
మనం సంఘజీవులం కనుక ఈ సంఘం గురించిన అన్ని విషయాలను కూలంకషంగా తెలిపే
సాంఘిక శాస్త్రాన్ని తేలికగా అర్థం చేసుకోగలుగుతాం. మరి ఈ తేలికైన
సబ్జెక్టులో ఎ+ గ్రేడు లేదా 100/100 మార్కులు వస్తున్నాయా? రాకపోతే ఏం
చేయాలి? ఎలా చదవాలి? చాలా అంశాలు ఉండే ఈ శాస్త్రాన్ని ఎలా నేర్చుకోవాలి?
జవాబులలో అన్ని పాయింట్లూ కవర్ అయ్యేలా ఎలా ప్రిపేర్ అవ్వాలి? మ్యాప్
పాయింటింగ్ వంటి ముఖ్యమైన ఏరియాను ఎలాంటి జాగ్రత్త్రలతో నేర్చుకోవాలి?
ఇలాంటి అంశాలన్నింటిని ఇప్పుడు చూద్దాం.
సమాజం అమరిక గమనించండి
పిల్లలకు ఐదు సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి సాంఘిక భావనలు అంకురిస్తాయని
మానసిక శాస్త్రవేత్తలు తెలియజేశారు. సమాజాన్ని కుతూహలంగా గమనిస్తున్న
ఆవయస్సులోనే వారికి అది ఎలా ఏర్పడిందో క్రమంగా వివరించాలి.ఆ ఏర్పాటులో తానూ
భాగమేనన్న యదార్థం విద్యార్థి గమనించేలా మనం ప్రొత్సహించాలి. అదే
విద్యార్థి 11 ఏళ్లు వచ్చేసరికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలని
ఆలోచిస్తాడు. మనం వారికి మంచి సాంఘిక వైఖరులను నేర్పించగలిగితే వారు
తీసుకునే నిర్ణయాలు వారి స్వీయ అభివృద్దికీ, సమాజ శ్రేయస్సుకూ దోహదపడగలవని
గమనించాలి. అంటే, సామాజిక విషయాలు తెలుసుకునే