Showing posts with label NET. Show all posts
Showing posts with label NET. Show all posts

ఈ-మెయిల్ ఐడి... ఓ గంట కోసం!







ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి కొన్ని వెబ్ సైట్లు మన పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడి అడుగుతుంటాయి. పేరు, చిరునామా పర్వాలేదు కానీ.. ముక్కూ మొహం తెలియని వెబ్ సైట్లకు మన ఈ-మెయిల్ ఐడి ఇవ్వడం సురక్షితమేనా? ఇలాంటి అనుమానం మీకు కలిగినప్పుడు డిస్పోజబుల్ (యూజ్ అండ్ త్రో) ఈ-మెయిల్ ఐడితో మీ పని ముగించవచ్చు. అరె.. డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడి కూడా ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే చదవండి మరి!
కొన్ని కోట్ల వెబ్ సైట్లు, లక్షల బ్లాగ్ లతో ఇప్పుడు ఇంటర్నెట్ ఒక మహాసముద్రం అయిపోయింది. ఆన్ లైన్లోకి అడుగుపెట్టడమంటే.. ఈత రాని వ్యక్తి ఓ చిన్న పడవలో సముద్రంలోకి బయలుదేరడమే. వెబ్ బ్రౌజింగ్ సమయంలో కొన్నిసార్లు ఆన్ లైన్ అప్లికేషన్లు భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మన పేరు, చిరునామా, ఉపయోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడి సహా బోలెడు వివరాలు సమర్పించుకోవాల్సి ఉంటుంది.
పేరు, చిరునామా ఇవ్వడం వల్ల పెద్ద సమస్యలు తలెత్తవుకానీ, ఎటొచ్చీ ఈ-మెయిల్ ఐడి ఇవ్వాల్సిరావడమే తలనొప్పి. ఒక్కోసారి మీ ఈ-మెయిల్ ఐడి దుర్వినియోగం అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఒకవేళ ఈ-మెయిల్ ఐడి లేనివారయితే తప్పనిసరిగా ఏదో ఒక ఈ-మెయిల్ సర్వీస్ ప్రొవైడర్ ను ఆశ్రయించి అప్పటికప్పుడు ఈ-మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవలసి వస్తుంది. అయితే నెటిజన్లను ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఇంటర్నెట్ లో కొన్ని డిస్పోజబుల్ ఈ-మెయిల్ సర్వీసులు కూడా లభిస్తాయి. వీటిలో చెప్పుకోదగ్గది గొ రిల్లా మెయిల్ (Guerrilla Mail ). ఒక్క ఇంగ్లీషులోనే కాక డచ్, జర్మన్, ఇటాలియన్, నార్వేజియన్, పోలిష్, స్పానిష్ వంటి భాషల్లో సైతం ఈ తాత్కాలిక ఈ-మెయిల్ సౌకర్యం లభిస్తుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత కేవలం గంట సేపు మాత్రమే ఈ ఈ-మెయిల్ ఐడి ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే మాయమైపోతుంది. అందుకే దీనిని డిస్పోజబుల్ ఈ-మెయిల్ అని, యూజ్ అండ్ త్రో ఈ-మెయిల్ అని పిలుస్తారు. ఆ గంట సేపూ యాహూ, రెడిఫ్, జీమెయిల్ వంటి రెగ్యులర్ ఈ-మెయిల్ సర్వీస్ ల మాదిరిగానే ఈ 'గొరిల్లా మెయిల్ కూడా పనిచేస్తుంది. ఇందులో ఈ-మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తరువాత మీరు ఎవరికైనా మెయిల్ పంపుకోవచ్చు. ఒకవేళ అవతలి వాళ్ళు కూడా మీకు తిరిగి వాళ్ళ ఈ-మెయిల్ ఐడి నుంచి రిప్లై మెయిల్ ఇస్తే దాన్ని మీరు చదువుకోవచ్చు కూడా. కాకపొతే ఇదంతా సరిగ్గా 60 నిమిషాలు.. అంటే గంటలోనే పూర్తి కావాలి. ఆ తర్వాత మీరు ఎంత వెతికినా మీ ఈ-మెయిల్ ఐడి మీకే కాదు, ఎవరికీ కనబడదు.
బాగుంది కదూ? ఈసారి ఎప్పుడైనా ఆన్ లైన్ లో ఎవరికైనా మీ శాశ్వత ఈ-మెయిల్ ఐడి ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే, అది ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే.. మీరు నిరభ్యంతరంగా ఈ 'గొరిల్లా మెయిల్' సర్వీసును ఉపయోగించుకోవచ్చు.
ఇవి కూడా ట్రై చేయవచ్చు..
ఇంటర్నెట్ లో తాత్కాలికంగా ఈ-మెయిల్ సర్వీసులు అందిస్తున్నది ఒక్క 'గొరిల్లా మెయిల్' మాత్రమే కాదు. ఇంకా ఇలాంటి డిస్పోజబుల్ ఈ-మెయిల్ సర్వీసులు చాలా ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగినవి.. 10 మినిట్ మెయిల్.కాం, మెయిలినేటర్.కాం, యోప్ మెయిల్.కాం, మింట్ ఈమెయిల్.కాం, మెయిల్ డ్రాప్.సిసి, జేటేబుల్.ఆర్గ్ వంటివి కూడా గొరిల్లా మెయిల్ మాదిరిగానే టెంపరరీగా ఈ-మెయిల్ సర్వీస్ అందిస్తాయి.
వీటిలో 10 మినిట్ మెయిల్.కాం అందించే మెయిల్ సర్వీసు కేవలం పదంటే పది నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఒక ట్యాబ్ పై క్లిక్ చేయడం ద్వారా గడువును మరో పది నిమిషాలు పెంచుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లయినా గడువును పెంచుకోవచ్చుగానీ, ఆ పది నిమిషాల గడువు తీరక మునుపే గడువును పెంచుకుంటూ ఉండాలి.
ఇక మెయిలినేటర్.కాం విషయానికొస్తే.. ఇది కూడా గొరిల్లా మెయిల్ మాదిరిగానే ఒక గంట సేపు మాత్రమే పనిచేస్తుందికానీ ఇందులో ఒక సౌలభ్యం ఉంది. అదేమిటంటే.. ఒక్కసారి మీరు ఈ-మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే ఇక దానిని తర్వాతెప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రతిసారీ అదే ఈ-మెయిల్ ఐడిని ఉపయోగించి వెబ్ సైట్ లోకి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే సైన్ ఇన్ అయిన ప్రతిసారీ ఓ గంటలోగా మీ మెయిల్ ఐడి ద్వారా మెయిల్ సర్వీస్ పొందవచ్చు. కానీ ఇందులో ఉన్నఒక అసౌకర్యం ఏమిటంటే.. భద్రత లేకపోవడం. అంటే.. మీ ఈ-మెయిల్ ఐడి తెలిసిన ఎవరైనా అదే ఐడిని ఉపయోగించి ఎవరికైనా ఈ-మెయిల్ పంపవచ్చు. ఇది మీకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
మింట్ మెయిల్.కాం కూడా 10 మినిట్ మెయిల్.కాం మాదిరిగానే 10 నిమిషాలపాటే పనిచేస్తుంది. అయితే 10 నిమిషాల గడువు ఆటోమాటిక్ గా పొడిగింపబడటం ఇందులో ఉన్న ప్రత్యేకత. అంటే.. మీ మెయిల్ ఇన్ బాక్స్ లోనికి ఏదైనా మెయిల్ వచ్చినప్పుడల్లా మీ ఐడి గడువు పొడిగింపబడుతూ ఉంటుందన్నమాట.
ఇక జెటేబుల్.ఆర్గ్ విషయానికొస్తే.. ఇతర అన్ని తాత్కాలిక ఈ-మెయిల్ సర్వీసుల కంటే కూడా అధునాతన, యాంటీ స్పామ్ టెక్నాలజీ కలిగినటువంటి సర్వీస్ ఇది. కొన్ని వెబ్ సైట్లు ఈ టెంపరరీ డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడిలను స్పామ్ కింద పరిగణిస్తాయి. అలాంటి సమయంలో ఈ జెటేబుల్ మెయిల్ ఐడి అక్కరకొస్తుంది. ఇది మొదట మీ ఒరిజినల్ శాశ్వత ఈ-మెయిల్ ఐడిని గుర్తుంచుకుంటుంది. ఆ తర్వాత మీరు క్రియేట్ చేసుకున్న జెటేబుల్ మెయిల్ ఐడికి వచ్చే ఇన్ కమింగ్ మెయిల్స్ అన్నిటినీ మీ ఒరిజినల్ శాశ్వత ఈ-మెయిల్ ఐడికి చేరవేస్తూ ఉంటుంది. మీరు పెట్టుకున్న గడువు తీరిపోగానే మీ జెటేబుల్ మెయిల్ ఐడి ఎవరికీ కనిపించదు.
మొత్తానికి ఈ డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడిల కథా కమామిషు బాగుంది కదూ?!


Tags: mail Tips, Mails Tool, Gmail Tool, New Mail, Create Mail, How To Create New Mail in Telugu,

నెట్‌కి సిద్ధమేనా !..... NET 2016


బోధ‌నారంగంలో ఉన్నత స్థాయిలో స్థిర‌ప‌డాల‌న్నా, ప‌రిశోధ‌న దిశ‌గా అడుగులేయాల‌నుకున్నా ఏటా రెండుసార్లు నిర్వహించే నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) రాయ‌డం త‌ప్పనిస‌రి. ఈ ప‌రీక్ష ద్వారా జేఆర్ఎఫ్‌కు ఎంపికైన అభ్యర్థులు నెల‌కు రూ.25,000 ఫెలోషిప్‌గా పొంద‌వ‌చ్చు. 2014 డిసెంబ‌ర్ నుంచి ప‌రీక్షను సీబీఎస్ఈ నిర్వహిస్తోంది. జులైలో జ‌రిగే నెట్‌కు ప్రక‌ట‌న వెలువ‌డింది. ఈ నేప‌థ్యంలో ప‌రీక్షకు ఎలా స‌న్నద్ధం కావాలో తెలుసుకుందాం.
పీజీ చ‌దువుతున్న, ఇప్పటికే పోస్టుగ్రాడ్యుయేష‌న్ పూర్తిచేసిన విద్యార్థుల‌కు ఉండే మంచి అవ‌కాశాల్లో నెట్ ఒక‌టి. ఎందుకంటే యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, డిగ్రీ క‌ళాశాల‌ల్లో లెక్చర‌ర్‌ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి, ఫెలోషిప్‌తో కూడిన‌ ప‌రిశోధన చేయ‌డానికి అర్హత సాధించాలంటే నెట్ రాయ‌డం త‌ప్పనిస‌రి. బోధ‌నా ప్రమాణాలు పెంపొందించ‌డం, అక‌డ‌మిక్ ప‌రిశోధ‌న‌ల‌ను ప్రోత్సహించే ల‌క్ష్యంతో హ్యుమానిటీస్‌, సోష‌ల్ సైన్సెస్‌, లాంగ్వేజెస్‌ల్లో ఏటా రెండు సార్లు సీబీఎస్ఈ నెట్ (2014 జూన్ ప‌రీక్ష వ‌ర‌కు ఇది యూజీసీ నెట్‌గా ఉండేది) ప‌రీక్షను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పీజీలో చ‌దివిన కోర్సును నెట్ స‌బ్జెక్టుగా రాసుకోవ‌చ్చు. ఈసారి 83 స‌బ్జెక్టుల్లో నెట్ నిర్వహిస్తున్నారు. దీనికోసం దేశ‌వ్యాప్తంగా 88 ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉస్మానియా, ఆంధ్ర, నాగార్జున, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు సమన్వయ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నాయి. నెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఏ విశ్వవిద్యాలయంలో అయినా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హత లభిస్తుంది. అదే వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే సెట్‌ (స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)లో అర్హత సాధిస్తే ఆ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అవకాశం లభిస్తుంది. జూనియర్ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (JRF)సాధిస్తే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హులవ్వడమే కాకుండా ఫెలోషిప్‌ను పొందవచ్చు. ప్రతి 6 నెలలకూ నిర్వహించే నెట్ ద్వారా అన్ని సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 3200 మందికి ఫెలోషిప్‌ను ప్రకటిస్తారు. జేఆర్ఎఫ్‌కి ఎంపికైతే మొద‌టి రెండేళ్లపాటు నెల‌కు రూ.25,000 అనంత‌రం ఎస్ఆర్ఎఫ్‌లో నెల‌కు రూ.28,000 స్టైపెండ్‌గా పొందొచ్చు. జేఆర్ఎఫ్‌కి ఎంపికైతే సంబంధిత యూనివ‌ర్సిటీలో వ‌స‌తి క‌ల్పిస్తారు. ఒక‌వేళ అక్కడ ఉండ‌డానికి అవ‌కాశం లేక‌పోతే స్టైపెండ్‌లో 30 శాతాన్ని హెచ్ఆర్ఎగా అద‌నంగా చెల్లిస్తారు. అంటే అభ్యర్థులు నెల‌కు రూ.32,500 పొంద‌వ‌చ్చు.
అర్హత: అభ్యర్థి రాయదలుచుకున్న సబ్జెక్టులో 55 శాతం మార్కులతో (OBC/SC/ST/PWDలకు 50% మార్కులు) మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే. కానీ వారు నెట్‌ ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి రెండేళ్ల లోపు మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు దరఖాస్తు చేసుకునేవారికి వయః పరిమితి లేదు. కానీ జేఆర్‌ఎఫ్‌ అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారి వయసు ప్రక‌ట‌న‌లో పేర్కొన్న తేదీ కి 28 ఏళ్లకు మించకూడదు. SC/ST/OBC/PWD/Women అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
ప‌రీక్ష ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే రూ.600, ఓబీసీ (నాన్ క్రీమీ లేయ‌ర్‌) వాళ్లైతే రూ. 300, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీల‌కు రూ.150.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తారు. అయితే గ‌తంలో ఉన్నట్టు ఆన్‌లైన్ అప్లికేష‌న్ ఫారాన్ని సీబీఎస్ఈకి పంపాల్సిన అవ‌స‌రం లేదు.
పరీక్ష స్వరూపం: ప్రతి అభ్యర్థినీ మొత్తం మూడు పేపర్లలో పరీక్షిస్తారు. మూడింటిలో కూడా ప్రశ్నలు మల్టిపుల్‌ ఛాయిస్‌ రూపంలో ఉంటాయి. టీచింగ్‌ అండ్ రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ పేపర్‌-1 అన్ని సబ్జెక్టుల వారికీ ఒక‌టే. పేపర్‌-2, 3 లు అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించినవి.
ప‌రీక్ష ఇలా...
పేపర్‌-1: మొత్తం 60 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 50 ప్రశ్నల‌కు జ‌వాబు గుర్తిస్తే స‌రిపోతుంది. అయితే అన్ని ప్రశ్నల‌కు జ‌వాబులు గుర్తించిన‌ప్పటికీ మొద‌టి 50 ప్రశ్నల‌ను మాత్రమే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. కాబ‌ట్టి స్పష్టంగా జ‌వాబు తెలిసిన 50 ప్రశ్నల‌కే స‌మాధానం ఇవ్వడం మంచిది. దీనిప్రకారం మ‌ధ్యలో తెలియ‌ని ప్రశ్నల‌ను వ‌దిలేయ‌డ‌మే శ్రేయ‌స్కరం. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున ఉంటాయి. మొత్తం ప్రశ్నప‌త్రానికి 100 మార్కులు. ప‌రీక్ష వ్యవ‌ధి 75 నిమిషాలు. నెగెటివ్ మార్కులు లేవు.
ప్రశ్నల‌డిగే విభాగాలు...
ఈ పేపర్లో 10 యూనిట్లుంటాయి. 1. టీచింగ్‌ అప్టిట్యూడ్‌ 2. రీసెర్చ్‌ అప్టిట్యూడ్‌ 3. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ 4. కమ్యూనికేషన్‌ 5. రీజనింగ్‌ 6. లాజికల్‌ రీజనింగ్‌ 7. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 8. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ 9. పీపుల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ 10. హైయర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌: గవర్నెన్స్‌, పాలిటీ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌.
బోధనలో ఉపయోగపడే పద్ధతులు, సాంకేతికతను ఎంత ప్రభావవంతంగా ఉపయోగించుకోగలరు? ఆలోచన ప్రక్రియలో అభ్యర్థి సామర్థ్యం ఎలా ఉంది? సామాజిక, నైతిక, పర్యావరణ విలువలపై వైఖరి ఏమిటి? దేశ రాజకీయ, విద్యా వ్యవస్థపై అవగాహన ఏమిటి? ఆంగ్ల ప‌రిజ్ఞానం, గ‌ణితంలో ప్రావీణ్యం, పర్యావ‌ర‌ణం, వ్యక్తులు త‌దిత‌ర అంశాల నుంచి ప్రశ్నలు రావొచ్చు.
మనోవైజ్ఞానిక శాస్త్రంలోని నూతన సిద్ధాంతాలు బోధనాభ్యసన ప్రక్రియలో వివిధ మార్పులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా నిర్మాణాత్మక సిద్ధాంతం బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయ, విద్యార్థి పాత్రలను పూర్తిగా మార్చివేసిందని చెప్పవచ్చు. ఫలితంగా శిశుకేంద్రిత విద్య, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఉపాధ్యాయుని ప్రజాస్వామ్యయుత ప్రవర్తన మొదలైన నూతన ధోరణులు చోటుచేసుకున్నాయి. వీటిపై అవగాహన ముఖ్యం.
పరిశోధన పద్ధతుల ప్రశ్నలు మౌలిక భావాలను మాత్రమే పరీక్షిస్తున్నాయి. వివిధ పరిశోధన పద్ధతులు, పరిశోధన ప్రక్రియలోని సోపానాలు, పరిశోధన సంబంధిత గణాంక పద్ధతులపై పట్టు సాధిస్తే ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు కష్టమేమీ కాదు.
ఆధునిక సమాచార ప్రసార సాధనాలు, కంప్యూటర్‌ నిర్మాణం, పనితీరు, అంతర్జాలం, సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లు బోధనాభ్యసన- పరిశోధన ప్రక్రియలో ఎలా ఉపయోగపడగలవో తెలుసుకోవటం కూడా ముఖ్యం.
ఈ పేపర్‌లోని 5, 6, 7 యూనిట్లు అభ్యర్థి అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ సామర్థ్యం మదింపునకు సంబంధించినవి. ఈ ప్రశ్నలు దాదాపు 10వ తరగతి స్థాయి సామర్థ్యాలనే పరీక్షిస్తున్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ విభాగాలపై పట్టు సాధిస్తే కచ్చితంగా 15 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవచ్చు.
పాత ప్రశ్నప‌త్రాల‌ను అధ్యయ‌నం చేయ‌డ‌మూ ముఖ్యమే. కొన్ని ప్రశ్నలు ( క‌నీసం ఆ మోడ‌ల్ నుంచి) పున‌రావృతం అయ్యే అవ‌కాశాలూ ఉన్నాయి.
పేపర్‌- 2, 3: ఇవి అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించినవి. పేపర్‌-2 100 మార్కులకు (50 ప్రశ్నలు X 2 మార్కులు) ఉంటుంది. వ్యవ‌ధి 75 నిమిషాలు. పేపర్‌-3కి 150 మార్కులు (75 ప్రశ్నలు X 2 మార్కులు) కేటాయించారు. ప‌రీక్ష వ్యవ‌ధి రెండున్నర గంటలు. ఏ పేప‌ర్‌లోనూ నెగెటివ్ మార్కులు లేవు. ప్రస్తుతం మూడు పేపర్లలో సాధించిన మార్కుల ఆధారంగా ఉత్తీర్ణతను నిర్ణయిస్తున్నారు. అందుకని రెండు మూడు పేపర్లపై శ్రద్ధ పెట్టి, పేపర్‌-1ని నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు.
పేపర్‌-2,3లలో సిలబస్‌లోని అంశాలు పీజీ స్థాయిలో ఉంటాయి.
పేపర్‌- 2తో పోలిస్తే పేపర్‌-3లోని ప్రశ్నల కఠినత్వ స్థాయి ఎక్కువ. పేపర్‌-2లో కేవలం ప్రాథమిక భావనలు, వాస్తవాలు, భావనల మధ్య అంతస్సంబంధాన్ని పరీక్షించే ప్రశ్నలుంటాయి. పేపర్‌-3లో అభ్యర్థి అవగాహన స్థాయి, అనువర్తిత సామర్థ్యం పరీక్షిస్తారు.
పేపర్‌-2, 3 సిలబస్‌లోని అంశాల్లో పెద్దగా వైరుద్ధ్యం ఏమీ ఉండదు. కానీ పేపర్‌-3లోని అంశాలు పేపర్‌-2 అంశాలను విస్తరించే స్వభావంతో ఉంటాయి. అందుకే సన్నద్ధత వ్యూహం కూడా మౌలికమైన భావనల నుంచి లోతైన విషయ అవగాహన వరకూ కొనసాగాలి.
ఈ పేపర్లలో కూడా గతంలో వచ్చిన ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. కాబ‌ట్టి పాత ప్రశ్నప‌త్రాల‌ అధ్యయనం మరువకూడదు.
ఆంగ్ల సాహిత్యం, తెలుగు సాహిత్యం, ఎడ్యుకేషన్‌, చరిత్ర, కంప్యూటర్‌ సైన్స్‌, మేనేజ్‌మెంట్‌ల్లో పేపర్‌-3లో ఎలక్టివ్‌ విధానం ఉంది. ఈ సబ్జెక్టుల్లోని పేపర్‌-3 ప్రశ్నపత్రంలో ఎక్కువగా ఎలక్టివ్‌ల నుంచే ప్రశ్నలు రావడం గమనించదగ్గ విషయం.
ఈ పేపర్ల మెటీరియల్‌ సేకరణకు కొద్దిపాటి కష్టం తప్పదు. మొత్తం సిలబస్‌ ఏ ఒక్క సంప్రదింపు గ్రంథంలోనో దొరకదు. విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్ల, సీనియర్ల సలహాలు, సూచనలు ఈ విషయంలో ఎంతగానో ఉపయోగ పడతాయి. సిల‌బ‌స్ ప్రకారం ఆయా అంశాల‌కు సంబంధించి విస్తృతంగా స‌మాచారం లభించే పుస్తకాల‌ను ఎంచుకోవ‌డం ముఖ్యం. అంటే ఏ స‌బ్జెక్టును ఎంచుకున్నప్పటికీ క‌నీసం ఆరేడు ప్రామాణిక పుస్తకాలు చ‌ద‌వ‌డం త‌ప్పనిస‌రి.
అర్హతను నిర్ణయిస్తారిలా...
1. మొదటగా మూడు పేపర్లలో నిర్దేశించిన కనీస అర్హత మార్కులను సాధించినవారితో కూడిన పట్టిక తయారుచేస్తారు.
2. ఆ పట్టిక నుంచి అభ్యర్థులు మూడు పేపర్లలోనూ సాధించిన మొత్తం మార్కులను ఆధారంగా చేసుకొని సబ్జెక్టు, కేటగిరిల వారిగా మెరిట్ లిస్ట్‌ తయారుచేస్తారు.
3. మెరిట్‌ జాబితాలోని టాప్‌ 15% (ప్రతి సబ్జెక్టు, కేటగిరి) అభ్యర్థులకు నెట్ లెక్చర‌ర్‌షిప్‌కు అర్హులుగా నిర్ణయిస్తారు.
4. లెక్చర‌ర్‌షిప్‌కు అర్హత సాధించినవారి నుంచి మెరిట్‌ ఆధారంగా స‌బ్జెక్టు, కేట‌గిరీల వారీ కొంత మందిని జేఆర్‌ఎఫ్‌కు ఎంపిక‌చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:

 
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మే 12, 2016
వెబ్‌సైట్‌: http://cbsenet.nic.in/cms/public/home.aspx



వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ స్పామ్‌


 ఈ మధ్య వాట్స్‌యాప్‌లో వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడంకోసం మన మిత్రులచే సందేశం పంచబడుతుంది. ఈ సందేశం ప్రకారం మనం వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడం కోసం ఆ సందేశాన్ని పదిమంది తోను మరియు మూడు గ్రూపులలోను పంచుకొని సందేశంలో ఇవ్వబడిన లంకెలోకి వెళ్ళి మొబైల్ నెంబరు ద్వారా వీడియో కాలింగ్ నమోదు చేసుకొమ్మని ఉంది. మనం మొబైల్ నెంబరును నమోదు చేసిన తరువాత వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ సర్వరుకు కలుపబడుతున్నట్లు మనకు వివిధ రకాల స్టేటస్‌లను చూపించి ఒక కాళీ పాప్‌అప్‌ తెరవబడుతుంది. ఈ తతంగం అంతా నిజంగానే వీడియో కాలింగ్ వస్తున్నట్లుగానే మనల్ని నమ్మించే విధంగా ఉంటుంది. ఇది కేవలం మన ఫోను నంబరును మరియు మన ఫోనులో ఉన్న సమాచారాన్ని దొంగిలించడానికి తయారుచేయబడిన ఒక స్పామ్‌ సందేశం మాత్రమే. దీని ద్వారా వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ రాదు. అది తెలియక చాలా మంది వారి సమాచారాన్ని అందించడమే కాకుండా ఈ సందేశాన్ని వివిధ గ్రూపులలోను మిత్రులతోను పంచుకోని వారిని కూడా ఈ స్పామ్‌ బారిన పడేస్తున్నారు. కనుక వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఈ స్పామ్‌ సందేశాన్ని షేర్ చేయకండి. ఈ స్పామ్‌ బారిన పడకుండా మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి.


Short Url యొక్క original Long Url ఏమిటో తెల్సుకోవాలనుకుంటున్నారా?


మన మిత్ర్రులు కావచ్చు లేక Online లో చాలా మంది ఏదైనా Share చేసేటపుడు Long Url ని Short చేసి పంపుతుంటారు. Short Urls చూడటానికి అన్నీ ఒకేలా అనిపిస్తుంటాయి. Link ని Click చేసి Open చేస్తే కానీ అది ఏ Site నుంచి వచ్చిందో అందులో ఏ కంటెంట్ ఉందో అర్ధం కాదు. సరిగ్గా దీన్నే కొంతమంది Hackers ఆసరాగా చేస్కుని Short Links ద్వారా Computer కి Virus ఎక్కేలా చేస్తారు. తెలియక వాటిని Click చేస్తే Computer కి Virus వచ్చే ప్రమాదం ఉంటుంది.

దీనికి ప్రధాన పరిష్కారం మనం Short Url ని Click చేసే ముందే దాని Original Long Url ఏమిటో  తెల్సుకోవడమే. దీని కోసం మనకు http://unfurlr.com/ అనే Website బాగా ఉపయోగపడుతుంది.

Short to Long Url
మీ వద్ద ఉన్న Short Url ని ఇక్కడ Enter చేసి Check It Button పై Click చేయాలి.



National Eligibility Test June, 2012 for Junior Research Fellowship and Eligibility for Lectureship

 National Eligibility Test June, 2012  for Junior Research Fellowship and Eligibility for Lectureship 
 Online applications for June 2012, UGC NET are being invited. Apply now. The date for UGC NET - June 2012 is SUNDAY, June 24, 2012.




Important dates :     


Last date for Applying On-Line   30-04-2012 

Exams SUNDAY, June 24, 2012.

Last date for receiving the printout of online Application Form (2 copies), Attendance Slip (one copy) and Admission Card (one copy) at the respective test centre opted by the candidate (with fee receipt & category certificate(s) )    07-05-2012
        
NOTE :     PRINTOUT OF ON-LINE APPLICATION FORM SENT DIRECTLY TO THE UGC OFFICE WILL NOT BE ENTERTAINED.  


Bank Challan :  Download




Followers