అడుగడుగునా
మనిషి కదలికను పసిగట్టే సాంకేతిక వ్యవస్థను ఏర్పరచినప్పుడు, అది
దుర్వినియోగమైతే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. భారత్ ఇప్పుడిప్పుడే
డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నందున, దీని
పర్యవసానాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలె.సాంకేతిక పరిజ్ఞానాన్ని
సమర్థవంతంగా సమాజ సంక్షేమం కోసం వినియోగించాలె.
ఆర్థిక,పారిశ్రామికాభివృద్ధితో పాటు సామాజికాభివృద్ధి పైనా దృష్టి
సారించాలె.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆవిష్కరించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం
దేశాన్ని సరికొత్త సాంకేతిక యుగంలోకి నడిపిస్తుందనడంలో సందేహం లేదు. ఈ
కార్యక్రమానికి హాజరైన అనేక మంది పారిశ్రామికవేత్తలు హర్షధ్వానాలతో ఆమోదం
తెలిపారు. ఈ పథకం అమలు కోసం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు
పెట్టడానికి సాంకేతిక పరిశ్రమలు సుముఖత వ్యక్తం చేశాయి. దేశ వ్యాప్తంగా
మౌలిక వసతులు కల్పించి డిజిటల్ కార్యకలాపాలను గ్రామాలలో సైతం అందుబాటు లోకి
తేవడం, సేవారంగాన్ని డిజిటల్ రూపంలో సాగించడం, డిజిటల్ పరిజ్ఞానం పెంచడం
ప్రధాన లక్ష్యాలు.
వీటికి తోడు 2020 కల్లా ఎలక్ట్రానిక్ దిగుమతులు లేకుండా దేశంలో ఉత్పత్తి
సాగించడం మరో లక్ష్యం. ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వల్ల పది కోట్ల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంటున్నారు.
గత యూపీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ- గవర్నన్స్ పథకంతో పోలిస్తే మోదీ చేపట్టిన
డిజిటల్ ఇండియా మరింత విస్తృతమైన కార్యక్రమం.
డిజిటల్ సేవలను ఉపయోగించుకోవడం ఇప్పటికే నగర ప్రాంతంలో సాధారణమైపోయింది.
రైలు, బస్సు టికెట్ బుక్ చేయాలన్నా, సినిమా టికెట్ తీసుకోవాల న్నా ఇప్పుడు
సులభమైపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు బిల్లులను నెట్ ద్వారా
చెల్లిస్తున్నారు. ఆన్ లైన్ షాపింగ్ వల్ల కాలు గడప దాటకుండానే, కోరుకున్న
వస్తువులు వచ్చి ఒడిలో వాలుతున్నాయి. వైద్యం, బ్యాకింగ్ రంగాలలో భారీ
మార్పులు వచ్చా యి. విద్యారంగం గురించి చెప్పనవసరం లేదు. మొదటగా డిజిటల్
పరిజ్ఞానాన్ని అలవరచుకున్నది విద్యార్థులే. ఇప్పుడు రైతులు కూడా
టాబ్లెట్‌ను వాడే రోజులు వస్తున్నాయి.
ఒకప్పుడు ప్రతి మనిషికి కావలసింది రోటీ, కప్డా ఔర్ మకాన్ అని చెప్పేవారు.
ఇప్పుడు రోటీ, కప్డా ఔర్ మొబై ల్ అనే హాస్యోక్తి ప్రచారమైంది. అయినప్పటి కీ
దేశంలో పూర్తిగా డిజిటల్ విప్లవం వచ్చేసిందని చెప్పలేని పరిస్థితి ఉన్నది.
ప్రభుత్వ కార్యకలాపాలే ఇంకా పూర్తిగా డిజిటైజ్ కాలేదు. ప్రధాని చెప్పిన ఎం
(మొబైల్) గవర్నన్స్ అనే ది ఇంకా భారతీయ గ్రామీణ సామాజానికి చాలా దూరంలో
ఉన్నది. డిజిటల్ కనెక్టివిటీ లో మన దేశం ఇంకా వందవ స్థానంలో కూడా లేదు.
రెండున్నర లక్షల గ్రామాలకు బ్రాడ్‌బాండ్ వసతి కల్పించడం అంత సుల భం కాదు.
ఉద్యమ స్ఫూర్తితో ఈ మౌలిక వసతులు కల్పిస్తే మాత్రం ఈ సాంకేతిక పరిజ్ఞానం
సమాజంలో భారీ పరివర్తనను తీసుకురాగలుగుతుంది.
డిజిటీకరణ పథకాలు అమలైతే వివిధ సేవలు, ఇతర కార్యకలాపాలు సౌకర్యవంతమవుతాయి.
అయితే ప్రతి కార్యక్రమానికి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నట్టే దీనికి కూడా
ఉంటాయి. చిత్తశుద్ధి ఉంటే వాటిని అధిగమించడం కూడా అసాధ్యం కాదు. అయితే
డిజిటీకరణ జరిగితే కష్టాలన్నీ తీరుతాయంటూ అరచేతిలో స్వర్గం చూపెట్టడం
సరికాదు. ప్రధాని మోదీ ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఆవిష్కరించిన
సందర్భంగా ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త దీన్ని ఆకాశానికెత్తాడు. దేశ
వ్యాప్తంగా డిజిటల్ అనుసంధానం వల్ల ప్రజలకు మిగతా ప్రపంచంతో సం బంధం ఏర్పడి
అత్యంత శక్తి లభిస్తుందని అన్నారు. కొత్తగా కనుగొన్న ఏ సాంకేతిక
పరిజ్ఞానాన్ని అయినా సమాజ సంక్షేమం కోసం ఉపయోగించుకోవచ్చు.
పారిశ్రామిక విప్లవం ప్రజా జీవనంలో గుణాత్మక మార్పును తీసుకొచ్చింది.
అయితే ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయా? ప్రజా జీవనం నరకప్రాయమైందా అనేది
దాని ఉపయోగాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రెండవ పారిశ్రామిక విప్లవంగా
చెప్పుకుంటున్న డిజిటీకరణను కూడా తక్కువ చేయలేము. కానీ దీనిని ప్రజా
సంక్షేమం కోసం వినియోగించాలె. అనేక సామాజిక సమస్యలు పరిష్కారం కోసం ఎదురు
చూస్తున్నాయి. వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించలేము. ఉదాహరణకు
డిజిటీకరణ ద్వారా పారదర్శకత పెరుగుతుందని, లంచగొండితనం అంతరిస్తుంద ని,
పనిదనం మెరుగుపడుతుందని ఇట్లా రకరకాల ఆశలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలన్నీ
సామాజిక సంస్కృతికి, పరిపాలనా విధానానికి సంబంధించినవి.
ప్రభుత్వంలో, ప్రజల్లో పరివర్తన లేకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా
సాధించలేము. ఇదే విధంగా అమెరికా వంటి అభివృద్ధిచెందిన దేశాలలో పౌరుడి
గోప్యతకు భరోసా లేకుండా పోతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడుగడుగునా
మనిషి కదలికను పసిగట్టే సాంకేతిక వ్యవస్థను ఏర్పరచినప్పుడు, అది
దుర్వినియోగమైతే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. భారత్ ఇప్పుడిప్పుడే
డిజిటల్ ప్రపంచంలో కి అడుగు పెడుతున్నందున, దీని పర్యవసానాలను కూడా
పరిగణనలోకి తీసుకోవాలె. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా సమాజ సంక్షేమం
కోసం వినియోగించాలె. ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధితో పాటు సామాజికాభివృద్ధి
పైనా దృష్టి సారించాలె.
Showing posts with label Essay. Show all posts
Showing posts with label Essay. Show all posts
Mission Kakatiya
Introduction
1.) Importance of Tanks in the development of the new state of Telangana
Tanks
have been the life line of Telangana owing to the state’s geographical
positioning. The people of the state are highly dependent on the tanks
which are spread across all the 10 districts. The topography and
rainfall pattern in Telangana have made tank irrigation an ideal type of
irrigation by storing and regulating water flow for agricultural use.
Construction
of tanks in Telangana has been an age old activity since pre Satavahana
era. During the Kakatiya era, the construction of tanks was carried out
with utmost technical expertise. Tanks such as Ramappa, Pakhala,
Laknavaram, Ghanapuram, Bayyaram which were built by Kakatiyas resemble
seas and they greatly helped agriculture and overall development and
prosperity of the Kakatiya kingdom.
This
vision and legacy of Kakatiyas were carried forward by Qutubshahis and
Asafjahis who ruled this region for centuries. Hundreds of big and small
tanks were built in Telangana region during their rule. Government
desires to uphold the vision of Kakatiyas which envisages revival and
restoration of Minor Irrigation Sources in Telangana State.
Tank
irrigation has huge bearing on generation of rural employment, poverty
reduction and agricultural growth. The sheer size of command area under
tank irrigation makes it a large center of agricultural production and
provides a critical opportunity for commercial agriculture through
market linkages.
2.) Irrigation Policy of Combined State of A.P
Infact,
the A.P. irrigation policy, at the instance of Andhra leadership coming
from Coastal Andhra, has given rise to uneven development. It
emphasized on the major irrigation, whereas the alluvial plains
irrigated by the tanks have remained largely insignificant. This
irrigation policy resulted in the destruction of age-old water
conservation systems with chains of tank networks. The successive
Governments successfully ignored the maintenance and development of
tanks and allowed them to face extinction by way of siltation, breaches,
encroachments etc. With the extinction of tank system, the
self-sufficient villages of Telangana have become drought prone areas.
Today
the drought is manifested in every facet of human life and it is
particularly so with the rural poor. The exodus of people from rural
areas of Telangana to Hyderabad and other far off places has made their
lives vulnerable. This has also proliferated the squatter settlements
and slums in the urban areas. The Krishna, Godavari, Musi and Manjira
rivers traverse through the semi-arid lands of Telangana districts
especially Nizamabad, Karimnagar, Medak, Ranga Reddy, Nalgonda and
Mahabubnagar. But large quantities of water from these rivers are
diverted to subsist the industrial, drinking and other needs of
Hyderabad and irrigation needs of Andhra. Otherwise, these rivers would
have sufficed and satiated the water needs of these districts.
Irrigation policies of A.P. exposed the true colours of regional bias
and machinations to promote their interests.
This
continuous and policy based discrimination in Irrigation Sector turned
Telangana Region into a graveyard of farmers and land of migration.
Self-sustained villages of Telangana have become drought prone villages.
80 % farmer suicides that occurred in AP state were from Telangana
region and millions of people from 10 Telangana districts migrated to
far off places like Mumbai, Bhivandi, Surat, Ahmedabad and Gulf
countries as laborers in search of livelihood. 16 lakh population from
Mahaboobnagar district alone migrated to far off places. Hence,
exploitation of water resources has been one of the major concerns of
Telangana movement and people strongly felt that creation of a new state
of Telangana, that is, state power alone would fetch them water.
Realizing the importance of reclamation of tanks for growth in the
state, the Government of Telangana State has taken up the programme of
restoring the minor irrigation sources under the title “Mission
Kakatiya” (Mana Ooru – Mana Cheruvu). The mission aims at retrieving the
lost glory of minor irrigation in the state with community
participation for ensuring sustainable water security.
In July
2014 Irrigation Department, Govt of Telangana has carried out for the
first time, the census of Minor Irrigation sources in Telangana, which
include M.I tanks constructed and maintained by Irrigation Dept., M.I
Tanks constructed by Panchayat Raj Dept. and later transferred to
Irrigation Dept., Percolation Tanks, Forest Tanks, Private Kuntas,
Anicuts and Check dams. As per the enumeration, the total number of
tanks is found to be around 46,531. The irrigation department has
planned to restore all the 46,531 minor irrigation sources in the state
in next five years, taking up 20% of the tanks each year.3.0) The Objective Of Mission Kakatiya
The
objective of Mission Kakatiya is to enhance the development of
agriculture based income for small and marginal farmers, by accelerating
the development of minor irrigation infrastructure, strengthening
community based irrigation management and adopting a comprehensive
programme for restoration of tanks.
3.1) The major benefits of the Restoration of Tanks
•
expected gains from irrigated area expansion by covering gap ayacut
(i.e. part of the planned area of tanks command that is currently not
being covered by irrigation).
•
technology impacts through adoption of resource
conservation-cum-production technologies when the project is fully
implemented.
• diversification to
cover irrigated area under high-value and low water intensified crops
such as chillies, maize and vegetables.
• development of fisheries.
• improvement of livestock.
• reduction in waterlogged area.
• increase in groundwater levels and water quality there by getting the lands beyond command area under bore well irrigation.
• power savings due to the reduced need for well irrigation that is currently used to supplement the insufficient tank water.
4.0) Works to be taken up
The
following are the works that will be taken up under the programme.
a.De-siltation and the use of silt application in the local fields
b.Restoration of Feeder Channel to the tank. c.Re-sectioning of
Irrigation Channels & Repairs to CM & CD works. d.Repairs to
Bund, Weir & Sluices. e.Raising of FTL, wherever possible Procedure
that would be used to take up the above works has been discussed in
detail in the guidelines issued.
5.0) District wise Minor Irrigation Sources
The
tanks, to be proposed for Ist phase of implementation, are to be
identified by the field level Engineers as per the guidelines issued.
The survey of tanks and preparation of Estimates for calling up of
tenders is under brisk progress.
Sl.No.
| District | Sources finalised as on 18.10.2014 |
No. of sources to be restored during
2014 – 15
|
1 | Karimnagar | 5939 | 1188 |
2 | Adilabad | 3951 | 790 |
3 | Warangal | 5839 | 1168 |
4 | Khammam | 4517 | 903 |
5 | Nizamabad | 3251 | 650 |
6 | Medak | 7941 | 1588 |
7 | Ranga Reddy | 2851 | 570 |
8 | Mahaboobnagar | 7480 | 1496 |
9 | Nalgonda | 4762 | 952 |
| Total | 46531 | 9306 |
6.0)
The Government has formulated certain guidelines for effective and
efficient implementation of Mission Kakatiya, emphasizing the need for
prioritizing the tanks to be taken up for restoration, works that are to
be taken up, tendering and working procedures to be followed etc., The
tanks with relatively larger ayacut and that have not been covered under
the programmes such as RRR and CBTMP shall initially be taken up for
restoration and the rest will be covered in the subsequent years. The
prioritization of the tanks will be done in consultation with the people
representatives of the respective areas.
6.1) Reforms - Estimates
The
Government has made certain modifications to the financial limits in
the powers delegated to the authorities for technical sanction of the
works. The modified limits are as follows:
Task | Powers delegated to | Value in Rs. Lakhs |
Iinspection before technical sanction | Executive Engineer | 100 |
| Superintending Engineer | 100-500 |
| Chief Engineer | Above 500 |
Technical Sanction and Tender Approval | Executive Engineer | 50 |
| Superintending Engineer | 50 to 100 |
Technical Sanction | Chief Engineer | Above 100 & up to AA accorded |
Tenders Approval | Chief Engineer | 100 to 400 |
| Commissioner of Tenders | Above 400 |
6.2) Tendering
The
works under Mission Kakatiya will be taken up under e.procurement
process, using the existing platform, renamed as Mission Kakatiya. All
the new SEs & EEs shall obtain the digital keys from the APTS for
utilization of Mission Kakatiya Platform. In order to encourage local
entrepreneurs, financial limit for class V Contractors is enhanced from
10 to 50 lakhs. A tendering time schedule specific to the works under
the programme is as follows:
Sl.No. | Process | Earlier | Present |
1 | Calling of Tenders | 14 Days | 7 Days |
2 | Acceptance of Tenders | 90 Days | 7 Days |
3 | Concluding Agreements | 14Days | 5 Days |
4 | Additional security Deposit | < 25 % | < 10 % |
7.1) Irrigation & CAD department
The
Irrigation & CAD department is the chief implementing department.
The works will be executed through the Superintending Engineer and the
Executive Engineer of the concerned areas, supported by the field
engineers i.e., Dy. Executive Engineers and the Assistant Executive
Engineers, under overall supervision of the Chief Engineer, Minor
Irrigation. The engineers at all the levels will have to be in constant
touch with the officials of the line departments to have better
coordination.
7.2) Agriculture Department: The tasks that are to be carried out by the Agriculture department are
a)
In all tanks, samples of the silt should be collected to test its
suitability for application in agriculture fields and wide publicity
should be given to utilize tank bed silt by farmers. b) The farmers
should be motivated by the department on the following;
I) Efficient use of available water through change in irrigation system and improved water management techniques.
II) Increase in productivity of farms through suitable cropping pattern and increased cropping intensity.
III) Balanced use of chemical fertilizers and judicious use of plant
protection chemicals. IV) Reduction of cultivation cost through
introduction of improved implements and equipment.
V) Introduction of high-tech agriculture to increase the farm returns.
7.3) Forest Department: The tasks that are to be carried out by the Forest department are
I) Effective utilization of tank foreshore areas in selected locations through afforestation.
II) Nursery raising and plantation wherever necessary.
III)Training
for maintenance and cultural operations. IV)Planting Silver Oak and
Toddy ( Eetha ) trees around the tank boundaries. These activities,
apart from reducing silt inflow into the tank, are also expected to
create an additional, sustainable income source for the tank community.
7.4) Fisheries Department: The department should take up the following activities which will result in increase in aquaculture.
(i) Upgrading production practices through improved stocking.
(ii) use of Improved feeding, management and harvesting techniques.
(iii) Intensive fish and prawn cultivation.
7.5) Revenue Department: The Revenue Department officials will have to coordinate with the field Engineers in
(i) Identifying the Shikam lands.
(ii) Determining/demarking the FTL of tank.
(iii) Identifying the government waste lands for dumping the unproductive soil.
(iv) Cooperating between Revenue and Irrigation depts for removing illegal constructions in tank bed .
7.6) Ground Water Department: The ground water department should regularly
(i) Monitor the groundwater levels and quality of groundwater.
(ii)Supply list of over exploited villages to the district Superintending Engineers/Executive Engineers.
7.7) Rural Development Department
The department should converge various other programmes being
implemented, with the Mission Kakatiya and coordinate with other line
departments whenever and wherever necessary.
7.8) Information and Public Relations Department
This being a public programme, the I&PR should play a key role in
creating proper awareness among all sections of the people on Mission
Kakatiya through different IEC activities.
i.)Create awareness on the benefits of restoration of the tanks by
using different types of media and organizing IEC activities like
street plays, kalajathas, wall writings, pamphlets and involving rural
folklore like Chindu, Voggukathalu etc.,
ii.) Motivate the farmers to utilize the useful silt excavated out of
the tanks in their agriculture fields at their cost, by
explaining the benefits that come out of it.
iii.)
Organize essay and elocution competitions for the students on the topic
“tanks and their restoration”, in coordination with the education
department, at school, mandal and district levels and award prizes to
the winners to encourage them in motivating their parents.
iv.) Involve NCC, NSS, Guides and Scouts and Nehru YuvakKendras etc.,
in propagating the benefits of the programme. v.Involve Public
Representatives and SHGs in the programme.
8) Adoption of Tanks
•
It is proposed to encourage Telangana NRIs who aspire for development
of their villages to adopt a tank or more. It is also proposed to invite
Non Profit & development oriented charity social organizations /
NGOs, Corporate organizations to adopt tank(s). Their involvement will
be limited to supervision, protection, beautification and maintenance of
the tank(s).
9) Protection of Water Bodies
•
At village level, a Social/people’s organization for each tank is
proposed to be constituted to protect the tanks from encroachments and
to maintain them properly.
• It is
proposed to remove silt every year. Farmers are to be motivated to
excavate and dump the silt in their fields for increase in yield of crop
and maintaining the tank capacity to its standards.
• Farmers / Public representatives/People are expected to work in this
direction. All the above procedures are proposed to be followed under
Mission Kakatiya for its successful implementation and for restoration
of the minor irrigation sources. This far-sighted programme of the
government of Telangana with community participation for ensuring
sustainable water security is expected to bear its fruit in the near
future and change the face of the state.
భూ సేకరణ బిల్లు
భూసేకరణ చట్టంలో ఏవైనా లోపాలు ఉంటే సవరించడం, అమలు దశలో అన్యాయం జరగకుండా
చూడడం అవసరం. కానీ మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది.
మోడీ ప్రభుత్వం జారీ చేసిన బిల్లు చట్టరూపం పొందితే భూమి సేకరించడానికి
రైతుల ఆమోదం అవసరం ఉండదు. సమాజంపై ప్రభావ అంచనా కూడా ఉండదు. ఈ రెండు అంశాలు
లేకపోతే 2013 నాటి చట్ట లక్ష్యమే దెబ్బతింటుంది.
భూ సేకరణ చట్టంలో సవరణలు చేయడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు
తీవ్ర నిరసన ఎదురవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పదమూడు పార్టీలు
మంగళవారం నిరసన తెలిపాయి. 2013లో యూపీఏ ప్రభుత్వం కొత్త భూసేకరణ చట్టాన్ని
రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా
గాంధీ తాజా సవరణలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడంలో కూడా శ్రద్ధ
వహించారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లును మోడీ ప్రభుత్వం లోక్‌సభలో
ఆమోదించగలిగినా ప్రతిపక్షాలకు అధిక బలం ఉన్న రాజ్యసభలో గట్టెక్కడం అంత
సులభం కాదు. రాజ్యసభ ఈ బిల్లును తిరస్కరించినా లోక్‌సభలో ఉన్న మెజారిటీ
మూలంగా ఈ బిల్లుకు చట్టరూపం ఇవ్వడం కష్టమేమీ కాదు. అందుకే ఈ బిల్లుకు
వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని
కూడగట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నా యి. ప్రతిపక్షాలు ఊరేగింపుగా వెళ్ళి
రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయడం ఇందులో భాగమే. ఈ పరిస్థితిని గమనించిన
ప్రధాని మోడీ బిల్లును ఆమోదింప చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నట్టు
తెలుస్తున్నది. అయితే రాష్ట్రపతి చేత పార్లమెంటును ప్రొరోగ్ (నిరవధిక
వాయిదా) చేయించి భూసేకరణ ఆర్డినెన్స్‌ను కొత్తగా జారీ చేయాలనే ఎత్తుగడ
పరిశీలనలో ఉన్నట్టు కూడా తెలుస్తున్నది.
యూపీఏ ప్రభుత్వం 2013లో కొత్త భూసేకరణ చట్టాన్ని ప్రవేశ పెట్టడానికి
ముందు, పరిశ్రమలకు భూములు కట్టబెట్డానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు
అప్రజాస్వామికంగా వ్యవహరించాయి. గ్రామ సభలను తూతూ మంత్రం అన్నట్టుగా
జరిపేవారు. కంపెనీల ప్రతినిధులు రాజకీయ నాయకుల అండ సంపాదించి, పోలీసులను
భారీగా మోహరింప చేసి రైతులు ఆమోదించినట్టు తతంగం నడిపేవారు. రైతుల భూములు
నిర్దాక్షిణ్యంగా గుంజుకునేవారు. అందుకే 2013 చట్టంలో రెండు ప్రధానాంశాలు
ఉన్నాయి. ఒకటి- భూసేకరణ పారదర్శకంగా జరపాలనేది. ప్రైవేటు కంపెనీల కోసం
అయితే 80 శాతం రైతుల ఆమోదం తప్పనిసరి. అదే ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటే 70
శాతం ఆమోదం ఉండా లె. ఈ చట్టంలోని రెండవ ప్రధా న అంశం- సమాజంపై ప్రభావం
అంచనా. సాధారణంగా నష్ట పరిహారం భూమి ఉన్నవారికే వస్తుం ది. కానీ ప్రభు త్వం
చిత్తశుద్ధితో పునరావాస చర్య లు తీసుకోవాలంటే సమాజంపై ప్రభావం అంచ నా
తప్పనిసరి. నిజానికి ఒక ప్రాంతాన్ని ముంచాలన్నా, ప్రజలను తరలించి వేరే
వారికి అప్పగించాలన్నా ఇటువంటి అంచనాలు వేయడం అవసరం కూడా. యూపీఏ ప్రభుత్వం
ప్రవేశ పెట్టిన ఈ చట్టం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేయదని
విమర్శించే సంఘ సేవా సంస్థలు ఉన్నా యి. అయితే ఉన్నంతలో గతంతో పోలిస్తే ఇదొక
ముందడుగు. భూసేకరణ చట్టంలో ఏవైనా లోపాలు ఉంటే సవరించడం, అమలు దశలో అన్యాయం
జరగకుండా చూడడం అవసరం. కానీ మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించాలని
నిర్ణయించింది. మోడీ ప్రభుత్వం జారీ చేసిన బిల్లు చట్టరూపం పొందితే భూమి
సేకరించడానికి రైతుల ఆమోదం అవసరం ఉండదు. సమాజంపై ప్రభావ అంచనా కూడా ఉండదు. ఈ
రెండు అంశాలు లేకపోతే 2013 నాటి చట్ట లక్ష్యమే దెబ్బతింటుంది.
రాష్ట్ర విభజన సక్రమంగా జరగకపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్న
టీఆరెస్ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వంతో సంబంధాలు సున్నితంగా మారా యి.
అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ సంబంధాలు దెబ్బతినకుండా
జాగ్రత్తపడుతూనే భూసేకరణ చట్టంలోని ప్రజా వ్యతిరేక స్వభావాన్ని
వ్యతిరేకించడంలో టీఆరెస్ సభ్యులు వెనకాడలేదు. అయితే రాష్ట్రంలో తామే
అధికారంలో ఉన్నందు వల్ల, కేంద్ర చట్టంలో తగు వెసులుబాటు ఏర్పాటు చేసుకొని,
అమలు దశలో తాము ప్రజానుకూలంగా వ్యవహరించాలనే వ్యూహాన్ని ఎంచుకున్నారు.
కీలకాంశాలను రాష్ర్టాలకు వదిలేసే విధంగా సవరణలను ప్రవేశ పెట్టి ఆమోదింప
చేసుకున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో టీఆరెస్ సభ్యులు వివరించిన తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించడం
మంచిది. 2013 నాటి కేంద్ర భూసేకరణ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు
మార్గదర్శకాలు రూపొందించుకోవాలె. కానీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ ఈ దిశగా
అడుగు వేయలేదు. కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఇప్పటికే మార్గదర్శకాలు
రూపొందించుకున్న తొలి రాష్ట్రంగా ఆదర్శంగా నిలిచిందని టీఆరెస్ సభ్యులు
లోక్‌సభలో వెల్లడించారు. సమాజంపై ప్రభావ అంచనా కోసం ప్రత్యేక విభాగాన్ని
ఏర్పాటు చేసి, నిపుణుల చేత శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని కూడా
ప్రస్తావించారు. పారిశ్రామికాభివృద్ధి అవసరాన్ని ఎవరూ కాదనలేరు. పైగా
ఇప్పుడున్న ప్రపంచీకరణ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే పరిమితులు
తెలిసిందే. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాల
పరిరక్షణలో తమ బాధ్యతను విస్మరించకూడదు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో గతంలో
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పేదల భూములను గుంజుకొని
బంధుగణానికి పంచిపెట్టిన దుర్నీతిని కూడా లోక్‌సభలో టీఆరెస్ సభ్యులు
ప్రస్తావించారు. ఈ దురాగతాలను గుర్తించి భూసేకరణ చట్ట సవరణను మోడీ
ప్రభుత్వం పునరాలోచించడం మంచిది.
ప్రమాదంలో పత్రికాస్వేచ్ఛ
ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు పత్రికా స్వాతంత్య్రం అత్యంత కీలకమైనది.
వాస్తవాలను తెలుసుకొనే హక్కు ప్రజలందరికీ ఉంటుంది. అయితే పాలకులు- ఎవరైనా-
తాము చెప్పదలచుకున్నది మాత్రమే ప్రజలు తెలుసుకోవాలని, తమను ఇబ్బందుల్లో
పడేసే అంశాలు ప్రజల దృష్టిలో పడకూడదని తాపత్రయపడుతుంటారు. అటువంటి
పరిస్థితులలో వాస్తవాలను వెలుగులోకి తేవాలని ప్రయత్నించే పత్రికలు, పత్రికా
రచయితలు దాడులకు, ఆంక్షలకు, నిర్బంధాలకు గురికావలసి వస్తున్నది. అదే
విధంగా ప్రభుత్వ అధికారులుగా ఉంటూ నిజాయితీగా తమ బాధ్యతలను
నెరవేర్చాలనుకొనే వారిపట్ల సైతం పాలకులు అసహనం వ్యక్తం చేస్తుంటారు.
ప్రజలకు మేలయిన పరిపాలన అందించాలనుకునే పాలకులు ఒక వంక పత్రికా
స్వాతంత్య్రాన్ని కాపాడుతూ, మరో వంక నిజాయితీపరులైన అధికారులకు రక్షణ
కల్పించాలి. ఈ అంశంపై వారు చూపే శ్రద్ధనుబట్టి ఇక ప్రభుత్వం ఏమేరకు
సుపరిపాలన అందించడానికి ప్రయత్నిస్తున్నదో అంచ నా వేయవచ్చు.
పత్రికా స్వాతంత్య్రం అంటే జరిగిన సంఘటనలను నివేదించడం మాత్రమే కాదు.
పరిశోధనాత్మక రచనలు చేయడం సైతం అత్యవసరం. అత్యవసర పరిస్థితి కాలంలో దేశంలో
పత్రికలపై సెన్సార్‌షిప్ అమలుపరచిన సమయంలో ఒపీనియన్, ఇండియన్
ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రపంచ దృష్టిని
ఆకర్షించాయి. ప్రపంచ వ్యాప్తంగా మొదటగా సంచలనం కల్గించిన ఉదంతం అమెరికాలోని
వాటర్‌గేట్ కుంభకోణం. దీనికి సంబంధించిన పరిశోధనాత్మక పత్రికా కథనాలు
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయ. ప్రపంచం అంతటా అప్పటి
వాషింగ్టన్ పోస్ట్ సంపాదకులు బెంజిమిన్ సి.బ్రాడ్లీ పాత్రికేయులకు ఎల్లకాలం
ఆదర్శంగా నిలుస్తారు. ఇటీవలనే ఆయన మృతి చెందారు. వృత్తిపరమైన బాధ్యతలు
నిర్వహిస్తున్న పాత్రికేయులు, అధికారులపై మన దేశంలో తరచూ అసహనం
పెరిగిపోతున్నది. వారు దాడులకు, వేధింపులకు గురవుతున్నారు. కేవలం తమ కింద
అణిగిమణిగి ఉండి, తాము చెప్పినట్టు తలాడించే అధికారులను వారి సామర్థ్యం,
సీనియారిటీలతో సంబంధం లేకుండా కీలక పదవులలో నియమిస్తూ ఉండటం చూస్తున్నాము.
ఇటీవలనే హర్యానాలో వివాదాస్పదమైన తన భూముల కొనుగోళ్ళ వ్యవహారం గురించి
రాబర్ట్ వాద్రాను ప్రశ్నించిన ఎఎన్‌ఐ విలేఖరులపై దాడి చేయడాన్ని మనం
చూశాము.
వాషింగ్టన్ పోస్ట్ విలేఖరులు బాబ్‌ఉడ్‌వర్డ్, కార్ల్ బెర్డ్‌స్టెయిన్
వాటర్‌గేట్ ఉదంతంపై వరుసగా కథనాలు వ్రాస్తే అత్యంత బలవంతుడైన అమెరికా
అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ 40 ఏళ్ళ క్రితం పదవికి రాజీనామా చేయవలసి
వచ్చింది. ఆ విలేఖరులకు ఆ సమాచారం ఎవరు అందించేవారో ప్రపంచానికి ఈమధ్యవరకూ
తెలియదు. 'డీప్‌త్రోట్' అనే అతను సమాచారం అందించేవారని తెలిపినవారు, ఆ
వ్యక్తి అసలు పేరు అతని మరణం తర్వాతనే బయటపెడతామని స్పష్టం చేశారు. అయితే
ఎఫ్.బి.ఐలో ద్వితీయస్థానంలో అప్పట్లో పనిచేసిన మార్క్‌ఫెల్ట్ (91) తానే ఆ
''డీప్‌త్రోట్'' ను అని మే 31, 2005న ఒక పత్రికా ఇంటర్వ్యూలో బహిరంగంగా
వెల్లడించారు. అమెరికాలో సైతం అప్పట్లో వాటర్‌గేట్ కథనాలు ప్రచురించడానికి
ఇతర పత్రికలు అప్పట్లో సాహసించలేదు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం అయిన భారతదేశంలో పత్రికా
స్వాతంత్య్రం మాత్రం పలు ఆంక్షలకు గురవుతున్నదని రిపోర్టర్స్ వితవుట్
బోర్డర్స్ తమ వార్షిక నివేదికలో పేర్కొన్నది. మొత్తం 180 దేశాలలో పత్రికా
స్వాతంత్య్రంలో ఈ సంస్థ భారత్‌కు 140 స్థానం ఇచ్చింది. భారతదేశంలో
పాత్రికేయులు పాలక పక్షం, ప్రభుత్వానికి సంబంధించిన వారినుండే గాక
ప్రయివేటు గ్రూపులనుండి సైతం దాడులకు గురవుతున్నారు. రాజకీయ పక్షాలు,
తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నేరస్థుల బృందా లు, ప్రదర్శకుల నుండి తరచూ
దాడులకు గురవుతున్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించినా, ప్రసారం
చేసినా ఏమవుతుందో చూడండి అంటూ ఒక ముఖ్యమంత్రి బహిరంగ సభలో హెచ్చరికలు
జారీచేయగలగడం చూశాము. ముఖ్యంగా జమ్ముకాశ్మీర్, ఛత్తీస్‌ఘడ్, ఈశా న్య
రాష్ట్రాలలో పాత్రికేయులు అభద్రతాయుత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
న్యాయస్థానాలు, పోలీసు అధికారులు సైతం పత్రికలవారినే దూకుడుగా వార్తాకథనాలు
ఉండరాదనే రీతిలో మందలిస్తుండటాన్ని చూస్తున్నాం. పత్రికలపై దాడులకు
పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం చూడలేకపోతున్నాము. గత సాధారణ
ఎన్నికలకు ముందు ఫ్రీడంహౌస్ ప్రచురించిన నివేదిక ప్రకారం భారతదేశంలో
పత్రికా సంస్థల, యజమానుల జోక్యం సైతం పత్రికా స్వాతంత్య్రాన్ని
హరిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అందుకనే
ఐక్యరాజ్యసమితి 2012లో పాత్రికేయుల భద్రతకోసం ఒక కార్యాచరణ ప్రణాళికను
రూపొందించింది. పాత్రికేయులపై పాల్పడే నేరాల పట్ల ఉపేక్షతను తొలగించే
దినంగా నవంబర్ 2ను ప్రకటించింది.
పౌరులు అన్ని విషయాలు తెలుసుకొని, సమాజ అభివృద్ధి అంశాలలో పూర్తి
భాగస్వామ్యం అందించడానికి అవసరమైన భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని ప్రాథమిక
హక్కుగా గుర్తించి, అమలుజరిగే విధంగా చూడటమే ఈ ప్రయత్నపు లక్ష్యం.
ఐక్యరాజ్యసమితి పిలుపు అందుకొని పాత్రికేయులకు రక్షణ కల్పించడానికి అవసరమైన
నియమ నిబంధనలు రూపొందించడం పట్ల నరేంద్రమోడీ ప్రభుత్వం తగు చొరవ చూపగలదని
ఆశిద్దాం. అయితే పత్రికా స్వాతంత్య్రం పట్ల ఈ ప్రభుత్వం తన ఆసక్తిని ఇంకా
ప్రదర్శించవలసి ఉంది. గత పదేళ్ళ యు.పి.ఏ పాలనా కాలంలో ప్రభుత్వంలో జరిగిన
పలు భారీ అవినీతి కుంభకోణాలు పత్రికల ద్వారానే వెలుగులోకి వచ్చాయి. ఆయా
కుంభకోణాలు వెలుగులోకి రాకుండా ఉండడానికి పలు పత్రికా సంస్థలు సహకరించినా,
ఒక దశలో సాధ్యంకాలేదు. ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాలు క్రియాశీల పాత్ర
వహించడం ప్రారంభించడంతో మీడియా సంస్థలు ప్రేక్షకపాత్ర వహించలేకపోయాయి.
యు.పి.ఏ పాలనా కాలంలో పత్రికా ప్రతినిధులకు ఢిల్లీలో అన్ని ప్రభుత్వ
కార్యాలయాలకు వెళ్ళడానికి, అధికారులను, రాజకీయ నాయకులను కలవడానికి
ఇబ్బందులు ఉండేవి కావు. అయితే ప్రస్తుతం నరేంద్రమోడీ ప్రభుత్వంలో
పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కొందరు పార్టీ ఎంపీలు, మంత్రులు
బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉండటంతో ప్రభుత్వ ప్రతిష్టకు ప్రమాదం ఏర్పడింది.
దాంతో మం త్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు పత్రికల వారితో గతంలో వలే
స్వేచ్ఛగా వ్యవహరించకుండా కట్టడిచేయవలసి వస్తున్నది. ప్రభుత్వ
కార్యాలయాలకు, మంత్రుల ఇండ్ల కు పత్రికలవారు యధేచ్ఛగా వెళ్ళి ప్రతి విషయం
గురించి ఆరాతీసే పరిస్థితులు నేడు లేవని చెప్పవచ్చు.
చైనాలో మాదిరిగా పత్రికల కళ్ళకు గంతలు కట్టడం ద్వారా ప్రజలను శాశ్వతంగా
మాయపుచ్చలేమని అందరూ గ్రహించాలి. చైనాలోని హాంకాంగ్‌లో నేడు న్యాయం,
స్వాతంత్య్రంకోసం అంటూ ప్రజలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
వాటికి సంబంధించిన వార్తలు చైనాలోని ఇతర ప్రాంతాలలో తెలియనే తెలియదు.
టిబెట్‌ను చైనా ఆక్రమించి, అక్కడ నిరసనలకు అవకాశం లేకుండా, స్థానిక ప్రజలను
తమ సంస్కృతి, సాంప్రదాయాలనుండి దృష్టి మళ్ళించడానికి గత 55 సంవత్సరాలుగా
నిరంకుశంగా ప్రయత్నం చేస్తున్నది. అయినా స్థానిక ప్రజలలో మాత్రం నిరసన,
అసమ్మతిలను కట్టడి చేయలేకపోతున్నది. 1959 తర్వాత జన్మించిన యువతరం నేడు తమ
ధార్మిక అధినేత దలైలామాను టిబెట్‌కు రప్పించాలని కోరుతూ ఆందోళనలు
సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికి 132 మంది యువకులు నిరసన ఉద్యమాలలో భాగంగా
ఆత్మాహుతులకు పాల్పడ్డారు. చైనా పతాకం నీడలో జన్మించిన యువత దృష్టిని సైతం
పత్రికా సమాచారాన్ని, భావప్రకటనా స్వాతంత్య్రాన్ని అణచివేసినా చైనా కట్టడి
చేయలేకపోతున్నది. టిబెట్‌పై 55 ఏళ్ళయినా పూర్తి ఆధిపత్యం
వహించలేకపోతున్నది.
అత్యవసర పరిస్థితి కాలంలో పత్రికలపై ఉక్కుపాదం మోపి, జాతీయ నాయకుల
అరెస్టులను సైతం ప్రచురింపకుండా నిరోధించినా ప్రజలలో నిరసనను ఇందిరాగాంధీ
కట్టడి చేయలేకపోయినది. చివరకు తప్పనిసరి పరిస్థితులలో ఎన్నికలు జరిపి,
పరాజయానికి గురయ్యారు. అయితే భారతదేశంలో పత్రికలకు పరిధులులేని
స్వాతంత్య్రం ఉందని చాలామంది భావిస్తుంటారు. పలు అవినీతి కుంభకోణాలను
వెలుగులోకి తేవడంలో, అధికార పక్షాలను ఇరకాటంలో పడవేయడంలో పలు పత్రికలు,
న్యూస్ ఛానళ్ళ క్రియాశీల పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు. అయితే ఇటువంటి
సంఘటనలు పరిమితంగానే జరుగుతున్నాయి. మొత్తంమీద చూస్తే పలు పరిమితులు,
వత్తిడులు, ప్రభావాలు మీడియాను ప్రభావితం చేస్తున్నట్లు అంగీకరించక తప్పదు.
పలు సందర్భాలలో మీడియా సంస్థలు సైతం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుండటం
జరుగుతున్నది. కొన్ని రాజకీయ, సామాజిక, ఆర్థిక అభిప్రాయాలకు, ప్రభావాలకు
పరిమితంకావడం సైతం చూస్తున్నాం. వార్తను వార్తగా ప్రచురించడం అన్ని
సందర్భాలలో సాధ్యంకావడం లేదని అంగీకరించక తప్పదు.
ప్రభుత్వం సైతం వాస్తవాలను పత్రికలకు చెబితే అధికారులపై చర్యలు
తీసుకుంటున్న ఉదంతాలు జరుగుతున్నాయి. కర్ణాటకలో నిజాయితీ అధికారిణిగా
పేరొందిన రష్మిమహేష్‌ను మైసూరులోని ఐ.ఎ.ఎస్. అధికారులకు శిక్షణ కల్పించే
పరిపాలనా శిక్షణా సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. అంతగా ప్రాధాన్యత
లేదనుకున్న ఆ పదవిలో ఉండి ఆమె అంతకుముందు ఆరు సంవత్సరాల కాలంగా రూ.100
కోట్ల మేరకు సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని కనుగొని నివేదికలు
పంపారు. ఈ అవినీతిని వెలుగులోకి తేవడానికి ఆమెకు సహకరించిన ఒక క్యాంటిన్
మేనేజర్ అనూహ్యం గా హత్యకు గురయ్యారు. మృతదేహం చూడటానికి వెళ్ళిన ఆమెపై
భౌతికంగా దాడి జరిపి, ఆమెను గాయపరచారు. ఈ సందర్భంగా ఆమె పత్రికల వారితో
మాట్లాడితే అది సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకం అంటూ ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి ఆమెకు షోకాజ్ నోటీస్ జారీచేశారు. అయితే మరింత అప్రదిష్ట
ఎదుర్కోవలసి వస్తుందని ఆమెను సస్పెండ్ చేయలేదు. పత్రికలను తమ ఇమేజ్
పెంచుకొనే సాధనాలుగా మాత్రమేగాక ప్రజాస్వామ్య వికాసానికి పత్రికా
స్వాతంత్య్రం ఆయువుపట్టు అని గ్రహించాలి. ఆదరించాలి.
మానవుని మేధ ఎ౦త గొప్పది?
మానవుని మేధ ఎ౦త గొప్పది?
ఒక రచయిత ఒక సినిమా పాటలో తన అభిప్రాయాన్ని ఈ విధ౦గా తెలియజేస్తున్నారు. "గర్భ౦లో జని౦చేటి అ౦తా గతి౦చు మేధలో పుట్టిన నీకు మృత్యువే లేదు....",ఈ వాక్య౦లోకి కాస్త లోతుగా వెల్లి అర్ధాన్ని వేతికే ప్రయత్న౦ చేద్దా౦. 'గర్భ౦లో జని౦చేటి అ౦తా గతి౦చు', అ౦టే గర్భ౦లో పుట్టినది లేదా గర్భ౦ను౦చి వచినది అ౦టే ప్రాణి అది మనిషి అయినా, జ౦తువయినా, భూ గర్భ౦లో ను౦చి వచ్చిన మహా వృక్ష౦ అయినా మరియు ఈ భూమి మీది నమరియే జీవరాశి అయినా ఎప్పటికో ఒకప్పటికి అ౦తరి౦చక మానదు. ఇప్పుడు రె౦డో వాక్య౦ చూద్దా౦ 'మేధలో పుట్టిన నీకు మృత్యువే లేదు..', మేధ అ౦టే తేలివి, నిజానికి తెలివి అన్ని పరిణితి చె౦దిన జీవులలో ఉ౦టు౦ది. కాని ఈ భూమి మీద అన్ని జీవ రాశులలో ఉన్నత౦గా పరిణితి చె౦దిన జీవులలో మానవడు ఒకడని చెప్పట౦ అవసర౦ లేదు. అయితే 'మేధ'లో ఏమి జనిస్తు౦ది? 'ఒక ఆలోచన', 'ఒక ఊహ' మరియు ఒక 'భావన'. ఈ ఆలోచనలను, భావనలను, ఊహలను కార్యరూప౦లో పేట్టగలిగే ఒకే ఒక జీవి మానవుడు అ౦దుకే మొత్త౦ ప్రప౦చాన్ని తన కమా౦డల౦తో శాసిస్తున్నాడు. అలా మానవుని మేధలో పుట్టిన ఆలోచనలకు అ౦త౦ ఉ౦డదు. ఉదాః ఈ వాక్యాన్ని రచి౦చిన రచయత మాటల్లో వి౦దా౦, "టెలిఫోన్ ను కనిపెట్టిన 'అలగ్జా౦డర గ్రహ౦బెల్' నేడు లేడు కాని ఆయన కనిపేట్టిన టెలిఫోన్ మాత్ర౦ సజీవ౦గా ఉ౦ది. గ్రహ౦బెల్ ఒక తల్లి గర్భ౦లో ను౦చి జని౦చాడు కాబట్టి గతి౦చాడు కాని ఫోన్ తన మేధలో పుట్టి౦ది కాబట్టి దానికి అ౦త౦ లేదు". నిజ౦గా ఇది ఒక గోప్ప భావన కదా! ఈ భావనకూడా ఒక రచయత మేధలో పుట్టి౦ది కాబట్టి గోప్ప భావన అయి౦ది. కనుక మానవుని మేధ ఎ౦తో గోప్పది కదా!.
ఈ అ౦శాన్ని ఇ౦కా వివర౦గా వివరి౦చాలి, దానికి నేను కొన్ని అ౦శాలని శేకరి౦చి వివరి౦చాలి. మొదటిప్రయత్న౦గా, నా ఈ రచనని సినిమాతో మొదలుపేట్టాను కాబట్టి, ప్రప౦చ సినీ ప్రిస్రమలో ఒక గోప్ప సినిమాని ఆధార౦గా చేసుకుని ఒక ప్రయత్న౦ చేస్తున్నాను. అదే 'జేమ్స్ బా౦డ్' సినిమా ఒక రచయత మేధలో పుట్టిన ఊహ.
ఈ సినిమానే ఎ౦దుకు?
'మై నేమ్ ఈస్ బా౦డ్, జేమ్స్ బా౦డ్'అనే పొగరూ వగరూ కలగలిపిన డైలాగుతో ప్రప౦చ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగి౦చిన సినిమాలు జేమ్స్ బా౦డ్ సినిమాలు. ఈ డైలాగుతో పాటు బా౦డ్ పాత్రలు చేసిన సాహసాలు, సినిమాలో యువత మనసును దోచుకునే మా౦చి రొమాన్స్, సస్పెన్స్, యాక్షన్, గ్రాఫిక్స్ టెక్నాలజీ అన్నీ కలగలిపి సగటు ప్రేక్షకుడి మదిని దొ౦గిలి౦చాయి అని అనట౦లో స౦దేహ౦ లేదు. ఇప్పటికి ౧౪ నవలలు, ౨౨ సినిమాలు (౨౦౦౮ నవ౦బర్ లో విడుదలైన క్వా౦టమ్ ఆఫ్ సోలేస్ తో కలిపి), బా౦డ్ గా చేసిన మొత్త౦ హీరోలు ౬గురు, మొత్త౦ వ్యయ౦ $౮౫.౯౫ కోట్లు, మొత్త౦ వసూళ్లు $౩౦౫.౩౩ కోట్లు (క్వా౦ట౦ ఆఫ్ సోలేస్ మినహా), ఇ౦కా కోట్లాది మ౦ది సినీ ప్రేక్షకులు. ౧౯౬౨ ను౦చి ౨౦౦౮ వరకు ౪౮ స౦వత్సరాల సుదీర్ఘ ప్రస్థాణ౦, ఎన్ని తరాల ప్రేక్షకులు? బహుశా మోదటి బా౦డ్ సినిమాని చూసిన వారిలో చాలా మ౦ది ఇప్పటికి తనువు చాలి౦చి ఉ౦డవచ్చు కాని బా౦డ్ సినిమాలు మాత్ర౦ ఇ౦కా బ్రతికే ఉన్నాయి. ౨౦వ శతాబ్ధ౦లో మోదలైన బా౦డ్ ప్రస్థాణ౦ ౨౧వ శతాబ్ధ౦లో కూడా తన ఉనికిని కొనసాగిస్తూ ఉ౦ది. నిర్మాతలు మారినా, దర్శకులు మారినా, సినిమా పేర్లు మారినా, కధానాయకులు, నాయికలు మారినా 'బా౦డ్' మాత్ర౦ మారలేదు. ప్రప౦చ జనాభాలో సగ౦ జనాభా కనీస౦ పావు భాగమయినా బా౦డ్ సినిమాల్ల ఒక్కదానినైనా చూసి ఉ౦డ వచ్చని అ౦చనా.
అసలు బా౦డ్ ఎలా పుట్టాడు?
మరలా ఒకసారి మొదట చేప్పుకున్న పాటని ఒకసారి గుర్తు చేసుకు౦దా౦ అ౦దులో ఇ౦కొక వాక్య౦ "రోబో... రోబో పలు భాషలు వస్తేనే౦...నా పితృ భాష తెలుగు కదా...", పితృ భాషా? అవును ఆ సినిమాలో రోబోని ఒక మగవాడు తయారు చేస్తాడు కాబట్టి, మగవాడి మేధలో పుట్టాడూ కాబట్టి తన భాష పితృ భాష అయి౦ది.
ఐయాన్ ఫ్లెమి౦గ్ ఇ౦గ్ల౦డ్లో జన్మి౦చాడు, కొన్ని బ్రిటిష్పత్రికలలో ఉప స౦పాదకుడుగా పనిచేసేవాడు. చివరికి మాస్కో (రష్యా) లో పాత్రికేయునిగా పనిచేసేవాడు. ఆ రోజుల్లో, ఆరుగురు బ్రిటిష ఇ౦జనీర్లు ఓ రష్యన యువతి సాయ౦తో గూఢచర్యానికి పాల్పడుతున్న వార్తొకటి రాశాడు. ఆ వార్తనుకూడా మామూలుగా కాకు౦డా ఒక సస్పెన్స థ్రిల్లర్ ను తలపి౦చేలా తీర్చిదిద్దాడు. ఆ రచనా శైలికి పాఠకులు ఆకర్షితులయ్యారు. తరువాత రె౦డవ ప్రప౦చ యుద్ధ కాల౦లో బ్రిటిష రాయల్ నేవీలో నేవల్ ఇ౦టిలిజెన్స్ డైరక్ట్రర దగ్గర అసిస్టె౦ట్ గా చేరి , గొప్ప గూఢచారి, అతని గురువైన సర్ విలియమ్ స్తిఫెన్సన్ దగ్గర గూఢచర్య౦ గురి౦చి మెళుకువలు నేర్చుకున్నారు. యుద్ధ౦ ముగిసాక బ్రిటిష్ రాయల్ నేవల్ ను వదిలి ఒక పత్రికలో స౦వత్సరానికి రె౦డు నెలలు సెలవులు తీసుకు౦టానని షరుతులతో చేరాడు. ఆ రె౦డు నెలల సెలవులలో ఫ్లెలిమి౦గ్ జమైకాలోని తన స్నేహితుని ఎస్టేట్ లో జల్సాగా, క్లబ్బుల్లో తిరిగి గడిపేవాడు. తరువాత అన్ని వ్యసాలను వదులుకుని, పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడే కాని చాలాకాల౦గా ఉన్న ఒక మ౦చి డిటెక్టివ్ పాత్రను సృష్టి౦చాలనే కోరిక మాత్ర౦ తీరలేదు. కొ౦త కాల౦ తరువాత తన అనుభావలను జోడి౦చి తన నవలను రాయటానికి సిద్ధ్దమయ్యాడు. కాని తన నవలలోని కధానాయకుని పేరు విషయ౦లో మాత్ర్ర౦ ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. చివరికి ఓ రోజు ఉదయ౦ ఫ్లిమి౦గ్ కాఫీ తాగే సమయ౦లో ఆయన భార్య ఏదో పుస్తక౦ తిరగేస్తూ కనిపి౦చి౦ది. అది తన స్నేహితుడైన జేమ్స్ బా౦డ్ రచి౦చిన "ఫీల్డ్ గైడ్ టు బర్డ్స్ ఆఫ్ వెస్టి౦డీస్". ఆ టైటిల్ క్రి౦దున్న తన స్నేహితుని పేరు బాగా ఆకట్టుకు౦ది, తన నవలా కధా నాయకునికి ఆ పేరును ఖరారు చేసాడు. రూపు రేఖలు తన గురువైన స్టిఫెన్సన్ వి, పేరు తన మిత్రుడైన జేమ్స్ బా౦డ్ వి ఇలా బా౦డ్ పాత్ర ఫ్లెమి౦గ్ రచనలో ప్రాణ౦ పోసుకు౦ది. తన మొదటి బా౦డ్ నవల 'కాసినో రాయల్' ౧౯౫౩ లో రచి౦చాడు.
జేమ్స్ బా౦డ్ ఎలా ఉ౦టాడు?
బహుశా ఈ షయ౦ బా౦డ్ సినిమాలు బాగా ఇష్ట౦గా చూసే వారికి తెలిసిన విషయమే, అయితే ఇప్పతివరకూ చూడని మరియు ఒకటి రె౦డు సినిమాలు చూసిన వారికి తెలియక పోవచ్చు. ఇక్కడ ఇ౦కొక చమత్కార౦ ఏమిట౦టే సాధారణ౦గా పిల్లలలకు తమ తల్లివి కాని త౦డ్రివికాని పోలికకు అలవాట్లు నడవడైక వస్తాయి అ౦టారు. అదే తరహాలో బా౦డ్ కి కూడా తన త౦డ్రి అయిన ఫ్లేమి౦గ్ నడవడికలు, అలవాట్లు వచ్చాయి. ఫ్లెమి౦గ్ కు కాఫీ అ౦టే ప్రాణ౦. మధ్య౦, ధూమపాన౦ మహా ఇష్ట౦, కురచ చేతుల చొక్కాలు ధరి౦చడ౦ అ౦టే యమ క్రేజ్. బా౦డ్ కు కూడా అచ్చ౦ ఇవే ఇష్ట౦, ఎలా అ౦టే ఇప్పుడు చెప్పినవన్నీ బా౦డ సినిమాల్లో మనకు కనిపిస్తాయి. అ౦టే ఫ్లెమి౦గ్ తనను తాను బా౦డ్ సినిమాలలో ప్రతిబి౦బి౦చుకున్నాడన్నమాట. దీనికి ఇ౦కొక స్పష్టమైన సన్నివేశాన్ని మన౦ ఆయన నవలల్లో ఒకటైన, సినిమాగా తీసిన 'టుమారో నెవర్ డైస్'లో చూడవచ్చు. అదేమిట౦టే, ఓ సారి ఓ పత్రికఆధికారి మాజీ భార్య ఫ్లెమి౦గ్ కు ఈ విధ౦గా ఒక ప్రేమ లేఖ రాసి౦దట "నేను ప్రప౦చమఓతా తిరిగాను అనేక నగరాలు చూసాను, అక్కడి అ౦దగత్తెల్౦తా నీ గురి౦చి చేప్పారు. నీతో ప్రేమణ౦ నడిపామని ఒప్పుకున్నారు. అయినా సరే నువ్వ౦టే నాకిష్ట౦... నేను నిన్ను పెళ్లి చేసుకు౦దామనుకు౦టున్నాను". చూడ౦డి బా౦డ్ ఎ౦త రసికుడో, అదే బా౦డ్ సినిమాలలో కనిపిస్తు౦టు౦ది. సరే ఇక సినిమా విషయానికి వద్దా౦, ఆ సినిమాలో 'టుమారో నెవర్ డైస్' అనేది చైనా లోని ఒక పత్రికా స౦స్థ, ఆ పత్రికాధినేత భార్య బా౦డ్ ను ప్రేమిస్తు౦ది. ఇలా చాలా తన పోలికలను బా౦డ్ పాత్రల్లో చొప్పి౦చాడు.
జేమ్స్ బా౦డ సినిమాల గురి౦చిః
ఫ్లెమి౦గ్ మోదటి నవల 'కాసినో రాయల్'అయినప్పటికీ మొదటి సినిమా మాత్ర౦ 'డాక్టర్ నో'(౧౯౬౨). దీనికి ఆల్బర్ట్. ఆర్. బ్రకోలి మరియు హ్యారి సాల్ట్జమన్ లు ఇ. ఒ. ఎన్. (ఎవ్రీథి౦గ్ ఆర్ నథి౦గ్) నిర్మాణ స౦స్థ ద్వారా నిర్మి౦చారు. టెరన్స్ య౦గ్ మొదటిసారిగా బా౦డ్ సినిమాకు దర్శకత్వ౦ వహి౦చాడు. ఈ సినిమాలో కధానాయకుదు షాన్ కానరీ, అ౦టే మొదటి షాన్ కానరీ అన్నమాట.
బా౦డ్ సినిమాలు-హీరోలుః
షాన్ కానరీః
డాక్టర నో (౧౯౬౨)
ప్రమ్ రష్యా విత లవ్(౧౯౬౩)
గోల్డ్ ఫి౦గర్(౧౯౬౪), థ౦డర్ బాల్(౧౯౬౫)
యు ఓన్లి లివ్ ట్వయిస్(౧౯౬౭)
డైమ౦డ్స్ ఆర్ ఫరెవర్(౧౯౭౧)
జార్జ్ లాజన్బీః
హర్ మెజిస్టీస్ సిక్రెట్ సర్వీస్(౧౯౬౯)
రోజర్ మూర్;
లివ్ అ౦డ్ లెట్ దై(౧౯౭౩)
ద మాన్ విత్ ద గోల్డన్ గన్(౧౯౭౪)
ద స్పై హు లవ్డ్ మీ(౧౯౭౭) ఫర్ యువర్ ఐస్ ఓన్లీ(౧౯౮౧)
ఆక్టోపసీ (౧౯౮౯), ఎ వ్యూ టు ఎ కిల్(౧౯౮౫)
తిమోతి డాల్టన్;
ద లివి౦గ్ డే లైట్స్(౧౯౮౭)
లైసెన్స్ టు కిల్(౧౯౮౯)
పియర్స్ బ్రోస్నన్;
గోల్డెన్ ఐ(౧౯౯౫)
టుమారో నెవర డైస్(౧౯౯౭), ద వర్ల్డ్ ఈజ్ నాట ఎనఫ్(౧౯౯౯), డై ఎనదర్ డే(౨౦౦౨)
డానియల్ క్రెగ్;
కాసినో రాయల్(౨౦౦౬), క్వా౦టమ్ ఆఫ్ సోలేస్(౨౦౦౮), బా౦డ్ ౨౩ (త్వరలో).
బా౦డ్ అమ్మాయిలు;
ఉర్సులా ఆ౦డ్రస్, హ్యానర్ బ్యాక్ మాన్, డయానా రిగ్, జిల్ సెయి౦ట జాన్, బార్బరా బాచ్, కారోల్ బొకే, ఫామ్కే జాన్సన్, హాలీ బెర్రీ, యవా గ్రీన్ ఓల్గా కురిలె౦కో.
బా౦డ్ కోస౦ ప్రట్యేక౦గా తయారు చేసిన కార్లు:
ఆస్టన్ మార్టిన్ డీబి౫, లోటస్ ఎస్ప్రిట్, లోటస్ టర్బో, ఆస్టన్ మార్టిన్ వి౮, బిఎ౦డబ్ల్యూ జెడ్౩, బిఎ౦డబ్ల్యూ ౭౫౦ఐఎల్, బిఎ౦డబ్ల్యూ నెడ్౮, ఆస్టన్ మార్టిన్ ఐ౧౨, ఆస్టన్ మార్టిన్ డీజిఎస్.
ముగి౦పు:
౧౯౦౮లో పుట్టి, ౧౯౬౫లో చనిపోయిన ఫ్లెమి౦గ్ ఇప్పటికీ మన మధ్య బా౦డ్ రూప౦లో జీవిస్తూనే ఉన్నాడు, కారణ౦ తన మేధస్సు. తన మేధలో పుట్టిన ఊహలో జని౦చిన ’జేమ్స్ బా౦డ్’ అనే పాత్ర ఇ౦కా బ్రతికి ఉ౦ది, ఇ౦కా ఎన్నాల్లు ఇలా బ్రతికి ఉ౦టు౦దో తెలియదు కానీ ఫెలిమి౦గ్ మాత్ర౦ మన మధ్య బ్రతికే ఉ౦టాడు. ఆల్బర్ట్.ఆర్. బ్రకోలి బ్రతికి ఉ౦డకపోవచ్చు కానీ అతని ఆలోచనలో పుట్టిన నిర్మాణ స౦స్థ (ఇ.ఒ.ఎన్) మాత్ర౦ ఇ౦కా బా౦డ్ సినిమాలను నిర్మిస్తూనే ఉ౦ది. బా౦డ్ పాత్ర ఎ౦తో మ౦ది నటులకు ప్రప౦చ వ్యాప్త౦గా మ౦చి పేరును తెచ్చి పెట్టి౦ది. బా౦డ్ పాత్ర వాహన నిర్మాణ ర౦గ౦లో కొత్త మార్పులను తెచ్చి౦ది. ఎ౦తో మ౦దికి జీవనాధర౦ అయి౦ది. కోట్లమ౦ది ప్రేక్షకుల హృదయాలను దోచి౦ది.
"బా౦డ్’" ఒకప్పటి ఊహ.....
"బా౦డ్" ఒకప్పటి నవలా కధానాయకుడు...
తరువాత వె౦డి తెర హీరో....
ఇప్పుడు బా౦డ్ మనలో ఒకడు....ఫ్లెమి౦గ్ సృష్టి౦చిన బా౦డ్ మనకు కనిపి౦చని ఒక ప్రప౦చ౦లో ప్రతి దిన౦ మనల్ని తన ధైర్య సాహసాలతో, విన్యాసాలతో చెడును౦చి మనల్ని, మన ప్ర౦చాన్ని కాపాడుతూనేఉన్నాడు...ఉ౦టాడు.
స్వచ్ఛ భారతం
"స్వచ్ఛ భారతం ".
భారత
దేశంలోని ప్రజల్లో చాలా మందికి నిర్లక్ష్యం, అలక్ష్యం మరియు నిర్లిప్తితా
భావాలు చాలా ఎక్కువ. ఈది నిజం. ..ఈ నిజాన్ని ఒప్పుకోవలసిన సమయం వచ్చింది.
ఏందుకంటే... పరిసరాల శుభ్రత కోసం భారత ప్రభుత్వం ఏనాడో ఉద్యమించిది. ....
పలు రకాల బౄహత్తర కార్యక్రమాలను కూడా చేపట్టింది. 1986లో సెంట్రల్ రూరల్
శానిటేషన్ కార్యక్రమాన్ని పల్లెల్లో పారిశుధ్యాన్ని వేగవంతం చేయాలనే
లక్ష్యంతో ప్రారంభించింది. డీనికి కొన్ని మార్పులు చేసి అందరికీ
మరుగుదొడ్లు అందుబాతులోకి తీసుకువస్తూ దీని పరిధిని విస్తరిస్తూ 1999లో
టోటల్ శానిటేషన్ కేంపైన్ గా మార్చారు. మరలా 2012లో దీనికి మార్పులు చేసి "
నిర్మల్ భారత్ అభియాన్ " గా మార్చారు. మరలా ఇప్పుడు " స్వచ్ఛ భారతం "
పేరుతో విప్లవాన్ని తీసుకొస్తున్నారు. ఖావునా, రెండు దశబ్ధాలు మారినా
మనలో ఓ కాసింత మార్పు కూడా కలుగలేదు.
తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య గణాంకాలు -3 (2005-06 ) ప్రకారం ఇప్పటికీ భారత
దేశ జనాభాలో 33 % మంది కుటుంభీకులకు మాత్రమే మరుగుదొడ్లు
అందుబాటులోఉన్నాయి. ఇది పట్టణాలలో 83.7 % కగా గ్రామాలలో కేవలం 16 % మందికి
మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 67 % భారతీయులకు మరుగుదొడ్లు
అందుబాటులో లేవంటే తీవ్రంగా అలోచించాల్సిన విషయమే. గ్రామాల్లో నివసించే
590 మిలియన్ల మంది ఇంకా భహిరంగానే మలవిసర్జన జరుపుతున్నారు. ఈందులో చలా
మందికి మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ భహిరంగానే విసర్జించుటకు
మొగ్గు చూపుతున్నరు. ఈ ఆలోచన మారాలి. ఇది చాలదూ. ... మన లో చాలా మంది పైన
పేర్కున్నట్టు నిర్లక్ష్యం, అలక్ష్యం మరియు నిర్లిప్తితా భావంతో ఉన్నామని
చెప్పటానికి.
"కుటుంబాలే సమాజానికి ఊయల లాంటివి " అని సోక్రటిస్ చెప్పిన విధంగా. ...
కుటుంబాలే సమాజాన్ని పెంచి పోషిస్తుంటాయి కుటుంభం బాగుంటే... కుటుంబ
వ్యక్తులు బాగుంటారు, కుటుంబ వ్యక్తులు బాగుంటే....సమాజం బాగుంటుంది.
ఎందుకంటే సమాజం అంటే మనుషులు..... కాబట్టి, " స్వచ్ఛ భారతం" కోసం ఇప్పుడు
ఎన్ని చేసినా అవి స్వల్ప కాలానికి కాకుండా దీర్ఘ కాలంగా కొనసాగాలి. "
మొక్కై వంగనిది మానై వంగునా" అన్న నానుడిని అనుసరించి ఇప్పటికీ
క్రమశిక్షణ లేని పెద్దలు ( తల్లి దండ్రులు ) ను వదిలేసి పిన్నలలో ఈ ఆలోచన
ను ధృఢంగా నాటాలి. చిన్నప్పుడు మేము చదువుకున్న పరిసరాల విజ్ఙానం -1,
పరిసరాల విజ్ఙానం -2 అని ప్రత్యేక పాఠ్య పుస్తకాల మాదిరిగానే ' పరిసరాల
పరిశుబ్రత ' ( ఆ పాఠ్య పుస్తకాలలో ఉన్నప్పటికీ ) అనే పాఠ్య పుస్తకాలను
ప్రవేశ పెట్టాలి. ఇవి అప్పటికే పరిమితం కాకుండా డిగ్రీ, పీజి ల వరకూ
కొనసాగుతూ ఉండాలి. ఎందుకంటే.... ఒక నిర్ణీత సమయానికి చేరుకున్నక
విద్యార్ధుల ఆలోచనలు మారిపోతున్నాయి. కొత్త ఆలోచనలు ( మార్కులు,
ర్యాంకులూ, పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగం, విదేశాలు, పెద్ద పెద్ద పేరున్న
కంపెనీలు, ఎక్కువ జీతం, విలాసవంతమైన జీవితం, పరువు, ప్రతిష్ట, గౌరవం,
గుర్తింపు. ...). పాత ఆలోచనలను భర్తీ చేస్తూన్నాయి. ఇక్కడ నేను ఇంకొక
విషయం చెప్పదల్చుకున్నాను. గాంధీగారి జీవిత చరిత్ర ' సతయ్ సోధన ' చదువుతూ
ఉండగా మా ఇంటి పైన ఉంటున్న తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయి వచ్ఛి '
ఏమి చదువుతున్నారు?' అని అడిగింది. పుస్తకం కవరు పేజీ చూపాను. "గాంధీ.
..." అని కనుబొమ్మలు ఎగురవేసి రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది (మీకు
దండం. .. అన్నట్తుగా వ్యంగ్యంగా). ఈ పుస్తకం చదువమని సిఫ్హారసు చేసాను.
దానికి ఆమె ఇలా సమాధానమిచ్ఛింది. "ఇప్పుడెందుకు అన్నయ్యా.
....ఎక్జ్సాంసూ....9th క్లాసూ. ....తరువాత 10th క్లాసూ... అన్నీ 10th
క్లాసు తరువతే. ...." అని వెల్లిపోయింది. ఈ ఒక ఉదాహరణ చాలదా ఇప్పటి
పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో. .... ఎటువేపు పరుగులు తీస్తున్నారో
చెప్పటానికి.
నిన్న మొన్న చదివిన విషయాలేగుర్తుండట్లేదు...అలాంటిది ఎప్పుడో చదివిన
విషయాలు ఎలా గుర్తుంటాయి? ఇప్పటి అల్ట్రా మోడ్రన్ తల్లిదండృల నుండి
సామాన్య, మధ్యతరగతి తల్లిదండృల వరకూ అందరూ తమ పిల్లల్ని పెద్ద పెద్ద
పేరున్న పాఠశాలల్లో చదివించాలి, ఆంగ్లం బాగా రావాలి, మచి మార్కులు
రావాలి, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు రావాలి అనే పెద్ద పెద్ద
ఆలోచనలతో పెంచేవారే తప్పా (చాలావరకూ) సమాజానికి పనికివచ్ఛే చిన్న చిన్న
ఆలోచనలను వారిలో చొప్పించడంలో విఫలమవుతున్నారు అనటంలో సందేహం లేదు.
చూడండి పక్కన ఉన్న చిత్రాన్ని. చదువు కుంటున్న విధ్యార్ధులు. ....
బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నారు. ... వీల్లకి చదువు ఏం చెప్తుంది.
ఇలాంటి పరిస్థుతులలో ఉన్నము. కాబట్టి స్వచ్ఛ భారతం రావాలి అంటే మొదట మనలో
మార్పు రావాలి. స్కూల్లలోను, కాలేజీల్లొ నిరంతరం దీనినిగురించి వక్కానించి
చెప్పాలి.
బాలల హక్కులు - బాధ్యతలు
స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కులు మొదలైన వాటన్నిటికీ సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. వాటిని సాధించే క్రమంలో గొప్ప అనుభవాల్ని సంపాదించాం. కానీ, ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కుల విస్తారంలోకి పిల్లల్ని చేర్చం.
నేటి ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో సైతం తల్లిదండ్రులు, టీచర్లు, పనిచేసేచోట్ల యజమానులు ఇంకా బయట ప్రతీచోటా పెద్ద వాళ్ళు పిల్లల్ని కొట్టటం, తిట్టటం, అవమానించటం, స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకోవడం, సరియైన ఆహారం అందించకపోవడం జరుగుతోంది, ఇది ఘోరమైన నేరం.
జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మానవహక్కుల దృక్పధం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొనిపోయింది. కానీ పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదన్నారు గనుక తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులూ ఉంటాయనుకునే దుష్టనీతి నుంచి మనం ఇంకా బయటపడలేదు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, బుద్ధి జీవులనబడే వాళ్ళు కూడా - దారిద్ర్యం, నిరుద్యోగం, వివక్షత వంటి పరిస్ధితుల్ని మూలకారణాలుగా పరిగణిస్తూ - పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని సమర్ధిస్తున్నారు.
అందుకే పిల్లల హక్కులు, పిల్లల సంరక్షణ అనే దృక్పథాలు బలపడటానికి ఒక బృహత్ ప్రచారం, ఒక ఉద్యమం అవసరమయ్యాయి. ఈ నేపధ్యంలోనే ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. దీనికి ముందు కూడా పిల్లల హక్కులకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, ఒడంబడికలు, అనేక ప్రయత్నాలు, కార్యక్రమాలు జరిగినప్పటికీ ఈ ఒడంబడిక విశిష్టమైనది, విలక్షణమైనది, సమగ్రమైనది. ఇది పిల్లల పౌర రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పూనుకున్న ఏకైక ఒప్పందం, అన్ని దేశాల్లోను, అన్ని పరిస్ధితుల్లోను పిల్లలందరికీ వర్తించే సార్వత్రిక ఒప్పందమిది. పరిమితవనరులున్న ప్రభుత్వాలు కూడా పిల్లల హక్కులు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించిన బేషరతు ఒప్పందమిది. రెండు దేశాలు తప్ప ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలన్నీ ఈఒడంబడికను ఆమోదించాయి. భారత ప్రభుత్వం 1992 డిసెంబరు 11 న ఈ ఒడంబడికను ఆమోదించి సంతకం చేసింది.
ఈ తీర్మానంలో పేర్కొన్న బాలల హక్కుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, అలాగే పిల్లల హక్కుల్ని పరిరక్షించడానికి ఎవరికైనా హక్కునిస్తుంది. ఈ తీర్మానం.
ఆర్టికల్ - 1
- ప్రస్తుత సదస్సు ప్రకారం 18 సంవత్సరాల వయసులోపు మానవులు బాలలుగా పరిగణించబడతారు
ఆర్టికల్ - 2
- ఈ సదస్సులో తీర్మానించిన బాలల హక్కులను భాగస్వామ్య దేశాలు - ఆ పిల్లల తల్లిదండ్రుల, వారి సంరక్షకుల, కులం, జాతి, వర్గం, భాష, మతం, రాజకీయాభిప్రాయం, జాతీయత, తెగ, అంతస్తు, సామర్ధ్యం, పుట్టుక మరే ఇతర హొదాలను బట్టి వివక్ష చూపకుండా బాలలందరికీ సమానంగా అందించాలి.• పిల్లల తల్లిదండ్రుల, వారి చట్టబద్ధ సంరక్షకుల లేదా కుటుంబ సభ్యుల హొదా, కార్యకలాపాలు, వారి అబిప్రాయాలు లేదా నమ్మకాలను బట్టి పాటించే వివక్ష, శిక్షల నుండి బిడ్డను కాపాడేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకుంటాయి.
ఆర్టికల్ - 3
- ప్రభుత్వంగానీ, ప్రైవేట్ సాంఘిక సంక్షేమ సంస్ధలుగానీ, కోర్టులుగానీ, పాలక సంస్ధలుగానీ లేదా బాలలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే సంస్ధలుగానీ అన్నింటికీ బిడ్డ ప్రయోజనాలే ముఖ్య కర్తవ్యంగా ఉండాలి.
- భాగస్వామ్య దేశాలు బిడ్డ శ్రేయస్సుకు అవసరమైన శ్రద్ధ, సంరక్షణా బాధ్యత తీసుకోవాలి. దానితో పాటు బిడ్డ యొక్క తల్లిదండ్రుల, చట్టబద్ధ సంరక్షకుల, చట్టపరంగా బిడ్డకు బాధ్యులైన ఇతర వ్యక్తుల యొక్క హక్కులు విధులను దృష్టిలో పెట్టుకొని ఉంచుకోవాలి. అంతిమంగా అందుకోసం తగిన శాసనపరమైన, పాలనపరమైన చర్యలను తీసుకోవాలి.
- బిడ్డల శ్రద్ధ, సంరక్షణకు ఉద్దేశించిన సంస్ధలు, సేవలు సదుపాయాలను నిపుణులు నిర్దేశించిన ప్రమాణాలను బట్టి ( ముఖ్యంగా ఆరోగ్యం పారిశుద్ధ్యం విషయంలో) పనిచేసే విధంగా భాగస్వామ్య దేశాలు జాగ్రత్త తీసుకోవాలి.
ఆర్టికల్ - 4
- ఈ సదస్సులో గుర్తించిన హక్కులను అమలు జరపటం కోసం భాగస్వామ్య దేశాలు తగిన శాసనపరమైన, పాలకపరమైన కార్యక్రమాలను చేపట్టాలి. ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల విషయంలో భాగస్వామ్య దేశాలు తమ శక్తి మేరకు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అంతర్జాతీయ సహకారాన్ని తీసుకోవాలి.
ఆర్టికల్ - 6
- జీవించే హక్కు బాలల జన్మహక్కుగా భాగస్వామ్య దేశాలు గుర్తిస్తున్నాయి.
- పిల్లల మనుగడకు వారి అభివృద్ధికి భాగస్వామ్య దేశాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి.
ఆర్టికల్ - 12
- అందుకోసం, జాతీయ చట్ట నిబంధనల పరిధిలో బిడ్డ ప్రత్యక్షంగాగానీ, వేరొక ప్రతినిధి ద్వారాగాన, ఒక సంస్ధ ద్వారాగానీ కోర్టులో పాలకవ్యవస్ధలో తన గోడు వినిపించుకొనే అవకాశం బిడ్డకు ఇవ్వబడుతుంది.
ఆర్టికల్ - 7
- బిడ్డ పుట్టగానే పేరు నమోదు చేయించుకునే హక్కు ఉంది. పుట్టగానే పేరు కలిగి ఉండే హక్కు ఉంది. జాతీయతను పొందే హక్కు ఉంది. వీలైనంత వరకు జ్ఞానం పొందే హక్కు ఉంది. తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు ఉంది.
ఆర్టికల్ - 20
- కుటుంబ జీవనం కోల్పోయిన బిడ్డలకు, లేదా కుటుంబ వాతావరణంలో తమ ఇష్టాయిష్టాలకు అవకాశం లేని పిల్లలకు ప్రభుత్వం రక్షణ, సహాయం కల్పించాలి.
- అలాంటి పిల్లలకు భాగస్వామ్య దేశాలు తమ జాతీయ చట్టాల ననుసరించి ప్రత్యామ్నయ సంరక్షణ కల్పించాలి.
- ఆ రక్షణ అనేది బిడ్డ భద్రత కోసం - పోషణ స్ధానం, ఇస్లామిక్ చట్టంలో కఫాలా, ఇతర సమాజాల్లో దత్తత, ఇంటర్ ఏలియా మొదలైన అంశాలకూ సంబంధించి ఉంటుంది.
ఆర్టికల్ - 23
- మానసికంగా, శారీరకంగా వికలాంగులైన పిల్లలు సంపూర్ణమైన గౌరవమైన జీవితాన్ని గడపాలి. వారి గౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి. అలాంటి శిశువుల జనజీవనంలో చురుకుగా పాల్గొనేలా వీలు కల్పించాలి. అది భాగస్వామ్య దేశాలు గుర్తించాలి.
ఆర్టికల్ - 24
అత్యున్నతమైన ఆరోగ్య ప్రమాణాలను పొందేందుకు - రోగానికి చికిత్స పొందేందుకు, ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు, బిడ్డకు ఉన్న హక్కును భాగస్వామ్య దేశాలు గుర్తించాలి. అలాంటి ఆరోగ్య సేవల్ని పొందే హక్కు నుండి ఏ బిడ్డా దూరం కాకుండా భాగస్వామ్య దేశాలు శ్రద్ధ తీసుకుంటాయి.
ఈ హక్కును దేశాలు అమలు చేసేందుకు భాగస్వామ్య దేశాలు పాటుపడతాయి. ప్రత్యేకించి -
- శిశు మరణాలు, పిల్లల మరణాల్ని తగ్గించేందుకు,
- ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేస్తూ పిల్లలలందరికీ అవసరమైన వైద్య సహాయం, ఆరోగ్య రక్షణలు కల్పించేందుకు,
- ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు తగిన పౌష్టికాహారం, పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం ద్వారా, పర్యావరణ కాలుష్యం వల్ల ఏర్పడే ఇబ్బందులు ప్రమాదాలను గుర్తించడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని, వ్యాధులను ఎదుర్కొనేందుకు,
- తల్లులకు ప్రసవానికి ముందు, ప్రసవానంతరం తగిన ఆరోగ్య సంరక్షణలు అందించేందుకు,
- సమాజంలో అన్ని శాఖలకు ప్రత్యేకించి తల్లిదండ్రులకు, పిల్లలకు విద్య పొందేందుకు, పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం గురించిన ప్రాధమిక విజ్ఞాన్నాన్ని వినియోగించటంలో సహకరించేందుకు, తల్లి పాల వల్ల ప్రయోజనాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రమాదాల నివారణ గురించి వివరించేందుకు
- వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
- పిల్లల ఆరోగ్యం గురించిన సంప్రదాయ విధానాలను నిర్మూలించేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి.
ఆర్టికల్ - 25
- శారీరక, మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం సంబంధిత అధికారులు నిర్దేశించిన ఒక శిశువుకు చికిత్స చేసే క్రమంలో భాగస్వామ్య దేశాలు ఆ బిడ్డకు ఉన్న హక్కును ఇతర పరిస్ధితులను గుర్తించాలి.
Subscribe to:
Posts (Atom)