Breaking News

మహమద్ కులీకుతుబ్ షా - విశ్వ నగరంగా భాగ్యనగరంమహమద్ కులీకుతుబ్ షా
  • క్రీ.శ 1580 లో గోల్కోండ సింహాసనాన్ని మహమద్ కులీకుతుబ్ షా అధిష్టించాడు.
  • క్రీ.శ 1591 లో హైదరాబాద్ నగరం ( భాగ్యనగరం ) నిర్మించాడు.
  • హైదరాబాద్ నగరవాస్తుశిల్పి- మీర్ మెమిన్ అస్త్రాబాది.
  • మహమద్ కులీకుతుబ్ షా తన ప్రేయసి భాగమతికి హైదర్ మహల్ అనే బిరుదును ప్రధానం చేసాడు.
  • మహమద్ కులీకుతుబ్ షా గోప్ప విద్వాంసుడు, కవి, ఇతను కలం పేరు- మానీలు.
  • మహమద్ కులీకుతుబ్ షా కాలాన్ని గోల్కోండ చరిత్రలో స్వర్ణయుగంగా భావిస్తారు.
  • గోల్కోండ కోటకు మగ్మద్ నగరు అని పేరు పేట్టాడు
  • మహమద్ కులీకుతుబ్ షా నిర్మించిన కట్టడాలు: చార్మినార్, మూసీనదికి ఆనకట్ట, చార్ కమాన్, దారుల్ షిఫా, దాదుమహల్, జామా మసీదు
  • 1593-94 హైదరాబాద్ ప్లేగు వ్యాధిని నిర్మూలించిన సందర్భంగా చార్మినార్ ను నిర్మించాడు
తెలంగణ రాజధాని నగరం హైదరాబాద్. దీనిని భాగ్యనగరం అని కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1591లో మహ్మద్‌కులీకుతుబ్ షా దీనిని నిర్మించాడు. కుతుబ్ షాహీ వంశంలో ఆయన అయిదో రాజు. ఈ నగరానికి 400ఏళ్ల చరిత్ర ఉంది. నగర చరిత్రకు చార్మినార్, గొల్కొండ కట్టడాలు మకుటాయమానం. ప్రత్యేక రాజ్యంగా అనేక ఏళ్లు వర్థిల్లిన హైదరాబాద్ ఎట్టకేలకు 1948 సైనిక చర్య తర్వాత భారత్‌లో అంతర్భాగమైంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రస్తుతం నగరం గ్రేటర్ హైదరాబాద్‌గా విస్తరిస్తోంది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, సాంకేతికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌గా వర్థిల్లుతోంది.
   

చర్వితచరణమైనా చరిత్ర అది ఎప్పటికీ శ్రవణానందకరమే. వేల గొంతులతో వీనులవిందుచేసిన రాగాల దర్బారు కూడా ఒకనాటికి వానకారు కోయిలలా మూగబోవచ్చు. కాని బూజుపట్టిన మూగ దర్బారులోనే రాలి పడిన మువ్వ ఒకటి నాటి ఘనమైన జ్ఞాపకాలను ఏర్చికూర్చి పాటలా వినిపిస్తుంటుంది. ఆ పాట వేల రాగాలకు స్వాగతగీతం పాడుతుంది. నేటి తరాన్ని వెన్నంటి ప్రొత్సహిస్తుంది. ఇలాంటి ఘనచరిత గురుతులున్న భాగ్యనగరం నేడు సైబర్ సొబగులతో, డిజిటల్ మోతలతో ఆధునికతతో అలరారుతున్నంత మాత్రాన 'గతం గతః' అనుకుంటే పొరపాటే. మధురస్మృతులు ఒడిన దాచుకుని వడివడిగా పరుగెత్తిన మూసీ నేడు మురికినీటితో మూగబోయింది. అయినా మనసుండాలేకాని ఆ తీరంలో సాగిన నాగరికత జాడలు... ఎందరో నవాబుల, షరాబుల ప్రణయగాధలు... ఇంకెందరో గరీబుల గాయాల గుండెచప్పుళ్లు... మనకిప్పటికీ వినిపిస్తునే ఉంటాయి. 'కారే రాజులు రాజ్యముల్ గల్గవే, వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే...' అంటారు పోతనామాత్యులు. అలా రాజ్యాలు, రాజులు పోయినా ఈ సుందరనగరపు సుమధుర కథనాలు మాత్రం మనను విడిచిపోలేదు. మతంకన్నా మమతలు మిన్నని మనసుపడి ఓ నేలమగువలను మనువాడిన నవాబులు ఆనాడే అందరూ ఒక్కటేనని నిరూపించారు. ఆ ప్రేమకథలకు గురుతుగా ఈ భాగ్యనగరాన్ని బహుమతిగా మిగిల్చారు. నగరానికే ఓ అందమైన నగగా చార్‌మినార్‌ను నిలబెట్టారు. ముంగిళ్లలో ముత్యాలు రాశులుగా పోసి అమ్మిన ఈ నగరంలో నేడు 'మంచినీరు' కూడా వెలకట్టే విలువైన వస్తువుగా పరిణమించింది. అణువణువు 'ప్రియం'గా మురుతున్నా, ఎందరికో ప్రియమైన ప్రదేశంగానే మారుతోంది. ఎందరో చరిత్రపురుషులు అడుగుజాడల్లో ఈ నగరం తరించిపోయింది. ఈ మట్టివాసనలో ఆనాటి చరిత్ర జ్ఞాపకాలెన్నో పరిమళిస్తాయి. ప్రపంచాన్నే అబ్బురపరిచే విభిన్న సంస్కృతుల సమ్మిశ్రమమం ఒకవైపు, పడుగుపేకల్లా అల్లుకుపోయిన భిన్న సంస్కృతులు మరోవైపు ఈ భాగ్యనగరపు ఉనికికి నిరంతరం నీరాజనాలై వెలుగుతున్నాయి.
కుతుబ్‌షాహీల చరిత్ర
బహమనీ సుల్తానులలో రెండోవాడైన మహమ్మద్ షా (1358-75) గోల్కొండ దుర్గాన్ని ఆక్రమించగలిగాడు. క్రమ క్రమంగా బహమనీ సామ్రాజ్యం తెలంగాణా ప్రాంతాలకేకాక, కోస్తాఆంధ్ర ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఆ సామ్రాజ్యాన్ని 1482 నుంచి 1518 వరకు పరిపాలించిన మహమూద్ షా బహమనీ 1496లో ''కులీకుతుబ్-ఉల్-ముల్క్'' అనే అనుచరుని తెలంగాణా ప్రాంతానికి గవర్నర్‌గా నియమించాడు. కులీకుతుబ్ గోల్కొండను కేంద్రంగా చేసుకొని తన ఆదీనంలో ఉన్న ప్రాంతాలను పరిపాలించాడు. మహమూద్ షా బహమనీ మరణానంతరం బహమనీ సామ్రాజ్యం బలహీనపడి నామమాత్రమైంది. ఇదే అదనుగా తీసుకొని అహమ్మద్‌నగర్, బీరార్, బీదర్, బీజపూర్ రాష్ట్రాల పాలకులు స్వతంత్రులయ్యారు. ఈ తరుణంలోనే కులీకుతుబ్ 1518లో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించి గోల్కొండ సామ్రాజ్యానికి మూలపురుషుడయ్యాడు.
హుస్సేన్‌సాగర్ నిర్మించిన ఇబ్రహీం
ఇబ్రహీం గొప్ప నిర్మాత. ఆయన హుస్సేన్ సాగర్‌ను నిర్మింపజేసి ఆ ప్రాంత ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించాడు. మూసీ నదిలో కలిసే మూడు చిన్న చిన్న ఏరులకు 2500 అడుగుల పొడుగు కల అడ్డకట్ట (టాంక్‌బండ్) వేయించడంతో ఈ సరస్సు ఏర్పడింది. దీనికి ఆ రోజులలోనే రెండున్నర లక్షల రూపాయల ఖర్చు చేశారు. ఇది పట్టణ ప్రజలకు మంచి నీరు అందివ్వడమే కాక ఇక్కడి వాతావరణాన్నే చల్లబరచింది. నేటి ప్రమాణాలతో పోల్చి చూస్తే దీనిని గొప్ప ఇంజనీరింగ్ ఘనకార్యంగానే భావించాలి. దీని పేరు దాని నిర్మాత అయిన ఇబ్రహీం పేర ఇబ్రహీంసాగర్‌గానే కుతుబ్‌షాహీ రికార్డుల్లో నమోదు అయింది. కాని దాని నిర్మాణానికి రూపకల్పన చేసి దానిని అమలుపర్చడంలో ప్రముఖపాత్ర వహించిన హుస్సేన్‌షా వలి పేరుమీదగానే ప్రజలు దీనిని హుస్సేన్‌సాగర్ అని పిలిచేవారు.
భాగ్యనగర నిర్మాత కులీకుతుబ్‌షా
హైదరాబాద్ నగర నిర్మాణం మహమ్మద్ కులీకుతుబ్ చేపట్టిన కార్యాలన్నిటిలోకి అత్యంత చిరస్మరణీయమైనది తన తండ్రి రూపొందించిన పథకం ప్రకారం మూసీకి దక్షిణదిశగా ఈ నగరాన్ని నిర్మించడం. దీనికాయన 1591లో పునాది వేశాడు. హిందూ, ముస్లిం పంచాంగాలను అనుసరించి దీనికి ముహుర్తం పెట్టించాడని ప్రతీతి. చంద్రుడు సింహరాశిలోను, బృహస్పతి తన స్వస్థానంలో ఉన్న శుభ ముహూర్తంలో ఈ నగర శంకుస్థాపన జరిగింది. దీనికి ఇరాన్‌లోని సుప్రసిద్ధ నగరమైన 'ఇస్ఫహాన్' రూపకల్పనననుసరించి 'అలీం' అనే వాస్తుశిల్పి రూపకల్పన చేశాడని చరిత్రకారుల అభిప్రాయం. అందువల్లనే ఈ నగర నిర్మాణంలో సముచిత పాత్ర వహించిన మహమ్మద్ కులీకుతుబ్ షా ప్రధానమంత్రి మీర్ మొమిన్ ఈ నగరాన్ని 'నూతన ఇస్ఫహాన్'గావర్ణించాడు.
   

నిజాంల పాలన
ఆనాటి మొగల్ చక్రవర్తులు గోల్కొండ, బీజపూర్, తమిళనాడు, గుల్బర్గా, బీదర్, బీరార్ ప్రాంతాలను ఒక సుభాగా ఏకం చేసి దాని పరిపాలనకు ఒక సుభాదారుడిని నియమించేవారు. ఈ దక్కన్ సుభాదార్ ఔరంగాబాద్‌ను కేంద్రంగా చేసుకొని ఈ ప్రాంతాలను పరిపాలించేవాడు. 1713లో ఆనాటి మొగల్ చక్రవర్తి ఫరూక్ సియార్ మీర్ కమ్రుద్దీన్ చింక్ లిచ్‌ఖాన్ అనే సర్దార్‌ను దక్కన్ సుబేదారుగా నియమించారు. రెండు సంవత్సరాల తర్వాత ఆయన స్థానంలో సయ్యద్ హుస్సేన్ ఆలీఖాన్‌ను ఆ పదవిలో నియమించారు. మీర్ కమ్రుద్దీన్ కేంద్రమంత్రులలో ఒకడిగా నియమితుడయ్యాడు. 1720లో సయ్యద్ సోదరుల తిరుగుబాటును అణచివేయడంలో ఆనాటి మొగల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా (1719-1748)కు సాయపడి ఆయన నుంచి 'నిజాం-ఉల్-ముల్క్' అనే బిరుదు పొందారు.
   

కాని ఆయన దృష్టి దక్కన్‌పైనే ఉండేది. 1920లో దక్కన్ సుబేదార్‌గా నియమితుడయ్యాడు. కాని అప్పటికే ఆ పదవిలో ఉన్న ముబారిజోఖాన్ సుబేదారీ పదవిని వదులుకోడానికి ఇష్టపడలేదు. దీంతో వీరిరువురి మధ్య 1724లో అక్టోబరు 11వ తేదీన షక్కర్‌గెడ్డ యుద్ధం జరిగింది. ఇందులో జయించిన నిజామ్ -ఉల్-ముల్క్ దక్కన్ సుబేదారుగా స్థిరపడ్డాడు. హైదరాబాద్ రాజ్యస్థాపన ఈ తేదీ నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. మహమ్మద్ ఆయనకు 'అసఫ్‌జా' అనే బిరుదు కూడా ఇచ్చాడు. నిజామ్-ఉల్-ముల్క్ వారసులు ఆ బిరుదునే తమ వంశ నామంగా ఉపయోగించారు. ఒకపక్క దక్కన్ సుబేదారుగా వ్యవహరిస్తూనే అసఫ్‌జా మొగల్ సామ్రాజ్య ప్రధాన మంత్రులలో ఒకడిగా కూడా వ్యవహరించేవాడు. 1739లో నాదిర్షా దండయాత్ర జరిగిన తర్వాత ఆయన ఢిల్లీని సందర్శించనేలేదు. ఢిల్లీ చక్రవర్తులు కూడా నామావశిష్టులైపోవడంతో నిజాం స్వతంత్రుడయ్యాడు. అలా దక్కన్ సుబేదారు ఆచరణలో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించింది.
చార్మినార్‌లోని 'చార్'ల అద్భుతం
నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం. ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం నాలుగు మినార్‌ల కారణంగానే చార్మినార్‌కు ఆ పేరు స్థిరపడలేదు.
   ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టటానికి దారి తీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్ కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్ ఒకటి. చార్మినార్ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు.
హైదరాబాద్ పేరు వెనుక చరిత్ర
అఫ్ఘాన్ ప్రాంతం నుంచి వలస వచ్చి మొగలుల ద్వారా దక్కన్ ప్రాంతానికి రాజైన సుల్తాన్‌కులీ పరిపాలన సజావుగానే సాగినప్పటికీ ఆయన ఏడుగురు కొడుకుల మధ్య సయోధ్య లేని కారణంగా కుటుంబ కలహాలు తీవ్రస్థాయిలో ఉండేవి. రాజ్య కాంక్ష, కక్షలు తీవ్రరూపం దాల్చటంతో కులీ కుమారుడు ఇబ్రహీం పొరుగు రాజ్యమైన విజయనగరంలో దాదాపు ఏడు సంవత్సరాల పాటు తలదాచుకున్నాడు. ఈ సమయంలోనే అతను విజయనగర యువరాణిలలో ఒకరైన భాగీరథిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇబ్రహీం, భాగీరథి దంపతులకు పుట్టిన మహ్మద్ కులీ కుతుబ్‌షా కలల సాకారంగా రూపొందిందే హైదరాబాద్ నగరం. మహ్మద్ కులీ ప్రేమ చిహ్నంగా హైదరాబాద్ నగరాన్ని పేర్కొనవచ్చు. షాజహాన్ ప్రేమ తాజ్‌మహల్ రూపంలో ప్రపంచం అంతా పాకింది. కులీ తన భార్య భాగమతికి ఒక నగరాన్నే అంకితం ఇచ్చాడు. అయితే పేరు వివాదాస్పదం కావటం, దానిని మార్చటానికి కులీ అంగీకరించటంతో చరిత్రలో షాజహాన్ అంతటి గొప్ప ప్రేమికుడిగాప్రత్యేక ముద్ర సంపాదించుకోలేకపోయాడు. సంప్రదాయాలను ఎదిరించి కులీ భాగమతిని వివాహం చేసుకుని కోటకు తీసుకువచ్చాడు. భాగమతి ప్రతి కదలికా అప్పట్లో సంచలనం కలిగించేదట. స్వతహాగా మంచి కవి, కళాభిరుచి ఉన్న వ్యక్తి అయిన మహ్మద్ కులీ ఆమె అందాన్ని వర్ణిస్తూ కవితలు కురిపించేవాడు. ఒక రోజు తాను కొత్తగా నిర్మిస్తున్న ప్రాంతానికి భాగమతిని తీసుకువెళ్లిన కులీ 'దీన్ని నీకు అంకితం ఇస్తున్నా' అని చెప్పాడట. నగర నిర్మాణం పూర్తయిన తర్వాత భాగమతి పేరు మీద నగరాన్ని భాగ్యనగరంగా పిలిచాడు మహ్మద్‌కులీ. అయితే ముస్లిం ప్రపంచానికి ప్రతినిధులుగా ఉండాల్సిన ప్రభువులు తమ రాజధానిని హిందూ ఛాయలు ఉన్న పేరుతో వ్యవహరించటం రాచకుటుంబంలో అనేక మందికి నచ్చలేదు. తరువాత భాగమతి తన మనుగడకే ప్రమాదం వచ్చే సూచనలు ఉండటంతో నిరాశకులోనైంది. పరిస్థితుల ప్రభావానికి తలవంచిన మహ్మద్‌కులీ మరో మార్గంలేక ప్రవక్త అల్లుడైన హైదర్అలీ పేరు మీద భాగ్యనగరాన్ని హైదరాబాద్‌గా మార్చటానికి అంగీకరించాడని చరిత్రకారుల నమ్మకం. అయితే కులీ మాత్రం హైదరాబాద్‌ని భాగ్యనగరంగానే వ్యవహరించేవాడని తెలుస్తోంది.
Read more ...

ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ ఉండబోదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది


ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ ఉండబోదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక మిగిలిన సీట్లన్నీ స్పాట్‌ అడ్మిషన్ల రూపంలోనే భర్తీ చేసుకోవాలని తేల్చిచెప్పింది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో రెండో విడత కౌన్సెలింగ్‌ తర్వాత 31వేల సీట్లు కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన సంగతి తెలిసిందే. వీటిలో దాదాపు 26వేల సీట్లు ఇంజినీరింగ్‌వే! మిగిలినవి ఫార్మసీ సీట్లు. రెండు విడతల్లోనూ సీట్లు రాని విద్యార్థులు సుమారు 3500 మంది దాకా ఉన్నారు. ఆప్షన్లను సరిగ్గా పెట్టుకోని కారణంగా వీరందరికీ సీట్లు రాలేదన్నది అధికారుల వివరణ. వీరికీ అవకాశం కల్పించేలా మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తొలుత భావించారు. కానీ ఆగస్టు లోపు కౌన్సెలింగ్‌ పూర్తికావాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరోమారు కౌన్సెలింగ్‌కు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 15 దాకా మిగిలిన సీట్లను భర్తీ చేసుకోవచ్చని సుప్రీంతీర్పులో ఉంది. కానీ కౌన్సెలింగ్‌ అడ్మిషన్ల ద్వారానా అనే స్పష్టత లేదు. గతంలో వీటన్నింటినీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్ల రూపంలోనే భర్తీ చేశారు. ఒకవేళ అందుకు భిన్నంగా చేస్తే ఎవరైనా కోర్టుకు వెళితే మొత్తం ప్రక్రియే ఇబ్బందుల్లో పడుతుందన్నది ప్రభుత్వ ఆందోళన. అందుకే మూడోవిడత కౌన్సెలింగ్‌ను వదలుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. స్పాట్‌ అడ్మిషన్లకు తెలంగాణ ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రకటన వెలువరిస్తుంది. ఆతర్వాత ఆయా కళాశాలలు విడివిడిగా పత్రికా ప్రకటనలిచ్చి ఏదో ఒకరోజు ప్రవేశాలు నిర్వహిస్తాయి. ఈప్రక్రియ 15లోపు పూర్తికావాల్సి ఉంటుంది.
Read more ...

కుతుబ్‌షాహీ సమాధుల్లో సొరంగం

kutubshaahi samaadhullo sorangam

16వ శతాబ్దం నాటిదని అంచనాసమ్మర్‌ ప్యాలెస్‌ అవశేషాల గుర్తింపుతవ్వకాల్లో గుర్తించిన అగాఖాన్‌ ట్రస్ట్‌సందర్శించిన అమెరికా రాయబారి మైఖేల్‌ఈనాడు, హైదరాబాద్‌: వందల ఏళ్ల చరిత్ర కలిగిన కుతుబ్‌షాహీ సమాధుల్లో పురాతన సొరంగం బయటపడింది. గోల్కొండ కోట నుంచి సమాధుల వరకు ఈ సొరంగం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గోల్కొండ కోటను పాలించే కుతుబ్‌షాహీల్లో ఎవరైనా మరణిస్తే సమాధుల వద్దకు తీసుకెళ్లేందుకు దీన్ని నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. సొరంగ మార్గంతోపాటు ఒక ఉద్యానం, సహాయకుల కోసం నిర్మించిన వేసవి భవంతి (సమ్మర్‌ ప్యాలెస్‌) తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ తవ్వకాలను తెలంగాణ పురావస్తుశాఖ తోడ్పాటుతో అగాఖాన్‌ ట్రస్ట్‌ సాంస్కృతిక విభాగం గతేడాది సెప్టెంబరులో చేపట్టింది. దీనికి అమెరికా రాయబారుల సంస్కృతి పరిరక్షణ నిధి (ఏఎఫ్‌సీపీ) 1.01 లక్షల డాలర్లు మంజూరు చేసింది. హైదరాబాద్‌ వచ్చిన అమెరికా రాయబారి మైఖేల్‌ పిల్లెటైర్‌ శుక్రవారం సమాధుల్లో బయటపడిన సొరంగాన్ని సందర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 125 దేశాల్లో 800 సాంస్కృతిక పరిరక్షణ ప్రాజెక్ట్‌లకు నిధులు అందజేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలోని తవ్వకాలకూ సాయమందిస్తున్నామని చెప్పారు. ఇక్కడ స్థానిక కూలీలతోనే తవ్వకాలు చేపట్టడాన్ని ఆయన ప్రశంసించారు. పురాతన భవనాలు, ఆనవాళ్లను వెలికితీయడంతోపాటు అప్పటి సాంకేతికతను పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని మైఖేల్‌ వివరించారు.మండువేసవిలోనూ చల్లదనం..తవ్వకాల్లో సొరంగంతోపాటు వేసవి భవంతి నిర్మాణ అవశేషాలను గుర్తించినట్లు అగాఖాన్‌ ట్రస్ట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రతీష్‌నందా, కె.కె.మహ్మద్‌ వివరించారు. ''15, 16వ శతాబ్దాల్లో గోల్కొండ కోటను పాలించిన కుతుబ్‌షాహీలు 106 ఎకరాల్లో ఒకవైపు సమాధుల నిర్మాణం చేపట్టారు. ఇప్పుడున్న మ్యూజియం వెనకవైపు సహాయకుల కోసం వేసవిభవంతి (సమ్మర్‌ ప్యాలెస్‌)ని నిర్మించారు. వీటి కింది భాగం నుంచి నీటిపైపులు బయటబడ్డాయి. మండువేసవిలోనూ చల్లగా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆ రోజుల్లో సమాధుల పక్కనే ప్రార్థన చేసేందుకు మసీదుల నిర్మాణం చేపట్టారు. తిలవత్‌ ఖురాన్‌ పఠించేవారు. వీరి కోసమే వేసవి భవంతిని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ తవ్వకాల్లో చైనీస్‌, ఇండోనేషియా, జకార్తా, ఇజ్రాయిల్‌ శైలి నిర్మాణాలు బయటపడ్డాయి. మొదటి కులీకుతుబ్‌ ముల్క్‌ సమాధి ఎదురుగా ఒక ఉద్యానం, గోల్కొండ కోటవైపు ప్రహరీకి ఆనుకుని సొరంగ మార్గాన్ని తవ్వకాల్లో గుర్తించాం. ఈ తవ్వకాల పనులు డిసెంబరు నాటికి పూర్తవుతాయి'' అని వారు వివరించారు.


Read more ...

ఉద్యోగాలకు వయోపరిమితి పదేళ్లు పెంపు

మన తెలంగాణ/హైదరాబాద్: నిరుద్యోగులు ఎంత గానో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లకు మరో నెల రోజుల వరకు ఆగాల్సిందే. నోటిఫికేషన్ల విడుదల ముందుకు చేయాల్సిన ప్రక్రియ మరికొంత జరగాల్సి ఉంది. దీంతో పాటుగా మొదటి సారి ఉద్యోగాల భర్తీకి శ్రీ కారం చుడుతున్నందున ఈ సారి కొంత జాప్యం తప్పదని సూచిస్తున్నారు. అధికారిక ప్రక్రియలో ఏమైనా లోపాలు జరిగితే కోర్టుకు వేళ్లితే మొదటికే మోసం వస్తుందని… అందుకు కొద్దిగా అలస్యమైనా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగా భర్తీకి కొంత వరకు లైన్ క్లియర్ చేసింది. అయితే అంతర్గతంగా ఇంక కొంత ప్రక్రియ జరగాల్సి ఉందని చేబుతున్నారు.
సర్వీస్ కమిషన్ విడుదల చేసే ఉద్యోగాలకు స్కీమ్ ఎగ్జామినేషన్ ను ఖరారు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వయో పరిమితిని పదేళ్లకు పెంచుతూ జీవో కూడా విడుదల చేశారు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్‌ను ప్రకటిం చాల్సి ఉంటుంది. సిలబస్‌ను ప్రకటించడానికి కమిషన్ అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో సబ్జెక్టులో నిపుణులైన వారిచే సంప్రదింపులు జరుపుతు న్నారు. అయితే ఈ కసరత్తు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుందని సమాచారం. సిలబస్ కొలిక్కి వచ్చినా ముందుగా ఏ పోస్టులను భర్తీ చేయనున్నారో ఆ పోస్టులకు సంబంధించిన సిలబస్ ను మాత్రమే ప్రకటించాలని గతంలోనే టిఎస్‌పిఎస్‌సి నిర్ణయించింది. దీని వల్ల కోచింగ్ సెంటర్ల దోపిడికి, నిరుద్యోగులను మభ్యపెట్టే సంస్థలకు అడ్డుకట్టవే యగలుగుతామని అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీని వల్ల పట్టణ ప్రాంత విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు కల్పించవాళ్లం అవుతామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిలబస్ ప్రకటన తరువాత విద్యార్థులు ప్రిపేర్ కావడానికి కొంత సమయం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ సారి తెలంగాణ కోణంలో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రూపొందించినందున కొత్త సిలబస్ ఎక్కువగా ఉంటుందని.. దాని కోసం సమ యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ వినతిని అంగాకరిం చాల్సిందేనని నిపుణులు సైతం సూచిస్తున్నారు. సిలబస్ ప్రకటన తరువాత పేపర్ సెట్టింగ్ కోసం నిపుణులు సంప్ర దింపులతో అధిక సమయం పడుతుందని చేబుతున్నారు.
కొందరు జీవోలు విడుదల కాగానే అంత అయి పొయినట్లుగా భావిస్తున్నారని… ఆ జీవోలు ఆర్ధిక శాఖ ఆమోదం పొందడం .. ఆ తరువాత శాఖాధిపతుల నుంచి అనేక వివరాలతో లేఖ సర్వీస్ కమిషన్ కు చేరడానికే ఎక్కు వ సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కోర్టుల్లో సమస్యలు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉం టుందని.. దీని కోసమే అధిక సమయం పడుతుందం టున్నారు. ఇలా పలు రకాల అధికారిక ప్రక్రియలు పూర్తి అయి నియామక నోటఫికేషన్‌లు రావడదానికి నిరుద్యో గులు ఉహించినంత తొందరగా సాధ్యం కాదని చేబుతున్నారు. దీంతో ఆగస్టు చివరి వరకు మొదటి నోటిఫికేషన్‌కు ఎదురుచూడక తప్పదు.
54 సంవత్సరాలకు ఉద్యోగమా…!
ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితిని సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న వయో పరిమతిని 10 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జీవో రాబోయే ఒక సంవత్సరం పాటు మాత్రమే అమల్లో ఉంటుంది. ఆ తరువాత పాత వయో పరిమితి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం జనరల్ కేటగిరి వారికి 34 సంవత్సరాల వయస్సున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, వారికున్న 39 సంవత్సరాలను 49కి, వికలాంగులకు 54 సంవత్సరాల వయస్సు వారికి అవకాశం రానుంది. అయితే వయో పరిమితి పెంపుతో 54 సంవత్సరాల వారికి అవకాశం ఇస్తే వారికి ఉద్యోగం వచ్చినా… నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.
బీసీ, ఎస్‌సి, ఎస్‌టి 49 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చినా మరో 9 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేయనున్నారు. ఇలా అతి తక్కువ కాలం ఉద్యోగంలో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని.. కనీసం 20 సంవత్సరాలు ఉద్యోగంలో ఉన్న వారికే పెన్షన్ వస్తుందని గుర్తుచేస్తున్నారు. ఆ వయస్సు వారు ఇప్పటికే జీవితంలో స్థిరపడి ఉంటారని.. వారి పిల్లలు కూడా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి అర్హత సాధించి ఉంటారని… ఈ సమయంలో అవకాశం రావడంతో పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చంటున్నారు

Read more ...

మహేష్‌బాబు జెంటిల్‌మెన్ - శృతిహాసన్

గబ్బర్ సింగ్ చిత్రం సూపర్ హిట్‌తో శృతిహాసన్‌కు తెలుగులో డిమాండ్ పెరిగింది. అప్పటి వరకు చిన్న హీరోల సరసన నటించిన శృతి. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారింది. రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇప్పుడు శ్రీమంతుడు చిత్రంలో మహేష్‌బాబుతో జోడి కట్టింది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రం ఆగస్ట్ 7న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్బంగా శృతి హాసన్ చిత్ర విశేషాల గుర్చి ముచ్చటించారు. మహేష్‌బాబుతో నటించిన అనుభూతి? మహేష్‌బాబుతో కలసి పని చెయాలని ఎప్పటి నుండో ఉంది. శ్రీమంతుడి చిత్రంతో కలసి పని చేస్తున్నాం. పెద్ద స్టార్ అయినా మహేష్ చాల సింపుల్‌గా ఉంటారు. అందరితో కలసి పోయి అందరికి ఎనర్జీని పెంచుతాడు. సరదాగా ఉంటారు. శ్రీమంతుడు చిత్రం మీకు ఎలా వచ్చింది? దర్శకుడు కొరటాల శివ కథ చెప్పారు. నచ్చింది. కాలేజి స్టూడెంట్ పాత్ర నాది. దర్శకుడు నా పాత్రను తీర్చిదిద్దిన తీరు అద్బుతం. శ్రీమంతుడు లో నా పాత్ర ఎంత బాగుంటుందో చిత్రం చూశాక తెలుస్తుంది. చారుశీల పాత్ర ? చారుశీల పాత్ర చాల సహజంగా ఉంటుంది. చారుశీల పాత్ర డిఫెరెంట్‌గా ఉంటుంది. ఈ పాత్రలో కామెడి ఉండదు. ఆలోచనాత్మకంగా, సున్నిత బావోద్వేగాలతో సాగే పాత్ర ఇది. ఈ చిత్రంలో సొంతంగా పాడలేదే ? సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ను అడగాలి. తమిళ్‌లో అవకాశం ఇస్తే పాడాను. శ్రీమంతుడు పాటలు బాగున్నాయి. సూపర్ హిట్ అయ్యాయి. ఆడియో సక్సెస్ అయినందుకు చాల హ్యాపిగా ఉంది. దర్శకుడు కొరటాల శివ గుర్చి చెప్పాండి? దర్శకుడు శివ వ్యక్తిగతంగా చాల కామ్‌గా ఉంటారు. ఆయన చిత్రీకరణ చాల అద్బుతంగా ఉంటుంది. పాత్రల్లో మాత్రం మంచి భావోద్వేగాలు పలికిస్తారు. తనకి కావాలసిన ఔట్ ఫుట్‌ను చాలా చక్కగా రాబట్టుకుంటారు. జగపతిబాబు తో నటించినప్పుడు ఎలా ఉంది? జగపతిబాబు గారు ప్రేండ్లీగా ఉంటారు. ఒక సీనియర్ ఆర్టిస్ట్‌తో పని చెయడం చాల హ్యాపిగా ఉంది. చాల సరదాగా ఉంటారు. ఖాళీ టైమ్‌లో ఏమి చెస్తారు? ఖాళీ సమయంలో టివి చూస్తాను. ఎక్కువగా పుస్తకాలు చదువుతాను, ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తాను. లేడి ఓరియేంటేడ్ చిత్రాలు చేస్తారా? అలాంటిది ఏమి ఉండదు. క్యారెక్టర్ బట్టి పాత్ర ఉంటుంది. ప్రతి సినిమాలో అని మంచి పాత్రలు ఉంటాయి. సినిమా బట్టి ప్రధాన పాత్ర ఉంటుంది తప్ప లేడి ఓరియేంటేడ్ అంటు సినిమాలు ఉండవు. మీ చెల్లితో కలసి నటించే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటుంది. ఇద్దరికి సరిపడ మంచి సబ్జెట్ దొరికితే తప్ప కుండా కలసి పని చేస్తాం. నెస్ట్ చిత్రాలు? తెలుగు, తమిళ్, హింది భాషల్లో ప్రస్తుతం బిజిగా ఉన్నాను. మంచి చిత్రం ఏ భాషలో వచ్చినా వదలను.


Read more ...

రాజకీయాల్లో ఉన్నది చాలు, ఇక వైదొలగుతా

సింగపూర్‌లో ఎన్‌ఆర్‌ఐ ఎంపీ 55 ఏళ్ల వయసుకే రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రక టించారు. పంజాబ్‌కు చెందిన ఇంద్రజిత్‌ సింగ్‌ (55) బతుకుదెరువు కోసం సింగపూర్‌ వెళ్లారు. అక్కడే స్థిరప డిపోయారు. మంచి వాగ్ధాటి కలిగిన ఆయన అక్కడివా రికి చేరువై 1997 నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తి స్తున్నారు. అయితే ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొల గుతున్నానని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఆయన ఫేస్‌ బుక్‌ ద్వారా తెలిపారు. ఆయన వ్యాపారవేత్తగా కూడా రాణించడం విశేషం.
Read more ...

1993 నాటి పేలుళ్లపై మరిన్ని ఆసక్తికర విషయాలు !


మార్చి 12, 1993న 13 వరుస పేలుళ్లు సంభవించాయి. * తొలి బాంబు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బొంబాయి స్టాక్‌ ఎక్సే్చంజ్‌ భవంతి బేస్‌ మెంటులో పేలింది. ఆపై 3:40 వరకూ వివిధ ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. * మాహింలోని మత్స్యకారుల కాలనీ, ప్లాజా సినిమాస్‌, జవేరీ బజార్‌, కఠా బజార్‌, హోటల్‌ సీ రాక్‌, హోటల్‌ జుహూ సెంటార్‌, ఎయిర్‌ ఇండియా బిల్డింగ్‌, సహారా ఎయిర్‌ పోర్టు, వర్లి, పాస్‌ పోర్టు ఆఫీస్‌ ప్రాంతాల్లో బాంబులు పేలాయి. * వీటిల్లో ఎక్కువ బాంబులు స్కూటర్లలో పెట్టారు. హోటళ్లలో పేలిన బాం బులను బ్రీఫ్‌ కేసుల్లో ఉంచారు. * ఈ పేలుళ్లలో 250 మందికి పైగా మరణించగా, 700 మంది గాయ పడ్డారు. వీరిలో వందల మంది వివిధ అవయవాలను కోల్పోయారు. * ఈ పేలుళ్ల వెనుక పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ హస్తముందని, అండర్‌ వరల్‌డ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సూచనల మేరకు ఆయన సహచరులు టైగర్‌ మెమన్‌, ఆయూబ్‌ మెమన్‌, యాకూబ్‌ మెమన్‌లు ప్రణాళికలు రూపొందించారని విచారణ సంఘాలు గుర్తించాయి. * స్మగ్లర్లు హాజీ అహ్మద్‌, హాజీ ఉమర్‌, తౌఫిక్‌ జలివాలా, అస్లామ్‌ం భట్టి, దూవోద్‌ జాట్‌ లు ఆర్థిక సహాయం అందించారు. * గ్రౌండ్‌ లెవల్‌లో పేలుళ్లకు సహకరించి వారంతా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారే. * బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా ఈ పేలుళ్లు జరిగాయన్న ఆరో పణలు ఉన్నాయి. * పేలుళ్లు జరిపేందుకు నియమించుకున్న వారికి పాకిస్థాన్‌, దుబాయ్‌లలో శిక్షణ ఇచ్చారు. వీరికి బాంబులను ఎలా పేల్చాలో నేర్పారు. పేలుడు పదార్థాలను పాకిస్థాన్‌ సమకూర్చింది. * పేలుళ్లను ముందుగా పసిగట్టడంలో నిఘా విభాగం, కోస్‌ట గార్‌డ విఫల మైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. * ఇదే కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగివున్నాడని, సాక్ష్యాలను నాశ నం చేసేందుకు ప్రయత్నించాడని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌పై వచ్చిన అభి యోగాలు నిజమేనని కోర్టు తేల్చి శిక్ష విధించింది. అయితే, బాంబులు పేల్చాలన్న ప్లాన్‌ వెనుక ఆయన ప్రమేయం లేదని తేలింది. * పేలుళ్ల సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శరద్‌ పవార్‌ ఉన్నారు. * మొత్తం 100 మందిని ఈ కేసులో నిందితులుగా తేల్చారు. * కేసులో ప్రధాన నిందితులు దావూద్‌ ఇబ్రహీం, టైగర్‌ మెమన్‌, ఆయూబ్‌ మెమన్‌లు ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారు. * ఈ పేలుళ్లు ముంబై అండర్‌ వరల్‌డలో చీలికలు తెచ్చింది. * అప్పటివరకూ దావూద్‌ అనుచరులుగా ఉన్న చోటా షకీల్‌, సాధూ షెట్టి వంటి వారు దావూద్‌ను వీడి బయటకు వచ్చారు.


Read more ...

తెలంగాణలో కొత్తగా గ్రూప్-3 పోస్టులు

రాష్ర్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిన 15,222 ఉద్యోగుల భర్తీకి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల విభజన, విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రూప్‌-1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్‌ నుంచి ఎంపీడీవో వరకు 20 రకాల పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్‌-1కు 1000 మార్కులతో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్ లో కొత్తగా పేపర్‌ -6ని ప్రవేశపెడుతున్నారు. ఇందులో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు సిలబస్‌ ఉంటుందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్‌-2 లో మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహశీల్దార్ సహా 12 రకాల పోస్టులుంటాయని పేర్కొంది. ఈ పరీక్షను 675 మార్కులకు నిర్వహిస్తుంది. మరో 17 రకాల పోస్టులతో గ్రూప్‌-3 ని కొత్తగా ఏర్పాటు చేసింది.
Read more ...

Followers

Designed By