టెన్త్ విద్యార్థుల కోసం సరికొత్త యాప్

పదో తరగతి విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. దేశంలోనే మొట్టమొదటి 3డీ అగ్మెంటెడ్ రియాల్టీ యాప్ ఇది. డిజిటల్ ఎడ్యూకేషన్ సొల్యూషన్స్ కంపెనీ, స్మార్టర్ డాట్ కామ్ రూపొందించిన ఈ యాప్ స్మార్టర్-3డీ క్విక్ స్టడీ పేరుతో ఆండ్రాయిడ్, టచ్ స్క్రీన్ ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. స్మార్టర్.డామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ నీజర్ జెవాల్కర్ దీన్ని రూపొందించారు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెన్త్ విద్యార్థులకు అద్భుతమైన విజ్ఞాన భాండాగారంగా ఉపయోగపడే ఈ యాప్‌ను బుధవారం పర్యటక భవన్‌లో వివిధ పాఠశాలల విద్యార్థుల సమక్షంలో సంస్థ వ్యవస్థాపకుడు నీరజ్ జెవాల్కర్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడి లేని విద్యావకాశాలు కల్పించడం, విద్యార్థులు మరింత సమర్థవంతగా ఆయా అంశాలను మననం చేసుకునేందుకు ఈ యాప్‌ను వాడుకోవచ్చన్నారు. ఈ యాప్‌లో పాఠ్యాంశంలోని చిత్రాలు, ఆబ్జెక్ట్స్‌ను 2డీ టెక్స్‌బుక్‌లో చూడవచ్చు. ఫిజిక్స్, బయోలజీ, గణితం సబ్జెక్టులకు సంబంధించి అన్ని సిద్దాంతాలు ఇందులో ఉన్నాయి. చిత్రాలు కలిగిన టెక్ట్స్ బుక్‌పై అండ్రాయిడ్ కెమెరా పాయింట్ ద్వారా చిత్రీకరిస్తే 3డీ ఆకారం ఫోన్లో ప్రత్యక్షమై దానికి సంబంధించిన వివరాలు తెలుపుతుంది Download in PlayStore as "Smartur 3D Quick study"






Followers