Indian Bank PO Result 2018: ఇండియన్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడు...
ఇండియన్ బ్యాంక్
పీవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు
విడుదలయ్యాయి. ఈ నెల 6న నిర్వహించిన పరీక్షలో.. అర్హత సాధించిన అభ్యర్థుల
జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ అభ్యర్థులంతా నవంబర్ 4న జరిగే ఆన్‌లైన్
మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ ఈ నెల 22లోపు
డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
మెయిన్ పరీక్ష పూర్తయ్యాక అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది వ్యవధితో ఇండియన్ బ్యాంక్ మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ కోర్సు పూర్తయ్యాక.. అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లలో పీవోలు (Probationary Officer)గా ఉద్యోగాల్లో చేరతారు.

Web Title: indian bank released result for online po prelims exam