ఉగ్రవాద నిర్మూలకు భారత్‌తో సై: ఒబామా


వాషింగ్టన్‌ః జమ్ము కాశ్మీర్‌లో శుక్రవారం మధ్యాహ్నం తీవ్రవాదులు మూడు ప్రాంతాలలో దాడులు చేశారు. ఈ దాడుల్లో 11 మంది జవాన్లు, ఎనిమిది మంది తీవ్రవాదులు ప్రాణాలుకోల్పోయారు. ఉగ్రవాదులు జరిపే దాడుల నిర్మూలకై భారత్‌తో కలిసి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా వెల్లడించారు. సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదులు యూరీలోని ఆర్మీ క్యాంప్‌ సహా పలు ప్రాంతాలపై దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో ఒక లెఫ్టినెంట్‌ కల్నల్‌ సహా 8 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల ఎదురుదాడుల్లో లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ సహా 8 మంది ఉగ్రవాదులతో సహా మొత్తం 18 మంది హతమయ్యారు. అలాగే పోపియాన్‌ ప్రాంతంలో ఉన్న ఓ పోలీస్‌ స్టేషన్‌ మీద ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పటి వరకు రెండు దశల పోలింగ్‌ పూర్తయింది. త్వరలో ప్రధాని నరేంద్రమోడీ ఇక్కడ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో దాడులు జరిగిన నేపథ్యంలో జమ్ము కాశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.



Followers