మోడల్ ఏదైనా... కాన్ఫిగరేషన్ ఎంతైనా... వాడకంలో బ్యాలెన్స్ లేకపోతే
ప్రయోజనం శూన్యం. అవసరానికి తగిన సాఫ్ట్‌వేర్‌లను ఓపిగ్గా వెతకాలి.
ఇన్‌స్టాల్ చేయాలి. వాడి చూడాలి. అబ్బే... మాకంత సమయం ఎక్కడిదీ? అనే కోవకి
వచ్చే వారి కోసమే ఇవి. వాడితే రెండిటినీ ఇట్టే బ్యాలెన్స్ చేయవచ్చు!ఏవైనా
ఫైల్స్‌ని కాపీ చేయడానికి 'కాపీ' ఆప్షన్ని వాడడం తెలుసు. ఇలా కాపీ
చేస్తున్న సందర్భాల్లో కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఉదాహరణకు కాపీ
చేస్తున్నప్పుడు మధ్యలో 'పాజ్' చేయడం ఎలా? అలాగే, అక్కర్లేని ఫైల్స్‌ని
కాపీ అవుతున్నప్పుడు 'స్కిప్' చేయవచ్చా?... అలాంటివి అనేకం. వీటికి
సమాధానంగా 'ఆల్ట్రాకాపీయర్' టూల్‌ని వాడొచ్చు. ఇన్‌స్టాల్ చేయగానే సిస్టం
ట్రేలో చేరి పని చేస్తుంది. ఫైల్స్‌ని కాపీ చేయడానికి ఆప్షన్‌తో కాపీ
చేయవచ్చు. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి.సిస్టం సామర్థ్యం మందగిస్తే
'టెంపరరీ ఫైల్స్' తొలగిస్తుంటాం. అందుకు రన్‌లోకి వెళ్లి ఏవేవో కమాండ్స్
వాడుతుంటారు. అవేం లేకుండా సిస్టంలో దాగి ఉన్న టెంపరరీ ఫైల్స్‌ని ఈ టూల్
తొలగిస్తుంది. జిప్ ఫార్మెట్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఎక్స్‌ట్రాక్ట్
చేయాలి. టూల్‌ని రన్
చేసేందుకు 'డాట్‌నెట్ ఫ్రెమ్‌వర్క్ 4.0' అప్లికేషన్ సిస్టంలో ఉండాలి.
నెట్‌లో వాడే సర్వీసులు అనేకం. అన్నింటి లాగిన్ వివరాల్ని గుర్తుంచుకోవడం
కాస్త కష్టమే. అందుకు ఈ టూల్‌తో లాగిన్ తాళాల్ని సురక్షితంగా భద్రం
చేయవచ్చు. కావాల్సినప్పుడు అనువుగా వాడుకోవచ్చు. ఇదో ఓపెన్‌సోర్స్
పాస్‌వర్డ్ మేనేజర్. అన్ని పాస్‌వర్డ్‌లను ఒక్క మాస్టర్ పాస్‌వర్డ్‌తో
భద్రం చేయవచ్చు. అంటే... క్రియేట్ చేసుకున్న అన్ని పాస్‌వర్డ్‌ల
డేటాబేస్‌కి తాళం మాస్టర్ పాస్‌వర్డ్ అన్నమాట. ఫోల్డర్ ఐకాన్స్ అన్నీ
ఒకే రంగులో ఉంటాయి. కానీ, ముఖ్యమైన ఫోల్డర్ల రంగులు మార్చుకుని వాటి
ప్రాధాన్యాన్ని తెలిపేలా సెట్ చేసుకుంటే? అందుకు అనువైన టూల్ ఇదే. జిప్
ఫార్మెట్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి. ఇన్‌స్టాల్
చేశాక రంగు మార్చాలనుకునే ఫోల్డర్‌పై రైట్‌క్లిక్ చేయాలి. వచ్చిన
పాప్‌అప్ మెనూలో 'రెయిన్‌బో' ఆప్షన్ సెలెక్ట్ చేసి కావాల్సిన రంగుని
ఎంపిక చేసుకోవచ్చు. మీరు ఎక్స్‌పీ వాడుతున్నట్లయితే ఫోల్డర్ స్టెల్‌ని
'విస్టా' మోడల్‌లో సెట్ చేసుకోవచ్చు. మొత్తం ప్రక్రియ ముగిశాక ఆప్షన్‌పై
క్లిక్ చేయాలి. ఒకవేళ ఫోల్డర్ రంగుని తొలగించాలి అనుకుంటే ఉంది. టూల్
డౌన్‌లోడ్ కోసం లింక్‌లోకి వెళ్లండి.ఎక్కువ మెమొరీ తీసుకోకూడదు. కానీ,
దాంట్లో అలారం సౌకర్యం ఉండాలి. పుట్టిన రోజు లాంటి ముఖ్యమైన వాటిని గుర్తు
చేయాలి. డైరీ రాసుకోవాలి. అడ్రస్‌లను భద్రం చేసుకోవాలి. టైమర్ కౌంట్‌డౌన్
లాంటి మరిన్ని సౌకర్యాల్ని వాడుకోగలగాలి. అదీ ఉచితంగా... ఇలా ఎప్పుడైనా
అనుకున్నారా? అయితే ఈ టూల్ మీకే. ఇన్‌స్టాల్ చేయగానే డెస్క్‌టాప్‌పై
ఐకాన్ గుర్తు వస్తుంది. ఆప్షన్‌తో పీసీలో అలారం సెట్ చేయవచ్చు. ద్వారా
పీసీని నిర్ణీత సమయానికి షట్‌డౌన్ చేయవచ్చు. పేరు, మొబైల్ నెంబర్,
ఈమెయిల్, పర్సనల్ ఇన్ఫర్మేషన్... వివరాలతో 'అడ్రస్‌బుక్' క్రియేట్
చేయవచ్చు. మ్యాక్‌లో మాదిరిగా పీసీలోనూ 'డాకింగ్' బార్‌ని సెట్
చేసుకోవచ్చు. తెరకి అన్ని వైపులా డాక్‌బార్‌ని సెట్ చేసుకోవచ్చు.
డాక్‌బార్‌లో కొత్త అప్లికేషన్‌ని ఇన్‌సర్ట్ చేయాలంటే... డ్రాగ్ అండ్
డ్రాప్ పద్ధతిలో చేయవచ్చు. డాక్‌బార్ యానిమేషన్ ఎఫెక్ట్‌ని
కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. అందుకు మెనూలోకి వెళ్లండి. బార్‌ని
ఆటోమాటిక్‌గా హైడ్ చేయవచ్చు కూడా. ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్‌ని పీసీకి
కనెక్ట్ చేసి డేటాని ట్రాన్‌ఫర్ చేయడం సులువే. అదే మ్యాక్‌కి కనెక్ట్
చేస్తే! ఎలాంటి స్పందనా ఉండదు. అదే ఈ 'ఆండ్రాయిడ్ ఫైల్ ట్రాన్స్‌ఫర్'
టూల్‌తో సులువుగా మ్యాక్‌కి మొబైల్‌ని కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. టూల్‌ని
మ్యాక్‌లో ఇన్‌స్టాల్ చేసి ఫోన్‌కి కనెక్ట్ చేస్తే పాప్‌అప్ ద్వారా
కనిపిస్తుంది. ఇక మైక్రోఎస్‌డీ కార్డ్‌ని యాక్సెస్ చేసి డేటాని
ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలోనూ ఫైల్స్‌ని కాపీ
చేసుకునే వీలుంది. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి.మ్యాక్ సామర్థ్యం కాస్త
నెమ్మదిస్తే! టూల్‌తో స్టార్ట్‌అప్‌లో ఏమేం రన్ అవుతున్నాయో తెలుసుకుని
మేనేజ్ చేయవచ్చు. ఇదో మల్టీ ఫంక్షన్ యుటిలిటీ టూల్. సిస్టం ఫైల్స్‌ని
స్కాన్ చేసి చూడొచ్చు. అక్కర్లేని చెత్తని తొలగించి వేగాన్ని పెంచుతుంది.
మెమొరీ డిలీట్ చేస్తుంది. మ్యాక్‌లో ఫైల్స్‌ని ఎప్పుడూ ఒకేలా వెతికి బోర్
అనిపిస్తే ఈ టూల్‌ని ప్రయత్నించండి. సరికొత్త సౌకర్యాల్ని మ్యాక్ ఓఎస్‌ని
జత చేయవచ్చు. ఉదాహరణకు ఫైల్స్‌ని బ్రౌజ్ చేసేప్పుడు బ్రౌజర్‌లో మాదిరిగా
ట్యాబ్ విండోలను సెలెక్ట్ చేసుకునే వీలుంది. రెండు విండోలను జోడుగా
'డ్యూయల్ ప్యానల్, డ్యూయల్ విండో'ల్లో ఫైల్స్‌ని బ్రౌజ్ చేయవచ్చు.
విండోస్‌లో మాదిరిగా ఫైల్స్‌ని కట్, కాపీ చేసుకునే వీలుంది. ఏదైనా
ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకుని దాని 'పాత్'ని కాపీ చేయవచ్చు. అందుకు ఉంది.
డెస్క్‌టాప్ మొత్తాన్ని మాయం చేయవచ్చు. లాంటి ఆప్షన్లు మరిన్ని ఉన్నాయి.
టూల్ కోసం లింక్ చూడండి.ఎక్కువ సమయం మ్యాక్ ముందే గడుపుతున్నారా? అయితే,
కళ్లకు అసౌకర్యం కలగకుండా టూల్‌ని వాడుకోవచ్చు. ప్రాపర్టీలను ఆటోమాటిక్‌గా
మార్పులు చేస్తుంది. రోజులోని వేళల్ని అందుకు కొలమానంగా తీసుకుంటుంది.
ఉదాహరణకు రాత్రి సమయంలో పూర్తిగా విద్యుత్ దీపాల్లో పని చేస్తుంటాం.
అలాంటి సందర్భాల్లో మ్యాక్ డిస్‌ప్లేని కళ్లకు అనువుగా మార్పులు
చేస్తుంది. డౌన్‌లోడ్, ఇతర వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.మ్యాక్‌లో
ఎక్కువగా వాడే అప్లికేషన్లు సులువుగా పొందేందుకు ఇదో చక్కని వేదిక.
కావాల్సిన ఫైల్స్‌ని కూడా దీన్నుంచే వెతకొచ్చు. మరింత వేగంగా వేతికేందుకు
హాట్‌కీస్, కీవర్డ్స్‌ని కూడా పెట్టుకునే వీలుంది. ఒకటి కంటే ఎక్కువ
మ్యాక్‌ల్లో వాడాల్సివస్తే 'డ్రాప్‌బాక్స్' క్లౌడ్‌స్టోరేజ్ సర్వీసు
ద్వారా సెట్టింగ్స్‌ని సింక్ చేసుకోవచ్చు. టూల్ కోసం లింక్‌ని
చూడండి.మ్యాక్ కాన్ఫిగరేషన్ ఏంటో తెలుసుకునేందుకు అనువైంది. మొత్తం
(సీపీయూ, ర్యామ్, హార్డ్‌డిస్క్, నెట్‌వర్క్ యూసేజ్...) సమాచారాన్ని
మెనూబార్‌లోనే చూపిస్తుంది. ఇతర వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.జిప్ చేసిన
ఫైల్స్‌ని మ్యాక్‌లో ఎక్స్‌ట్రాక్ట్ చేసేందుకు వాడొచ్చు. లాంటి ఇతర
ఫార్మెట్‌లనూ సపోర్ట్ చేస్తుంది. మ్యాక్ ఆప్ స్టోర్ నుంచే టూల్
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.