్టులన్నాయి.
ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్దులు, ఉపాధ్యాయులు స్కూలుకి హాజరవుతున్న
విషయాన్ని ఖచ్చితంగా పర్వవేక్షించడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు
చేయనున్నట్లు తెలిపారు. ఈ బయోమెట్రిక్ విధానాన్ని మొదటగా పశ్చిమగోదావరి
జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. వీడియో, ఆడియో ద్వారా పాఠ్యాంశాల
బోధిస్తామన్నారు. ప్రతి 10 గ్రామాలకు ఒక క్లస్టర్ స్కూల్ ను ఎంపిక చేసి ఆ
పాఠశాలలో విద్యకు సంబంధించిన అవగాహన, శిక్షణ కార్యక్రమాలను
నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పాఠశాలల పనితీరు కార్పోరేట్ పాఠశాలలకు
మించి ఉండేలా చర్యలు
తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపామన్నారు.
సమాచారం... ఉద్యోగాలు
టెక్నికల్ సూపరింటెండెంట్‌లు అస్సాంలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్‌లు-24-
ఇతర ఖాళీలు :
అసిస్టెంట్ రిజిస్ట్రార్-2,
మెడికల్ ఆఫీసర్-1,
వర్క్‌షాప్ సూపరింటెండెంట్-1,
అసిస్టెంట్ ఇంజనీర్-1,
స్టాఫ్ నర్స్-1,
జూనియర్ అకౌంటెంట్-1,
మల్టీఫంక్షనల్ అసిస్టెంట్-2.
దరఖాస్తు : వెబ్ సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు,
చివరి తేదీ : ఆగస్టు 4
వెబ్‌సైట్ : www.cit.in
బార్క్‌లో అప్రెంటీస్‌షిప్ ముంబయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ట్రేడ్ అప్రెంటీస్‌షిప్ శిక్షణలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది
సీట్లు : 18 (మెకానికల్-8, ఆటోమొబైల్ ఇంజనీరింగ్-2, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్-4, ఎక్స్‌రే టెక్నీషియన్-2, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్-2)
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
చివరి తేదీ : ఆగస్టు 31
వెబ్‌సైట్ : www.barc.gov.in
ఎయిమ్స్, న్యూఢిల్లీ న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది
ఖాళీలు : అసిస్టెంట్ ప్రొఫెసర్ -96- విభాగాలు : అనాటమీ, బయోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, సి.టి.వి.ఎస్, సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈ.ఎన్.టి, గ్యాస్ట్రోఎంటరాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడిసిన్, న్యూరోసర్జరీ, మొదలైనవి.
వయసు : 50 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
చివరి తేదీ : ఆగస్టు 14
వెబ్‌సైట్ : డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎయిమ్స్‌ఎక్జామ్స్.ఓఆర్‌జి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రభుత్వ విభాగాల్లోని వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది
ఖాళీలు :అసిస్టెంట్ ఎపిగ్రాఫిస్ట్-3, డైటీషియన్-15, బోసన్-5, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్-8, క్లర్క్-1, అసిస్టెంట్ మేనేజర్ కమ్ స్టోర్ కీపర్-1, ఫొటోగ్రాఫర్-1, జూనియర్ కార్టోగ్రాఫిక్ అసిస్టెంట్-1, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-21, అకౌంటెంట్-1, సైంటిఫిక్ అసిస్టెంట్-1, స్టోర్ సూపరింటెండెంట్-1, సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-4, చార్ట్‌మెన్-13, క్వారంటైన్ ఇన్‌స్పెక్టర్-3, డిప్యూటీ రేంజర్-3, సీనియర్ రేడియో టెక్నీషియన్-1.-
ఎంపిక :-కామన్ స్క్రీనింగ్ టెస్ట్ /ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్ / స్కిల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు : ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
చివరి తేదీ : ఆగస్టు 14
వెబ్‌సైట్ : www.sscwr.net
Subscribe to:
Posts (Atom)