భారతదేశ సమాచారం

భారతదేశ సమాచారం -భారతదేశాన్ని పూర్వకాలంలో జంబూ ద్వీపం అని పిలిచేవారు. జంబూ అంటే నేరేడు లేదా గిన్నే కాయ. మనదేశంలో నేరేడు పండ్లు ఎక్కువగా పండుతుండటం వల్ల భారతదేశాన్ని జంబూ దేశమని పిలిచేవారు. -దుష్యంతుడు, శకుంతల పుత్రుడు భరతుడు భారతదేశాన్ని పాలించడం వల్ల భారతదేశం అని పేరు వచ్చింది. -భారతదేశంపై దండెత్తడానికి వచ్చిన గ్రీకులు సింధూనదిని ఇండస్ అనేవారు. ఇండస్‌కు సమీపంలో నివసించేవారిని ఇండోయిలు అని అనేవారు. ఇండోయిలు నివసిస్తున్న దేశాన్ని ఇండియా అని పిలిచేవారు. బ్రిటీషర్లు ఈ పేరును బాగా ప్రచారంలోకి తెచ్చారు. -అరబ్బులు మన దేశానికి హిందూ సముద్రం ద్వారా రావడం, మన దేశానికి హిందూ మహాసముద్రం సరిహద్దుగా ఉండటం వల్ల హిందూ దేశమని, హిందుస్థాన్ అని పిలిచేవారు. ఈ విధంగా సింధూదేశం, హిందూదేశంగా, హిందూస్థాన్‌గా మారింది. -భారతదేశం ఉత్తరార్థ, పూర్వార్థగోళంలో, ఆసియా ఖండంలో దక్షిణభాగంలో కలదు. 80 41 నుంచి 37061 ఉత్తర అక్షాంశాల మధ్య 680 71 నుంచి 970 251 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం 300 పొడవు, రేఖాంశాల పరంగా 300 వెడల్పుతో విస్తరించి ఉంది. -భారతదేశ వైశాల్యం 32,87,263 చ.కి.మీ. ప్రపంచ భూభాగంలో భారతదేశం 2.4 శాతం వైశాల్యాన్ని ఆక్రమించింది. ప్రపంచంలో భౌగోళిక పరిమాణ పరంగా భారతదేశం ఏడో అతిపెద్ద దేశం కాగా రష్యా ప్రథమ స్థానంలో, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియాలు తర్వాతి స్థానాల్లో న్నాయి. -ఆసియా ఖండంలో భౌగోళిక పరిమాణంగా రష్యా, చైనాల తర్వాత మూడో పెద్ద దేశంగా భారత్ నిలిచింది. -భారతదేశ భూ సరిహద్దు పొడవు 15200 కి.మీ. మన దేశానికి 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలదు. ప్రపంచంలోని అత్యధిక దేశాలతో సరిహద్దుగల దేశం చైనా. ఈ దేశం 16 దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. -భారతదేశంలో అత్యంత పొడవైన భూసరిహద్దు ఉన్న దేశం బంగ్లాదేశ్ (4096 కి.మీ) -అతి తక్కువ భూ సరిహద్దు గల దేశం ఆప్ఘనిస్తాన్(80 కి.మీ). భారతదేశంతో సరిహద్దుగల దేశాలు -బంగ్లాదేశ్‌తో అత్యధిక సరిహద్దు గల రాష్ట్రం- పశ్చిమబెంగాల్ -చైనాతో అత్యధిక సరిహద్దు గల రాష్ట్రం-జమ్ము కశ్మీర్ -పాకిస్థాన్‌తో అత్యధిక సరిహద్దు గల రాష్ట్రం- రాజస్థాన్ -నేపాల్‌తో అత్యధిక సరిహద్దుగల రాష్ట్రం- బీహార్ -మయన్మార్‌తో అత్యధిక సరిహద్దుగల రాష్ట్రం- అరుణాచల్‌ప్రదేశ్ -భూటాన్‌తో అత్యధిక సరిహద్దుగల రాష్ట్రం- అసోం -భారతదేశంలో అత్యధిక రాష్ర్టాలతో సరిహద్దు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇది ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖాండ్(మొత్తం 8 రాష్ర్టాలు). -భారతదేశంలో 29 రాష్ర్టాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు కలవు. మన దేశంలో చివరగా తెలంగాణ రాష్ట్రం 2014, జూన్ 2న ఏర్పడింది. -భారతదేశంలో 247 దీవులు కలవు. 223 దీవులు బంగాళఖాతంలో, మిగిలినవి అరేబియా సముద్రంలో ఉన్నాయి. -అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో 100 నుంచి 140 ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. వీటిలో 862 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న గ్రేట్ నికోబార్ అతిపెద్ద దీవి. అండమాన్ నికోబార్ దీవులన్నీ అగ్నిపర్వత ఉద్భవ టెర్షియర్ మహా యుగానికి చెందినవి. -లక్షదీవులు అరేబియా సముద్రంలో 80 -110 ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. లక్షదీవులు ప్రవాళ దీవులు. ఇందులో చిన్న దీవి మినికాయ్ ఇది మాల్దీవుల సమీపంలో ఉంది. -భారతదేశంలో పెద్ద రాష్ట్రం రాజస్థాన్(వైశాల్యపరంగా వరసక్రమంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్. చిన్న రాష్ట్రం గోవా. -భారతదేశంలో పెద్ద కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు. -భారతదేశంలో పెద్ద జిల్లా కచ్(గుజరాత్). చిన్న జిల్లా మహి(పుదుచ్చేరి) -భారతదేశంలో ఉత్తర నుంచి దక్షిణానికి పొడవు 3214 కి.మీ. తూర్పు నుంచి పడమరకు పొడవు 2933 కి.మీ. -ప్రపంచంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన దేశం కెనడా. మనదేశం అత్యంత పొడవైన తీరరేఖ గల 18వ దేశం. -భారతదేశంలో ఎక్కువ తీరరేఖ గల పట్టణం చెన్నై. మూడువైపులా సముద్రంతో తీరరేఖ గల రాష్ట్రం తమిళనాడు. -భారతదేశంలో ఎత్తయిన శిఖరం కాంచనగంగ(8598 మీ) ఇది సిక్కిం, తూర్పు నేపాల్ మధ్య కలదు. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్(8848 మీ). ఇది నేపాల్‌లో ఉంది. ప్రపంచంలో రెండో ఎత్తైన శిఖరం K2. దీన్ని క్విన్ ఆఫ్ హిమాలయాస్ అంటారు. దీన్ని బ్రిటీషర్లు గాడ్విన్ ఆస్టిన్ అనే పేరు పెట్టారు. దీని ఎత్తు 8611 మీ. ఇది కారాకోరం పర్వతశ్రేణుల్లో ఉంది. ఇది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో ఉంది. పాకిస్థాన్‌లో K2 పర్వత శిఖరాన్ని చో-ఘోరిగా పిలుస్తారు. కానీ దీన్ని మనదేశం అంతరంగిక భూభాగంగా గుర్తించారు. -భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత రాజస్థాన్‌లోని బార్మర్‌లో 500C సెప్టెంబర్ 13, 1922లో నమోదైంది. -భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత జమ్ముకాశ్మీర్‌లో డ్రాస్ సెక్టార్‌లో -490C నమోదైంది. ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత -82.20C అంటార్కిటికా ఖండంలోని హోస్టక్‌లో జూలై 21, 1983లో నమోదయింది. -భారతదేశంలో లోతట్టు ప్రాంతం కుట్టుండు(కేరళలోని కొట్టాయం)లో కలదు. -భారతదేశంలో పెద్ద సరస్సు చిలాకా సరస్సు (ఒడిషా). ఇది పూరి, గంజామ్, కుర్దా జిల్లాల్లో విస్తరించి ఉంది. -ప్రపంచంలో పెద్ద సరస్సు కాస్పియన్ సముద్రం. ప్రపంచంలో పెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు. భారతదేశం సరిహద్దు రేఖలు భారతదేశం - చైనా - మక్‌మోహన్ రేఖ భారతదేశం - పాకిస్థాన్ - రాడ్‌క్లిప్ రేఖ భారతదేశం - ఆప్ఘనిస్తాన్ -డ్యూరాండ్ రేఖ భారతదేశం - శ్రీలంక - పాక్ జలసంధి కలదు -భారత్‌కు- శ్రీలంక మధ్య ఉన్న జలశాఖ- మున్నార్ సింధూ శాఖ, పంబన్ దీవులు, ఆడమ్స్ బ్రిడ్జ్ కలదు. -తీరరేఖతో కానీ, ఇతర దేశాలతో గాని సరిహద్దులేని రాష్ర్టాలను భూపరివేష్ఠిత రాష్ర్టాలు అంటారు. భూ పరివేష్ఠిత రాష్ర్టాలు- 1. హర్యానా 2, మధ్యప్రదేశ్, 3, ఛత్తీస్‌గఢ్, 4, జార్ఖండ్, 5. తెలంగాణ -భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82 1/20 తూర్పు రేఖాంశం. ఇది ఐదు రాష్ర్టాల గుండా పోతుంది. అవి 1. ఆంధ్రప్రదేశ్, 2. ఒడిషా, 3. ఛత్తీస్‌గఢ్, 4. మధ్యప్రదేశ్, 5. ఉత్తరప్రదేశ్. -భారతదేశ ప్రామణిక సమయం ప్రపంచ ప్రామాణిక సమయం కంటే 51/20 ముందు ఉంటుంది. -భారతదేశంలో మొదటగా అరుణాచల్‌ప్రదేశ్, చివరగా గుజరాత్‌లో సూర్యోదయం అవుతుంది. భారతదేశంలో 821/2 తూర్పు రేఖాంశం ముఖ్య నగరాలైన వారణాసి, కాకినాడల గుండా వెళుతుంది. -భారతదేశం మధ్యగుండా 231/20 ఉత్తర అక్షాంశ రేఖ అయిన కర్కటరేఖ 8 రాష్ర్టాల గుండా వెళుతుంది. అవి...1. గుజరాత్ 2. రాజస్థాన్ 3. మధ్యప్రదేశ్ 4. ఛత్తీస్‌గఢ్ 5. జార్ఖండ్ 6. పశ్చిమబెంగాల్ 7. త్రిపుర 8. మిజోరం -భారతదేశ తీరరేఖ పొడవు 6,100 కి.మీ. కేంద్రపాలిత ప్రాంతాలతో 7516.5 కి.మీ. పొడవైన తీరరేఖ కలదు. మనదేశంలో 9 రాష్ర్టాలకు తీరరేఖ కలదు. అవి. 1. గుజరాత్ 2. మహారాష్ట్ర 3. గోవా 4. కర్ణాటక 5. కేరళ 6. తమిళనాడు. 7. ఆంధ్రప్రదేశ్ 8. ఒడిషా 9. పశ్చిమబెంగాల్ -భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ గల రాష్ట్రం గుజరాత్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో కలదు. అతి తక్కువ తీరరేఖ పొడవు గల రాష్ట్రం గోవా. -భారతదేశానికి అత్యంత ఉత్తరాన ఉన్న భాగం ఇందిరాకోల్, దక్షిణాన ఉన్న భాగం పిగ్మీలియన్ పాయింట్. దీన్నే ఇందిరా పాయింట్ అంటారు. భారతదేశానికి అత్యంత తూర్పుభాగం అరుణాచల్‌ప్రదేశ్ లోని దీఫాపాస్ కాగా అత్యంత పశ్చిమ ప్రాంతం గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్(సర్‌క్రీక్) ప్రాంతం.

Followers