Showing posts with label Telangana News. Show all posts
Showing posts with label Telangana News. Show all posts

నిరుద్యోగ భృతి: తెలంగాణ


టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టో అంటూనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల వారికి వరాల జల్లులు ప్రకటించారు. ముఖ్యంగా నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3016 రూపాయల నిరుద్యోగ భృతిని అందించనున్నట్లు వెల్లడించారు. ఏపీలో గత ఎన్నికల ప్రచారంలో నెలకు రూ.2 వేలు ఇస్తామన్న భృతిని చంద్రబాబు నాయుడు సర్కార్ ఇటీవల వెయ్యి రూపాయలు చేయగా.. కేసీఆర్ మాత్రం దానికి మూడు రెట్ల నిరుద్యోగ భృతిని రాష్ట్ర నిరుద్యోగులకు అందించనున్నట్లు ప్రకటించారు.
ఓ వైపు ఉద్యోగ నియామకాలు చేపడుతూనే మరోవైపు జాబ్ లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులను ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల్లో నిరుద్యోగ భృతికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగ భృతికి అర్హులుంటారని, అయితే 12 లక్షల మందికైనా రూ.3016 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. కేశవరావు కమిటీ త్వరలో తుది నివేదిక ఇచ్చాక మరిన్ని వివరాలపై మేనిఫెస్టో విడుదల చేస్తామని కేసీఆర్ వివరించారు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు- కలెక్టర్లు- ఎస్పీలు, కమీషనర్లు, డీసీపీలు


కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను, కొత్త కమిషనరేట్లకు కమిషనర్లు, డీసీపీలను ప్రభుత్వం ఖారారు చేసింది. విజయదశమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న 21 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ, పాత జిల్లాల కలెక్టర్లను కూడా బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. రేపు ఉదయం 11:13 గంటలకు మంత్రులతొ పాటు కలెక్టర్లు కొత్త జిల్లాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఇంకా కొన్ని జిల్లాలకు ఎస్పీలు ఖరాలు కావాల్సి ఉంది.

జిల్లా కలెక్టర్లు
ఆదిలాబాద్- జ్యోతి బుధ్ద ప్రసాద్
మంచిర్యాల - ఆర్వీ కర్నన్
నిర్మల్ - ఇలంబర్తి
ఆసిఫాబాద్( కొమరం భీం) - చంపాలాల్

నిజామాబాద్- యోగితా రాణా
కామారెడ్డి - సత్యనారాయణ

కరీంనగర్- సర్పరాజ్ అహ్మద్
పెద్దపల్లి - అలుగు వర్షిణి
జగిత్యాల - శరత్
సిరిసిల్ల (రాజన్న) - కృష్ణ భాస్కర్

వరంగల్ అర్భన్- అమ్రపాలి
వరంగల్ (రూరల్)- పాటిల్ ప్రశాంత్ జీవన్
మహబూబాబాద్ - ప్రీతి మీనన్
జనగామ - దేవసేన
జయశంకర్ - మురళి

ఖమ్మం- లోకేశ్ కుమార్
కొత్తగూడెం (భద్రాద్రి) - రాజీవ్ జీ హన్మంతు

నల్లగొండ- గౌరవ్ ఉప్పల్
సూర్యాపేట - సురేంద్ర మోహన్
యాదాద్రి - అనిత రామచంద్రన్

మెదక్ - భారతి
సంగారెడ్డి-మాణిక్ రాజ్
సిద్దిపేట్- వెంకట్రామరెడ్డి

హైదరాబాద్- రాహుల్ బొజ్జా
రంగారెడ్డి- రఘునందన్ రావు
మేడ్చల్ (మల్కాజిగిరి) - ఎంవీరెడ్డి
వికారాబాద్ - దివ్య

మహబూబ్ నగర్- రోనాల్డ్ రోస్
నాగర్ కర్నూలు - శ్రీధర్
జోగులాంబ - రజత్ కుమార్ షైనీ
వనపర్తి - శ్వేతామహంతి

కమీషనర్లు, డీసీపీలు
వరంగల్ కమిషనర్- అకున్ సబర్వాల్
కరీంనగర్ కమిషనర్- కమలహాసన్ రెడ్డి
సెంట్రల్ జోన్ డీసీపీ- జ్యోయల్ డెవిస్
సిద్దిపేట్ కమిషనర్- శివకుమార్
నిజామాబాద్ కమిషనర్ -కార్తీకేయ
మాదాపూర్ డీసీపీ- విస్సా ప్రసాద్
రామగుండం కమిషనర్- విక్రజిత్ దుగ్గల్
ఖమ్మం కమిషనర్-షానవాజ్ ఖాసీం
శంషాబాద్ డీసీపీ- పద్మజారెడ్డి


జిల్లాల ఎస్పీలు
సూర్యాపేట ఎస్పీ - పరిమళ నూతన్
నల్లగొండ- ప్రకాశ్ రెడ్డి
యాదాద్రి- యాదగిరి
సిరిసిల్ల - విశ్వజిత్
నిర్మల్- విష్ణు వరియార్
మెదక్- చందన దీప్తి
కొత్తగూడెం- అంబర్ కిషోర్ ఝా
కామారెడ్డి-
జగిత్యాల- అనంత్ శర్మ
ఆదిలాబాద్- శ్రీనివాస్
వనపర్తీ జిల్లా ఎస్పీ- రోహిణి
నాగర్ కర్నూల్- సింగన్ వార్
ఆసిషాబాద్- సన్ ప్రీత్ సింగ్
ఆచార్య జయశంకర్ జిల్లా- భాస్కర్
గద్వాల జిల్లా ఎస్పీగా- విజయ్ కుమార్






కొత్త జిల్లాలకు ఇంటర్ విద్యాధికారులు


హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఇంటర్ విద్యాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కరీంనగర్, జగిత్యాల- ఎల్ సుహాసిని
మంచిర్యాల, పెద్దపల్లి- ప్రభాకర్ దాసు
సిరిసిల్ల-రామచందర్
ఆదిలాబాద్, నిర్మల్, ఆసీఫాబాద్- బి. నాగేందర్
నిజామాబాద్, కామారెడ్డి-ఓదెన్న
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్- కేవీ ఆనంద్
మహబూబాబాద్, భూపాలపల్లి-ఎస్ కే అహ్మద్
జనగామ-వై. శ్రీనివాస్
ఖమ్మం, కొత్తగూడెం- ఆండ్రూస్
సూర్యపేట- ప్రకాష్ బాబు
నల్లగొండ, యాదాద్రి- హన్మంతరావు
హైదరాబాద్-కాదీనాథ్
శంషాబాద్-మహమూద్ అలీ
మహబూబ్‌నగర్, వికారాబాద్- విజయలక్ష్మీ
మల్కాజ్‌గిరి- ప్రభాకర్
వనపర్తి, నాగర్ కర్నూల్- సుధాకర్
సంగారెడ్డి- కిషన్
సిద్ధిపేట, మెదక్- నాగమునికుమార్


ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ ఉండబోదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది


ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ ఉండబోదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక మిగిలిన సీట్లన్నీ స్పాట్‌ అడ్మిషన్ల రూపంలోనే భర్తీ చేసుకోవాలని తేల్చిచెప్పింది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో రెండో విడత కౌన్సెలింగ్‌ తర్వాత 31వేల సీట్లు కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన సంగతి తెలిసిందే. వీటిలో దాదాపు 26వేల సీట్లు ఇంజినీరింగ్‌వే! మిగిలినవి ఫార్మసీ సీట్లు. రెండు విడతల్లోనూ సీట్లు రాని విద్యార్థులు సుమారు 3500 మంది దాకా ఉన్నారు. ఆప్షన్లను సరిగ్గా పెట్టుకోని కారణంగా వీరందరికీ సీట్లు రాలేదన్నది అధికారుల వివరణ. వీరికీ అవకాశం కల్పించేలా మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తొలుత భావించారు. కానీ ఆగస్టు లోపు కౌన్సెలింగ్‌ పూర్తికావాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరోమారు కౌన్సెలింగ్‌కు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 15 దాకా మిగిలిన సీట్లను భర్తీ చేసుకోవచ్చని సుప్రీంతీర్పులో ఉంది. కానీ కౌన్సెలింగ్‌ అడ్మిషన్ల ద్వారానా అనే స్పష్టత లేదు. గతంలో వీటన్నింటినీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్ల రూపంలోనే భర్తీ చేశారు. ఒకవేళ అందుకు భిన్నంగా చేస్తే ఎవరైనా కోర్టుకు వెళితే మొత్తం ప్రక్రియే ఇబ్బందుల్లో పడుతుందన్నది ప్రభుత్వ ఆందోళన. అందుకే మూడోవిడత కౌన్సెలింగ్‌ను వదలుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. స్పాట్‌ అడ్మిషన్లకు తెలంగాణ ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రకటన వెలువరిస్తుంది. ఆతర్వాత ఆయా కళాశాలలు విడివిడిగా పత్రికా ప్రకటనలిచ్చి ఏదో ఒకరోజు ప్రవేశాలు నిర్వహిస్తాయి. ఈప్రక్రియ 15లోపు పూర్తికావాల్సి ఉంటుంది.

కుతుబ్‌షాహీ సమాధుల్లో సొరంగం

kutubshaahi samaadhullo sorangam

16వ శతాబ్దం నాటిదని అంచనాసమ్మర్‌ ప్యాలెస్‌ అవశేషాల గుర్తింపుతవ్వకాల్లో గుర్తించిన అగాఖాన్‌ ట్రస్ట్‌సందర్శించిన అమెరికా రాయబారి మైఖేల్‌ఈనాడు, హైదరాబాద్‌: వందల ఏళ్ల చరిత్ర కలిగిన కుతుబ్‌షాహీ సమాధుల్లో పురాతన సొరంగం బయటపడింది. గోల్కొండ కోట నుంచి సమాధుల వరకు ఈ సొరంగం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గోల్కొండ కోటను పాలించే కుతుబ్‌షాహీల్లో ఎవరైనా మరణిస్తే సమాధుల వద్దకు తీసుకెళ్లేందుకు దీన్ని నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. సొరంగ మార్గంతోపాటు ఒక ఉద్యానం, సహాయకుల కోసం నిర్మించిన వేసవి భవంతి (సమ్మర్‌ ప్యాలెస్‌) తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ తవ్వకాలను తెలంగాణ పురావస్తుశాఖ తోడ్పాటుతో అగాఖాన్‌ ట్రస్ట్‌ సాంస్కృతిక విభాగం గతేడాది సెప్టెంబరులో చేపట్టింది. దీనికి అమెరికా రాయబారుల సంస్కృతి పరిరక్షణ నిధి (ఏఎఫ్‌సీపీ) 1.01 లక్షల డాలర్లు మంజూరు చేసింది. హైదరాబాద్‌ వచ్చిన అమెరికా రాయబారి మైఖేల్‌ పిల్లెటైర్‌ శుక్రవారం సమాధుల్లో బయటపడిన సొరంగాన్ని సందర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 125 దేశాల్లో 800 సాంస్కృతిక పరిరక్షణ ప్రాజెక్ట్‌లకు నిధులు అందజేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలోని తవ్వకాలకూ సాయమందిస్తున్నామని చెప్పారు. ఇక్కడ స్థానిక కూలీలతోనే తవ్వకాలు చేపట్టడాన్ని ఆయన ప్రశంసించారు. పురాతన భవనాలు, ఆనవాళ్లను వెలికితీయడంతోపాటు అప్పటి సాంకేతికతను పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని మైఖేల్‌ వివరించారు.మండువేసవిలోనూ చల్లదనం..తవ్వకాల్లో సొరంగంతోపాటు వేసవి భవంతి నిర్మాణ అవశేషాలను గుర్తించినట్లు అగాఖాన్‌ ట్రస్ట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రతీష్‌నందా, కె.కె.మహ్మద్‌ వివరించారు. ''15, 16వ శతాబ్దాల్లో గోల్కొండ కోటను పాలించిన కుతుబ్‌షాహీలు 106 ఎకరాల్లో ఒకవైపు సమాధుల నిర్మాణం చేపట్టారు. ఇప్పుడున్న మ్యూజియం వెనకవైపు సహాయకుల కోసం వేసవిభవంతి (సమ్మర్‌ ప్యాలెస్‌)ని నిర్మించారు. వీటి కింది భాగం నుంచి నీటిపైపులు బయటబడ్డాయి. మండువేసవిలోనూ చల్లగా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆ రోజుల్లో సమాధుల పక్కనే ప్రార్థన చేసేందుకు మసీదుల నిర్మాణం చేపట్టారు. తిలవత్‌ ఖురాన్‌ పఠించేవారు. వీరి కోసమే వేసవి భవంతిని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ తవ్వకాల్లో చైనీస్‌, ఇండోనేషియా, జకార్తా, ఇజ్రాయిల్‌ శైలి నిర్మాణాలు బయటపడ్డాయి. మొదటి కులీకుతుబ్‌ ముల్క్‌ సమాధి ఎదురుగా ఒక ఉద్యానం, గోల్కొండ కోటవైపు ప్రహరీకి ఆనుకుని సొరంగ మార్గాన్ని తవ్వకాల్లో గుర్తించాం. ఈ తవ్వకాల పనులు డిసెంబరు నాటికి పూర్తవుతాయి'' అని వారు వివరించారు.


ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య కన్నుమూత


ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య ఈరోజు (08/06/2015) ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జానపదం నవలలు రచించి సాహితీ రంగంలో విశేష ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్దతులను ఆయన తన నవలల్లో చిత్రీకరించారు.రంగాచార్య జీవిత విశేషాలు...* 1928లో వరంగల్‌ జిల్లా చినగూడూరులో జన్మించారు.* నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు.* 1951-57 మధ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.* 1957-88 మధ్య సికింద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఉద్యోగం చేశారు.* 'చిల్లర దేవుళ్లు' నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.* తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించారు.* శ్రీమద్రామాయణం, శ్రీమహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు.* 'జీవనయానం' పేరుతో ఆత్మకథను
రచించారు.* అభినవ వ్యాసుడిగా బిరుదు పొందారు.* దేహదాసు ఉత్తరాలు, శ్రీ మహాభారతము, జీవనయానం, చతుర్వేద సంహిత, అమృత ఉపనిషత్తు, అమృతంగమయ తదితర రచనలు చేశారు.కేసీఆర్‌ సంతాపందాశరథి రంగాచార్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి రంగాచార్య అని ఆయన కొనియాడారు. తన రచనల ద్వారా సామాజిక స్ఫూర్తిని ప్రదర్శించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన దాశరథి:
చంద్రబాబుప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం ప్రకటించారు. సాహితీ ప్రక్రియల్లో దాశరథి చేసిన కృషి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిందని కొనియాడారు.


ఇండియా మ్యాప్ లోకి తెలంగాణ ఎంటర్...

indiya myaap loki telangaana entar...  


తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. కానీ అధికారిక చిత్రపటం లేదు. తాజాగా ఇండియా మ్యాప్‌లోకి తెలంగాణ ఎంటరైంది. తెలంగాణ అధికారిక మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ చిహ్నంగా చూపించింది. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, ఆచారవ్యవహారాల వివరాలు సైతం మ్యాప్‌లో ఉన్నాయి. 12వ పెద్ద రాష్ట్రంగా తెలంగాణ.. తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా అధికారికంగా విడుదల చేసింది. దేశంలోని 12వ పెద్ద రాష్ట్రంగా తెలంగాణను పేర్కొంది. రాష్ట్ర సరిహద్దులను నిర్ధారిస్తూ... అన్ని వివరాలను వివరించింది. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక ఉన్నాయి. మ్యాప్‌లో కాకతీయ కళాతోరణానికి సర్వే ఆఫ్‌ ఇండియా పెద్ద పీట వేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వివరాలు.. ఇక జిల్లా కేంద్రాలు, హైవేలు, నదులు, ప్రాజెక్టులు, నదీ మార్గాలు, చారిత్రక స్థలాలు, పుణ్యక్షేత్రాలు సహా అన్ని పర్యాటక ప్రదేశాలను మ్యాప్‌లో స్పష్టంగా కనబడతాయి. తెలంగాణ సంస్కృతిని.. తెలుగు, నిజాం, మొగలాయి, పర్షియన్‌ సంప్రదాయాల కలబోతగా అభివర్ణించింది. అన్ని ప్రధాన పండుగలతో పాటు బతుకమ్మ, బోనాల పండుగలను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారని పేర్కొంది. ఇక జిల్లాల వారిగా 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వివరాలను కూడా పొందుపరిచింది. 10 భాషలతో కూడిన మ్యాప్... మ్యాప్‌లో హైదరాబాద్‌-సికింద్రాబాద్ జంటనగరాలను సర్వే ఆఫ్ ఇండియా హైలైట్ చేసింది. హైదరాబాద్‌ సిటీ మ్యాప్‌తో పాటు మెట్రో రైల్ రూట్‌మ్యాప్‌ను కూడా పొందుపరిచింది. హైదరాబాద్‌ నుంచి ఉన్న రైలు, రోడ్డు, విమాన మార్గాలను మ్యాప్‌లో సూచించింది. తెలంగాణ జిల్లాల నుంచి పలు ప్రముఖ ప్రాంతాలకు ఉండే దూరాన్ని సైతం పొందుపరిచింది. హైదరాబాద్‌ సగటు ఉష్ణోగ్రత వివరాలు కూడా మ్యాప్‌లో ఉన్నాయి. మొత్తం 10 భాషలతో కూడిన మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది.




చార్మినార్‌ వద్ద ఉచిత వైఫై సేవలు ప్రారంభం

హైదరాబాద్‌: చార్మినార్‌ వద్ద ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఈ సేవలను ప్రారంభించారు.

ఓయూలో విద్యార్థుల ఆందోళన OU


ఉస్మానియా విశ్వవిద్యాలయం భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ ఆర్ట్స్‌ కళాశాల నుంచి లా కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించి రహదారిపై బైఠాయించారు.



కేజీ టు పీజీని నీరుగార్చే ప్రసేక్త లేదు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కేజీ టు పీజీని నీరుగార్చే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక కేజీ టు పీజీని పటిష్టంగా అమలు పరచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నా మన్నారు. దీనికి సంబంధించి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా పాలసీని రూపొందిస్తామని చెప్పారు. శాసనసభలో శనివారం సభ్యులు కే లక్ష్మణ్‌, జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ కేజీ టు పీజీ విషయమై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘా లతో చర్చించి అమలుచేస్తామన్నారు. ఈ పాలసీని అసెంబ్లీలో సైతం చర్చకు పెడతామని చెప్పారు. నాణ్యతతో కూడిన ఉచిత విద్య అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దశలవారీగా కామన్‌ స్కూలు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వ, ప్రవేటు రంగంలో 43,861 పాఠశాలలు ఉన్నాయని, వీటిలో 59,54,376 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. కాగా మరో 46 వేల మంది పిల్లలు బడి బయట ఉన్నారన్నారు. వీరందరకూ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. అదేవిధంగా విద్యా హక్కు చట్టం విష యమై కమిటీని వేశామని, ఇది నివేదికను సమర్పించగానే దానిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలు ఉన్న చోట్ల విద్యార్థులు లేరని, విద్యా ర్థులు ఉన్న చోట సరిపడా ఉపాధ్యాయలు లేరని ఇటువంటి లోపాలను సరిచే స్తామన వెల్లడించారు. దేశానికే ఆదర్శవంతమైన విద్యా పాలసీని అందించా లన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి కడియం తెలిపారు. అలాగే పువ్వాడ అజయ్‌కుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఎమ్‌సెట్‌ ఉమ్మడిగా నిర్వహించాలనేది ఆంధ్ర ప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో లేదని తేల్చిచె ప్పారు. ఈనేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎంసెట్‌ను నిర్వహి స్తున్నామని చెప్పారు. విభజన చట్టంలోని 10వ షెడ్యూల్డ్‌లో ఉన్న సంస్థలను మాత్రమే ఉమ్మడిగా నిర్వహించుకోవాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంసె ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎంసెట్‌ నిర్వహణ, ఇంజనీరింగ్‌, మెడికల్‌ సీట్ల ఎంపికకు ఎటువంటి ఇబ్బందులు లేవని మంత్రి పేర్కొన్నారు.


మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ - కెటిఆర్


మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ తప్పకుండ కల్పిస్తామని ప్రకటించారు కెటిఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించామని తెలిపారు. ఉర్దూ మీడియం పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. మైనార్టీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.


తెలంగాణా బడ్జెట్‌ 2015


మొత్తం బడ్జెట్‌ రూ. 1,15,689.19 కోట్లుప్రణాళికేతర వ్యయం రూ. 63,306 కోట్లుప్రణాళికా వ్యయం రూ. 52,383.19 కోట్లుపన్నుల ద్వారా ఆదాయం రూ. 46,494.75 కోట్లుపన్నేతర ఆదాయం రూ. 22,413.27 కోట్లుప్రతిపైసా ప్రజల కోసమే..కేంద్రం నిధుల కోతలేసినా...లక్ష్యం దిశగా అడుగులుబడ్జెట్లో ప్రజల ఆకాంక్షలు సాకారమయ్యాయన్న ఈటెల2015-16 బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విత్తమంత్రిభారీ కోతలను సవరణ బడ్జెట్లో చెప్పని వైనంఇది అంకెల గారడీ: విపక్షాలుకేంద్రం 20 వేల కోట్లు కోతేసినా...ఆశించిన రాబడి రాకపోయినా...అప్పుల భారం భయపెడుతున్నా..ఆదాయ మార్గాలు అంతంతగానే ఉన్నా......ఇలా ఎన్ని హద్దులున్నా..బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగాపెద్ద పద్దును విత్తమంత్రి ఆవిష్కరించారుసొంత ఆదాయ వనరులపై పూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శించారుప్రతిష్ఠాత్మక పథకాలకు పెద్దపీట వేశారుసర్కారు ప్రాధాన్యాల్ని బలంగా వినిపించారుఆర్థిక గంభీరతను చాటుతూ.. మిగులు బడ్జెట్‌నూ చూపారు..ఈ నిధుల లెక్కలు ఘనంగానే ఉన్నా.. వాటి సాధనపైనే సంశయాలు!!నడుస్తున్న బడ్జెట్లో రాబడి లక్ష్యాల్ని అందుకోలేకపోయిన సర్కారు..కొత్త బడ్జెట్‌లో ఇందుకోసం ఏ చర్యలకు ఉపక్రమిస్తుందో వేచి చూడాల్సిందే!!''2014-15లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అంచనాల కన్నా బాగా తగ్గాయి. ప్రణాళికా సాయంగా రూ.11,781 కోట్లు రావాల్సి ఉండగా ఫిబ్రవరి వరకూ వచ్చింది రూ.4,147 కోట్లే. రూ.9,939 కోట్ల ప్రణాళికేతర గ్రాంటులో అందింది రూ.1,346 కోట్లు మాత్రమే. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి పన్నుల రాబడుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెరిగినా తెలంగాణకు కేంద్రం ఇచ్చే ప్రణాళిక నిధుల శాతం తగ్గింది. అయినప్పటికీ కొత్త బడ్జెట్‌లో మా ప్రభుత్వం అధిక మొత్తంలో ప్రణాళిక వ్యయాన్ని ప్రతిపాదిస్తోంది.''-బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌భారీగా తెలంగాణ తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌కేంద్ర సాయం తగ్గినా వెనకడుగులేదనిఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర వెల్లడిఅన్ని రంగాలకూ ప్రాధాన్యంప్రతిష్ఠాత్మక పథకాలకు స్థానంభూముల అమ్మకాలు, క్రమబద్ధీకరణ ద్వారా రూ.13,500 కోట్ల లక్ష్యంవ్యాట్‌ రాబడి తగ్గిందంటూనే మళ్లీ భారీ అంచనాభారీ కోతలను సవరణ బడ్జెట్‌లో చెప్పని వైనంహైదరాబాద్‌ - న్యూస్‌టుడేలంగాణ తొలి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ (2015-16) భారీ కేటాయింపులతో తొణికిసలాడింది. పలు ప్రతిష్ఠాత్మక పథకాలకు తాజా బడ్జెట్‌లో స్థానం లభించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అంచనాల కన్నా తగ్గాయంటూనే భారీ కేటాయింపులతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృఢవిశ్వాసం వ్యక్తంచేసింది. గత హామీల మేరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా చేపట్టాలనే పట్టుదలతో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయటానికి సిద్ధపడింది. 2015-16వ ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ పునర్‌నిర్మాణమే ధ్యేయంగా రూ1,15,689 కోట్ల కేటాయింపులతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని రంగాలకూ కేటాయింపులు కనిపిస్తున్నాయి. కొత్త బడ్జెట్‌లో కేటాయింపులు 2014-15 కంటే రూ.14,977 కోట్లు అధికం.ప్రస్తుత (2014-15) పది నెలల బడ్జెట్‌లో పొందుపర్చిన పథకాలన్నింటికి కొత్త బడ్జెట్‌లోనూ నిధులను పొందుపర్చారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్న జలహారం, మిషన్‌ కాకతీయ, ఆసరా, కల్యాణ లక్ష్మి, సాగునీరు వంటి వాటన్నింటికీ బడ్జెట్‌లో బాగానే నిధులు ఇచ్చారు. నిధులను చూపించటం వరకు బాగానే ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం ఎలా సమీకరించుకొంటుందన్న విషయాన్ని అన్ని వివరాలతో బడ్జెట్‌లో పేర్కొనలేదు. భూముల అమ్మకాలు, క్రమబద్ధీకరణపై ఇంతకు ముందు అంచనావేసిన మేర ఆదాయం రాకపోయినా మళ్లీ రూ.13,500 కోట్లను లక్ష్యంగా నిర్ధేశించుకోవటం, అప్పులను నిబంధనలకు మించి ఎక్కువగా తేవాలనుకోవటం, వ్యాట్‌ ద్వారా ఏకంగా రూ.35,463 కోట్లను రాబట్టాలని సంకల్పించటం బడ్జెట్‌కు భారీ తనాన్ని తెచ్చిపెట్టాయి. కేంద్రం నుంచి వస్తుందనుకొన్న రూ.20వేల కోట్ల మేర నిధులు రాలేదని చెబుతూనే 2014-15 సవరించిన బడ్జెట్‌లో ఆ విషయాన్ని ప్రతిఫలించే వివరాలను పొందుపరచకపోవటాన్ని బట్టి మళ్లీ ఇటువంటి పరిస్థితి కొత్త బడ్జెట్‌లోనూ ఉత్ఫన్నమైతే ప్రభుత్వం ఏ రీతిలో వ్యవహరిస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆర్థిక సంఘం కంటే ఎక్కువ అంచనా14వ ఆర్థిక సంఘం ఇటీవలే వెల్లడించిన నివేదికలో 2014-15లో తెలంగాణ రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయాలు రూ.57,426 కోట్లుగా లెక్కగట్టింది. తాజా బడ్జెట్‌లో మాత్రం దాన్ని రూ.68,908 కోట్లకు పెంచి చూపించారు. ఇలా పెంచి చూపించటం కోసం ప్రభుత్వం.. భూముల అమ్మకాలపై మళ్లీ దృష్టి సారించి ఏకంగా రూ.13,500 కోట్లు సంపాదించాలని నిర్ధేశించుకొంది. అయితే, ప్రస్తుత బడ్జెట్‌లో భూ విక్రయాల ద్వారా రూ.6,500 కోట్ల రాబడి అంచనా వేసినా రూ.120 కోట్ల మేర మాత్రమే సమకూరింది. ఈ పరిస్థితుల్లో కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.13,500 కోట్లను చేరుకోవటంపై సందేహాలు రాకమానవు. ప్రస్తుత అనుభవాలను బట్టి ఇక భూములపై భారీ అంచనాలు ఉండబోవని ప్రభుత్వమే ఒక వైపు చెబుతూ వచ్చి ఇప్పుడు అదే అంశం నుంచి భారీగా నిధులను ఆశించటం చూస్తుంటే బడ్జెట్‌ పరిధిని పెంచటానికే ఇటువంటి అంచనాలకు వెళ్లారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రస్తుతం రూ.2,583 కోట్లను ఆశించగా అందులో సగం మొత్తం కూడా రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని రూ.3,700 కోట్లు చేయటాన్ని బట్టి ఇప్పటి కంటే చాలా ఎక్కువ రాబడిని రిజిస్ట్రేషన్ల ద్వారా సాధించుకోవాలనేది స్పష్టమవుతోంది. దీనికోసం భూముల రిజిస్ట్రేషన్ల విలువలను సర్కారు పెంచటం అనివార్యంగా కనిపిస్తోంది. వ్యాట్‌ వేటు తప్పదావ్యాట్‌ ద్వారా రూ.35,463 కోట్లను కొత్త బడ్జెట్‌లో ఆశించారు. ప్రస్తుత పది నెలల బడ్జెట్‌లోని వ్యాట్‌ లక్ష్యం రూ.26,963 కోట్లు కాగా ఇప్పటికైతే దానిలో చాలా లోటు ఉంది. వ్యాట్‌ ద్వారా అనుకొన్నంత సాధించలేకపోయినట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. అయినప్పటికీ వ్యాట్‌పై మళ్లీ భారీగా రాబడిని అంచనా వేయటాన్ని బట్టి త్వరలో పన్నులను పెంచవచ్చనే భావన వ్యక్తమవుతోంది. ముడి చమురు ధరల్లో వ్యత్యాసాల కారణంగా వ్యాట్‌ రాబడి తగ్గిపోకూడదనే ఉద్దేశంతోనే పెట్రోల్‌, డీజిల్‌లపై పన్ను రేట్లను పెంచినట్లుగా సభలో సభ్యులకు అందజేసిన ద్రవ్యవిధాన పత్రంలో ప్రభుత్వం వెల్లడించింది. మిగతా పన్నుల పెంపు గురించి ఏమీ తెలపలేదు. ఇటీవల అమల్లోకి తెచ్చిన సీఎఫ్‌ఎంఎస్‌ (సమగ్ర ఆర్థిక యాజమాన్య విధానం)ద్వారా పన్నుల వసూళ్లలోని లొసుగులను కనుగొంటామని మాత్రమే దానిలో పేర్కొంది. సొంత పన్నుల రాబడిని 14వ ఆర్థిక సంఘం అంచనాకంటే తక్కువగానే కొత్త బడ్జెట్‌లో చూపించినప్పటికీ అందులో ప్రధానమైన వ్యాట్‌ రాబడి లక్ష్యం మాత్రం ఇప్పటికంటే చాలా భారీగా ఉండటం విశేషం. మద్యంపై అంచనాల పెంపుమద్యంపై కూడా ప్రభుత్వం భారీ ఆదాయాన్నే అంచనా వేస్తోంది. వ్యాట్‌ రాబడిలో రూ. 8,291 కోట్లు కేవలం మద్యం అమ్మకాల ద్వారానే రావాల్సి ఉంది. లైసెన్సు రుసుముల వంటి వాటి ద్వారా ఎక్సైజ్‌ శాఖ మరో రూ.3,916 కోట్లు సంపాదించాలి. ఈ రెండు కలిపి రూ.12,207 కోట్లు ఖజానాకు చేరాలి. ఇది ప్రస్తుత లక్ష్యానికంటే రూ.3,080 కోట్లు అధికం. అప్పుల్లో అదనంగా రూ.2వేల కోట్లురాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 శాతం మాత్రమే అప్పులను తెచ్చుకోవాలనే నిబంధనకు అనుగుణంగా ప్రభుత్వం రూ.14,597 కోట్లను మాత్రమే బడ్జెట్‌లో చూపించాల్సి ఉండగా దానికి భిన్నంగా రూ.16,968 కోట్లను అంచనా వేసింది. అంటే పరిమితి కన్నా రూ.2,371 కోట్లు ఎక్కువ. కేంద్రం జీడీపీలో 3.9 శాతం మేర అప్పులను తెస్తూ రాష్ట్రాలను మాత్రం 3 శాతానికి పరిమితం చేయటం తగదన్నది ప్రభుత్వ వాదన. అటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుత 2014-15 బడ్జెట్‌లో కూడా రూ.17,398 కోట్ల (4.04శాతం) మేర రుణాలను అంచనా వేయగా కేంద్రం అందుకు అంగీకారం తెలపనేలేదు. దీంతో అప్పులను కుదించుకోక తప్పలేదు. రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపులు పది శాతానికంటే తక్కువగాను, మొత్తం అప్పులు జీఎస్‌డీపీలో 25 శాతాని కంటే తక్కువగాను ఉన్నట్త్లెతే అటువంటి రాష్ట్రం 3 శాతానికి మించి మరో 0.50 శాతం మేర అప్పులను తెచ్చుకోవటానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా కేంద్రం ఇంకా దీనికి ఆమోదముద్ర వేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఈ రెండు రకాల నిబంధనలను అమలు చేస్తున్నందున ఆ విధంగా చూసినా ఎక్కువ అప్పులకు అనుమతి లభించవచ్చని భావిస్తున్నట్లు ద్రవ్యవిధాన పత్రం పేర్కొంది.ప్రత్యేక ప్యాకేజీపై మళ్లీ అంచనావెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయంతో ప్యాకేజిని అందజేస్తామని పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం పేర్కొనటంతో కొత్త బడ్జెట్‌లో రూ.2,950 కోట్లను సర్కారు అంచనా వేసింది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5వేల కోట్లను పేర్కొన్నా కేంద్రం ఇచ్చిందేమీలేదు. ప్రభుత్వం మాత్రం ఐదేళ్ల వ్యవధిలో రూ.56 వేల కోట్లను ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్‌టీ) బకాయిలపై కేంద్రం ఇటీవల కొంత సానుకూల ధోరణి కనబర్చటంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రూ.1,500 కోట్లు వస్తాయని కొత్త బడ్జెట్‌లోను ఆశలు పెట్టుకొంది.ఆస్తుల కల్పనకు మిగిలింది తక్కువేభారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ ఆస్తుల కల్పనకు ఉపయోగపడే పెట్టుబడి వ్యయం రూ.15,982 కోట్లుగా మాత్రమే ఉండనుంది. కొత్త బడ్జెట్‌లో తప్పని సరి ఖర్చులతో కూడిన ప్రణాళికేతర వ్యయం రూ.63,306 కోట్లకు చేరటంతో అప్పుల ద్వారా తెచ్చే మొత్తాలను మాత్రమే పెట్టుబడి వ్యయానికి వినియోగించుకోవాల్సి వస్తోంది. ఉద్యోగులకు 43 శాతం మేర ఫిట్‌మెంట్‌ ఇవ్వటంతో జీతాలు, పింఛన్ల ఖర్చు భారీగా పెరగనుంది.పూర్తికాని అప్పుల విభజనఉభయ రాష్ట్రాల మధ్య అప్పుల విభజన ఇంకా పూర్తికాలేదు. దీంతో తెలంగాణ అప్పులు ఎంతనేది కొత్త బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం పేర్కొనలేదు. మొత్తం రూ.1.48 లక్షల కోట్లను విభజించాల్సి ఉండగా అందులో ఇప్పటికి తెలంగాణ వాటాగా వచ్చింది రూ. 61,711 కోట్లని, ఇంకా విభజించాల్సిన మొత్తం ఉందని మాత్రమే సర్కారు పేర్కొంది.


తెలంగాణకు ప్రత్యేక తపాలా సర్కిల్



తెలంగాణకు ప్రత్యేక తపాలా సర్కిల్
  • రాష్ట్రంలో మరో తపాలా రీజియన్ ఏర్పాటు
  •  పిన్ నంబర్లు మాత్రం పాతవే
  •  కొత్తగా చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పోస్టు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు విడివిడిగా పోస్టల్ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ స్వయంగా సీఎం కేసీఆర్‌కు చెప్పారు. పాలనా సౌలభ్యం కోసం దాన్ని విభజించినా.. పిన్‌కోడ్ నంబర్లలో ఎలాంటి మార్పు ఉండదని ఆ విభా గం అధికారులు చెబుతున్నారు. పిన్‌కోడ్‌లుగా ప్రస్తుతం జిల్లాల వారీగా ఉన్న నంబర్లు ఇకపై కూడా అలాగే కొనసాగనున్నాయి. వాస్తవానికి రాష్ట్ర సరిహద్దులతో తపాలాశాఖకు సంబంధం ఉండదు. రాష్ట్రం రెండుగా విడిపోయినా ఒకే సర్కిల్‌గా కొనసాగించే అవకాశం ఉంది.

ఈ మేరకు తెలంగాణ, ఏపీలను ఒకే సర్కిల్ కింద కొనసాగించాలని తొలుత కేంద్రం అనుకున్నా... రాజకీయ ఒత్తిడి, భౌగోళికంగా 2 రాష్ట్రాలు విశాలంగా ఉండటంతో విభజించేందుకే కేంద్రం మొగ్గుచూపింది. ఆరు డిజిట్లు ఉండే పిన్‌కోడ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలో 500 సంఖ్య (తొలి మూడు డిజిట్లు) నుంచి 535 సంఖ్య వరకు అమల్లో ఉన్నాయి.

దీని తర్వాతి సిరీస్ సంఖ్య కర్ణాటక సర్కిల్ పరిధిలో కొనసాగుతోంది. వెరసి 500 సిరీస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, క ర్ణాటక రాష్ట్రాల మధ్య ఉంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య వరుస క్రమంలో ఈ సిరీస్ కొనసాగుతున్నందున.. రాష్ట్రాలు విడిపోతే వాటిని మార్చ టం ఇబ్బందికరం. దీంతో ప్రస్తుత పిన్‌కోడ్ నంబర్లు యధావిధిగా అమలవుతాయి.

ప్రధాన మార్పులు ఇలా..
ప్రస్తుతం ఏపీ సర్కిల్ పేరుతో ఉన్న చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పోస్టును ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించి తెలంగాణకు అదనంగా కొత్త పోస్ట్ కేటాయిస్తారు.

తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి హైద రాబాద్ సిటీ రీజియన్, మిగతా జిల్లాలకు కలిపి హైదరాబాద్ రీజియన్ ఉన్నాయి. వీటి పరిధిలో 13 తపాలా డివిజన్లున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడే తెలంగాణ సర్కిల్ పరిధిలో మరో రీజియన్‌ను అదనంగా ఏర్పాటు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు రీజియన్లున్నాయి. వీటిపరిధిలో 36 తపాలా డివిజన్లున్నాయి. ప్రస్తుత ఆంధప్రదేశ్ సర్కిల్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమవుతుంది.

హైదరాబాద్ అబిడ్స్‌లో జనరల్ పోస్టాఫీసు (జీపీవో) తరహాలో ఏపీ రాజధానిలో ఒకటి కొత్తగా ఏర్పాటు చేస్తారు. అక్కడే చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి కేంద్రం నిధులిస్తుంది. అప్పటివరకు రెండు సర్కిళ్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మెయిల్ మోటార్ సర్వీసు (ఎంఎంఎస్) తరహా వ్యవస్థలను ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుత ఏపీ సర్కిల్ పరిధిలో 16 వేల సాధారణ పోస్టాఫీసులు, 2,500 డిపార్ట్‌మెంటల్ పోస్టాఫీసులున్నాయి. తెలంగాణలో రెండూ కలిపి 8,500 వరకు ఉన్నాయి. ఇవి ఏ ప్రాంతానివి ఆ ప్రాంతంలోనే ఉంటాయి. ప్రస్తుతం విజయవాడ సర్కిల్ పరిధిలో ఉన్న ఖమ్మం జిల్లాను తెలంగాణ పరిధిలోకి మారుస్తారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పోస్టాఫీసుల సంఖ్య పెరుగుతుంది.

ఏపీ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం 45 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి విభజనకు కేంద్రం త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తుంది.

సెక్రటేరియట్‌ను తరలిస్తే సహించేది లేదు: బండ


తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుందని గ్రేటర్ మాజీమేయర్ బండ కార్తీకాచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో సచివాలయాన్ని తరలించడాన్ని నిరసిస్తూ గాంధీభవన్ టు రాజ్‌భవన్‌కు చేపట్టిన పాదయాత్రకోసం తార్నాక నుంచి పిసిసి నాయకులు బండ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా గాంధీభవన్‌కు తరలివెళ్లారు. గాంధీభవన్ నుంచి ప్రారంభమైన యాత్ర కొద్దిసేపటికి పోలీసులు అడ్డుకుని గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా కార్తీకాచంద్రారెడ్డిలు మాట్లాడుతూ సచివాలయాన్ని తరలించాలనుకోవడం తుగ్లక్ చర్య అవుతుందని అన్నారు. కొత్తగ ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలకు కొదవలేదని ఆ సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పధంలో నడిపించాల్సిన ముఖ్యమంత్రి మూఢ నమ్మకాలతో వాస్తు దోషాలంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చింది తడవు ఏదో చేస్తున్నట్లు హంగామా చేయడం ఏమి చేయకపోవడం ఏదో జరుగుతుందని ప్రజలను భ్రమల్లోకి తీసుకువెళుతున్న కెసిఆర్ పనితీరును ప్రజలు గ్రహించే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణా ప్రజల కోరికను తెలుసుకున్న సోనియాగాంధీ ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్కచేయకుండా రాజకీయ ప్రయోజనాలను సైతం ప్రక్కనపెట్టి కేవలం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వచ్చిన తెలంగాణను బంగారు మయం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికి కూడా కెసిఆర్ ప్రభుత్వం ఓట్లు ఎలా సాధించాలి ప్రక్కపార్టీల నేతలను ఎలా ఆకట్టుకొని తమ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలన్న ఆలోచన తప్ప మంచి పనులతో ప్రజల నుంచి స్వచ్ఛందంగా క్యాడర్‌ను పెంచుకునే సత్తాను కోల్పోయిందని అన్నారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా రాజకీయ ప్రయోజనాలను మూఢ నమ్మకాలను ప్రక్కనపెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు అవసరమయ్యే మంచిపనులు చేయాలని అన్నారు. గ్రేటర్‌లో ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఇందులో ఎంతమాత్రం అనుమానం లేదని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తార్నాడ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బీజ్యానర్సింగ్‌రావు, తిరుమలేశ్, లడ్డుబాయ్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. పంట రుణాల పంపిణీ లక్ష్యాలను అధిగమించండి ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, ఫిబ్రవరి 7: జిల్లాలో పంట రుణాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను అధికగమించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో రుంల పంపిణీపై ప్రత్యేక బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంట రుణాలకు సంబంధించి ఈ సంవత్సరం ఖరీఫ్, రబీకు కలిపి రూ. 714 కోట్ల రుణాలకు గాను రూ. 657 కోట్ల రుణాలను అందించిడం జరిగిందని మిగితా రుణాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. రుణమాఫీ పొందిన రైతులందరి రుణాలు రెన్యూవల్, రీషెడ్యూల్ చేసుకున్నట్లయితే రుణ మాఫీ వర్తిస్తుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ పంట రుణాలను అందించాలని బ్యాంకర్లకు సూచించారు. ఈనెల 16 నుండి 23 వరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొంటూ, రుణ మాఫీకి సంబంధించి ప్రభుత్వం రూపొందించినన పత్రాలను సంబంధిత తహశీల్దార్‌తో సంతకం చేసిన అనంతరం రైతులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దీంతో పాటు బ్యాంకర్లు రూపొందించిన ఫారమ్-ఎఫ్‌ను కూడా రైతులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ గ్రామ సభలకు స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు. రుణ మాఫీకి సంబంధించి జిల్లాలో ఫిర్యాదుల విభాగానికి 123 ధరఖాస్తులు రావడం జరిగిందని వీటికి సంబంధించి 3,844మంది రైతులకు రుణ మాఫీ వర్తింపజేసేందుకు వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సీ,ఎస్టీ బిసి, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా గత సంవత్సరం మంజూరై గ్రౌండింగ్ కాని రుణాలను సత్వరమే గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు ఆయన సూచించారు. మహిళా సంఘాల రుణాలకు సంబంధించి తక్కువగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు శ్రద్ధ తీసుకొని లక్ష్యాలను అధిగమించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎల్‌డి ఎం. సుబ్రమణ్యం, వ్యవసాయ శాఖ జెడి విజయకుమార్, డిఆర్‌డిఎ డ్వామా, పిడిలు సర్వేశ్వర్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండాలి ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, ఫిబ్రవరి 7: రంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్ సైనీ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కోర్టు హాల్లో పరిశుభ్రతపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాంపల్లిలో పోలీసు తనిఖీలు చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 7: నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు శనివారం సాయంత్రం కార్డ్ ఆన్ సర్చ్ తనిఖీలు నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెడ్‌హిల్స్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో సుమారు 150 మంది పోలీసులతో డిసిపి కమలాసన్‌రెడ్డి, ఏసిపి సురేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ మదుమోహన్‌రెడ్డిలు మూకుమ్మడిగా ఈ తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 30 వాహనాలను సోదా చేయగా, డాక్యుమెంట్లు సక్రమంగా లేని 12 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 500 గుడుంబా ప్యాకెట్లు లభ్యం కావటంతో, అందుకు సంబంధించిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఉద్యోగులకు కేసిఆర్‌ నజరానా


తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్‌ తీపికబురు అందించింది. ఉద్యోగులకు 43 ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం సచివాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించిన వేతన సవరణ ఇదే. ఈ సందర్భంగా సీఎం కేసీ ఆర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఫిట్‌మెంట్‌ 2014 జూన్‌ 2 నుంచి అమలవు తుందని చెప్పారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర అవ తరణ దినోత్సవం కావడంతో అదే రోజు నుంచి పీఆర్సీని అమలు చేయా లని నిర్ణయించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్త ర్వులను ప్రభు త్వం శుక్రవారం విడుదల చేస్తుందన్నారు. పీఆర్సీ సిఫార్సు చేసిన దాని కం టే ఎక్కువగానే జీతాలు పెంచినట్లు సీఎం వివరించారు. పెరిగిన జీతాలు మార్చి నుంచి అ మలులోకి వస్తాయని తెలిపారు. వేతన సవరణ బకా యిలను జీపీఎఫ్‌లో జమ చేస్తామని అన్నారు. జూన్‌లో నెలలో రిటైర్డైన ఉద్యోగులకు సైతం ఈ వేతన సవరణ వర్తిస్తుందని సీఎం చెప్పారు. ఉద్యోగుల నియామకాలను కేడా సరళీకరణం చేయనున్నట్లు తెలిపారు. ఉ ద్యోగుల జీతభత్యాలతో పాటు ఇతర అంశాలకు సంబంధించి పలు రకాల వ్యతాసాలు కొన సాగుతున్నాయని వాటిని సవరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సర్వీస్‌ రూల్స్‌ను కూడా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం ప్రేండ్లీ సర్కార్‌ నినాదంతో ముందుకు సాగాలని కోరుకుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌లోనూ పెద్ద ఎత్తున మార్పులు చేయాలనిభావిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రధానంగా ఉద్యోగుల నిబం ధనలు అత్యంత కఠినంగా వున్నాయని వీటిని సడలించి సులభ ంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించేలా మార్పు లు చేర్పులు చేయాల ని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇక ప్రదీప్‌చంద్ర నేతృ త్వంతో కొనసాగుతున్న పీఆర్సీ క మిటీ రాష్ట్రంలో కొనసాగుతుందని అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీఆ ర్సీ కమిటీతో భేటి అయ్యారు. పలు అంశాలపై కూలం కుషంగా చర్చించిన సీఎం కేసీఆర్‌ అన్ని విధాలుగా ఉద్యోగులకు మంచి జరగాలనే వుద్దేశ్యంతో ఇంత పెద్ద మొత్తంగా వేతన సవరణకు అంగీకారం తెలిపారు. గతంలో నాలుగైదు పర్యయాలు ప్రదీప్‌చంద్ర కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన సంప్రదిం పులు వారి సమావే శంలోని అంశాలను కమిటీ ఛైర్మన్‌ ప్రదీప్‌చంద్ర ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వివరించారు. కమిటీ సూచిం చిన దానితో పాటు ఉద్యోగుల ఆశించిన దానికంటే ఎక్కువగానే ఫిట ్‌మెంట్‌ను ప్రకటించినట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఉద్య మంలో ఉద్యోగులు చేసిన పాత్ర అనిర్వచనీయమైనదని అన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యో గులకు ఎంత చేసిన తక్కువేనని సీఎం ఈ సందర్భంగా అభిప్రా యపడ్డారు. రాష్ట్ర సాధనలో ఉద్యోగులు అగ్రభాగాన నిలిచి పోరాడిన పరిస్థితిని సీఎం కేసీఆ ర్‌ గుర్తు చేశారు. ఉద్యోగులుగా వారిపై ఎన్ని నిర్భంధాలు పెట్టినా... చివరకు పలు రకాల కేసులు నమోదు చేసినా.. ఎలాంటి భయాం దోళనలకు గురి కాకుండా సకల జనుల సమ్మె లో పాల్గొన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల భారీస్థాయిలో నజరానాగా 43 శా తం ఫీట్‌మెంట్‌ను ప్రకటించామని తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయం లోని ఉద్యోగు లు ఆనందంలో మునిగి తేలారు. సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, దేవిప్రసాద్‌, మమతతో పాటు పలు వురు నేతలు ఈ సం దర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకా కుండా ఆయనకు స్వీట్లు సీఎం పం చారు. పీఆర్‌సీ ప్రకటించిన విషయం తెలుసుకున్న ఉద్యోగులంతా ఒకచోట గుమికూడి అరుపులు, కేకలతో పాటు తన ఆనందోత్సవాలను తెలిపారు. సచివాలయ ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు నరేందర్‌రావు ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు మిఠాయిలు పంచు కుంటూ పటా కులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠా యిలు తి నిపించుకున్నారు. పెద్ద మొత్తం బాణసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు. జై తెలంగాణ సీ ఎం కేసీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తూ సచివాలయం ప్రాగంణాన్ని హోరెత్తించారు. ఉద్యోగులకు అధిక నష్టం: శ్రీనివాస్‌గౌడ్‌ సమైక్య పాలనలో మొదటగా నష్టపోయింది ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులేనని పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. ఏపీ ఏర్పడక ముందు తెలంగాణలో ఉద్యోగుల జీతాలు ఎక్కువగా వున్న విష యాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌ రాష్ట్రం ఆంధ్రాతో విలీనమయ్యాక ఇక్కడి ఉద్యోగుల జీతాలను తగ్గించారని అన్నారు. అక్కడి నుంచి వలస వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు 4 3 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఆయన మాట్లా డారు. తాము కోరిన వెంటనే ఒక్కమా ట కూడా మాట్లాడకుండా ఫిట్‌మెంట్‌ను పెంచేందు కు సీఎం అంగీకరించారని అన్నారు. ఈ ప్రకటనతో కేసీఆర్‌ ఉద్యోగు ల ముఖ్యమంత్రని తే లిపోయిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ కోరిక మేరకు మనమంతా కలిసికట్టుగా పనిచేద్ధామ ని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు ధన్యవాదాలు: దేవిప్రసాద్‌ ఆర్థికశాఖ భారమని చెప్పినా ఉద్యోగులు రాష్ట్రాభివృద్ధికి కోసం అదనంగా గంటపాటు పనిచే స్తారని పీఆర్సీని పెంచారని తెలిపారు. పీఆర్సీతో ప్రకటనతో ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ప్రేమ ఎంత ఉందో అర్ధమవుతుందని తెలిపారు. 42 రోజుల పాటు ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె కాలాన్ని సెలవు రోజులుగా మంజూరు చేయాలని అధికా రులకు సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఉద్యోగులకు పీఆర్సీని ఇప్పించేలా కృషి చేసిన పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్‌, మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.






తెలంగాణ సర్వే సత్యాలు

Tags:
తాజా సర్వేలోని సమాచారం ఆధారంగా అభివృద్ధి విధానాలను మార్చుకోవచ్చు. అయితే ఆయా కులాల ఆర్థిక స్థితిగతులపై అంచనాకు రావడానికి మరింత అధ్యయనం చేయాలె. ప్రభుత్వం ఈ సర్వేతో ఆగకుండా ఇక ముందు కూడా అవసరమైనప్పుడల్లా సర్వేలు నిర్వహించాలె. ఈ సర్వేలో ఏమైనా చిన్న లోపాలు ఉంటే వాటిని సవరించుకోవచ్చు. ఈ సర్వే మనకు ఎంతో అనుభవాన్ని ఇచ్చింది. ఎంతో స్ఫూర్తిదాయకమైంది కూడా. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా సాహసంతో చేపట్టిన సకల జనుల సర్వే వివరాలు వెలుగులోకి రావడంతో అనేక విధాలైన సమాచారం తెలుస్తున్నది. ఈ సర్వే చేపట్టినప్పుడు గిట్టనివారు అనేక విమర్శలు, అవహేళనలు చేశారు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పట్టుదలగా ఈ సర్వేను జరిపింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క లెక్కా కచ్చితంగా లేదు. పథకాల రూపకల్పనలో, అమలులో చిత్తశుద్ధి లేదు. అంతా మొక్కుబడిగా, గందరగోళంగా ఉండేది. నిధులను ఎవరికి తోచిన రీతిలో వారు కైంకర్యం చేసుకున్నారే తప్ప అర్హులకు మాత్రమే అందాలనే దృక్పథం లేకుండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే ఫలితంగా ఇప్పుడు అభివృద్ధి విధానాలు, సంక్షేమ పథకాలు తయారు చేయడానికి కావలసిన సమాచారం చిటికె వేస్తే లభిస్తుంది. బడ్జెట్ కేటాయింపు మొదలుకొని నీటి సరఫరా వరకు ప్రతి కార్యక్రమానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక సమాచార బంగారు గని! ప్రజలు కూడా ఈ సర్వేకు ఎంతో సహకరించినందు వల్లనే ఈ ఫలితాలు వచ్చినయి. ప్రభుత్వం చేపట్టబోయే పథకాలకు ఈ సర్వే ప్రాతిపదికగా ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకొని సామాజిక వేత్తలు ఎన్నో అధ్యయనాలు, విశ్లేషణలు చేయవచ్చు. ప్రభుత్వానికి సూచనలు అందించవచ్చు. ఒక్కో సామాజికవర్గ, ప్రాంత స్థితిగతులు ఎంతగా అధ్యయనం చేస్తే అంతగా లక్ష్య నిర్దేశిత విధానాలు అవలంబించవచ్చు. సర్వేలో వెల్లడయిన సమాచారం ప్రకారం- ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలలో మగవారి కన్నా మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నది. దీనిని సామాజిక అభివృద్ధికి సూచనగా భావించాలా సామాజిక సంక్షేమ ఫలితమా అనేది అధ్యయనం చేసి తెలుసుకోవాలె. వికలాంగుల సంఖ్య ఐదు లక్షల మేర ఉన్నది. అంగవైకల్యానికి కారణాలను గుర్తించి గర్భస్థ దశ నుంచి జాగ్రత్తలు చేపట్టాలె. ఇప్పుడున్న వికలాంగులకు చేయూత ఇవ్వాలె. ఆయా వైకల్యాన్ని బట్టి వారు జీవితంలో స్థిరపడే విధంగా, సామాజికాభివృద్ధిలో భాగస్వాములయ్యే విధంగా పథకాలు రూపొందించాలె. జనాభాలో రెండు శాతం వ్యాధిగ్రస్తులున్నారు. వ్యాధులను అరికట్టడంతోపాటు, ఇప్పుడున్న వారికి చికిత్స, ఉపశమనం మొదలైన అంశాలపై దృష్టి సారించవచ్చు. దాదాపు పద్దెనిమిది శాతం కుటుంబాలకు మహిళలే ఇంటి పెద్దలు. వీరి ఉపాధి, జీవన విధానాలపై పరిశీలన జరపాలె. నాలుగు శాతం మహిళలు వితంతువులు, భర్త వదిలేసిన వారుగా వెల్లడైంది. వీరు ఏ కారణాల రీత్యా వితంతువులు అవుతున్నారు? విడిగా బతకడానికి కారణాలేమిటి? వీరిలో అక్షరాస్యులు, ఉన్నత, మధ్యతరగతి, కింది తరగతి వారు ఎందరు? పునర్వివాహం చేసుకోని వారు ఏ వర్గాల వారై ఉంటారు? మొదలైన అధ్యయనాలు జరిపితే సంస్కరణలకు అవకాశం ఉంటుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు సంబంధించి కూడా వివరాలు తెలిసినందు వల్ల వారి పురోభివృద్ధికి చర్యలు తీసుకోవచ్చు. ఆయా వర్గాల వారికి కూడా ఈ గణాంకాలు ఉపయోగకరంగా ఉంటాయి. రాష్ట్రంలో 51శాతం వెనుకబడిన తరగతుల వారున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. పదిహేడున్నర శాతం ఎస్సీలు, దాదాపు పది శాతం ఎస్టీలు, 14.46 శాతం వివిధ అల్పసంఖ్యాకవర్గాలు ఉన్నాయి. ఈ అల్ప సంఖ్యాకవర్గాలలో అధిక సంఖ్యాకులు ముస్లింలు. విద్యార్థి వసతి గృహాలు, పక్కా ఇండ్లు ఇట్లా అనేక పథకాల అమలుకు, అవి ఏ వర్గాలకు చేరుతున్నాయో తెలుసుకోవడానికి ఈ గణాంకాలు ఉపయోగపడతాయి. కులాలను కూడా లెక్కించడం ఈ సర్వే ప్రాముఖ్యాన్ని పెంచింది. కులాన్ని లెక్కించాలా వద్దా అనే చర్చ జాతీయ స్థాయిలో సాగుతున్న వేళ మన రాష్ట్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు సంబంధించి కచ్చితమైన గణాంకాలు లేవు. దీని వల్ల తమ జన సంఖ్యకు తగిన రీతిలో రిజర్వేషన్ ఇతర సదుపాయాలు లేవనే భావన కొందరిలో ఉన్నది. కొన్ని కులాలు ముందంజ వేసినప్పటికీ ఇంకా రిజర్వేషన్ ఇతర సదుపాయాలు పొందడమేమిటి? దీని వల్ల అదే వర్గంలోని ఇతర కులాలు నష్టపోవడం లేదా అనే ప్రశ్నలు కూడా ఉండేవి. వీటన్నిటిపై తగిన చర్చ జరగాలంటే కచ్చితమైన వివరాలు అవసరం. తాజా సర్వేలోని సమాచారం ఆధారంగా అభివృద్ధి విధానాలను మార్చుకోవచ్చు. అయితే ఆయా కులాల ఆర్థిక స్థితిగతులపై అంచనాకు రావడానికి మరింత అధ్యయనం చేయాలె. ప్రభుత్వం ఈ సర్వేతో ఆగకుండా ఇక ముందు కూడా అవసరమైనప్పుడల్లా సర్వేలు నిర్వహించాలె. ఈ సర్వేలో ఏమైనా చిన్న లోపాలు ఉంటే వాటిని సవరించుకోవచ్చు. ఈ సర్వే మనకు ఎంతో అనుభవాన్ని ఇచ్చింది. ఎంతో స్ఫూర్తిదాయకమైంది కూడా.


తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ : బడ్జెట్ ప్రధాన అంశాలు


తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.

బడ్జెట్ ప్రధాన అంశాలు :

* తెలంగాణ జర్నలిస్టుల భవన్ కు కి రూ.10 కోట్లు కేటాయింపు
*  ఆటోలపై రవాణా పన్ను రద్దు
* బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి మూడున్నర లక్షల కేటాయింపు
* దీపం పథకానికి రూ.100 కోట్లు
*దళితుల భూపంపిణీకి రూ.1000 కోట్లు
* సాంస్కృతిక, క్రీడారంగానికి రూ.1000 కోట్లు

*విద్యాశాఖలోని అన్ని విభాగాలకు రూ.10,956 కోట్లు కేటాయింపు
*వ్యవసాయం, రుణమాఫీ కోసం ఇప్పటికే రూ.4,250 కోట్లు కేటాయింపు
*మిగతా నిధులను వచ్చే మూడేళ్లలో దశలవారీగా చెల్లింపు
*ఇన్ పుట్ సబ్సిడీ రూ.480 కోట్లు ఇప్పటికే చెల్లింపు
* ఉద్యానవన శాఖకు రూ.250 కోట్లు కేటాయింపు
* వ్యవసాయ రంగంలో యంత్రీకరణకు రూ.100 కోట్లు

* వికలాంగుల పెన్షన్ ను రూ.500 నుంచి 1500లకు పెంపు
* వృద్ధులు, వితంతువుల పెన్షన్ రూ.200 నుంచి రూ.1000 పెంపు
* మహిళా శిశు సంక్షేమానికి రూ.221 కోట్లు, ఐసిడీఎస్ పథకానికి రూ.1103 కోట్లు
* బీసీల సంక్షేమానికి రూ.2022 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.1030 కోట్లు
* ఎస్సీల సబ్ ప్లాన్ కు రూ.7579 కోట్లు, ఎస్టీల సబ్ ప్లాన్ కు రూ.4559 కోట్లు
* 2014-19 వరకు ఎస్సీల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వ లక్ష్యం
* కళ్యాణ లక్ష్మీ (ఎస్సీ) పథకానికి రూ.150 కోట్లు, కళ్యాణ లక్ష్మీ (ఎస్టీ) పథకానికి రూ.80కోట్లు కేటాయింపు
* మైనార్టీలకు (షాదీ ముబారక్) రూ.100 కోట్లు

* రహదారుల అభివృద్ధికి రూ.10వేల కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లాలకు డబుల్ రోడ్లకు రూ.400 కోట్లు
* ఈ ఏడాది 9వేల చెరువులకు రూ.2వేల కోట్ల కేటాయింపు
*తెలంగాణలో దెబ్బతిన్న 45వేల చెరువులను పునరుద్ధరిస్తాం
* తెలంగాణ 10 జిల్లాల్లో తలసరి ఆదాయం ఒక్కోచోట ఒక్కోలా ఉంది
* 50 ఏళ్లుగా తెలంగాణపై చేసిన పరోక్ష పెత్తనం... ఈప్రాంతాన్ని వెనుకబడేలా చేసింది

* విద్యుత్ రంగానికి మొత్తం రూ.3241 కోట్లు
* ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.కోటిన్నర, మొత్తం రూ.234 కోట్ల కేటాయింపు
* వచ్చే అయిదేళ్లలో 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యం
* ఎన్టీపీసీ ద్వారా అదనంగా 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు
* 6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం జెన్ కోలో రూ.1000 కోట్ల పెట్టుబడి

*రూ.లక్షా 637 కోట్ల 10 నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటెల రాజేందర్
*ప్రణాళిక వ్యయం రూ.48, 648 కోట్లు
*ప్రణాళికేతర వ్యయం రూ.51,989 కోట్లు
*రెవెన్యూ మిగులు అంచనా రూ.301 కోట్లు
*ఆర్థిక లోటు అంచనా రూ.17,398 కోట్లు

* రహదారుల అభివృద్ధికి 10వేల కోట్లు
* రైతులకు సోలార్ పంపు సెట్ల కోసం రూ.200 కోట్లు
*గృహ నిర్మాణం 1000 కోట్లు
* వాటర్ గ్రిడ్ లకు రూ.2వేల కోట్ల కేటాయింపు
* నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
* 459మంది అమరవీరుల ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం
* పథకాల అమలులో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే సమగ్ర సర్వే

* నల్లగొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ శాపంగా మారింది
* బంగారు తెలంగాణ లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన
* ఉద్యమ భవిష్యత్ అందించేలా బడ్జెట్
* ఈ బడ్జెట్ పది నెలలకు సంబంధించినది మాత్రమే
* అన్నివర్గాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
* అమరవీరులకు పరిహారం కోసం బడ్జెట్ లో రూ.100 కోట్లు

ఆసరా పథకం

ఈ నెల 8 నుంచి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఫించన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఫించన్లను 'ఆసరా' పథకం ద్వారా ఇవ్వనున్నారు. అయితే 'ఆసరా' పేరిట పెన్షన్ పథకం అమలుకు మార్గదర్శకాలు నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెల 1 నుంచి 8వ తేదీ వరకు ఫించన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వితంతువులు, వృద్ధులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 ఇవ్వనున్నారు.

రేషన్ కార్డులను టీఎస్ పేరుతో

ఏపీ పేరుతో ఉన్న రేషన్ కార్డులను టీఎస్ పేరుతో మారుస్తామని ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణలోని పేదలకు బియ్యం కార్డులను అందజేస్తామని చెప్పారు. తెల్లరేషన్ కార్డు కేవలం బియ్యం కోసం మాత్రమేనని, గత ప్రభుత్వం లాగే రూపాయికే కిలో బియ్యం ఇస్తామన్నారు. ఒక కుటుంబానికి 20 కిలోల బియ్యం అనే పరిమితిని సడలిస్తామని ఈటెల స్పష్టం చేశారు.

Followers