సెక్రటేరియట్‌ను తరలిస్తే సహించేది లేదు: బండ


తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుందని గ్రేటర్ మాజీమేయర్ బండ కార్తీకాచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో సచివాలయాన్ని తరలించడాన్ని నిరసిస్తూ గాంధీభవన్ టు రాజ్‌భవన్‌కు చేపట్టిన పాదయాత్రకోసం తార్నాక నుంచి పిసిసి నాయకులు బండ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా గాంధీభవన్‌కు తరలివెళ్లారు. గాంధీభవన్ నుంచి ప్రారంభమైన యాత్ర కొద్దిసేపటికి పోలీసులు అడ్డుకుని గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా కార్తీకాచంద్రారెడ్డిలు మాట్లాడుతూ సచివాలయాన్ని తరలించాలనుకోవడం తుగ్లక్ చర్య అవుతుందని అన్నారు. కొత్తగ ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలకు కొదవలేదని ఆ సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పధంలో నడిపించాల్సిన ముఖ్యమంత్రి మూఢ నమ్మకాలతో వాస్తు దోషాలంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చింది తడవు ఏదో చేస్తున్నట్లు హంగామా చేయడం ఏమి చేయకపోవడం ఏదో జరుగుతుందని ప్రజలను భ్రమల్లోకి తీసుకువెళుతున్న కెసిఆర్ పనితీరును ప్రజలు గ్రహించే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణా ప్రజల కోరికను తెలుసుకున్న సోనియాగాంధీ ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్కచేయకుండా రాజకీయ ప్రయోజనాలను సైతం ప్రక్కనపెట్టి కేవలం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వచ్చిన తెలంగాణను బంగారు మయం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికి కూడా కెసిఆర్ ప్రభుత్వం ఓట్లు ఎలా సాధించాలి ప్రక్కపార్టీల నేతలను ఎలా ఆకట్టుకొని తమ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలన్న ఆలోచన తప్ప మంచి పనులతో ప్రజల నుంచి స్వచ్ఛందంగా క్యాడర్‌ను పెంచుకునే సత్తాను కోల్పోయిందని అన్నారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా రాజకీయ ప్రయోజనాలను మూఢ నమ్మకాలను ప్రక్కనపెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు అవసరమయ్యే మంచిపనులు చేయాలని అన్నారు. గ్రేటర్‌లో ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఇందులో ఎంతమాత్రం అనుమానం లేదని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తార్నాడ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బీజ్యానర్సింగ్‌రావు, తిరుమలేశ్, లడ్డుబాయ్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. పంట రుణాల పంపిణీ లక్ష్యాలను అధిగమించండి ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, ఫిబ్రవరి 7: జిల్లాలో పంట రుణాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను అధికగమించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో రుంల పంపిణీపై ప్రత్యేక బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంట రుణాలకు సంబంధించి ఈ సంవత్సరం ఖరీఫ్, రబీకు కలిపి రూ. 714 కోట్ల రుణాలకు గాను రూ. 657 కోట్ల రుణాలను అందించిడం జరిగిందని మిగితా రుణాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. రుణమాఫీ పొందిన రైతులందరి రుణాలు రెన్యూవల్, రీషెడ్యూల్ చేసుకున్నట్లయితే రుణ మాఫీ వర్తిస్తుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ పంట రుణాలను అందించాలని బ్యాంకర్లకు సూచించారు. ఈనెల 16 నుండి 23 వరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొంటూ, రుణ మాఫీకి సంబంధించి ప్రభుత్వం రూపొందించినన పత్రాలను సంబంధిత తహశీల్దార్‌తో సంతకం చేసిన అనంతరం రైతులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దీంతో పాటు బ్యాంకర్లు రూపొందించిన ఫారమ్-ఎఫ్‌ను కూడా రైతులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ గ్రామ సభలకు స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు. రుణ మాఫీకి సంబంధించి జిల్లాలో ఫిర్యాదుల విభాగానికి 123 ధరఖాస్తులు రావడం జరిగిందని వీటికి సంబంధించి 3,844మంది రైతులకు రుణ మాఫీ వర్తింపజేసేందుకు వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సీ,ఎస్టీ బిసి, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా గత సంవత్సరం మంజూరై గ్రౌండింగ్ కాని రుణాలను సత్వరమే గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు ఆయన సూచించారు. మహిళా సంఘాల రుణాలకు సంబంధించి తక్కువగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు శ్రద్ధ తీసుకొని లక్ష్యాలను అధిగమించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎల్‌డి ఎం. సుబ్రమణ్యం, వ్యవసాయ శాఖ జెడి విజయకుమార్, డిఆర్‌డిఎ డ్వామా, పిడిలు సర్వేశ్వర్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండాలి ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, ఫిబ్రవరి 7: రంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్ సైనీ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కోర్టు హాల్లో పరిశుభ్రతపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాంపల్లిలో పోలీసు తనిఖీలు చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 7: నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు శనివారం సాయంత్రం కార్డ్ ఆన్ సర్చ్ తనిఖీలు నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెడ్‌హిల్స్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో సుమారు 150 మంది పోలీసులతో డిసిపి కమలాసన్‌రెడ్డి, ఏసిపి సురేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ మదుమోహన్‌రెడ్డిలు మూకుమ్మడిగా ఈ తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 30 వాహనాలను సోదా చేయగా, డాక్యుమెంట్లు సక్రమంగా లేని 12 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 500 గుడుంబా ప్యాకెట్లు లభ్యం కావటంతో, అందుకు సంబంధించిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Followers