ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిటిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-2019) ఆన్‌లైన్ రిజిష్ట్రేషన్ నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా వివిధ మెడికల్, డెంటల్ కాలేజీల్లో (ఎయిమ్స్, జిప్‌మర్ మినహా) ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తుంది.
నీట్‌ను 2019 మే 5న నిర్వహించనున్నారు. మారిన విధానం ద్వారా తొలిసారిగా నిర్వహిస్తున్న పరీక్ష ఇదే కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ పరీక్షకు హాజరవుతారు. మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఉన్న ఏకైక పరీక్ష ఇదే. రాష్ట్రాల స్థాయిలో ఉన్న పరీక్షలను పరిగణనలోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
నీట్ 2019కు అభ్యర్థులు నవంబర్ 1 నుంచి నిర్ణీత ఫార్మాట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీబీఎస్‌ఈ తెలిపింది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీపీసీ విభాగంలో ఇంటర్, తత్సమాన అర్హత ఉన్నవారు నీట్‌కు అర్హులు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది.
నీట్ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. నీట్ రిజిస్ట్రేషన్‌కు ఆధార్ తప్పనిసరి కాదని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.