భలే బిజినెస్‌ ఆప్స్‌!

undefined


 (13 Mar) వ్యాపారం ఏదైనా... స్మార్ట్‌ మొబైల్‌ చేతిలో ఉంటే చాలు! పనులు చిటికెలో చక్కబెట్టేయవచ్చు! అందుకు తగిన ఆప్స్‌ ఇవిగో!ర్ట్‌గా పని చేయడానికి అందరి చూపు స్మార్ట్‌ మొబైల్స్‌ వైపే. విద్యార్థులేమో పాఠాలకు, ప్రాజెక్ట్‌ పనులకు వాడుకుంటే... ఉద్యోగులేమో వారి రోజువారీ కార్యకలాపాల్లో భాగస్వామిని చేసేస్తున్నారు... నిరుద్యోగులేమో ఉద్యోగ అవకాశాలకు వేదికగా మలుచుకుంటున్నారు. మరి, వ్యాపారంలో మొబైల్‌ పాత్ర ఏమీ తక్కువ కాదు. వాడుకోవాలేగానీ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అమ్మకాల్లో మీకో అసిస్టెంట్‌గా పని చేస్తుంది. చెల్లింపుల్లో ఎకౌంటెంట్‌గా సాయపడుతుంది. లక్ష్యాల్ని చేధించడంలో తోడు నిలుస్తుంది. పర్సనల్‌ అసిస్టెంట్‌గా మారి అన్నీ గుర్తు చేస్తుంది. ఇలా చెబుతూ వెళ్తే చాలానే ఉన్నాయి. అవేంటో కాస్త వివరంగా చూద్దాం!పీసీలోనే కాదు. మొబైల్‌లోనూ చిట్టా పద్దులు వేయవచ్చు. లాభ, నష్టాల ఖాతా వేసి నికర లాభం, నష్టాన్ని తెలుసుకోవచ్చు. అందుకు అనువైన ఆప్‌ కావాలంటే? ఆప్‌ని ప్రయత్నించండి. టాలీ అప్లికేషన్‌కి పోటీగా దీన్ని రూపొందించారు. 'ఫైనాన్షియల్‌ ఎకౌంటింగ్‌, డబుల్‌ ఎంట్రీ బుక్‌ కీపింగ్‌' పద్ధతిలో పద్దుల్ని నమోదు చేయవచ్చు. ఒక్కసారి ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక ఆఫ్‌లైన్‌లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. క్రియేట్‌ చేసుకున్న అన్ని కంపెనీ ఎకౌంట్‌లను మేనేజ్‌ చేసుకునేందుకు ఎలాంటి నెట్‌ కనెక్షన్‌ అవసరం లేదు. ఎంటర్‌ చేసిన డేటాని ఎస్‌కార్డ్‌లోకి ఎప్పటికప్పుడు బ్యాక్‌అప్‌ చేయవచ్చు. క్రియేట్‌ చేసిన రిపోర్ట్‌లను ఫార్మెట్‌ల్లో పొందొచ్చు. రిపోర్ట్‌లను ఆప్‌ నుంచే మెయిల్‌ చేసుకునే వీలుంది. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ మొబైల్‌, ట్యాబ్‌ల్లో వాడుకునేందుకు లింక్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి.ఇప్పటికే బాగా పరిచయం ఉన్న 'టాలీ' మాదిరిగా మొబైల్‌ ఆప్‌ మరోటి సిద్ధంగా ఉంది. చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన పద్దుల్ని మేనేజ్‌ చేసుకునేందుకు బుల్లి తెరపై అప్లికేషన్ని వాడొచ్చు. ఒకేసారి రెండు కంపెనీల వివరాల్ని మేనేజ్‌ చేయవచ్చు. ఎకౌంట్స్‌ని క్రియేట్‌ చేయవచ్చు. చివరగా 'బ్యాలెన్స్‌ షీట్‌'ని కూడా తయారు చేయవచ్చు. కావాలంటే లింక్‌ నుంచి పొందండి.చేస్తున్న వ్యాపారం చిన్నదే కావచ్చు. ఆర్థిక వ్యవహారాన్ని మేనేజ్‌ చేసుకునేందుకు స్మార్ట్‌ మొబైల్‌ని చేతిలోకి తీసుకోండి. చిన్న తరహా వ్యాపారాలకు అనువుగా బుల్లి ఆప్‌ ఉంది. అదే మన దేశీయ వ్యాపార వ్యవహారాలకు అనువుగా దీన్ని రూపొందించారు. వినియోగదారుల వివరాల్ని ఆప్‌తోనే మేనేజ్‌ చేసుకోవచ్చు. వినియోగదారులు చెల్లింపుల్లో తేడా రాకుండా ప్రతి పైసాని లెక్క తేల్చేలా పద్దులు రాసుకోవచ్చు. ఫోన్‌లోని కాంటాక్ట్‌లను 'ఇంపోర్ట్‌' చేసుకుని కస్టమర్ల జాబితాని తయారు చేసుకోవచ్చు. కస్టమర్‌ కాల్‌ చేయగానే అతనికి సంబంధించిన మొత్తం వివరాలు తెరపై కనిపిస్తాయి. 'ఇన్‌వాయిస్‌'లను క్రియేట్‌ చేయవచ్చు. ఆప్‌ నుంచే కస్టమర్లకు మెసేజ్‌, ఈమెయిల్‌ చేసుకునే వీలుంది. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.బిజినెస్‌ చేస్తే విజిటింగ్‌ కార్డ్‌ కచ్చితంగా ఉంటుంది. అవసరార్థం వాటిని వాడుతుంటాం. ఆ పనేదో మొబైల్‌తోనే చేస్తే! అందుకు అనువైనదే ఆప్‌. అప్లికేషన్‌న్ని ఇన్‌స్టాల్‌ చేశాక కార్డ్‌ని ఫొటో తీసి ఆప్‌లో ఎడిట్‌ చేయవచ్చు. కార్డ్‌లోని వివరాల్ని రీడ్‌ చేసి ఫోన్‌బుక్‌లోని కాంటాక్ట్‌కి జత చేయవచ్చు. ఉదాహరణకు మీ ఫోన్‌బుక్‌లో కాంటాక్ట్‌ వ్యక్తికి సంబంధించిన విజిటింగ్‌ కార్డ్‌ని రీడ్‌ చేయగానే అతని కాంటాక్ట్‌కి కార్డ్‌ ఇన్స్‌స్టెంట్‌గా జత అవుతుంది. ఇక మీదట ఎప్పుడైనా కాంటాక్ట్‌ని చూస్తే ఆ వ్యక్తికి సంబంధించిన విజిటింగ్‌ కార్డ్‌ అక్కడే కనిపిస్తుంది. మొబైల్‌, ట్యాబ్‌, సిస్టం అన్ని చోట్లా ఒకేసారి డేటా సింక్రనైజ్‌ అవుతుంది. కార్డ్‌లోని వివరాల్ని సుమారు 200 భాషల్లోకి మార్చుకునే వీలుంది. అంటే... వినియోగదారులుగానీ, కంపెనీలోని భాగస్వాములుగానీ వారికి అనువైన భాషలోకి మార్చుకుని కార్డ్‌ వివరాల్ని చూడొచ్చన్నమాట. ఆఫ్‌లైన్‌లోనూ 16 భాషల్ని సపోర్ట్‌ చేస్తుంది. ఫొటో తీసుకున్న కార్డ్‌ని ఆప్‌ ద్వారా కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. కార్డ్‌లను బ్యాక్‌అప్‌ చేసుకోవడంతో పాటు అవసరమైతే ఫార్మెట్‌ ఫైల్స్‌గా ఎక్స్‌పోర్ట్‌ చేయవచ్చు. ఆప్‌ని ఆండ్రాయడ్‌ యూజర్లు లింక్‌ నుంచి పొందొచ్చు.యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. బ్లాక్‌బెర్రీ యూజర్లు ఆప్‌వరల్డ్‌ నుంచి పొందొచ్చు. మీ అభిరుచి మేరకు ఫోన్‌లోనే బిజినెస్‌ కార్డ్‌ని క్రియేట్‌ చేసుకుని షేర్‌ చేయాలంటే? అందుకు మొబైల్‌లోనే ఆప్‌ సిద్ధంగా ఉంది. కావాలంటే ఆప్‌ని ప్రయత్నించండి. ఆప్‌లో అందుబాటులో ఉంచిన టెంప్లెట్స్‌లోకి బిజినెస్‌ కార్డ్‌ వివరాల్ని ఎంటర్‌ చేసి వర్చువల్‌ కార్డ్‌ని డిజైన్‌ చేయవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌, ఫాంట్‌, టెక్స్ట్‌ పరిమాణాన్ని కావాల్సినట్టుగా మార్పులు చేయవచ్చు. ఫొటో, కంపెనీ లోగో వివరాల్ని ఇన్‌సర్ట్‌ చేసుకునే వీలుంది. క్రియేట్‌ చేసకున్న కార్డ్‌లను ప్రత్యేక 'వ్యూ'లో ఎక్స్‌ప్లోర్‌ చేయవచ్చు. ఇలాంటిదే మరోటి కావాలంటే లింక్‌లోకి వెళ్లండి.వ్యాపారంలోని అమ్మకాల వివరాల్ని ట్రాక్‌ చేసేందుకు అనువైన ఆప్స్‌ కూడా ఉన్నాయి. వారం, నెల, ఏడాది.... ఇలా నిర్ణీత గడువులో ఏ మేరకు అమ్మకాలు జరిగాయో ట్రాక్‌ చేసి చూడొచ్చు. ఆప్‌ అలాంటిదే. డేటాని పాస్‌వర్డ్‌తో భద్రత ఏర్పాటు చేసుకోవచ్చు. అమ్మకాలతో పాటు అపాయింట్‌మెంట్స్‌ని మేనేజ్‌ చేసుకునేందుకు ఆప్‌ని ప్రయత్నించొచ్చు. ఐఫోన్‌లో చిట్టా పద్దుల్ని నమోదు చేసుకునేందుకు ఆప్‌ ఉంది. వ్యాపార నిమిత్తం చేపట్టిన పనుల్ని సులువుగా మేనేజ్‌ చేసుకునేందుకు ఆప్‌ని వాడొచ్చు. బృందంతో కలిసి పని చేయాల్సివస్తే అప్‌ ప్రయోజనం ఎక్కువ. వ్యాపారానికి సంబంధించిన ఇన్‌వాయిస్‌లను క్రియేట్‌ చేసుకునేందుకు ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. డౌన్‌లోడ్‌ వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.ఈవెంట్స్‌ని క్యాలెండర్‌లో సులువుగా మేనేజ్‌ చేసుకునేందుకు వాడొచ్చు. 'క్యాష్‌ రిజిస్టర్‌'ని మొబైల్‌లోనే యాక్సెస్‌ చేసేందుకు ఆప్‌ని ప్రయత్నించండి.

Followers