తెలుగువారు చదువుకునేందకు వీలుగా సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో తెలుగు
ఖురాన్ దివ్య ఖురాన్‌కు చోటు కల్పించారు. దీనిని ప్రవాస భారతీయుడైన డాక్టర్
మౌలానా అబ్దుల్ రహీం అరబ్బీ నుంచి తెలుగులోకి అనువదించారు.
- నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించిడంతో 12 వేల ఇళ్లు
కూలిపోగా, 400 మంది మరణించారు.
- భారత ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు నేపాల్‌లో పర్యటించారు. ఈ
సందర్భంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. దీంతో 1990 తర్వాత
ఒక విదేశీ నేత నేపాల్ పార్లమెంట్‌లో ప్రసంగించడం ఇదే తొలిసారి. నేపాల్
అధ్యక్షుడు రామ్‌భరణ్ యాదవ్, ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా. పర్యటనలో
భాగంగా మోడీ నేపాల్‌లోని ప్రముఖ పశుపతినాథ్ దేవాలయాన్ని సందర్శించారు.
- మనిషికి అత్యంత ప్రమాధకరమైన వైరస్‌లలో ఒకటైన ఎబోలా వైరస్ బారినపడి
పశ్చిమాఫ్రికాలోని సియెర్రా లియోన్, లైబీరియా, గినియా, నైజీరియా దేశాల్లో
950 మంది మరణించారు. ఈ వైరస్‌ను అరికట్టేందుకు ఆయా దేశాలకు ప్రపంచ బ్యాంక్,
ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకులు తక్షణ సాయంగా రూ. 1500 కోట్లు ప్రకటించాయి. ఈ
వైరస్ గబ్బిలాల (సహజ అతిదేయులు) ద్వారా జంతువులకు,
జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్ సోకిన వ్యక్తి 2 - 21 రోజుల వ్యవధిలో మరణిస్తాడు.