నెట్వర్కింగ్ అనగా ఏమిటి:
ముందు మనం నెట్వర్క్ అంటే ఏమిటో తెలుసుకోవాలి . రెండు లేక అంత కన్నా
ఎక్కువ పరికరాలు (కంప్యూటర్లు, ప్రింటర్లు ఇంకా ఇలాంటివి) ఒక మాధ్యమం
ద్వారా అనుసంధానించబడితే దానినే ఒక నెట్వర్క్ అంటాము. ఇప్పుడు ఈ
నెట్వర్క్ ద్వార సమాచారాన్ని ఒక పరికరం నుండి ఇంకో పరికరానికి పంపే
ప్రక్రియను నెట్వర్కింగ్ అంటారు .
ఏమేం కావాలి?:
రెండు పరికరాలను అనుసంధానించాలంటే మనకొక మాధ్యమం కావాలి . మాధ్యమం రెండు
రకాలు . 1 తీగలు ఉపయోగించి అనుసంధానించడం, 2. తీగలు లేకుండా అనుసంధానించడం.
ఈ రెండింటి లో ఏదో ఒక మార్గం అనుసరించి అనుసంధానించవచ్చు. మనం ఒక్కొక్క
మార్గాన్నీ విడివిడిగా చూద్దాం. ఇక్కడ చెప్పే విధానంలో విండోస్ ఆపరేటింగ్
సిస్టమ్‌ని తీస్కోవడం జరిగింది. ఇదే సమాచారంలో వివరణ లింక్సుకి కూడా
వర్తిస్తుంది. అనుసంధానించబడాలంటే ప్రతి పరికరానికి ఒక ప్రత్యేక గుర్తింపు
నామం, డొమైన్ నామం,నెట్వర్క్ గుర్తింపు ఉండాలి.
ప్రత్యేక గుర్తింపు నామం: ఇది మీ కంప్యూటర్ నామం. ఇది సాధారణంగా
ఇన్‌స్టాల్ చేసేప్పుడు ఇచ్చి వుంటారు . ఇప్పుడు చూడాలనుకుంటే మౌస్ మీద
రైట్-క్లిక్ ఇచ్చి ఆప్షన్‌ని
ఎంచుకోండి .
డొమైన్ నామం:
నెట్వర్క్‌లోని కొన్ని పరికరాలు ఒక సముదాయముగా ఏర్పడితే దానిని ఒక డొమైన్
అంటాము. ప్రతి కంప్యూటరుకు ఒక డొమైన్ నామం ఉంటుంది. ఇది కూడా ఇన్‌స్టాల్
చేసేప్పుడు ఇచ్చి వుంటారు .ఇప్పుడు చూడాలనుకుంటే మౌస్ మీద రైట్-క్లిక్
ఇచ్చి ఆప్షన్‌ని ఎంచుకోండి
నెట్వర్క్ గుర్తింపు:
నెట్వర్క్‌లో మీ కంప్యూటర్ రిజిస్టర్ ఐన వెంటనే నెట్వర్క్
అడ్మినిష్ట్రేటర్ మీకు ఈ సభ్యత్వ గుర్తింపుని ఇస్తారు . డొమైన్ నామం
లాగానే ఈ గుర్తింపు కూడా కంప్యూటర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇది
ఇంటర్నెట్ లేదా ఇతర ప్రైవేటు నెట్‌వర్క్ లో మాత్రమే. మీరు ఇంట్లోనే
నెట్‌వర్క్ ఏర్పరుచుకోదలిస్తే ఈ గుర్తింపుని మీరే ఇచ్చుకోవచ్చు.
నెట్‌వర్క్ నిపుణుల అవసరం:
ఆయా సంస్థల్లో, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపయోగించే కంప్యూటర్లలో ఉండే
సమాచారంపై లక్షలాదిమంది జీవితాలు ముడిపడి ఉంటాయి కాబట్టి ఏ లోపమూ
చోటుచేసుకున్నా దాని ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే ఇలాంటి పరిస్థితి
తలెత్తకుండా చూసుకునేందుకు ప్రస్తుతం నెట్‌వర్క్ నిపుణులు అవసరం అవుతు
న్నారు. వీరికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి సంబంధిత
కెరీర్‌వైపు నేటి యువత ఆసక్తి చూపు తోంది. ఇప్పుడే దేశ విదేశాల్లో అత్యధిక
ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో కంప్యూటర్ నెట్‌వర్‌క ఒకటి. ఇందులో
ప్రవేశించిన వారికి ఆకర్షణీయమైన వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి.
అవకాశాలు:
కంప్యూటర్ అప్లికేషన్లను రూపొందించడం, సొంతంగా నెట్‌వర్క్‌ను డిజైన్
చేయడం అవసరాన్నిబట్టి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌ను సృష్టించడం
వంటి పనివిధానం కంప్యూటర్ నెట్‌వర్కింగ్‌లో భాగంగా ఉంటుంది. బ్యాంకులు,
మాన్యుఫాక్చరింగ్, మీడియా వంటి సంస్థల్లో భారీ సంఖ్యలో కంప్యూటర్లుంటాయి.
వీటి నెట్‌వర్క్ సజావుగా ఉండేలా చూసేందుకు నిపుణుల అవసరం తప్పనిసరి.
నెట్‌వర్క్ నిష్ణాతులకు హెచ్‌సిఎల్, విప్రో, ఇతర ఔట్‌సోర్సింగ్
కంపెనీల్లో నేడా అనేక కొలువులు లభిస్తున్నాయి. ఇంటర్నెట్ సర్వీస్
ప్రొవైడర్లు, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లలో భారీ సంఖ్యలో ఉద్యోగ
అవకాశాలు ఉంటాయి. నెట్‌వర్క్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్,
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేయవచ్చు. క్వాలిటీ
అస్యూరెన్స్/టెస్టింగ్ ఆఫ్ నెట్‌వర్క్ ప్రోటోకాల్స్, రీసెర్చ్ ఇన్
నెట్‌వర్కింగ్‌లో సేవలు అందించవచ్చు. దేశంలోని ప్రధాన నగరాలు,
ద్వితీయశ్రేణి నగరాలు పెరుగుతున్న కొద్దీ నెట్‌వర్క్ నిపుణులకు అవకాశాలు
కూడా అదేస్థాయిలో విస్తరిస్తున్నాయి.
ఎలాంటి స్కిల్స్ అవసరం:
కంప్యూటర్ నెట్‌వర్క్ నిపుణులకు శాస్ర్తీయ దృక్పథం అవసరం. విశ్లేషణాత్మక
ఆలోచనా ధోరణి ఉండాలి. సాంకేతిక సమస్యలను పరిష్కరించే నేర్పు కలిగి ఉండాలి.
తమ రంగానికి సంబంధించిన కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపనతో ఎప్పటికప్పుడు
వృత్తినైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి.
dsc 2014 syllabus dsc new syllabus 2014 dsc syllabus 2014 8th class history audiofree download ap dsc 2013 new syllabus ap dsc studymaterial ap dsc syllabus ap dscpsychology material apdsc hindi material d.s.c.syllabus hindi