Nelson Mandela




Nelson Mandela 
Born: July 18, 1918, Mvezo, South Africa
Died: December 5, 2013
 Children: Makaziwe Mandela, Zenani Mandela,
 Awards:
 Nobel Peace Prize, Bharat Ratna, Time's Person of the Year, Sakharov Prize, Presidential Medal of Freedom, Congressional Gold Medal, Arthur Ashe Courage Award, Queen Elizabeth II Diamond Jubilee Medal, Gandhi Peace Prize, Philadelphia Liberty Medal, Jawaharlal Nehru Award for International Understanding, Lenin Peace Prize, Queen Elizabeth II Golden Jubilee Medal, Nishan-e-Pakistan, Al-Gaddafi International Prize for Human Rights, Ambassador of Conscience Award, International Simón Bolívar Prize, United Nations Prize in the Field of Human Rights, Order of the Nile, World Citizenship Award, U Thant Peace Award, Félix Houphouët-Boigny Peace Prize, Isitwalandwe Medal, Indira Gandhi Award for International Justice and Harmony, Freedom of the City of Aberdeen, Bruno Kreisky Award, UNESCO Peace Prize, Carter–Menil Human Rights Prize, Bishop John T. Walker Distinguished Humanitarian Service Award, Giuseppe Motta Medal, Ludovic-Trarieux International Human Rights Prize, J. William Fulbright Prize for International Understanding, W E B DuBois International Medal, Prince of Asturias Award for International Cooperation, Harvard Business School Statesman of the Year Award

 జొహన్నెస్‌బర్గ్‌: పశ్చిమ దేశాల పీడనలో నిరాశా నిస్పృహల చీకట్లు అలముకున్న ఆఫ్రికా ఖండ ప్రజల్లో ఆశల వెలుగు నింపిన నల్ల సూరీడు అస్తమించాడు. గాంధేయ మార్గంలో అవిశ్రాంతంగా పోరాడి దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష ప్రభుత్వానికి చరమగీతం పాడిన యోధుడు శాశ్వతంగా విశ్రమించాడు. అర్ధ శతాబ్ధం పాటు కోట్ల మంది పోరాటాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్‌ మండేలా గురువారం అర్ధరాత్రి దాటాక కన్ను మూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్న 95 ఏళ్ల మండేలా జొహన్సెస్‌బర్గ్‌ శివారులోని తన నివాసంలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో తుదిశ్వాస విడిచారు. సెప్టెంబరు నుంచి ఆయన ఇంట్లోనే వైద్య చికిత్స పొందుతున్నారు. అంతకు ముందే మూడు నెలల పాటు ప్రిటోరియా ఆసుపత్రిలో వూపిరి తిత్తుల వ్యాధికి చికిత్స పొందారు. రెండేళ్లుగా ఆయన తరచూ జబ్బున పడుతున్నారు. దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు జాకబ్‌ జుమా టీవీలో జాతినుద్దేశించి మాట్లాడుతూ, ''మన ప్రియతమ నేత, ప్రజాస్వామ్య దక్షిణాఫ్రికా వ్యవస్థాపక అధ్యక్షుడు నెల్సన్‌ రోలిహ్లాలా మండేలా ఇకలేరు'' అని ప్రకటించారు. ''మన దేశం గొప్ప తనయుణ్ణి కోల్పోయింది. ప్రజలు తండ్రిని కోల్పోయారు''........



దక్షిణాఫ్రికా జాతిపిత, నల్లజాతి సూర్యడు నెల్సన్ మండేలా అంత్యక్రియలు ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు జాకోబ్ జూమా ఇక్కడ వెల్లడించారు. ఈస్టరన్ కేప్ లోని క్యూనులో మండేలా స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం ఆయన జోహెన్స్ బర్గ్ లోని మండేలా కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మండేలా అంత్యక్రియలు వచ్చే ఆదివారం నిర్వహించాలని తెలిపారని ఆయన చెప్పారు. ఆ మహానియుడి మృతికి 10 రోజులు సంతాపదినాలుగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మండేలా ఆత్మశాంతికి దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మండేలా మృతితో ఆయన కుటుంబానికి దక్షిణాఫ్రికా వాసులతోపాటు ప్రపంచ ప్రజలు మద్దతుగా నిలవడం పట్ల జూమా సంతోషం వ్యక్తం చేశారు. వారందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నెల్సన్ మండేలా అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ప్రపంచనేతలు హాజరుకానున్నారు. గత కొన్ని ఏళ్లుగా నెల్సన్ మండేలా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది మధ్యలో మండేలా తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు.








Followers