Second Year Civics 2 Marks





యూనిట్- 6  - రాష్ట్ర ప్రభుత్వం  
1.     గవర్నర్ నియామకానికి అర్హతలు(IMP):
1)    భారతదేశ పౌరుడై ఉండాలి.
2)   35 సం. వయస్సు నిండి ఉండాలి.
3)   లాభసాటి పదవిని  నిర్వహించకూడదు.
2.     రాష్ట్రకార్యనిర్వహణాశాఖ(IMP):  రాష్ట్రకార్యనిర్వహణాశాఖ గవర్నర్ , ముఖ్యమంత్రి, మంత్రిమండలి తో ఏర్పడుతుంది. రాష్ట్రశాసనశాఖ చేసిన చట్టలను కార్యనిర్వహణాశాఖ అమలుచేసుంది.
3.     గవర్నర్ కు ఉన్న చట్టబద్ధమైన రక్షణలు:  
a)   అధికార విధుల వినియోగం నిర్వహణలో గవర్నర్ న్యాయస్థానానికి జవాబుదారీగా ఉండరు.
b)   గవర్నర్ పై విధమైన సివిల్, క్రిమినల్ సంబంధమైన వివాదాల గురించి విచారించకూడదు.
c)    అతడిని నిర్భందంలోకి తీసుకోకుడదు.
4.     గవర్నర్ వివేచనాధికారలు(IMP) :
a)   ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం
b)   రాష్ట్రమంత్రిమండలిని తోలగించడం
c)    విధానసభను రద్ధుచేయడం
d)   రాష్ట్రపతి పాలనను విదించమని రాష్ట్రపతికి ఒక లేఖ వ్రాయడం
5.     ముఖ్యమంత్రి నియమాకం(IMP):    రాష్ట్ర విధనసభలో మెజారిటీ పార్టీ నాయకూడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు, ముఖ్యమంత్రి సలహాతో గవర్నర్ రాష్ట్ర మంత్రిమండలిని ఏర్పట్టు చేస్తాడు. ముఖ్యమంత్రి  రాష్ట్రానికి వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఆధికారలను చేలాయిస్తాడు.
6.     రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం:                   రాష్ట్ర మంత్రిమండలిని ముఖ్యమంత్రి సలహామెరకు గవర్నర్ నియమిస్తాడు. అందులో 1. కేబినెట్ మంత్రులు 2. స్టెట్ మంత్రులు  3. డిప్యూటీ మంత్రులు ఉంటారు.


యూనిట్- 7  - రాష్ట్రశాసన నిర్మాణశాఖ
1.  విధన సభ(IMP):        విధనసభనే రాష్ట్ర శాసనసభ అనీ, అసెంబ్లీ అనీ అంటారు. అందులోని సభ్యులు ఓటర్లచే ఏన్నుకోబడుతారు. విధనసభలో ఒకరిని ఆంగ్లో ఇండీయన్ ని గవర్నర్ నామినేట్ చేస్తాడు.
2.  విధానపరిషత్త్(IMP)    విధానపరిషత్త్ నే శాసనమండలి అని అంటారు. ప్రస్తుతం భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో  విధానపరిషత్త్ లు ఉన్నాయి. విధానపరిషత్త్ లో రెండు రకాల సభ్యులు ఉంటారు. 1 ఎన్నికయ్యె సభ్యులు 2. నామినేట్ సభ్యులు. మొత్తం సభ్యులలో 1/6 వంతు సభ్యులును గవర్నర్ నామినేట్ చేస్తాడు.
3.  విధనసభకు పోటి చేయుటకు కావలసిన అర్హతలు:
a)   భారతదేశ పౌరుడై ఉండాలి.
b)   25 సం. వయస్సు నిండి ఉండాలి.
c)    లాభసాటి పదవిని  నిర్వహించకూడదు.
d)   పార్లమెంట్ నిర్ణయించిన అర్హతలు కలిగి ఉండాలి.
4.  స్పీకర్(IMP):      శాసన సభలు సక్రమంగా నడపడంలో స్పీకర్ పాత్ర కీలకమైనది. ప్రభుత్వ,ప్రతిపక్షాల పట్ల సమదృష్టి, నిష్పక్షపాత వైఖరి కలిగి ఉంటాడు. వివిద సభాసంఘాలను ఏర్పరచి అధ్యక్షులను నియమిస్తాడు.
5.  ప్రభుత్వ పద్ధుల కమిటి(IMP):
a)   ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన మొత్తాలను పరిశిలిస్తుంది.
b)   కాగ్ నివేదికను పరిశిలిస్తుంది.
c)    ప్రభుత్వ పద్ధుల ఆదాయ వ్యయలు లాభనష్టాలకు సంబందించిన అంశాలను పరిశిలిస్తుంది.
6.  అంచనాల కమిటి(IMP):
·         ప్రభుత్వ అంచనాలకు, ఆర్థిక సంస్కరణలకు సంబందించిన సూచనలు ఇస్తుంది.
·         ప్రభుత్వ పాలనలో సామర్థ్యన్ని,ఆదాను  పెంచడం
·         దిగువ సభ సమర్పించిన అంచనాలను పరిశిలిస్తుంది.


యూనిట్- 8   రాష్ట్ర న్యాయశాఖ  ( హైకోర్టు)
1.  హైకోర్టు నిర్మాణం:     రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానమే హైకోర్టు. హైకోర్టులో ప్రధాన న్యాయముర్తి కొందరం సాధారణ న్యాయముర్తులు ఉంటారు. హైకోర్టులలో పనిభారం ఎక్కువగా ఉంటే రాష్ట్రపతి కోందరిని హైకోర్టులలో తాత్కాలిక న్యాయముర్తులను నియమిస్తాడు.
2.  జిల్లా స్థాయిలలో కోర్టులు పని చేస్తుంటాయి :   భారతదేశంలో ప్రతి రాష్టంలో జిల్లా స్థాయిలో కొన్ని సబార్టినేట్ కోర్టులు ఉన్నాయి.  1. జిల్లా కోర్టు            2.  సివిల్ కోర్టులు     3. క్రిమినల్ కోర్టులు
3.  హైకోర్టు న్యాయమూర్తుల తోలగింపు:           హైకోర్టు న్యాయముర్తి అనైతిక ప్రవర్తన అసమర్థత,అవినీతి వంటి ప్రత్యెక నిర్థిష్ట ఆరోపణలు వస్తే వాటిపై తగిన విచారణ  రాష్ట్రపతి జరిపించి, వారు దోషాలున్నట్లయితే, వారిని తోలగిస్తాడు. అయితె పార్లమెంటు 2/3 వంతు సభ్యులు మెజారిటితో అమోదించవలసి ఉంటుంది.


యూనిట్- 9   కేంద్ర రాష్ట్ర సంబందాలు
1.     కేంద్ర జాబితా (IMP):    కేంద్ర జాబితాలోని అంశాలపై  చట్టం చేసి అధికారం పార్లమెంటుకు ఉంది. మొదట కేంద్ర జాబితలో 97 అంశాలు ఉండేవి ప్రస్తుతం దినిలో  100 అంశాలు ఉన్నాయి  ఉదా: రక్షణ, రైల్వేలు,వైమానిక
2.     రాష్ట్ర జాబితా (IMP):   రాష్ట్ర జాబితాలోని అంశాలపై  చట్టం చేసి అధికారం రాష్ట్ర శాసన సభకు  ఉంది. మొదట రాష్ట్ర జాబితలో 66 అంశాలు ఉండేవి ప్రస్తుతం దినిలో  61 అంశాలు ఉన్నాయి  ఉదా: పోలిస్, స్థానిక సంస్థలు
3.     ఉమ్మడి జాబితా (IMP):  రాజ్యంగ ప్రారంభంలో ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉండేవి, ప్రస్తుతం దినిలో  51 అంశాలు కలవు, దినిలో క్రిమినల్ లా, వివాహం, ఒప్పందాలు, మొదలైయిన అంశాలు. వీటిపై కేంద్ర రాష్ట్ర శాసన సభలకు శాసనాలు చేసి అధికారం కలదు.
4.     అవిశిష్టాంశాలు(IMP):  కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా మూడింటిలో లేని అంశాలను అవిశిష్టాంశాలు అంటారు. వీటిపై పార్లమెంట్ కు శాసనం చేసి అధికారం కలదు.
5.     సర్కారియా కమీషన్(IMP):  1983 జూన్ 9 తేదిన కేంద్ర ప్రభుత్వం రంజిత్ సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమీషన్ ను ఒక దానిని ఏర్పరచింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలను పున:పరిశీలన జరిపి తగిన సిఫారసులు చేయవలసిందిగా కమీషన్ ను కోరడమైనది. 1987 అక్టోబర్ 27 247 సిఫారసులతో కూడిన 5 వేల పేజిలకు ఒక అంతిమ నివెదికను కమీషన్ కేంద్రప్రభుత్వనికి సమర్పించింది.
6.     అర్థిక సంఘం(IMP):    280 అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఒక అర్థికసంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. దిని కాలపరిమితి 5 సం.రాలు. దినిలో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు. సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయం వనరుల పంపిణి చేయడంలో సిఫారసులు చేస్తుంది. ప్రస్తుతం 13 ఆర్థిక సంఘం చైర్మన్. విజయ్ కెల్కర్.
7.     అంతర్ రాష్ట్రమండలి  263 అధికరణ ప్రకారం అంతర్ రాష్ట్రమండలి ఏర్పటయింది. రాష్ట్రప్రయోజనాలను నెరవేర్చే ఆశయంతో రాష్ట్రపతి మండలిని ఏర్పాటుచేస్తాడు. ఇది రాష్ట్రాల మధ్య తలెత్తె వివాదాలను పరిష్కార మార్గాలను సూచింస్తూంది. రాష్ట్రాలు నిర్వహించే విధుల విషయంలో ఎదురయ్యే వివాదాలను పరిష్కారించడం.


యూనిట్- 10  స్థానిక ప్రభుత్వాలు 
1.      సర్పంచ్/గ్రామాసర్పంచ్(IMP):  గ్రామపంచాయితీ రాజకీయ ఆధిపతియేసర్పంచ్”, గ్రామంలో రిజష్టర్డ్ ఓటర్లు ఇతడిని 5 సం.రాల కాలానికి ఎన్నుకుంటారు. గ్రామపంచాయితీకి గ్రామసభకు ఇతడు అధ్యక్షత వహిస్తాడు. గ్రామ సభ తీర్మానాల అమలును పర్యవేక్షిస్తాడు.
2.      గ్రామసభ(IMP):    గ్రామసభలో గ్రామానికి చెందిన ఓటర్లు  దినిలో సభ్యులుగా ఉంటారు. గ్రామసభ సంవత్సరంనకు 3 సార్లు సమావేశం అవుతుంది. గ్రామసభ సమావేశాలకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు.వార్షిక పరిపాలన అడిట్ నివేదికలను పరిశిలించి అమోదిస్తూంది.

4.      మండల పరిషత్త్:   జిల్లాలో రెండవ స్థాయిలో గల స్థానిక సంస్థయే మండల పరిషత్తు. మండల పరిషత్తులో నాలుగు అంగాలుంటాయి. 1. మండల పరిషత్తు  2. మండల పరిషత్తు అధ్యక్షుడు 3. మండల పరిషత్తు అభివృద్ది అధికారి 4. మండల మహసభ.
5.      మండల పరిషత్తు అధ్యక్షుడు(IMP) :       మండల పరిషత్తుకు పరిపాలన అధిపతి. మండల పరిషత్తు సమావేశాల తెదీలు అజేండా నిర్ణయిస్తాడు.సమావేషాల నిర్ణాయాలు తీర్మాణాలను అమలు జరిపిస్తాడు, మండల పరిషత్తు వార్షిక బడ్జెట్ ను రూపోందిస్తాడు.
6.      మండల పరిషత్తు అబివృద్ధి అధికారం (MPDO): మండల పరిషత్తుకు పరిపాలన అధిపతిగా వ్యవహరించే వ్యక్తిమే మండల పరిషత్తు అబివృధి అధికారి. మండల పరిషత్తు వ్యవహారాలలో అతడు కీలక పాత్ర పోషిస్తాడు, మండల పరిషత్తు సమావేశాల తెదీలు, అజేండా నిర్ణయిస్తాడు, సమావేశాల నిర్ణాయాలు, తీర్మాణలను అమలు జరిపిస్తాడు. పరిషత్తు వార్షిక బడ్జెట్ ను రూపొందిస్తాడు.
7.      జిల్లామహాసభ:      ప్రతి జిల్లా పరిషత్తులో ఒక జిల్లా మహాసభ ఉంటుంది.దానిలో జిల్లా పరిషత్తు చైర్మన్, కోందరు సభ్యులు ఉంటారు, జిల్లా మహాసభ జిల్లా పరిషత్తుకు సలహా సంస్థగా వ్యవహరిస్తుంది. దాని సమావేశాలకు జిల్లా పరిషత్తు చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు.
8.      మేయర్(IMP) :    నగర పాలక సంస్థ ప్రథమ పౌరుడు. నగరపాలక సంస్థకు రాజకీయ అధిపతి ఇతనిని నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్లు ఎన్నుకుంటారు పదవికాలం 5 సం,లు నెలకు 3,500 వేల వేతనం వస్తుంది. నగరపాలక మండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.
9.      మున్సిపల్ కమీషనర్(IMP) :                   పురపాలక సంస్థ పరిపాలనా అధిపతియే మున్సిపల్ కమీషనర్ అతడు తన విధి నిర్వహణలో ఒక వైపు పురపాలక మండలికి, వేరొక వైపు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత వహిస్తాడు మండలి సమావేశాలలో అజేండాను మున్సిపల్ చైర్మన్ తో సంప్రదించి రూపోందిస్తాడు, మండలి తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం అమోదించిన తరవాత అమలుపరుస్తాడు.
10. కంటోన్మెంట్ బోర్డులు(IMP) :                    భారతదేశంలో కంటోన్మెంట్ బోర్డులు భారత ప్రభుత్వ కంటోన్మెంట్ బోర్డు చట్టం 1904 సం, ద్వార ఏర్పాటయ్యయి. బోర్టులు కంటోన్మెంట్ ప్రాంతలలో నివసించే పౌరులు, సైనిక సిబ్బంది తాలుకు వ్యక్తుల ప్రయోజనాలను పెంపోందించడానికి కృషి చేస్తాయి. ప్రతి కంటోన్మెంట్ బోర్డులులో ఎనున్నకోబడిన సభ్యులు, నామినేట్ సభ్యులు ఉంటారు.


యూనిట్- 11  భారతదేశ విదేశాంగ విధానం

1.      విదేశాంగ విధానం నిర్వచనాలు (IMP):
      రాజ్యం చేత ఉద్దేశపూర్వకంగా జాతీయ ప్రయోజనాలను పేంపోదించుకోవడానికి ఎంపికైన క్రమానుగత ప్రకటనల సారమే విదేశాంగ విధానం”  -  F.H  హరిమన్.
2.         విదేశాంగ విధానం అంశాలు(IMP):       
     విధాన నిర్ణయాకలు    2  అసక్తులు ఆశయాలు    3 ప్రధాన సుత్రాలు   4  విదేశాంగ విధాన సాధనాలు
3.         భారతదేశ విదేశాంగ విధానం ఆశయాలు:     
1)     దేశ సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రతల పరిరక్షణ
2)     పోరుగు దేశాలతో సన్నిహిత సంబందాలను ఏర్పటు చేసుకోవడం
3)     దేశ రక్షణ పాటవాలను పెంపోందించుకోవడం
4)     తృతీయ ప్రపంచ దేశాలు ప్రయోజనాలను  పరిరక్షించుకోవడం
4.      అలీన విధానం (IMP):            అమెరిక ,రష్యా సైనిక కూటములలో చేరకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కలిగి ఉండుటనుఅలీన విధానంఅందురు. నెహ్రు, టిటో, నాజర్ బావనకు ఆధ్యులు. అలీన విధానం అనే భావన 1955 లో బాండూంగ్ సమావేశ సందర్భంలో ప్రచారంలోకి వచ్చింది. తోలి సమావేశం యుగోస్లావియాలో జరిగినది.
5.      పంచశీల(IMP):       1954 సం.లో భారత్-చైనా దేశాల మధ్య ఏర్పడిన ఐదు సూత్రాల నియమావళినిపంచశీలఅంటారు.
1.      రాజ్యాల ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వం పట్ల పరస్పర గౌరవం
2.      దురాక్రమణకు పాల్పడక పోవడం
3.      ఇతర రాజ్యాల అంతరంగిక వ్యవహారలలో జోక్యం చేసుకోకపోవడం
4.      సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాల సాధన
5.      శాంతీయుత సహాజీవనం
6.   నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ (NIEO): U.N.O సాధారణ సభ 1974 సం. నిర్వహించిన సాధారణ సభలో అబివృద్ధి చెందుతున్న దేశాలకు నూతన అంతర్జాతీయ అర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. సంస్థ ద్వారా అబివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాంతీయ సహకారం సమాజిక శ్రేయస్సు అర్థిక అబివృద్ధి సాధించబడుతాయని నిర్ణయించారు.
7.   SAARC(సార్క్)-(IMP):           దక్షిణాసియా రాజ్యాల ప్రాంతీయ సహకార సమాఖ్య 1985 సం. లో ఏర్పాటు చేశారు. దక్షిణాసియా రాజ్యాల మధ్య సహాకారాన్ని పెంపోదించుకోవడం దిని ప్రదాన ఆశయం. దినిలో ప్రారంభంలో ఏడు దేశాలు ఉన్నాయి.ప్రస్తుతం 8 దేశంగా అప్ఘనిస్తాన్ చెరింది అవి: 1. మల్ధీవులు 2. బంగ్లాదేశ్ 3. భూటాన్ 4. శ్రీలంక 5.ఇండియా  6.నేపాల్  7. పాకిస్తాన్  8. అప్ఘనిస్తాన్. (MBBS in PA).


8.   విదేశాంగ విధానంలో అంశాలు:
a.    ఆశయాలు నిర్థిష్టంగా రుపోందించడం
b.    ఆశయాల అమలుకోసం తీసుకోవాల్సిన చర్యలు.
c.     ఆశయాల సాధన కోసం వినియోగించవలసిన జాతీయ శక్తి.




యూనిట్- 12  ఐక్యరాజ్య సమితి
1.      ఐక్యరాజ్యసమితి చార్టర్:     ఐక్యరాజ్యసమితి ఆశయాలు ప్రధాన సూత్రాల, సాధారన స్వబావం గురించిన అంశాలన్ని చార్టర్ లో పోందుపరడమైంది.చార్టర్ లో మొత్తం 19 అధ్యాయలు, 111 అధికరణలు ఉన్నాయి.
2.      ఐక్యరాజ్యసమితి ప్రదాన అంగాలు:
1.      సాధరణ సభ                            4.   ధర్మకర్తృత్వ మండలి
2.      భద్రతా మండలి                         5.   అంతర్జాతీయ న్యాయస్థానం
3.      ఆర్థిక సాంఘిక మండలి              6.   సచివాలయం
3.      ధర్మకర్తృత్వ మండలి:                    స్వయం పాలనకు నోచుకోని అధీన ప్రాంతాలుగా గుర్తింపు పోందని వాటి వ్యవహారాలను ధర్మకర్తృత్వ మండలి పర్యవేక్షిస్తుంది. ధర్మకర్తృత్వ మండలి ఆవిశ్రాంతి కృషి ఫలితంగా 1975 నాటికి మొత్తం 11 అధీన ప్రాంతాలలో 10 ప్రాంతాలు స్వాతంత్ర్యన్ని పోందాయి. 1994 నాటికి మిగిత ఉన్న ప్రాంతానికి స్వాతంత్ర్యము ఇవ్వడంతో ధర్మకర్తృత్వ మండలి రద్దు అయింది.


4.      విటో(IMP):          భధ్రతామండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు ప్రత్యేకంగా కల్పించిన అధికారంను విటో అధికారం అంటారు. విటో అనగాతిరస్కరించడంఅని అర్థం. భధ్రతామండలిలో ప్రవేశపేట్టె ప్రత్యేక తీర్మానాన్ని ఒక్క శాశ్వత సభ్యదేశలు తిరస్కరించిన అది అమలులోనికి రాదు. విటో కలిగిన దేశాలు (ABCFR) అమెరిక, బ్రిటన్, చైనా, ప్రాన్స్, రష్యా.
5.      అర్థికసాంఘిక మండలి:        ఐక్యరాజ్యసమితి అంగాలలో  ఆర్థిక సాంఘిక మండలి ఒకటి దినిలో 54 మంది సభ్యులు ఉంటారు. వీరి పదవికాలం 3 సం. రాలు. ఉన్నత జీవన ప్రమాణస్థాయి, సంపూర్ణ నిరుద్యోగితలను సభ్యరాజ్యల ప్రజలకు అందించడానికి సంస్థ దోహదపడుతుంది.
6.      అంతర్జాతీయ న్యాయస్థానం (IMP):        U.N.O ప్రదాన అంగాలలో అంతర్జాతీయ న్యాయస్థానం ఒకటి. దిని ప్రదాన కార్యాలయం (నెదర్లాండ్స్- హెగ్ నగరంలో ఉంది) దినిలో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు,న్యాయమూర్తులు పదవికాలం 9 సం. లు. వివిద దేశాల మధ్య సంభవించే వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి అంతర్జాతీయ న్యాయస్థానం కృషి చేస్తుంది.
7.      ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సంస్థలు/U.N.O అనుబంద సంస్థలు
1)    అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)
2)   ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)
3)   ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)
4)   అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)
8.      ఐక్యరాజ్య సమితి ఆశయాలు/ఉద్ధేశాలు (IMP):
1)    భావితరాల వారిని యుద్దభీతి నుంచి కాపాడటం.
2)   మానవులందరికీ హక్కులు గౌరవాన్ని కల్పించడానికి హామి ఇవ్వడం.
3)   చిన్న పెద్ధ రాజ్యాలన్నింటిని ఒకే విధంగా చూడటం.
4)   ప్రపంచ శాంతి భద్రతల నిర్వహణ.


  
యూనిట్- 13  సమకాలీన ధోరణులు-అంశాలు
1.         ప్రపంచీకరణ  నిర్వచనం (IMP):
ప్రపంచీకరణ అంటే ఆర్థిక కార్యకలాపలను జాతుల రాజకీయ సరిహద్ధు వెలుపప విస్తరింప చేయండం” – దీపక్ నాయర్
వస్తువుల  సేవలు సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలకు సంబంధించి స్వదేశీ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనుసంధానం గావించడమే ప్రపంచీకరణ”     - T.R జైన్
2.         ప్రపంచీకరణ లక్షణాలు:
1)      వస్తువులు, సేవలకు సంబంధించిన అంతర్జాతీయ వర్తకం విస్తరణ
2)      దేశాల మధ్య ప్రాంతాల మధ్య ప్రజల రాకపోకలు
3)      బహుళజాతి కంపెనీల ఆవిర్భవం
4)      అంతర్జాతీయ వర్తకం సాంకేతిక పరిజ్ఞానం అధికమవడం
3.      ఉగ్రవాదం ఎత్తుగడలు(IMP):         ఉగ్రవాదులు గత కోన్ని దశాబ్ధాలుగా వివిధ దేశాలలో, వివిధ రకాల ఎత్తుగడలతో ఆయా ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేయుచున్నారు. వీరు అనుసరించే ఎత్తుగడలు ఎల్లప్పుడు ఒకే రకంగా లేవు తమ ఎత్తుగడలను తరుచుగా మార్చుకుంటూ, భారి జన ఆస్తి, నష్టానికి పాల్పడుచూన్నారు, స్వదేశి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, సైన్యంలో తిరుగుబాటును ప్రోత్సహించడం మొ,. ఉగ్రవాదుల ఎత్తుగడలో ప్రదాన అంశాలయ్యాయి.
4.      సాంస్కృతిక పతనం:         వర్థమాన దేశాలలో సాంస్కృతిక వాతావరణం క్రమేణా కలుషితమవుతూ వచ్చింది. ఈ దేశాలలో ఎక్కువ మంది ప్రజలు పనిచేయకుండానే ప్రభుత్వం ద్వార జీతభత్యాలు అందుబాటులోకి రావాలని ఆశించడం పెదవారిని దూషించడం ప్రభుత్వ రికార్డుల తారుమారు చేయడం ఆర్థిక నిధులను దుర్వినియోగం చేయడం మొదలగునవి.

www.telugugk.com



Second Year Civics 2 Marks, Telugu Civics  2 Marks,

Followers