ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన అమెరికా అధ్యక్షుడు హెలికాప్టర్ తయారీలో
ఇండియా భాగస్వామ్యం ఉంటుంది. ఆయన కూర్చునే హెలికాఫ్టర్ కాబిన్ మన
ఇండియాలోనే తయారవుతుంది. అందునా మన హైదరాబాద్ లో.. ఏం నమ్మశక్యం కాలేదా...
నిజమండి బాబు ఆయన ప్రయాణం చేసే హెలికాఫ్టర్ కాబిన్ ఇక్కడే తయారవుతుంది.
ఎక్కడ? ఎలా? రండీ తెలుసుకుందాం..
ప్రపంచంలోని చాలా మంది వివిఐపిలు ఎస్-92 హెలికాఫ్టర్లలో ప్రయాణిస్తారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రయాణించే హెలికాప్టర్లు కూడా ఇవే. ఇవి
అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడి ఉంటాయి. వీటిని సికోర్సకీ తయారు చేస్తుంది. ఆ
కంపెనీ వాటిలో కాబిన్లు తయారు చేసే కాంట్రాక్టను భారత దేశానికి చెందిన
ప్రిస్టేజియస్ కంపెనీ టాటాతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని టాటా కంపెనీ
హైదరాబాద్ లో తయారు చేస్తోంది.
అదే సమయంలో అమెరికా తమ అధ్యక్షుడి కోసం వినియోగించే హెలికాఫ్టర్లను త్వరలో
మార్చనున్నది. ఆయన భద్రత కోసం 21 కొత్త హెలికాఫ్టర్లను రంగంలోకి
దించనున్నది. వాటిని తయారు చేసే వేల కోట్ల కాంట్రాక్టును సికోర్సకీ కంపెనీ
గతేడాదే చేజిక్కించుకుంది. ఈ అంశాన్ని ఆ కంపెనీ వ్యవహారాల అధ్యక్షుడు సమీర్
మెహతా తెలిపారు. 21
హెలికాఫ్టర్ల కేబిన్లను హైదరాబాద్ లోనే తయారు చేయనున్నారు. చివరకు అమెరికా
అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రయాణించే హెలికాఫ్టర్ కాబిన్ కూడా ఇక్కడే తయారు
కానున్నది. బహుశా మన మోడీ చెప్పే మేక్ ఇన్ ఇండియా అంటే ఇదేనేమో