నేషనల్ ఫైర్ సర్వీస్ సబ్ ఆఫీసర్స్

Tags: Jobs In India



కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ 36వ ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ సబ్ ఆఫీసర్స్ కోర్సు నోటిఫికేషన్‌న్‌ను విడుదల చేసింది. అగ్నిప్రమాదాల నివారణ సమయంలో నిఫుణుల అవసరం ఉంటుంది. ఇందుకు నేరుగా నియామకాలే కాకుండా కళాశాలలో కోర్సు చేయడం ద్వారా కూడా నిపుణులను తయారు చేసుకోవడం ఈ కోర్సు ఉద్దేశ్యం. 2010-2011 సంవత్సరానికి నాగపూర్‌లోని ఫైర్ సర్వీస్ కాలేజీతో పాటు దాని కింద ఉన్న రీజనల్ ట్రైనింగ్ కాలేజీల్లో సబ్ ఆఫీసర్స్ కోర్సును అందించేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ కోర్సు కాల వ్యవధి 33 వారాలు ఉంటుంది. 21 వారాలు కాలేజీ, ట్రైనింగ్ సెంటర్‌లలో జరిగితే, మిగిలిన 12 వారాలు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న జరుగుతుంది. ఈ కోర్సు ఉందన్న విషయం చాలామందికి తెలీదు. ఫైర్ సర్వీస్ ఉద్యోగాలకు ఇటు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కూడా మంచి డిమాండ్ ఉంది.
వయోపరిమితి: 2010 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ళ మధ్య ఉన్న కలిగి ఉండాలి. పురుష, మహిళలు ఇరువురూ అర్హులే. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్ధులకు 5 ఏళ్ల వయోపరిమితి నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. వయోపరిమితి సడలింపు అర్హత ఉన్న వారు తమ వద్ద ఉన్న అర్హత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్ధ నుంచి హెచ్‌ఎస్‌ఎస్‌సి లేదా ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. హిందీ, ఇంగ్లీషు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
శారీరక కొలతలు:
పురుషులు: ఎత్తు 165 సె.మీ తగ్గకుండా ఉండాలి. బరువు 50 కేజీలు తగ్గకుండా ఉండాలి. ఛాతీ గాలి పీల్చినప్పుడు 86 సె.మీ, పీల్చనప్పుడు 80 సె.మీ ఉండాలి. కంటిచూపు 6/6 కలర్ బ్లైండ్‌నెస్ ఉండకూడదు. మెడికల్‌గా ఫిట్ కావాల్సి ఉంటుంది.
మహిళలు: ఎత్తు 157 సెం.మీ కలిగి ఉండాలి. 46 కేజీల కన్నా బరువు తక్కువ ఉండకూడదు. కంటి చూపు పురుషుల మాదిరిగానే ఉండాలి.
దరఖాస్తులు పంపేందుకు ఆఖరి తేదీ :
దరఖాస్తును నోటిఫికేషన్‌లో పేర్కొన్న మాదిరిగా తయారు చేసుకుని 2010 జనవరి 11 నాటికి పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫైర్ సర్వీస్‌లో పని చేస్తున్న అభ్యర్ధులైతే వారు తమ దరఖాస్తును ప్రోపర్ చానల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. జనవరి 11 తర్వాత అందిన దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుంది.
పరీక్ష ఫీజు:
అన్‌రిజర్వుడు అభ్యర్ధులు రూ.100, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్ధులు రూ.25 ఫీజు చెల్లించాలి. ఫీజును ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో పంపించాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాప్టులు గానీ, తక్కువగా గానీ, అసలు ఫీజు చెల్లించకుండా గానీ పంపితే అటువంటి దరఖాస్తులు తిరస్కరించబడతాయని అభ్యర్ధులు గ్రహించాలి.
ప్రవేశ పరీక్ష విధానం:
పరీక్ష రెండు విభాగాలుగా ఒకే రోజు జరుగుతుంది. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీషుల్లో ఉంటుంది. మొదటి విభాగం పేపర్‌లో ప్రశ్నలు పూర్తి ఆబ్జక్టివ్ పద్దతిలో ఇంటర్మీడియట్ స్ధాయిలో ఉంటాయి. ఈ పేపర్‌లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జి ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపర్‌లో జనరల్ సైన్స్, మేథమెటిక్స్ ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు:
ప్రవేశ పరీక్ష కేంద్రాలు ముంబయి, న్యూఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నై, నాగపూర్‌లో మాత్రమే జరుగుతాయి. దరఖాస్తులు అన్నీ పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి మాత్రమే ప్రవేశ పరీక్ష రాసేందుకు కాల్ లెటర్లు అందుతాయి. కళాశాల అవసరార్ధం కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని మార్చేందుకు అవకాశం ఉంటుంది.
సీట్ల వివరాలు:
నాగపూర్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో 60 సీట్లు మాత్రమే ఉంటాయి. రెండు బ్యాచ్‌లుగా జరుగుతాయి. ఒక్కో బ్యాచ్‌కి 30 సీట్లు ఉంటాయి. వాటిలో 5 సీట్లు ఎస్‌సి, ఎస్‌టిలకు, మరో రెండు సీట్లను సర్వీస్‌లో ఉండి చనిపోయిన వారి పిల్లలకు కేటాయించబడతాయి. జులై 2010లో ఒక బ్యాచ్, 2011 జనవరిలో రెండో బ్యాచ్‌కి తరగతులు జరుగుతాయి. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ఎటువంటి టి.ఎ, డి.ఎలు ఇవ్వబడవు.
ప్రవేశం: కోర్సులోకి ప్రవేశించే అభ్యర్ధులు ప్రవేశ పరీక్షలో సాధించిన పూర్తి స్ధాయి ప్రతిభ ఆధారంగా ఉంటుంది. దీంతో పాటు మెడికల్‌గా పూర్తి ఫిట్‌నెస్ కలిగి ఉండాలి.
ఇతర వివరాలు: దరఖాస్తులను ఎ4 సైజులో మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అన్ని వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్ధులు తమ సంతకాన్ని నిర్ధేశించిన బాక్స్‌లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫోటో కాపీ పంపిస్తే తిరస్కారానికి గురవుతుంది. దరఖాస్తులో అభ్యర్ధులు తమ సంతకాన్ని కేపిటల్ లెటర్‌లలో చేస్తే తిరస్కరించబడతాయి. దరఖాస్తుతో పాటు పంపిన అభ్యర్ధి ఫోటోపై కళాశాల ప్రిన్సిపాల్ లేదా, గెజిటెడ్ అధికారి సంతకం చేసి పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులను డైరక్టర్, నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ, సివిల్ లైన్స్, నాగపూర్-440001 చిరునామాకు పంపించాలి. దరఖాస్తు పంపించే కవర్‌పై ‘అప్లికేషన్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ 36వ సబ్ ఆఫీసర్స్ కోర్సు-2009’ అని స్పష్టంగా రాసి పంపించాలి. ఎవరైతే అర్హులుగా కాలేజీ భావిస్తుందో వారికి మాత్రమే కాల్ లెటర్లు పంపించడం జరుగుతుంది. ఈ కోర్సు పూర్తిగా కళాశాలలో ఉండి మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది. బాలురు ఉండేందుకు వసతి సౌకర్యం ఉంది. కానీ మహిళా అభ్యర్ధులు తమ వసతికి సంబంధించిన ఏర్పాట్లు వారే చేసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ చెకప్ సమయంలో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు, రెండు ఫోటో గ్రాఫ్‌లు తమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వివరాలు, దరఖాస్తులు డౌన్ లోడ్ కోసం తీతీతీ.డ్ళ్ఘజూౄజఒఒజ్యశ.ష్యౄ సందర్శించవచ్చును.


Followers