మేఘాలు మనసులోని సందేశాన్ని ఎలా మోసుకెళ్తాయి? పావురాలకు ప్రేమికుల ఇంటి
అడ్రస్‌లు ఎలా తెలుసు?... ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ఎప్పుడూ
మనం ప్రయత్నించం. కానీ, మీకు తెలుసా? నేటి టెక్నాలజీ ప్రపంచంలో మేఘాలు
మ్యూజిక్‌ని మోసుకెళ్తున్నాయి. శ్రావ్యంగా ట్రాక్స్‌ని వినిపిస్తున్నాయి.
ప్రతి స్పందనని తిరిగి మోసుకొస్తాయి. అదెలా? అనే సందేహం వస్తే
'సౌండ్‌క్లౌడ్' సర్వీసులో సభ్యులవ్వాల్సిందే. ఇదో ఉచిత క్లౌడ్ మ్యూజిక్
సర్వీస్. కమ్యూనిటీలా మ్యూజిక్ ప్రియుల్ని దగ్గర చేసే వేదిక. ఇష్టమైన
పాటలతో ఆల్బమ్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇతరుల ఆల్బమ్స్‌ని వింటూ లైక్
కొట్టొచ్చు. మరీ, నచ్చితే కామెంట్ ఇవ్వొచ్చు. ఇంకా చాలానే చేయవచ్చు. మీరూ
సభ్యులవ్వాలనుకుంటే వాడుతున్న ఈమెయిల్ ఐడీలో రిజిస్టర్ అవ్వొచ్చు.
లేదంటే.. ఇప్పటికే వాడుతున్న ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్ ఎకౌంట్‌లతో సరాసరి
సైన్‌ఇన్ అవ్వొచ్చు. ఆలస్యం దేనికి? ఎకౌంట్ క్రియేట్ చేసుకుందాం
అనుకుంటే సైట్‌ని ఓపెన్ చేయండి. సాధారణంగా మనకు ఇష్టమైన పాటలు, మ్యూజిక్
అల్బమ్స్‌ని పీసీ, మొబైల్‌లో కాపీ చేసుకుంటాం. కావాల్సినప్పుడు
వింటుంటాం. ఎప్పుడైనా మీ పర్సనల్ పీసీ, ఫోనూ అందుబాటులో లేకుంటే? ఎవ్వరి
సిస్టంలోనైనా... ఫోన్‌లోనైనా మీ మ్యూజిక్ ఆల్బమ్స్‌ని 'సౌండ్‌క్లౌడ్'లో
వినొచ్చు. అందుకు మీరేం చేయాలంటే? క్లౌడ్‌లోకి పాటల్ని అప్‌లోడ్ చేసి
ఆల్బమ్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. అందుకు సైట్ హోం పేజీలోని
'అప్‌లోడ్'పై క్లిక్ చేసి సిస్టంలోని పాటల్ని క్లౌడ్‌లోకి అప్‌లోడ్
చేయవచ్చు. మీరే ఓ పాట పాడి, దాన్ని క్లౌడ్‌లోకి అప్‌లోడ్ చేసి షేర్
చేయవచ్చు. అందుకు 'రికార్డ్' ఆప్షన్ ఉంది. ఇలా అప్‌లోడ్ చేసిన పాటల్ని
ఎప్పుడైనా... ఎక్కడైనా... సౌండ్‌క్లౌడ్‌లోకి లాగిన్ అయ్యి వినొచ్చు.
అప్‌లోడ్ చేసిన ట్రాక్స్‌ని మీరు మాత్రమే వినాలి అనుకుంటే 'ప్రైవేట్'
మోడ్‌లో సెట్ చేసుకోండి. ఇతరులు వినేలా పెట్టాలనుకుంటే 'పబ్లిక్' మోడ్
ఉంది. ఇక కమ్యూనిటీలో ఇతరులు పోస్ట్ చేసిన ట్రాక్స్‌నీ వినొచ్చు. నచ్చితే
లైక్ కొట్టొచ్చు. కామెంట్ పోస్ట్ చేయవచ్చు. 'డౌన్‌లోడ్' ఆప్షన్
ఎనేబుల్‌లో ఉంటే పాటని సిస్టంలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బాగా నచ్చిన
పాటల్ని సోషల్ నెట్‌వర్క్ వాల్స్‌పై షేర్ చేయవచ్చు కూడా. అలాగే,
కమ్యూనిటీలో ఎక్స్‌ప్లోర్ చేసిన పాటల్లో నచ్చిన వాటిని 'ప్లేలిస్ట్'లుగా
పెట్టుకుని ఎప్పుడైనా వినొచ్చు. మీరు వినాలనకునే పాటల్ని హోం పేజీలోని
'సెర్చ్' ద్వారా వెతకొచ్చు. విభాగాల వారీగా సభ్యులు అప్‌లోడ్ చేసి
ట్రాక్స్‌ని బ్రౌజ్ చేసి చూడొచ్చు. ఉదాహరణకు ఉల్లాసంగా డ్యాన్స్
చేయడానికి అనువైన ట్రాక్స్‌ని వినాలనుకుంటే 'డ్యాన్స్' మెనూపై క్లిక్
చేస్తే సరి. మీ పాటల్ని ఎవరితో పంచుకోవాలి? కమ్యూనిటీలో మీరు ఎవరి పాటల్ని
ఫాలో అవ్వాలి? వీటికి సమాధానమే 'గ్రూప్స్'. హోం పేజీలోని ప్రొఫైల్ ఐకాన్
పక్కన కనిపించే బాణం గుర్తుపై క్లిక్ చేసి ఆప్షన్స్‌ని ఎంపిక చేసుకోండి.
మీ ఫేస్‌బుక్ కమ్యూనిటీలో స్నేహితుల్ని వెతికి పట్టుకోవచ్చు. గ్రూపుగా
ఏర్పడి పాటల్ని షేర్ చేసుకోవచ్చు. ఇక మీరు అప్‌లోడ్ చేసిన మొత్తం
ట్రాక్స్‌ని వినేందుకు అదే మెనూలోని పై క్లిక్ చేయాలి. కమ్యూనిటీలోని
సభ్యుల్ని ఒక్కొక్కరిగా వెతికేందుకు మెనూలోకి వెళ్తే సరి. మరి, స్మార్ట్
మొబైల్ సంగతేంటి? అని ఆలోచిస్తున్నారా? ఆప్ రూపంలో ఉచితంగా ఇన్‌స్టాల్
చేసుకుని వాడుకో వచ్చు. మీరు ట్యూన్ చేసిన పాటని ఫోన్ మైక్రోఫోన్‌తో
రికార్డ్ చేసి కమ్యూనిటీలో షేర్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్
వాడుతున్నట్లయితే గూగుల్ ప్లే నుంచి ఇన్‌స్టాల్ చేయవచ్చు. కావాలంటే
లింక్‌లోకి వెళ్లండి.ఐఫోన్ యూజర్లు ఐట్యూన్స్ నుంచి పొందొచ్చు.