సెప్టెంబర్ 27 : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమార్జన కేసులో బెంగుళూరు ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి జయలలితకు నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. జయలలితతో సహా నలుగురికి కోర్టు నాలుగేళ్ల పాటు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు న్యాయస్థానం నలుగురు భారీ జరిమానాను విధించింది. జయలలితకు రూ.వంద కోట్ల జరిమానా విధించగా, శశికళ, ఇలవరసి, దత్తపుత్రుడు సుధాకరన్‌కు ఒక్కొక్కరికీ రూ.10 కోట్ల చొప్పున జరిమానా విధించింది. ప్రస్తుతం జయలలితను బెంగుళూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నాలుగేళ్ల పాటు శిక్ష విధించింది.