ఇండియా మ్యాప్ లోకి తెలంగాణ ఎంటర్...

indiya myaap loki telangaana entar...  


తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. కానీ అధికారిక చిత్రపటం లేదు. తాజాగా ఇండియా మ్యాప్‌లోకి తెలంగాణ ఎంటరైంది. తెలంగాణ అధికారిక మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ చిహ్నంగా చూపించింది. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, ఆచారవ్యవహారాల వివరాలు సైతం మ్యాప్‌లో ఉన్నాయి. 12వ పెద్ద రాష్ట్రంగా తెలంగాణ.. తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా అధికారికంగా విడుదల చేసింది. దేశంలోని 12వ పెద్ద రాష్ట్రంగా తెలంగాణను పేర్కొంది. రాష్ట్ర సరిహద్దులను నిర్ధారిస్తూ... అన్ని వివరాలను వివరించింది. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక ఉన్నాయి. మ్యాప్‌లో కాకతీయ కళాతోరణానికి సర్వే ఆఫ్‌ ఇండియా పెద్ద పీట వేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వివరాలు.. ఇక జిల్లా కేంద్రాలు, హైవేలు, నదులు, ప్రాజెక్టులు, నదీ మార్గాలు, చారిత్రక స్థలాలు, పుణ్యక్షేత్రాలు సహా అన్ని పర్యాటక ప్రదేశాలను మ్యాప్‌లో స్పష్టంగా కనబడతాయి. తెలంగాణ సంస్కృతిని.. తెలుగు, నిజాం, మొగలాయి, పర్షియన్‌ సంప్రదాయాల కలబోతగా అభివర్ణించింది. అన్ని ప్రధాన పండుగలతో పాటు బతుకమ్మ, బోనాల పండుగలను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారని పేర్కొంది. ఇక జిల్లాల వారిగా 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వివరాలను కూడా పొందుపరిచింది. 10 భాషలతో కూడిన మ్యాప్... మ్యాప్‌లో హైదరాబాద్‌-సికింద్రాబాద్ జంటనగరాలను సర్వే ఆఫ్ ఇండియా హైలైట్ చేసింది. హైదరాబాద్‌ సిటీ మ్యాప్‌తో పాటు మెట్రో రైల్ రూట్‌మ్యాప్‌ను కూడా పొందుపరిచింది. హైదరాబాద్‌ నుంచి ఉన్న రైలు, రోడ్డు, విమాన మార్గాలను మ్యాప్‌లో సూచించింది. తెలంగాణ జిల్లాల నుంచి పలు ప్రముఖ ప్రాంతాలకు ఉండే దూరాన్ని సైతం పొందుపరిచింది. హైదరాబాద్‌ సగటు ఉష్ణోగ్రత వివరాలు కూడా మ్యాప్‌లో ఉన్నాయి. మొత్తం 10 భాషలతో కూడిన మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది.




Followers