- అందరూ అందల మెక్కెవారే - మోసెవారెవరు ?
- నందిని చేయబోయి- పందిని చేసినట్లు
- అంతా మావాళ్ళెగాని , అన్నానికి రమ్మనెవాళ్ళులేరు ...
- అత్తకు లేక అటికలు నాకుతూ ఉంటే - అల్లుడు వచ్చి దీపావళి పండుగా అన్నాడట..
- అన్ని సాగితె రోగమంత భోగం లెదు
- ఆటాపాట మాయింట , మాపటి భోజనం మీఇంట ..
- ఇంటి వారు వేలు చూపెతె బయటి వారు కాలు చూపుతారు..
- ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా ?
- ఉపాద్యాయుడు యేం చేస్తున్నాడంటే - అబద్ధాలు వ్రాసి దిద్ధుకోంటున్నాడు అన్నాడట..
- ఊగి ఊగి ఉయ్యెల ఆగి ఉన్న చోటుకే వస్తుంది ...
- ఎగరబోయి బోర్లపడి ఊరు అచ్చి రాలేదు అన్నాడట..
- ఏ పూజ తప్పినా , పోట్టపూజ తప్పదు..
- ఏమీ తోచనమ్మ తోటికోడలి పుట్టెంటికి వెళ్ళిందట..
- కల్లాకపటం లేనివారికి - కష్టాలు తప్పవు..
- కలిగిన వారికి అందరూ చూట్టాలే..
- కార్యం అయ్యెదాకా.. గాడిద కాళ్ళయినా పట్టాలి.
- కుట్టితె తెలు , కుట్టకుంటే కుమ్మరి పురుగు...
- నీతిలేని వాడు కోతికన్నా పాడు..
- నెత్తిన నోరుంటే పేత్తనం సాగుతుంది..
- పండాకుని చూచి పసరాకునవ్వినట్టు..
- పనిలేక ఇంటికి పోతే పాత గోడకు పూత పేట్టుమన్నాడట...
Tags: తెలుగు సామెతలు, telugu saametalu, samethalu, telugu samethalu, సామెతలు , telugu gk, dvr-gk, Maripeda ,తెలుగు జనరల్ నాలెడ్జి,