ఎంబిఎలో రిటైల్ మేనేజ్‌మెంట్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది?


ఎంబిఎలో రిటైల్ మేనేజ్‌మెంట్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది. ఈ కోర్సును ఏ ఇనిస్టిట్యూట్‌లు అందిస్తున్నాయి? -ఎస్.సాయిప్రమోద్, మిర్యాలగూడ. జ ః రిటైల్ మార్కెట్ మనదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. షాపర్స్ స్టాప్, వెస్ట్‌సైడ్, పాంటలూన్స్, లైఫ్‌స్టైల్, ఆర్.పి.జి. రిటైల్, క్రాస్‌వర్డ్, గ్లోబస్, రిలయన్స్ మోర్, బిగ్‌బజార్, హెరిటేజ్‌లాంటి మాల్స్ చిన్న చిన్న పట్టణాలలో కూడా వెలుస్తున్నాయి. ఈ సంస్థలలో సేల్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్, హెచ్.ఆర్. కస్టమర్ కేర్ లాంటి రంగాలలో నిపుణుల నియామకం జరుగుతుంది. ఇందులో రిటైల్ మేనేజిమెంట్ స్పెషలైజేషన్‌లో ఎం.బి.ఎ పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటాయి. వాల్‌మార్ట్‌లాంటి రిటైల్ దిగ్గజాల ప్రవేశంతో అవకాశాలు మరింత పెరుగుతాయి. ఎం.బి.ఎ.లో రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సును చాలా విద్యాలయాలు ఆఫర్ చేస్తున్నాయి. మన రాష్ట్రంలోని ఎం.బి.ఎ కళాశాలలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. Pune నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ఏయే కోర్సులు అందుబాటులో ఉంటాయి? ఈ సంస్థ బ్రాంచ్ హైదరాబాద్‌లో ఉందా? ఈ కోర్సులు చేయాలంటే ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడుతుంది? - ఆర్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ . అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థ. ఈ సంస్థ 50 దేశాలలోని విద్యా సంస్థలలో ఎక్స్‌చేంజ్ కార్యక్ర మాలను ఏర్పర్చుకుంది. ప్రస్తుతం ఈ సంస్థకు అహ్మాదాబాద్, గాంధీ నగర్, బెంగళూర్‌లలో క్యాంపస్‌లు న్నాయి. ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, మధ్యప్రదేశ్‌లలో క్యాంపస్‌లు ఏర్పాడు చేయాలని నిర్ణయించింది. హైదరాబాదులో క్యాంపస్ నిర్మాణానికి మే 25వ తేదీన శంఖుస్థాపన చేశారు. 2015-16 సంవత్సరానికి హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సంస్థ నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రొగ్రామ్ ఇన్ డిజైన్ (జి.డి.పి.డి) రెండున్నర సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రొగ్రామ్ ఇన్ డిజైన్ (పి.జి.డి.పి.డి) కోర్సులను ఆఫర్ చేస్తోంది. జిడిపిడి కోర్సును అహ్మదాబాద్ ఆఫర్ చేస్తోంది. పి.జి. కోర్సులు అన్ని క్యాంపస్‌లలో ఆఫర్ చేస్తోంది. డిగ్రీలలో 100 సీట్లు, పి.జిలో 245 సీట్లుంటాయి. ఈ క్రింది డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ప్రోడక్ట్ డిజైన్, ట్రాన్స్‌పొర్టేషన్ అండ్ ఆటోమోబైల్ డిజైన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరీయర్ డిజైన్, గేమ్ డిజైన్, అప్పరల్ డిజైన్ అండ్ మర్చండైజింగ్, లైఫ్‌స్టైల్ అక్సెసరీ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్ ఫిల్మ్‌డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, న్యూ మీడియా డిజైన్, సాఫ్ట్‌వేర్ అండ్ యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్, ఇన్‌ఫర్మేషన్ అండ్ డిజిటల్ డిజైన్, ఇన్‌ఫర్మేషన్ అండ్ ఇంటర్ ఫేస్ డిజైన్, డిజైన్ ఫర్ డిజిటల్ ఎక్సిపీరియన్స్, స్ట్రాటజీ డిజైన్ మేనేజ్‌మెంట్, డిజైన్ ఫర్ రిటైల్ ఎక్సిపీరియన్స్. ఈ కోర్సుల్లో ఎంపిక, సంస్థ నిర్వహించే డిజైన్ డిప్టిట్యూడ్ టెస్ట్ (డిఎటి)లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ప్రతి ఏటా నోటిఫికేషన్ సెప్టెంబర్/ అక్టోబర్ నెలల్లో వెలువడుతుంది. జనవరిలో డి.ఎటి పరీక్ష దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాలలో జరుగుతుంది. 2014-15 సంవత్సరానికి నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 2న ముగిసింది.దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష 2014 జనవరి 12న జరుగుతుంది. మీరు వచ్చే సంవత్సరానికి ఇప్పటి నుండి ప్రిపేర్ కావాలి. దీనికి గత సంవత్సర ప్రశ్నపత్రాలు పరిశీలించండి. పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్ www. nid.edu చూడగలరు. ప: ఆర్మీలోకి ప్రవేశించాలంటే ఎప్పటి నుంచి ప్లానింగ్ చేసుకోవాలి? 10 వరతగతి తర్వాత ? లేక ఇంటర్ తర్వాతా? దీనికి కావాల్సిన ప్రత్యేక అర్హతలు ఏవైనా ఉన్నాయా? వివరంగా తెలపండి.? -కె. సుధాకర్, నిజామాబాద్. జ ః ఆర్మీలోకి ప్రవేశించాలంటే రెండు దశలుగా ఆఫీసర్‌గా మరియు సైనికు డిగా (సోల్జర్) చేరవచ్చు. ఇంటర్మీడి యట్ అర్హతతో యు.పి.ఎస్.సి నిర్వహించే నేషనల్ డిఫెన్స్ ఎకాడమీ (ఎన్.డి.ఎ) పరీక్ష ద్వారా ఆఫీసర్‌గా చేరవచ్చు లేదా డిగ్రీ అర్హతతో కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ (సిడిఎస్) పరీక్ష రాసి ఆఫీసర్‌గా నేరుగా ఆర్మీలో చేరవచ్చు. పదవతరగతి అర్హతతో సైనికుడిగా చేరవచ్చు. ఇంటర్మీడి యట్ అర్హతతో సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్, సోల్జర్ నర్సింగ్, సోల్జర్ ట్రేక్స్‌మెన్‌గా చేరవచ్చు. అభ్యర్థులను శారీరక దారుఢ్య పరీక్షలు, మెడికల్ టెస్టులు, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులు కనీస ఎత్తు 165 సెంటిమీటర్లు ఉండాలి. బరువు 50 కేజీలు తగ్గకుండా ఉండాలి. ప్రతియేటా రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించి వివిధ రకాల సైనిక ఉద్యోగాలకు ఎంపిక చేయటం జరుగుతుంది. ప్రణాళిక బద్ధంగా ప్రిపేర్ అయితే ఎంపిక కావడం సుసాధ్యమే

Followers