నిరుద్యోగ భృతి: తెలంగాణ


టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టో అంటూనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల వారికి వరాల జల్లులు ప్రకటించారు. ముఖ్యంగా నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3016 రూపాయల నిరుద్యోగ భృతిని అందించనున్నట్లు వెల్లడించారు. ఏపీలో గత ఎన్నికల ప్రచారంలో నెలకు రూ.2 వేలు ఇస్తామన్న భృతిని చంద్రబాబు నాయుడు సర్కార్ ఇటీవల వెయ్యి రూపాయలు చేయగా.. కేసీఆర్ మాత్రం దానికి మూడు రెట్ల నిరుద్యోగ భృతిని రాష్ట్ర నిరుద్యోగులకు అందించనున్నట్లు ప్రకటించారు.
ఓ వైపు ఉద్యోగ నియామకాలు చేపడుతూనే మరోవైపు జాబ్ లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులను ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల్లో నిరుద్యోగ భృతికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగ భృతికి అర్హులుంటారని, అయితే 12 లక్షల మందికైనా రూ.3016 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. కేశవరావు కమిటీ త్వరలో తుది నివేదిక ఇచ్చాక మరిన్ని వివరాలపై మేనిఫెస్టో విడుదల చేస్తామని కేసీఆర్ వివరించారు

Followers