తెలంగాణా బడ్జెట్‌ 2015


మొత్తం బడ్జెట్‌ రూ. 1,15,689.19 కోట్లుప్రణాళికేతర వ్యయం రూ. 63,306 కోట్లుప్రణాళికా వ్యయం రూ. 52,383.19 కోట్లుపన్నుల ద్వారా ఆదాయం రూ. 46,494.75 కోట్లుపన్నేతర ఆదాయం రూ. 22,413.27 కోట్లుప్రతిపైసా ప్రజల కోసమే..కేంద్రం నిధుల కోతలేసినా...లక్ష్యం దిశగా అడుగులుబడ్జెట్లో ప్రజల ఆకాంక్షలు సాకారమయ్యాయన్న ఈటెల2015-16 బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విత్తమంత్రిభారీ కోతలను సవరణ బడ్జెట్లో చెప్పని వైనంఇది అంకెల గారడీ: విపక్షాలుకేంద్రం 20 వేల కోట్లు కోతేసినా...ఆశించిన రాబడి రాకపోయినా...అప్పుల భారం భయపెడుతున్నా..ఆదాయ మార్గాలు అంతంతగానే ఉన్నా......ఇలా ఎన్ని హద్దులున్నా..బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగాపెద్ద పద్దును విత్తమంత్రి ఆవిష్కరించారుసొంత ఆదాయ వనరులపై పూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శించారుప్రతిష్ఠాత్మక పథకాలకు పెద్దపీట వేశారుసర్కారు ప్రాధాన్యాల్ని బలంగా వినిపించారుఆర్థిక గంభీరతను చాటుతూ.. మిగులు బడ్జెట్‌నూ చూపారు..ఈ నిధుల లెక్కలు ఘనంగానే ఉన్నా.. వాటి సాధనపైనే సంశయాలు!!నడుస్తున్న బడ్జెట్లో రాబడి లక్ష్యాల్ని అందుకోలేకపోయిన సర్కారు..కొత్త బడ్జెట్‌లో ఇందుకోసం ఏ చర్యలకు ఉపక్రమిస్తుందో వేచి చూడాల్సిందే!!''2014-15లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అంచనాల కన్నా బాగా తగ్గాయి. ప్రణాళికా సాయంగా రూ.11,781 కోట్లు రావాల్సి ఉండగా ఫిబ్రవరి వరకూ వచ్చింది రూ.4,147 కోట్లే. రూ.9,939 కోట్ల ప్రణాళికేతర గ్రాంటులో అందింది రూ.1,346 కోట్లు మాత్రమే. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి పన్నుల రాబడుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెరిగినా తెలంగాణకు కేంద్రం ఇచ్చే ప్రణాళిక నిధుల శాతం తగ్గింది. అయినప్పటికీ కొత్త బడ్జెట్‌లో మా ప్రభుత్వం అధిక మొత్తంలో ప్రణాళిక వ్యయాన్ని ప్రతిపాదిస్తోంది.''-బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌భారీగా తెలంగాణ తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌కేంద్ర సాయం తగ్గినా వెనకడుగులేదనిఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర వెల్లడిఅన్ని రంగాలకూ ప్రాధాన్యంప్రతిష్ఠాత్మక పథకాలకు స్థానంభూముల అమ్మకాలు, క్రమబద్ధీకరణ ద్వారా రూ.13,500 కోట్ల లక్ష్యంవ్యాట్‌ రాబడి తగ్గిందంటూనే మళ్లీ భారీ అంచనాభారీ కోతలను సవరణ బడ్జెట్‌లో చెప్పని వైనంహైదరాబాద్‌ - న్యూస్‌టుడేలంగాణ తొలి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ (2015-16) భారీ కేటాయింపులతో తొణికిసలాడింది. పలు ప్రతిష్ఠాత్మక పథకాలకు తాజా బడ్జెట్‌లో స్థానం లభించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అంచనాల కన్నా తగ్గాయంటూనే భారీ కేటాయింపులతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృఢవిశ్వాసం వ్యక్తంచేసింది. గత హామీల మేరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా చేపట్టాలనే పట్టుదలతో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయటానికి సిద్ధపడింది. 2015-16వ ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ పునర్‌నిర్మాణమే ధ్యేయంగా రూ1,15,689 కోట్ల కేటాయింపులతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని రంగాలకూ కేటాయింపులు కనిపిస్తున్నాయి. కొత్త బడ్జెట్‌లో కేటాయింపులు 2014-15 కంటే రూ.14,977 కోట్లు అధికం.ప్రస్తుత (2014-15) పది నెలల బడ్జెట్‌లో పొందుపర్చిన పథకాలన్నింటికి కొత్త బడ్జెట్‌లోనూ నిధులను పొందుపర్చారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్న జలహారం, మిషన్‌ కాకతీయ, ఆసరా, కల్యాణ లక్ష్మి, సాగునీరు వంటి వాటన్నింటికీ బడ్జెట్‌లో బాగానే నిధులు ఇచ్చారు. నిధులను చూపించటం వరకు బాగానే ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం ఎలా సమీకరించుకొంటుందన్న విషయాన్ని అన్ని వివరాలతో బడ్జెట్‌లో పేర్కొనలేదు. భూముల అమ్మకాలు, క్రమబద్ధీకరణపై ఇంతకు ముందు అంచనావేసిన మేర ఆదాయం రాకపోయినా మళ్లీ రూ.13,500 కోట్లను లక్ష్యంగా నిర్ధేశించుకోవటం, అప్పులను నిబంధనలకు మించి ఎక్కువగా తేవాలనుకోవటం, వ్యాట్‌ ద్వారా ఏకంగా రూ.35,463 కోట్లను రాబట్టాలని సంకల్పించటం బడ్జెట్‌కు భారీ తనాన్ని తెచ్చిపెట్టాయి. కేంద్రం నుంచి వస్తుందనుకొన్న రూ.20వేల కోట్ల మేర నిధులు రాలేదని చెబుతూనే 2014-15 సవరించిన బడ్జెట్‌లో ఆ విషయాన్ని ప్రతిఫలించే వివరాలను పొందుపరచకపోవటాన్ని బట్టి మళ్లీ ఇటువంటి పరిస్థితి కొత్త బడ్జెట్‌లోనూ ఉత్ఫన్నమైతే ప్రభుత్వం ఏ రీతిలో వ్యవహరిస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆర్థిక సంఘం కంటే ఎక్కువ అంచనా14వ ఆర్థిక సంఘం ఇటీవలే వెల్లడించిన నివేదికలో 2014-15లో తెలంగాణ రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయాలు రూ.57,426 కోట్లుగా లెక్కగట్టింది. తాజా బడ్జెట్‌లో మాత్రం దాన్ని రూ.68,908 కోట్లకు పెంచి చూపించారు. ఇలా పెంచి చూపించటం కోసం ప్రభుత్వం.. భూముల అమ్మకాలపై మళ్లీ దృష్టి సారించి ఏకంగా రూ.13,500 కోట్లు సంపాదించాలని నిర్ధేశించుకొంది. అయితే, ప్రస్తుత బడ్జెట్‌లో భూ విక్రయాల ద్వారా రూ.6,500 కోట్ల రాబడి అంచనా వేసినా రూ.120 కోట్ల మేర మాత్రమే సమకూరింది. ఈ పరిస్థితుల్లో కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.13,500 కోట్లను చేరుకోవటంపై సందేహాలు రాకమానవు. ప్రస్తుత అనుభవాలను బట్టి ఇక భూములపై భారీ అంచనాలు ఉండబోవని ప్రభుత్వమే ఒక వైపు చెబుతూ వచ్చి ఇప్పుడు అదే అంశం నుంచి భారీగా నిధులను ఆశించటం చూస్తుంటే బడ్జెట్‌ పరిధిని పెంచటానికే ఇటువంటి అంచనాలకు వెళ్లారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రస్తుతం రూ.2,583 కోట్లను ఆశించగా అందులో సగం మొత్తం కూడా రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని రూ.3,700 కోట్లు చేయటాన్ని బట్టి ఇప్పటి కంటే చాలా ఎక్కువ రాబడిని రిజిస్ట్రేషన్ల ద్వారా సాధించుకోవాలనేది స్పష్టమవుతోంది. దీనికోసం భూముల రిజిస్ట్రేషన్ల విలువలను సర్కారు పెంచటం అనివార్యంగా కనిపిస్తోంది. వ్యాట్‌ వేటు తప్పదావ్యాట్‌ ద్వారా రూ.35,463 కోట్లను కొత్త బడ్జెట్‌లో ఆశించారు. ప్రస్తుత పది నెలల బడ్జెట్‌లోని వ్యాట్‌ లక్ష్యం రూ.26,963 కోట్లు కాగా ఇప్పటికైతే దానిలో చాలా లోటు ఉంది. వ్యాట్‌ ద్వారా అనుకొన్నంత సాధించలేకపోయినట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. అయినప్పటికీ వ్యాట్‌పై మళ్లీ భారీగా రాబడిని అంచనా వేయటాన్ని బట్టి త్వరలో పన్నులను పెంచవచ్చనే భావన వ్యక్తమవుతోంది. ముడి చమురు ధరల్లో వ్యత్యాసాల కారణంగా వ్యాట్‌ రాబడి తగ్గిపోకూడదనే ఉద్దేశంతోనే పెట్రోల్‌, డీజిల్‌లపై పన్ను రేట్లను పెంచినట్లుగా సభలో సభ్యులకు అందజేసిన ద్రవ్యవిధాన పత్రంలో ప్రభుత్వం వెల్లడించింది. మిగతా పన్నుల పెంపు గురించి ఏమీ తెలపలేదు. ఇటీవల అమల్లోకి తెచ్చిన సీఎఫ్‌ఎంఎస్‌ (సమగ్ర ఆర్థిక యాజమాన్య విధానం)ద్వారా పన్నుల వసూళ్లలోని లొసుగులను కనుగొంటామని మాత్రమే దానిలో పేర్కొంది. సొంత పన్నుల రాబడిని 14వ ఆర్థిక సంఘం అంచనాకంటే తక్కువగానే కొత్త బడ్జెట్‌లో చూపించినప్పటికీ అందులో ప్రధానమైన వ్యాట్‌ రాబడి లక్ష్యం మాత్రం ఇప్పటికంటే చాలా భారీగా ఉండటం విశేషం. మద్యంపై అంచనాల పెంపుమద్యంపై కూడా ప్రభుత్వం భారీ ఆదాయాన్నే అంచనా వేస్తోంది. వ్యాట్‌ రాబడిలో రూ. 8,291 కోట్లు కేవలం మద్యం అమ్మకాల ద్వారానే రావాల్సి ఉంది. లైసెన్సు రుసుముల వంటి వాటి ద్వారా ఎక్సైజ్‌ శాఖ మరో రూ.3,916 కోట్లు సంపాదించాలి. ఈ రెండు కలిపి రూ.12,207 కోట్లు ఖజానాకు చేరాలి. ఇది ప్రస్తుత లక్ష్యానికంటే రూ.3,080 కోట్లు అధికం. అప్పుల్లో అదనంగా రూ.2వేల కోట్లురాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 శాతం మాత్రమే అప్పులను తెచ్చుకోవాలనే నిబంధనకు అనుగుణంగా ప్రభుత్వం రూ.14,597 కోట్లను మాత్రమే బడ్జెట్‌లో చూపించాల్సి ఉండగా దానికి భిన్నంగా రూ.16,968 కోట్లను అంచనా వేసింది. అంటే పరిమితి కన్నా రూ.2,371 కోట్లు ఎక్కువ. కేంద్రం జీడీపీలో 3.9 శాతం మేర అప్పులను తెస్తూ రాష్ట్రాలను మాత్రం 3 శాతానికి పరిమితం చేయటం తగదన్నది ప్రభుత్వ వాదన. అటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుత 2014-15 బడ్జెట్‌లో కూడా రూ.17,398 కోట్ల (4.04శాతం) మేర రుణాలను అంచనా వేయగా కేంద్రం అందుకు అంగీకారం తెలపనేలేదు. దీంతో అప్పులను కుదించుకోక తప్పలేదు. రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపులు పది శాతానికంటే తక్కువగాను, మొత్తం అప్పులు జీఎస్‌డీపీలో 25 శాతాని కంటే తక్కువగాను ఉన్నట్త్లెతే అటువంటి రాష్ట్రం 3 శాతానికి మించి మరో 0.50 శాతం మేర అప్పులను తెచ్చుకోవటానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా కేంద్రం ఇంకా దీనికి ఆమోదముద్ర వేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఈ రెండు రకాల నిబంధనలను అమలు చేస్తున్నందున ఆ విధంగా చూసినా ఎక్కువ అప్పులకు అనుమతి లభించవచ్చని భావిస్తున్నట్లు ద్రవ్యవిధాన పత్రం పేర్కొంది.ప్రత్యేక ప్యాకేజీపై మళ్లీ అంచనావెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయంతో ప్యాకేజిని అందజేస్తామని పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం పేర్కొనటంతో కొత్త బడ్జెట్‌లో రూ.2,950 కోట్లను సర్కారు అంచనా వేసింది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5వేల కోట్లను పేర్కొన్నా కేంద్రం ఇచ్చిందేమీలేదు. ప్రభుత్వం మాత్రం ఐదేళ్ల వ్యవధిలో రూ.56 వేల కోట్లను ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్‌టీ) బకాయిలపై కేంద్రం ఇటీవల కొంత సానుకూల ధోరణి కనబర్చటంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రూ.1,500 కోట్లు వస్తాయని కొత్త బడ్జెట్‌లోను ఆశలు పెట్టుకొంది.ఆస్తుల కల్పనకు మిగిలింది తక్కువేభారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ ఆస్తుల కల్పనకు ఉపయోగపడే పెట్టుబడి వ్యయం రూ.15,982 కోట్లుగా మాత్రమే ఉండనుంది. కొత్త బడ్జెట్‌లో తప్పని సరి ఖర్చులతో కూడిన ప్రణాళికేతర వ్యయం రూ.63,306 కోట్లకు చేరటంతో అప్పుల ద్వారా తెచ్చే మొత్తాలను మాత్రమే పెట్టుబడి వ్యయానికి వినియోగించుకోవాల్సి వస్తోంది. ఉద్యోగులకు 43 శాతం మేర ఫిట్‌మెంట్‌ ఇవ్వటంతో జీతాలు, పింఛన్ల ఖర్చు భారీగా పెరగనుంది.పూర్తికాని అప్పుల విభజనఉభయ రాష్ట్రాల మధ్య అప్పుల విభజన ఇంకా పూర్తికాలేదు. దీంతో తెలంగాణ అప్పులు ఎంతనేది కొత్త బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం పేర్కొనలేదు. మొత్తం రూ.1.48 లక్షల కోట్లను విభజించాల్సి ఉండగా అందులో ఇప్పటికి తెలంగాణ వాటాగా వచ్చింది రూ. 61,711 కోట్లని, ఇంకా విభజించాల్సిన మొత్తం ఉందని మాత్రమే సర్కారు పేర్కొంది.


Followers