స్వచ్ఛ భారతం

 "స్వచ్ఛ భారతం ".
భారత దేశంలోని ప్రజల్లో చాలా మందికి నిర్లక్ష్యం, అలక్ష్యం మరియు నిర్లిప్తితా భావాలు చాలా ఎక్కువ. ఈది నిజం. ..ఈ నిజాన్ని ఒప్పుకోవలసిన సమయం వచ్చింది. ఏందుకంటే... పరిసరాల శుభ్రత కోసం భారత ప్రభుత్వం ఏనాడో ఉద్యమించిది. .... పలు రకాల బౄహత్తర కార్యక్రమాలను కూడా చేపట్టింది. 1986లో సెంట్రల్ రూరల్ శానిటేషన్ కార్యక్రమాన్ని పల్లెల్లో పారిశుధ్యాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించింది. డీనికి కొన్ని మార్పులు చేసి అందరికీ మరుగుదొడ్లు అందుబాతులోకి తీసుకువస్తూ దీని పరిధిని విస్తరిస్తూ 1999లో టోటల్ శానిటేషన్ కేంపైన్ గా మార్చారు. మరలా 2012లో దీనికి మార్పులు చేసి " నిర్మల్ భారత్ అభియాన్ " గా మార్చారు. మరలా ఇప్పుడు " స్వచ్ఛ భారతం " పేరుతో విప్లవాన్ని తీసుకొస్తున్నారు. ఖావునా, రెండు దశబ్ధాలు మారినా మనలో ఓ కాసింత మార్పు కూడా కలుగలేదు.
తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య గణాంకాలు -3 (2005-06 ) ప్రకారం ఇప్పటికీ భారత దేశ జనాభాలో 33 % మంది కుటుంభీకులకు మాత్రమే మరుగుదొడ్లు అందుబాటులోఉన్నాయి. ఇది పట్టణాలలో 83.7 % కగా గ్రామాలలో కేవలం 16 % మందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 67 % భారతీయులకు మరుగుదొడ్లు అందుబాటులో లేవంటే తీవ్రంగా అలోచించాల్సిన విషయమే. గ్రామాల్లో నివసించే 590 మిలియన్ల మంది ఇంకా భహిరంగానే మలవిసర్జన జరుపుతున్నారు. ఈందులో చలా మందికి మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ భహిరంగానే విసర్జించుటకు మొగ్గు చూపుతున్నరు. ఈ ఆలోచన మారాలి. ఇది చాలదూ. ... మన లో చాలా మంది పైన పేర్కున్నట్టు నిర్లక్ష్యం, అలక్ష్యం మరియు నిర్లిప్తితా భావంతో ఉన్నామని చెప్పటానికి.
"కుటుంబాలే సమాజానికి ఊయల లాంటివి " అని సోక్రటిస్ చెప్పిన విధంగా. ... కుటుంబాలే సమాజాన్ని పెంచి పోషిస్తుంటాయి కుటుంభం బాగుంటే... కుటుంబ వ్యక్తులు బాగుంటారు, కుటుంబ వ్యక్తులు బాగుంటే....సమాజం బాగుంటుంది. ఎందుకంటే సమాజం అంటే మనుషులు..... కాబట్టి, " స్వచ్ఛ భారతం" కోసం ఇప్పుడు ఎన్ని చేసినా అవి స్వల్ప కాలానికి కాకుండా దీర్ఘ కాలంగా కొనసాగాలి. " మొక్కై వంగనిది మానై వంగునా" అన్న నానుడిని అనుసరించి ఇప్పటికీ క్రమశిక్షణ లేని పెద్దలు ( తల్లి దండ్రులు ) ను వదిలేసి పిన్నలలో ఈ ఆలోచన ను ధృఢంగా నాటాలి. చిన్నప్పుడు మేము చదువుకున్న పరిసరాల విజ్ఙానం -1, పరిసరాల విజ్ఙానం -2 అని ప్రత్యేక పాఠ్య పుస్తకాల మాదిరిగానే ' పరిసరాల పరిశుబ్రత ' ( ఆ పాఠ్య పుస్తకాలలో ఉన్నప్పటికీ ) అనే పాఠ్య పుస్తకాలను ప్రవేశ పెట్టాలి. ఇవి అప్పటికే పరిమితం కాకుండా డిగ్రీ, పీజి ల వరకూ కొనసాగుతూ ఉండాలి. ఎందుకంటే.... ఒక నిర్ణీత సమయానికి చేరుకున్నక విద్యార్ధుల ఆలోచనలు మారిపోతున్నాయి. కొత్త ఆలోచనలు ( మార్కులు, ర్యాంకులూ, పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగం, విదేశాలు, పెద్ద పెద్ద పేరున్న కంపెనీలు, ఎక్కువ జీతం, విలాసవంతమైన జీవితం, పరువు, ప్రతిష్ట, గౌరవం, గుర్తింపు. ...). పాత ఆలోచనలను భర్తీ చేస్తూన్నాయి. ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పదల్చుకున్నాను. గాంధీగారి జీవిత చరిత్ర ' సతయ్ సోధన ' చదువుతూ ఉండగా మా ఇంటి పైన ఉంటున్న తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయి వచ్ఛి ' ఏమి చదువుతున్నారు?' అని అడిగింది. పుస్తకం కవరు పేజీ చూపాను. "గాంధీ. ..." అని కనుబొమ్మలు ఎగురవేసి రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది (మీకు దండం. .. అన్నట్తుగా వ్యంగ్యంగా). ఈ పుస్తకం చదువమని సిఫ్హారసు చేసాను. దానికి ఆమె ఇలా సమాధానమిచ్ఛింది. "ఇప్పుడెందుకు అన్నయ్యా. ....ఎక్జ్సాంసూ....9th క్లాసూ. ....తరువాత 10th క్లాసూ... అన్నీ 10th క్లాసు తరువతే. ...." అని వెల్లిపోయింది. ఈ ఒక ఉదాహరణ చాలదా ఇప్పటి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో. .... ఎటువేపు పరుగులు తీస్తున్నారో చెప్పటానికి.
నిన్న మొన్న చదివిన విషయాలేగుర్తుండట్లేదు...అలాంటిది ఎప్పుడో చదివిన విషయాలు ఎలా గుర్తుంటాయి? ఇప్పటి అల్ట్రా మోడ్రన్ తల్లిదండృల నుండి సామాన్య, మధ్యతరగతి తల్లిదండృల వరకూ అందరూ తమ పిల్లల్ని పెద్ద పెద్ద పేరున్న పాఠశాలల్లో చదివించాలి, ఆంగ్లం బాగా రావాలి, మచి మార్కులు రావాలి, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు రావాలి అనే పెద్ద పెద్ద ఆలోచనలతో పెంచేవారే తప్పా (చాలావరకూ) సమాజానికి పనికివచ్ఛే చిన్న చిన్న ఆలోచనలను వారిలో చొప్పించడంలో విఫలమవుతున్నారు అనటంలో సందేహం లేదు.
చూడండి పక్కన ఉన్న చిత్రాన్ని. చదువు కుంటున్న విధ్యార్ధులు. .... బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నారు. ... వీల్లకి చదువు ఏం చెప్తుంది. ఇలాంటి పరిస్థుతులలో ఉన్నము. కాబట్టి స్వచ్ఛ భారతం రావాలి అంటే మొదట మనలో మార్పు రావాలి. స్కూల్లలోను, కాలేజీల్లొ నిరంతరం దీనినిగురించి వక్కానించి చెప్పాలి.

Followers