పంచా యతీ సెక్రటరీ పరీక్ష కటాఫ్ ఎంత...? 2014


ఆదివారం(ఫిబ్రవరి 23న) జరిగిన పంచాయతీ సెక్రటరీ పోస్టు పరీక్ష కటాఫ్ ఎంత ఉండవచ్చు -వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్ష ఫలితాలు పునరావతం అవుతాయా -అన్న ప్రశ్న పరీక్ష రాసిన అభ్యర్థుల మదిని తొలుస్తోంది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల విషయనిపుణులు, వీఆర్వో పరీక్ష విజేతల అభిపాయ్రాలతో కటాఫ్‌పై అందిస్తున్న విశ్లేషణ.... రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పంచాయతీసెక్రటరీ పరీక్షకు సుమారు ఆరులక్షల మందికి పైగా హాజరయ్యారు. కానీ దీనిలో సీరియస్‌గా పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య లక్షలోపే ఉంటుంది..! రెండు పేపర్లను పోటీపరీక్ష నిపుణులు నూతనకంటి వెంకట్ విశ్లేషిస్తూ... పేపర్ -1 : జనరల్ స్టడీస్ ప్రశ్నలు సిలబస్‌కు భిన్నంగా వచ్చాయన్నారు. ఈ విధంగా రావడంపై పలువురు అభ్యర్థులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తం జీఎస్ ప్రశ్నల్లో 90 శాతం ప్రశ్నలు అందరికీ అనుకూలంగా వచ్చాయి. అంటే సుమారు 113 ప్రశ్నలు సాధారణస్థాయిలో ఉన్నాయి. దీనిలో 100 మార్కులు తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక డాటా ఇంట్రప్రిటేషన్, మెంటల్ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్ విభాగాల కింద అడిగిన ప్రశ్నలు అభ్యర్థుల విజయాన్ని శాసిస్తాయి. రీజనింగ్ విభాగంలో కొంత కఠినమైన ప్రశ్నలు, లాజికల్‌స్కిల్స్‌లో యావరేజ్‌స్థాయిలో ప్రశ్నలు వచ్చాయి. వీటిలో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత మంచి ర్యాంకు వస్తుంది.మొత్తం మీద 150 మార్కులకు గాను 130 పైగా సాధిస్తేనే ఉద్యోగావకాశాలు ఉంటాయి. పేపర్ -2: రూరల్‌డెవలప్‌మెంట్‌పై కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పేపర్ అభ్యర్థులను అంతగా భయపెట్టలేదు. దీనిలో అడిగిన ప్రశ్నలు వాస్తవరూపంలో కనిపించేవి కావడం విశేషం. అభ్యర్థి ఉద్యోగంలో చేరిన తర్వాత చేయాల్సిన విధులపై కావల్సిన ప్రాథమిక సమాచారాన్ని అడగడం మంచి పరిణామం. దీనిలో అకౌంట్స్‌పై అడిగిన ప్రశ్నల్లో 15 వరకు సాధారణస్థాయిలో ఉన్నాయి. మిగిలిన 10 ప్రశ్నలు కఠినస్థాయిలో ఉన్నాయి. ఓవరాల్‌గా పరిశీలిస్తే ఈ పేపర్‌లో కూడా 125 - 135 మార్కులు సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. సగటు అభ్యర్థిని దష్టిలో ఉంచుకొని పేపర్స్ తయారుచేశారు. ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ పరిక్షించేవిధంగా ఉండడంపై అభ్యర్థులు, విద్యావేత్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ పేపర్లలో కొన్ని ప్రశ్నలు రిపీట్ కావడం గమనార్హం. అదేవిధంగా మెంటల్‌ఎబిలిటీ ప్రశ్నలస్థానంలో అరిథ్‌మెటిక్ ప్రశ్నలు అడగడంపై అభ్యర్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తం మీద రెండు పేపర్స్‌లో కలిపి జనరల్ అభ్యర్థులకు 270పైగా మార్కులు వస్తేనే ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన వీఆర్వో, వీఆర్‌ఏ ఫలితాల వలే సెంట్ మార్కులు కూడా వచ్చే అవకాశం ఉందని కొంతమంది పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్కొంటుండం గమనార్హం. ఏదేమైనా ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే

Followers