Tags: Social studies Methodology, DSC, DSC 2013, Notification DSC 2013.
1. జట్టు సభ్యులతో పనిచేసే సామర్థ్యం, ఇతర సభ్యుల సహకారం తీసుకోవడం ఏ రకమైన నైపుణ్యానికి సంబంధించింది?
1) నిశిత ఆలోచన 2) భావ వ్యక్తీకరణ
3) బౌద్ధిక 4) సాంఘిక
2. మేథోమధనం (Brainstorming)?
1) ఇది ఆలోచన ఉద్దీపన చేస్తుంది. కానీ ఆలోచనలు అర్థవంతమైనవా, ఉద్దేశ్యపూరితమైనవా పట్టించుకోదు
2) ఇది సాంఘికశాస్త్రంలో చాలా విరివిగా ఉపయోగించే విధానం
3) ఇది క్లినికల్ సైకాలజీలో వాడేవిధానం
4) మెదడు సంక్షోభంలో ఉండి, ఎటు వంటి ఆలోచనలూ ఉండవు
3. నిర్ధ్దేశిత
బోధనా వ్యూహంలో ఒక ముఖ్యమైన అంశంపై అనేక మంది వక్తలు వారి అభిప్రాయాలు,
అనుభవాలను వ్యక్తం చేస్తారు. దాన్ని ఏ విధంగా పేర్కొంటారు?
1) ప్యానెల్ చర్చ 2) సింపోజియం
3) వాగ్వాదం (డిబేటు)
4) సాంఘిక ఉద్గార
4. సరళత నుంచి సంక్లిష్టతకు వెళ్లడం ఒక?
1) ఉపకరణం 2) యుక్తి
3) వ్యూహం 4) నియమం
5. పాఠశాల విద్యార్థులు గ్రామస్తుల సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటుచేయడం దేన్ని సూచిస్తుంది?
1) పాఠశాల పరపతి సంఘాల భాగస్వామ్యం
2) పాఠశాల సమాజ భాగస్వామ్యం
3) ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం
4) విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం
6. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకం గా, ఉద్దేశపూర్వకంగా కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్టు అని నిర్వచించినవారు?
1) బైనింగ్ 2) స్టీవెన్‌సన్
3) కిల్ పాట్రిక్ 4) బెల్లార్‌డ
7. సరళత నుంచి సంక్లిష్టత, మూర్తము నుంచి అమూర్తం, నిర్ధిష్టత నుంచి సాధారణత మొదలైన సూత్రాల ఉపయోగం?
1) బోధకుడి ఎంపికకు
2) భోధనా వ్యూహం ఎంపికకు
3) బోధనా పరికరాల తయారీకి
4) మూల్యాంకన విధాన రూపకల్పనకు
8. విమర్శనాత్మక, నిర్ణయశక్తిని పెంపొందిం చే పద్ధతి?
1) సమస్యా 2) మూలాధార
3) ఉపన్యాస 4) సామాజీకృత కథన
9. దేశంలోని న్యాయ వ్యవస్థను బోధించడానికి ఉపాధ్యాయుడికి కావాల్సిన అనువైన బోధనాభ్యసన సామగ్రి?
1) వృత్తపటం 2) ప్రవాహ చార్టు
3) రేఖాపటం 4) పత్రికా చార్టు
10. 1963లో అభివృద్ధి చెందిన బోధన?
1) వ్యక్తిగత 2) జట్టు 3) స్థూల 4) సూక్ష్మ
11. జాన్ డ్యూయీ సమస్యా పరిష్కార పద్ధతి లో రూపొందించిన సోపానాల క్రమం?
1) భోగట్టా సేకరించడం, అధ్యయనం- నిశ్చిత అభిప్రాయాలకు రావడం- సమస్యా విశ్లేషణ, పరికల్పన రూపకల్పన
2) సమస్యా విశ్లేషణ, పరికల్పన రూపకల్పన- సమస్య నిర్వచించడం- నిశ్చిత అభిప్రాయాలకు రావడం- భోగట్టా సేకరించడం, అధ్యయనం
3) సమస్యను నిర్వచించడం- సమస్యా విశ్లేషణ, పరికల్పన రూపకల్పన- బోగట్టా సేకరించడం, అధ్యయనం- నిశ్చిత అభిప్రాయాలకు రావడం
4) నిశ్చిత అభిప్రాయాలకు రావడం- భోగట్టా సేకరించడం, అధ్యయనం- సమస్యావిశ్లేషణ, పరికల్పన రూప కల్పన- సమస్యను నిర్వచించడం
12. సాంఘిక అధ్యయనాల ఉపాధ్యాయుడుకి కావాల్సిన ప్రత్యేక లక్షణం?
1) క్షేత్ర పరిశీలనా దృక్పథం
2) నల్లబల్లపై రాసే నైపుణ్యం
3) పఠనాశక్తి 4) ఉత్సాహం
13. ఏ బోధనా పద్ధతిలో మోడరేటర్ ఆవశ్యకత ఉంది?
1) సమస్య 2) మూలాధార
3) సామాజికీకృత కథనం
4) పర్యవేక్షితాధ్యయనం
14. నిగమన, ఆగమన ప్రక్రియల ద్వారా బోధన చేపట్టే పద్ధతి?
1) ప్రయోగాత్మక
2)పర్యవేక్షితాధ్యయనం
3) ప్రాజెక్టు 4) సమస్యా
15. వీటిలో విద్యార్థులకు ప్రాచీన సంస్కృతి గురించి ప్రత్యక్ష అవగాహన కలిగించేది?
1) ప్రాచీన సంస్కృతిపై నిపుణుల ఉపన్యాసాలు
2) శిలా శాసనాలు
3) చారిత్రక గ్రంథాలు
4) ప్రాచీన సంస్కృతికి సంబంధించిన చిత్రాల ఆల్బమ్
16. ఏ పద్ధతిలో విద్యార్థి క్రియాశీలత జ్ఞాన రంగానికే పరిమితమైంది?
1) ప్రాజెక్టు 2) కథన
3) ఉపన్యాస 4) సమస్యా
17. సాంఘిక శాస్త్ర బోధనలో ఉపయోగించడానికి సాధారణంగా ప్రతి పాఠశాలకు అతి సమీప పరిసరాల్లో లభించే సహజ వనరు?
1) నదులు 2) కొండలు
3) మృత్తికలు 4) అడవులు
18. వీటిలో ప్రత్యక్ష అనుభవాలు కలిగించే బోధన ప్రక్రియ?
1) క్షేత్ర పర్యటనలు
2) నిపుణుల ఉపన్యాసాలు
3) వాగ్వాదం 4) నాటకాలు
19. ‘రోడ్డు భద్రతా నియమాలు’ అనే పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఏ పద్ధతి అవలంబిస్తే విద్యార్థులకు చక్కగా అవగాహన అవుతుంది?
1) కృత్యాధార 2) ఉపన్యాస
3) ప్రశ్నోత్తర 4) ప్రాజెక్టు
20. ‘భారతదేశంలో పార్లమెంట్ వ్యవస్థ’ అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి అనువైన వ్యూహం?
1) ఉపన్యాస పద్ధతి 2) చార్టులు
3) మాదిరి పార్లమెంటు
4) విద్యార్థుల సభను ఏర్పాటు చేయడం
21. ‘బ్యాంకులు- వాటిపనితీరు’ అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులు అవగాహన చేసుకునేందుకు దోహదం చేసే కృత్యం?
1) విద్యార్థులను బ్యాంకుకి తీసుకెళ్లడం
2) పాఠశాలలో సంచయిక బ్యాంకుని ఏర్పాటుచేయడం
3) బ్యాంకింగ్ ఏజన్సీతో ఉపన్యాసం ఇప్పించడం
4) సమూహాన్ని ఏర్పాటు చేసి, సమూహంలో చర్చించడం
22. విద్యార్థులు తమతోటివారి అభిప్రాయా లను గౌరవించడం ఏ పద్ధతిలో నేర్చు కుంటారు?
1) ప్రశ్నోత్తర 2) ప్రకల్పన
3) ఉపన్యాస 4) చర్చా
23. సాంఘిక శాస్త్రానికి ఒక చక్కని విద్యా ప్రణాళికా ప్రయోగశాల?
1) పాఠశాల ప్రయోగశాల
2) సాంఘిక శాస్త్ర మ్యూజియం
3) సాంఘిక శాస్త్ర తరగతి గది
4) చుట్టూ ఉండే సమాజం
24. సింపోజియమ్‌లో ఎంత మంది విద్యార్థులు పాల్గొంటే బాగుంటుంది?
1)10-15 2)20-30 3)15-18 4)4-5
25. విద్యార్థుల్లో స్వీయాభిప్రాయాల వ్యక్తీకరణకు అవకాశం కల్పించే పద్ధతి?
1) పర్యవేక్షితాధ్యయనం
2) సామాజికీకృత కథనం
3) మూలాధార 4) ఉపన్యాస ప్రదర్శన
26. జనవరిలో పూర్తి చేయాల్సిన సిలబస్ డిసెంబర్‌లోనే పూర్తిచేయమని జిల్లా ఉప విద్యాధికారి ఆదేశిస్తే హైస్కూల్ ఉపాధ్యాయుడిగా నీవు?
1) ముఖ్యమైన అంశాలు బోధిస్తాను
2) ఉపన్యాస పద్ధతిలో బోధిస్తాను
3) చర్చాపద్ధతిలో కష్టమైన పాఠాలను బోధిస్తాను
4) సమస్యా పరిష్కార పద్ధతి పాటిస్తాను
సమాధానాలు
1) 4 2) 1 3) 2 4) 4 5) 2
6) 3 7) 2 8) 4 9) 2 10) 411) 3 12) 1 13) 3 14) 4 15) 216) 3 17) 3 18) 1 19) 4 20) 321) 2 22) 2 23) 4 24) 4 25) 226) 2