అందుబాటులోకి వస్తోన్న అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌లు ఇంచుమించుగా
కంప్యూటర్లతో సమానమైన ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. మొబైల్ ఫోన్‌లను
వినియోగించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతుండటంతో వైరస్
సమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయి.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
ఈ క్రమంలో మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌టూ డేట్‌గా సురక్షితంగా ఉంచాలంటే
వైరస్‌ల నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మాల్వేర్స్,
ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ
విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్
సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. మీ ఫోన్‌లోని
వైరస్‌లను తొలగించేందుకు 10 ఉపయుక్తమైన చిట్కాలను మీతో షేర్
చేసుకుంటన్నాం..
స్మార్ట్‌ఫోన్‌లో కొత్తగా ఏదైనా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఆ
అప్లికేషన్‌కు సంబంధించి రివ్యూను ముందుగా చదవండి. ఇలా చేయటం ద్వారా ఆ
అప్లికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఏదైనా నెగిటివ్
ఫీడ్‌బ్యాక్ ఉన్నట్లయితే ఆ అప్లికేషన్‌కు బదులుగా వేరొక మంచి
అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.
అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు పర్మిషన్ లిస్ట్‌ను కూడా చెక్
చేసుకోవటం మంది. యాప్‌కు సంబంధించిన పర్మిషన్ లిస్ట్‌లో సదరు అప్లికేషన్‌కు
సంబంధించి అనేక రకాల విషయాలు చర్చించబడతాయి.
నమ్మకమైన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్
చేసుకోవటం ద్వారా వైరస్ ముప్పు నుంచి బయటపడవచ్చు. ఎప్పటికప్పుడు సదరు
యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తుండండి.
స్మార్ట్‌ఫోన్‌ను క్రమం తప్పకుండా రోజు స్కాన్ చేస్తుండటం వల్ల ప్రమాదకర
ఫైళ్లు మీ ఫోన్‌లోకి చేరవు.
మీ స్మార్ట్‌ఫోన్‌లోని వైరస్‌ను మాన్యువల్‌గా తొలగించాలంటే ముందుగా మీ
డివైస్‌లోని వైరస్‌కు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలిసి ఉండాలి.
వైరస్ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను
రిస్టోర్ చేసుకోండి. ఇందుకు ఫోన్ యూజర్ మాన్యువల్‌ను అవగాహన చేసుకోండి.
ఆన్‌లైన్ యాంటీ వైరస్ టూల్స్‌ను ఆశ్రయించటం ద్వారా మంచి ఫలితాలు రాబట్టే
అవకాశముంది.
ఫోన్‌కు సంబంధించి అప్లికేషన్‌లను సదురు ఫోన్‌కు సంబంధించిన అప్లికేషన్
స్టోర్ ద్వారా మాత్రమే ఇన్స్‌స్టాల్ చేసుకోండి. కొత్త పంథాను అనుసరిస్తున్న
హ్యాకర్లు వైరస్‌లతో కూడిన నకిలీ అప్లికేషన్‌లను నెట్‌లో
సృష్టిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించినట్లయితే
యూఆర్ఎల్స్ విషయంలో అప్రమత్తత వహించండి. తెలియని అనుమానస్పద యూఆర్ఎల్స్‌ను
ఏ మాత్రం క్లిక్ చేయవద్దు.