రెజ్యూమ్ రూపకల్పనలో చేయకూడని పొరపాట్లు


rejyum rupakalpanalo


ఉద్యోగాన్ని ఆశిస్తూ నియామక సంస్థలకు పంపే రెజ్యూమ్ అభ్యర్థుల సమగ్ర వివరాలు తెలిపే దర్పణం వంటిది. దీని ప్రాధాన్యత దృష్ట్యా పొరపాట్లకు ఆస్కారం లేకుండా రెజ్యూమ్ రూపొందించుకుంటే ఉద్యోగసాధనలో సగం విజయం సాధించినట్లే. సాధారణంగా రెజ్యూమ్ రూపకల్పనలో అభ్యర్థులు చేసే ఐదు పొరపాట్లు అవి అధిగమించే విధానాలపై గైడెన్స్.ఫ స్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్' అనే నానుడి అన్ని సందర్భాలతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు చేసే ఉద్యోగార్థులకూ మరింత బాగా వర్తిస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా అభ్యర్థులు 'రెజ్యుమ్' తయారు చేసి సంస్థలకు పంపుతుంటారు. ఈ క్రమంలో మీకూ మీరు ఉద్యోగ ప్రయత్నం చేసే సంస్థకు మధ్య వారధి మీరు తయారు చేసి పంపే ఈ రెజ్యుమ్. ఇది మీ గురించి పూర్తి సమాచారాన్ని క్లుప్తంగా, అవసరం మేరకు తెలియజెప్పే ఒక సాధనం. ఇందులో మీరు పొందుపరచిన సమాచారం చూశాక ప్రాథమికంగా మీరు సంస్థకు ఉపయోగపడతారా! లేదా! అన్న విషయాలను బేరీజు వేసుకుని మిమ్మల్ని ఇంటర్వ్యూకు పిలవాలా లేక మీ అప్లికేషన్‌ను 'రిజక్ట్' చేయాలా అన్న నిర్ణయం తీసుకుంటారుపస్తుతం ఉద్యోగావకాశాల కన్నా ఉద్యోగార్దుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటున్నది. అలాంటపుడు మీ అప్లికేషన్‌లో ఎలాంటి లొసుగులున్నా దాన్ని తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.మరో పార్శ్యంలో చూస్తే మీతో పాటు ఎన్నో వందల మంది అభ్యర్థులు 'రెజ్యుమ్'లు పంపి ఉంటారు కనుక మీ రెజ్యుమ్‌లో చిన్న చిన్న లోపాలు కూడా కనిపెట్టి మరీ అప్లికేషన్‌లను తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు వ్యకిగతంగా సంస్థ అధికారుల ముందు హాజరై మీ అర్హతలు, సామర్థ్యాలను మీ గురించి ఇతర సమాచారాలను తెలియజెప్పుకునే ఒక మంచి అవకాశాన్ని మీరు చేజేతులా వదులుకుంటున్నారని దానర్థం. అలాంటి అవకాశం ఇవ్వకుండా అప్లికేషన్ స్థాయిలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని మీరు కోరుకున్న ఉద్యోగం సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి కొన్ని జాగ్రత్తలను చూద్దాం. - 1 మీరు అప్లై చేసే ఉద్యోగానికి సూట్ అయ్యేలా రెజ్యుమ్‌లో మీ వివరాలు పొందుపరచాలి. చాలాసార్లు Job Description కు రెజ్యుమ్‌లో మీరు పొందుపరచిన సమాచారానికి, మీ లక్ష్యాలకు పొంతన ఉండదు. అందుకే మీ రెజ్యుమ్ ఈ మూడింటిని అనుసంధానం చేస్తూ ప్రజెంట్ చేయండి. - 2 కొంతమంది రెజ్యుమ్ తయారు చేసేటపుడు ఇతర రెజ్యుమ్‌ల నుండి కొంత సమాచారం తీసుకుంటారు. ఇటువంటి రెజ్యుమ్‌లలో అర్థం కాని క్లిష్టమైన పెద్ద పెద్ద పదాలు 'జార్గాన్స్' వాడుతుంటారు. ఇలాంటి పదాలు వాడి వారికి చాలా నాలెడ్జ్ ఉందని తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే చాలా సందర్భాలలో మీరు వాడిన పదాలకు మీరు ప్రయత్నించే ఉద్యోగానికి ఎలాంటి పొంతనా ఉండదు. ఒకవేళ ఉన్నా మీరు వాటిని ఇంటర్వ్యూలో సరియైన పద్ధతిలో వ్యక్తం చేయలేరు. ఫలితంగా ఫెయిల్ అవుతారు. అందుకే సింపుల్‌గా ఉన్నా మీకు బాగా అర్థమయ్యే పదాలను నిత్య జీవితంలో మీరు ఎక్కువసార్లు వాడే పదాలనే రెజ్యుమ్‌లో వాడండి. ఏ విషయమైనా మైండ్ నుండి సహజంగా వచ్చినపుడే ఆ విషయం గురించి ఏ సందర్భంలో అయినా కాన్ఫిడెంట్‌గా మీరు మాట్లాడగలుగుతారు. అందుకే మీ రెజ్యుమ్‌ని మీ స్వంత పదాలతో తయారు చేయండి. - 3 మీరు ఈ ఉద్యోగాన్ని పొందడానికి చాలా సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారన్న విషయం మీ రెజ్యుమ్‌లో తెలియజెయ్యండి. అంటే స్పెల్లింగులు, వ్యాకరణ దోషాలు లేకుండా జాగ్రత్తగా గమనించి రాయండి. ఉద్యోగంపై సీరియస్‌గా లేనివారు రెజ్యుమ్ లోని పొరబాట్లను గ్రహించరు. ఒకటి రెండు పొరబాట్లు చాలు అప్లికేషన్‌ను రిజక్ట్ చేయడానికి అని 76 శాతం మంది హెచ్.ఆర్. మేనేజర్‌లు ఒక సర్వేలో తెలియజేశారు. అందుకే రెజ్యుమ్ తయారు చేశాక ఒకటికి రెండు సార్లు మీరుగానీ మీ మిత్రులు గాని చెక్ చేసి ఇటువంటి చిన్న చిన్న పొరబాట్లు సరిచేసుకోండి. - 4 మీ వివరాలతో పాటు ప్రస్తు తం మీరు చేస్తున్న జాబ్ డిస్క్రిప్షన్ క్లుప్తంగా అర్థమయ్యేలా రాస్తే మీ రెజ్యుమ్ కు విలువ చేకూరుతుంది. చాలా మంది తాము రోజువారీ చేసే పనులనే ఒక జాబ్ డిస్క్రిప్షన్‌గా అప్లికేషన్‌లో రాస్తుంటారు. అది సరికాదు. మీరు ప్రస్తుతం పనిచేసే ఉద్యోగంలో మీరు సాధించిన విజయాలు స్పష్టంగా, క్లుప్తంగా రాయండి. అలాగే అప్లికేషన్‌లో తేదీలు, సంఖ్యాపరమైన వివరాలు తెలియజేయవలసి వచ్చినపుడు పొరబాట్లు లేకుండా చూడండి.వ్యక్తిగత సమచారం తెలియజేసేటపుడు మీ ఉద్యోగానికి సపోర్ట్ చేసే వ్యక్తిగత విషయాలను మాత్రమే తెలియజేయండి. కొంతమంది రెజ్యుమ్‌లను వ్యక్తిగత సమాచారంతో నింపే హాబీల పుస్తకంగా మార్చేస్తుంటారు. అంటే వారికున్న అన్ని హాబీలు అందులో రాసేస్తుంటారు. ఉదాహరణకు మీరు ఒక అకౌంటెంట్ ఉద్యోగానికి అప్లికేషన్ పెడితే మీకున్న అకౌంటింగ్ నాలెడ్జ్‌ని, కంప్యూటర్ నాలెడ్జ్‌ని తెలియజెప్పండి. అలాగే ఇతర రంగాలలో ఏవైనా చెప్పుకోదగ్గ విజయాలు సాధించి ఉంటే వాటిని తెలియజెప్పండి. ఇలా తెలియజెప్పడం వలన మీలో ఎలాంటి సామర్థ్యాలున్నాయో తెలుస్తాయి. అలా కాకుండా టీవి చూస్తుంటారనో, బ్రౌజింగ్, చాటింగ్ అంటే ఇష్టమనో తెలియజేయవలసిన అవసరం లేదు. - 5 మీ అప్లికేషన్‌ను వీలైనంత క్లుప్తంగా రెండు పేజీలకు మించకుండా తయారు చేయండి. పై జాగ్రత్తలు తీసుకోవ డంతో పాటు అప్లికేషన్‌ను మంచి లేఅవు ట్‌తో పదానికి, పదానికి మధ్య స్పేస్, మార్జిన్‌లు ఇచ్చి డిగ్నిఫైడ్‌గా ఉండే ఫాంట్‌తో ప్రెజెంట్ చేయండి. లెటర్ సైజ్‌ను 10-12 మధ్య ఫాంట్ ఉండేలా చూడండి. కొంతమంది కొన్నిచోట్ల చాలా పెద్ద సైజు లెటర్స్, కొన్ని చోట్ల చిన్న చిన్న లెటర్స్‌తో మరోచోట పద్ధతిలేని ఫాంట్‌లతో ప్రజెంట్ చేస్తుంటారు. ఇలా చేస్తే చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మిమల్ని మీరు ప్రెజెంట్ చేసుకోవడానికి రెజ్యుమ్ ఒక గొప్ప సాధనం. ఆసాధనాన్ని మీరు సమర్థవంతంగా ఉపయోగించుకొని విజయం సాధించండి. - వ్యాసకర్త ః ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో హెచ్.ఆర్ జాయింట్ జనరల్ మేనేజర్, కార్పొరేట్ ట్రైనర్.




Followers